పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

నేత్ర దానం

నేత్ర దానం

భారతదేశంలో, 4.6 మిలియన్ ప్రజలు శుక్లాల వల్ల అంధత్వంతో బాధపడుతున్నారని అంచనా. వీరికి శుక్ల మార్పిడి ద్వారా ఉపశమనం కలిగించవచ్చు.


కార్నియా కంటి ముందు వైపు ఉండే స్పష్ట ఉపరితల మరియు ప్రధాన అంశం. గాయం, ఇన్ఫెక్షన్ లేదా ఇతర కారణాలవల్ల కార్నియా వ్యాధి కలగవచ్చు.  కార్నియపై మేఘాలు కమ్ముకున్నట్టు కాగానే, దృష్టి చాలా తగ్గిపోయింది. కార్నియల్ మార్పిడిలో ఒక ఆరోగ్యకరమైన దాత కార్నియా ఒకే ఆకృతి  ఒకే డిస్క్ ఆకారంలో ఉన్న దానిని మారుస్తారు.  కార్నియల్ మార్పిడి 90% కంటే ఎక్కువ  విజయవంతంగా జరిగాయి. ఇది శుక్లాలవల్ల వచ్చే అంధత్వాన్ని పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. మేఘావృత కార్నియా తో పుట్టిన శిశువులలో శుక్ల మార్పిడి వారి జీవితాలలో ఒక పెద్ద తేడా తెస్తుంది.

నేత్ర దానం గురించిన వాస్తవాలు


* కళ్ళు మరణం తరువాత మాత్రమే దానం చేయవచ్చు.
 • మరణం తర్వాత 4-6 గంటల  లోపల కళ్లను తప్పనిసరిగా తొలగించాలి.
 • కళ్ళు నమోదిత వైద్యుని ద్వారా మాత్రమే తొల గించాలి.
 • నేత్రనిధి జట్టు లేదా ఆస్పత్రి సిబ్బంది మరణించిన వారి ఇంటికి కళ్ళు తొలగించటానికి వెళతారు.
 • కన్ను తొలగింపు ప్రక్రియ 20-30 నిమిషాలు మాత్రమే తీసుకుంటుంది కనుక అంత్యక్రియలు ఆలస్యం   కావు.
 • అంటు వ్యాధులు లేవనడానికి కొంచెం రక్తం పరీక్షకోసం తీస్తారు.
 • కంటిని తొలగించటం వల్ల ముఖం కురూపి కాదు.
 • మతాలు నేత్రదానానికి  అనుకూలంగా ఉన్నాయి.
 • దాత మరియు గ్రహీత ఇద్దరి గుర్తింపును రహస్యంగా ఉంచుతారు.

ఎవరు కళ్ళను దానం చేయవచ్చు?


కంటి దాతలు ఏ వయస్సు లేదా సెక్స్ వారైనా కావచ్చు. అంటు వ్యాధులు లేకుండా అధిక రక్తపోటు, ఆస్త్మా రోగులు మరియు, మధుమేహం, కళ్లద్దాలు వాడేవారు వారు కళ్ళు దానం చేయవచ్చు. ఎయిడ్స్, హెపటైటిస్ బి, సి, రాబీస్, సెప్టిసేమయా, తీవ్రమైన లుకేమియా (బ్లడ్ కేన్సర్), ధనుర్వాతం, కలరా, మరియు మెనింజైటిస్ మరియు మెదడువాపు వంటి అంటు వ్యాధులు ఉన్న వ్యక్తులు నేత్ర దానం చెయరాదు.

దానం ఎప్పుడు జరుగుతుంది?


మరణించిన వెంటనే కణజాలం బాగుంటే  శస్త్రచికిత్స చేసి  తీస్తారు. అంత్యక్రియల ఏర్పాట్లకు ఏ విధంగా ఆలస్యం కాకుండా ఉంటుంది. ఎందుకంటే దీని వలన డిస్ఫిగరు అవదు, ఒక ఓపెన్ పేటిక దాత కుటుంబం  ఎంపిక చేసుకోవచ్చు.

ఒక కంటి దానం చేసిన తరువాత ఎప్పటిలోగా మార్పిడి చేయాలి?


కార్నియా మార్పిడి సాధారణంగా కంటి సంరక్షణ పద్ధతిగా బట్టి, దానం చేసిన తరువాత 4 రోజుల్లో నిర్వహిస్తారు.

దాత యొక్క కుటుంబం ఏదైనా ఫీజు చెల్లించడం  లేదా అందుకోవటం జరుగుతుందా?


లేదు. మానవ కళ్ళు, అవయవాలు మరియు కణజాలాలలో అమ్మడం మరియు కొనుగోలు చట్టరీత్యా  నేరం. కంటి సేకరణ సంబంధం ఏదైనా ఖర్చును నేత్రనిధి చూసు కుంటుంది.

ఎలా ఒక వ్యక్తి దాత కావచ్చు?


ఒక వ్యక్తి చేయవలిసిన అతి ముఖ్యమైన పని అతని/ఆమె కుటుంబం మరియు చట్టపరమైన ప్రతినిధికి చెప్పడం. చాలా దేశాలు ఇప్పుడు చనిపోయిన వారి కుటుంబాలకు అవయవ దానాన్ని ఎంపిక చేసుకొనే అవకాశాన్ని  ఇస్తున్నాయి. కుటుంబాలు దానానితకి అనుమతి ఇవ్వవచ్చు. వారు ముందుగా అతడు/ఆమె అతని/ఆమె కళ్ళను దానం చేయాలనుకుంటున్నారిని తెలిస్తే ఇది చాలా సహాయకారిగా ఉంటుంది. దాత కార్డ్ కుటుంబం/చట్ట ప్రతినిధికి దాత ఉద్దేశాన్ని ఆసుపత్రులకు తెలియచేయడానికి పనిచేయగలదు.

 

ముఖ్యమైన విషయాలు


మరణించినవారి బంధువులు

 

కళ్ళు దానం చేయడానికి, కింది విధానాలు మరణించినవారి బంధువులు అనుసరించాలి

 • మరణించినవారి కంటి రెప్పలను మూసివేయండి.
 • నేరుగా మరణించిన వ్యక్తి మీద ఏదైనా ఫ్యాను ఉంటే  ఆపేయండి.
 • కింద ఒక దిండును ఉంచి మరణించినవారి తల పైకి లేపండి.
 • సాధ్యమైనంత త్వరగా సమీప నేత్రనిధిని సంప్రదించండి.
 • నేత్రనిధి జట్టు సులభంగా స్థలాన్ని గుర్తించడానికి నిర్దిష్ట ఆనవాళ్లు మరియు టెలిఫోన్ నంబర్ సరైన       చిరునామా ఇవ్వండి.
 • వైద్యుడి నుండి మరణ సర్టిఫికేట్ అందుబాటులో ఉంటే, అది సిద్ధంగా ఉంచండి.
 • నేత్రదానం అత్యంత దగ్గరి బంధువుల లిఖిత పూర్వక అనుమతితో  ఇద్దరు సాక్షుల సమక్షంలో చేయాలి.

కంటి దానం చేసిన తరువాత


 • దాత యొక్క కుటుంబం నేత్రనిధి నుండి ప్రశంసా పత్రాన్ని అందుకుంటుంది.
 • నేత్రనిధికి తీసుకువెళ్లిన తరువాత కళ్ళు శిక్షణ పొందిన సిబ్బందిచే శ్లేషించబడుతుంది.
 • పరీక్షలు నిర్వహించిన తర్వాత టిష్యూలను శుక్ల సర్జనుకు పంపుతారు.
 • జాబితా ప్రకారం గ్రహీతను పిలిచి శుక్ల మార్పిడి చేస్తారు.
 • కార్నియల్ మార్పిడి నిర్వహిస్తారు.
 • గ్రహీతను తరుచుగా కలిసి మర్పిడి విజయవంతమైయ్యెలో చేస్తారు.

-బ్యాంకు యొక్క సేవల


 • శిక్షణ పొందిన సిబ్బంది ఇరవైనాలుగు గంటలు కాల్స్ అందుకోవడానికి అందుబాటులో ఉండాలి.
 • నాణ్య మైన రార్నియాను పరీక్షించిన అనంతరం శుక్ల సర్జన్లకు అందించాలి.
 • మార్పుడికి ఉపయోగ పడని కళ్ళను కొత్త పద్ధతులు తెలుసు కోవడానికి ఉపయోగించి శుక్ల     పరిశోధనకు పంపాలి  మరియు శుక్ల సర్జన్ల శిక్షణకు ఉపయోగించాలి.
 • నేత్ర దానం మరియు ఐ బ్యాంకు పై ప్రజలలో అవగాహన పెంచాలి.
 • కంటిని తొలగించే విధానాలను వైద్యులకు నేర్పాలి.
 • నేత్ర దాన కేంద్రాల ఏర్పాటు మరియు అభివృద్ధి చేయాలి.
 • మూలం:http://www.aravind.org/default/eyedonationcontent/yourrole

   

  సంబంధించిన వనరులు


  1. నేత్రిదాన పోస్టర్


  2. నేత్రనిధిని గుర్తించండి

   

2.94520547945
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు