హోమ్ / ఆరోగ్యం / చిట్కాలు / ఆరోగ్యానికి చిట్కాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఆరోగ్యానికి చిట్కాలు

ఆరోగ్యానికి చిట్కాలు.

  1. 10-15 తులసి ఆకులు తీసుకొని దానికి నాలుగు వెల్లుల్లి పాయలు, ఒక టీస్పూను శొంఠి పొడిని జతచేసి మెత్తగా నూరి ఆ మెత్తటి మిశ్రమాన్ని నుదుటికి రాసుకోవాలి.
  2. అర టీ స్పూను శొంఠి పొడిలో చిటికెడు ఏలకుల పొడి కలిపి ఒక టీ స్పూను తేనెలో రంగరించి తింటే దగ్గు నుంచి ఉపసమనం లభిస్తుంది.
  3. అర టీ స్పూను ఆవపొడిలో ఒక టీ స్పూను తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
  4. అర కప్పు నీటిని మరిగించి ఒక టీస్పూను అల్లం రసం కలిపి వేడిగా తాగాలి. రెండు గంటలకొకసారి తాగుతుంటే అతిసారం పూర్తిగా తగ్గుతుంది.
  5. అర టీస్పూను నిమ్మరసం, అర టీ స్పూను అల్లం రసం, పావు టీ స్పూను మిరియాల పొడి కలిపి రోజుకు రెండుసార్లు తాగాలి.
  6. ఆర్ధరైటిస్, గుండె, మెదడు, కిడ్నీలు, కళ్ల సమస్యలను దూరం చేస్తుంది. సోయాబీన్ కొవ్వుకణాల సైజును తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా తింటే స్ధూలకాయం రాకుండా శరీరాన్ని అదుపులో ఉంచుతుంది.
  7. అరటిపండును చిన్నముక్కలు చేసి చిలికిన పెరుగులో కలిపి రోజుకు రెండు, మూడు సార్లు తింటే డయేరియా అదుపులోనికి వస్తుంది.
  8. అజీర్తితో బాధపడుతున్నప్పుడు జీలకర్రను పొడి చేసి చిటికెడు తీసుకుంటే ఉపశమనంగా ఉంటుంది.
  9. అనీమియాతో బాధపడుతుంటే ఆహారంలో వీలయినంత ఎక్కువగా మెంతి ఆకు తీసుకోవాలి.
  10. అరలీటరు నీటిలో పదిగ్రాముల నల్లతులసి ఆకులను వేసి మరిగించి ఆ నీటిని తాగుతూ ఉండాలి.
  11. అరకప్పు నిమ్మరసంలో కాస్త అల్లం రసం కలుపుకొని తాగితే దగ్గునుంచి ఉపశమనం కలుగుతుంది. ఇలా రోజుకి రెండు మూడు సార్లు తాగితే ఫలితం ఉంటుంది.
  12. అల్లం ముక్కను నిప్పుల మీద కాల్చి తింటే వికారం తగ్గుతుంది.
  13. అయిదారు లవంగాలు, ఒక హరతి కర్పూరాన్ని కాటన్‌ క్లాత్‌లో కట్టి పంటినొప్పి ఉన్నచోట పెట్టి పళ్లతో గట్టిగా నొక్కి పట్టాలి. కాసేపటికి పంటినొప్పి తగ్గిపోతుంది.
2.91666666667
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు