హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / ఇవి తింటే బరువు తగ్గుతారు
పంచుకోండి

ఇవి తింటే బరువు తగ్గుతారు

ఇవి తింటే బరువు తగ్గుతారు

 

రోజుకి ఐదు భాగాలుగా పళ్లు, కాయగూరలు తింటే జీవితంలో మీ దరికి ఎటువంటి వ్యాధులు రావని ఈ మధ్యనే ఒక అధ్యయనంలో వెల్లడైంది. సహజసిద్ధంగానే ఎన్నో ఆరోగ్య లాభాలను నింపుకుని ఉండే పళ్లు బరువు తగ్గేందుకు కూడా సాయపడతాయి. పళ్లలో అధిక మోతాదులో పీచు పదార్థం ఉంటుంది. సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. ఆకలికి అడ్డుకట్ట వేస్తాయి. అధిక బరువుని కచ్చితంగా తగిస్తాయి, బరువు పెరగనీయవు. అటువంటి ఓ ఆరు పళ్ల గురించి ఇస్తున్నాం చదివి ఆరోగ్యంగా బరువు తగ్గండి.

పుచ్చకాయ: బరువు తగ్గాలనుకునే వాళ్లకి ఇది మంచి ఫ్రెండ్‌. పుచ్చకాయలో 90 శాతం నీళ్లే ఉంటాయి. వందగ్రాముల పుచ్చకాయ ముక్క తింటే 30 కాలరీలు శరీరంలోకి చేరతాయి. అమైనో ఆమ్లం అయిన ఆర్జినైన్‌ కూడా ఉంది ఇందులో. కొవ్వును కరిగించడంలో ఇది బాగా పనిచేస్తుంది.

జామ కాయ: పోర్చుగీసు వాళ్ల ద్వారా భారతదేశానికి జామపండు వచ్చింది. ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. బరువు తగ్గించడంలో ఇది ఒనగూర్చే లాభం అంతా ఇంతా కాదు. గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. అందుకని డయాబెటిక్‌ వాళ్లకి ఇది చాలా మంచిది.

యాపిల్‌: క్యాన్సర్‌ రిస్క్‌ను తగ్గించే పండు యాపిల్‌. అంతేకాదు గుండెను ఆరోగ్యంగా, దంతాలను తెల్లగా ఉంచుతుంది. వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. డయేరియా, మలబద్ధకం వంటి సమస్యల్ని దరిచేరనీయదు. బరువు తగ్గేందుకు డైట్‌ చేస్తుంటే మీ ఆహారంలో యాపిల్‌ను తప్పక చేర్చాలి. మీడియం సైజ్‌ యాపిల్‌లో 50 కాలరీలు ఉంటాయి. ఫ్యాట్‌, సోడియంలు ఉండవు. ఆహారం తినేముందు ఒక యాపిల్‌ తింటే బరువు తగ్గడం ఖాయం. ఆడవాళ్లలో ఇది మంచి ఫలితాన్నిస్తుంది.

అరటిపండు: ఒక అరటిపండులో 105 కాలరీలు ఉంటాయి. తక్షణ శక్తికి అరటిపండుని మించింది లేదు. కండరాల నొప్పులు పోవాలన్నా, బిపి అదుపులో ఉండాలన్నా అరటిపండు తినాల్సిందే. ఎసిడిటీ రాకుండా కాపాడుతుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది.

ఆరెంజ్‌: వందగ్రాముల పండులో 47 కాలరీలు మాత్రమే ఉంటాయి. స్ర్టిక్ట్‌ డైట్‌ అనుసరించే వాళ్లకి ఇది మంచి స్నాక్‌. డైటింగ్‌లో ఉన్నప్పుడు స్వీట్లు తినాలనిపిస్తే ఈ పండును తింటే స్వీటు తిన్న భావనే కలుగుతుంది.

టొమాటో: బరువు తగ్గించడంలో టొమాటో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోకి నీరు చేరడాన్ని నిరోధిస్తాయి. లెప్టిన్‌ అనేది ఒక ప్రొటీన్‌ ఇది శరీరం బరువు తగ్గకుండా అడ్డుపడుతుంది. దాన్ని నిలువరించి బరువు తగ్గేందుకు సాయపడుతుంది టొమాటో. టొమాటోలు మంచివి అన్నాం కదాని పంచదారతో నిండిన సింథటిక్‌ కెచప్‌లు వాడకండి. అచ్చంగా టొమాటో అంటే టొమాటోనే వాడాలి
ఆధారము: ఆంధ్రజ్యోతి

 

 

2.90909090909
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు