অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

చర్మ సౌందర్యం 2

చర్మ సౌందర్యం 2

  1. ముడతలు మచ్చలు మిమ్మల్న్ని భాదిస్తుంటే ఇలా చేసేద్దాం
  2. అందం కోసం “చందనం(గంధం)”తో చేసే ఫేస్ ప్యాక్స్,ఫేస్ మాస్క్స్
  3. మగ వారి చర్మ రక్షణకు చిట్కాలు చూసేద్దామా
  4. అందమైన చర్మం కోసం “ఆముదము(Castor oil)” చెప్పే చిట్కాలు చూద్దామా.
  5. పొడి బారిన చర్మము(పొడి చర్మం), తగిన చికిత్స
  6. సౌందర్యానికి ‘మందారం’
  7. మీ అందం,చర్మం,జుట్టు మరియు గోళ్ళ సంరక్షణకు నిమ్మరసం చెప్పే చిట్కాలు
  8. “గ్లిసరిన్” వల్ల చర్మ రక్షణ మరియు జుట్టు సంరక్షణ ఎలా సాద్యమంటే??
  9. మిల మిల మేరిసే సహజ చర్మ సౌందర్యం కోసం 5 చిట్కాలు
  10. మీ చర్మ సంరక్షణలో బేకింగ్ సోడా ఎలా ఉపయోగపడుతుంది?
  11. మొటిమలు, నల్ల మచ్చల నిర్మూలన కోసం సహజమైన పద్దతులు – “ఫేస్ ప్యాక్స్ మరియు ఫేస్ మాస్క్”
  12. మీ చర్మ సౌందర్య సం రక్షణలో-పన్నీరు (rosewater) ఎలా ఉపయోగపడుతుంది.
  13. మగవారి చర్మం మిల మిల మెరవాలంటే, పాటించాల్సిన పద్దతులు, సహజ సూత్రాలు
  14. అందానికి, ఆరోగ్యానికి, కోడి గుడ్డు చెప్పే సూత్రాలు
  15. అందమైన జుట్టు కోసం కోడి గుడ్డు చిట్కాలు:
  16. మొటిమ రహితమైన చర్మం కోసం “ఫేస్ ప్యాక్స్” , “ఫేస్ మాస్క్స్”
  17. అందానికి, చర్మ సౌందర్యానికి నారింజ చెప్పే “ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్”
  18. ఆరోగ్యవంతమైన మరియు తేజోవంతమైన చర్మం కోసం టమటా చెప్పే చిట్కాలు.
  19. మెరిసే చర్మం కోసం సహజ పద్దతులతో కూడిన జాగ్రత్తలు
  20. ముడతలు పడిన మరియు ఒడిలి పోయిన చర్మ సంరక్షణకై టిప్స్
  21. చక్కటి చర్మం కోసం సహజమైన పద్ధతులు
  22. శరీర దుర్వాసన నియంత్రణకు చిట్కాలు

ముడతలు మచ్చలు మిమ్మల్న్ని భాదిస్తుంటే ఇలా చేసేద్దాం

ఈ రోజుల్లో జీవితం ఎంతో గజిబిజిగా, హడావిడిగా, ఉరుకులు, పరుగులు పెడుతూ, అందాన్ని కాపాడుకోవడానికి ఏ రకమైన వస్తువులు వాడాలో కూడా అలొచించుకునేంత సమయం ఉండడంలేదు అందుకే, “మీ అందమే మా ఆనందం” అని భావిస్తూ మీ కోసం, మీ అందమైన చర్మం కోసం సరికొత్త చిట్కాలు తెచ్చేశాం, ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి.

ముందుగా మీ చర్మంలో ముడతలు అనేక కారణముల వల్ల వ్యాపించవచ్చు,సూర్యిని కాంతి వల్ల, ధూమపానం వల్ల,ఈ ఇబ్బందులు కలగవచ్చు.అయితే మీ కంటి కింద, ముక్కు, నోరు ఇలా ముఖంలో అనేక భాగములలో ముడతలు వచ్చి మిమ్మల్ని అందమైన వయస్సులోనుంచి అమ్ముమ్మ, తాతాయ్యల వయస్సులోకి మార్చేస్తాయి, అంటే చిన్న వారు అయినను ఎక్కువ వయస్సు ఉన్నవారిలా కనపడతారు.

  • ధూమపానం వల్ల మీ చర్మం ముడతలు పడిపోతుంది, ఇందులో ఉన్న నికోటిన్ పదార్దము మీ రక్త ప్రవాహాన్ని సరిగా అవ్వకుండా ఆపేస్తుంది, అంతే కాకుండా మీ రక్త కణాల ఉత్పత్తిని కూడా ఆపేస్తుంది. దీని వల్ల మీ చర్మం ముడతలు పడిపోతుంది.
  • మంచి పౌశ్టికమైన ఆహారం విటమిన్ “E”తో తీసుకోవడం వల్ల మీ చర్మంలోని ముడతలు తగ్గి,ప్రారంభ దశలో ఉన్న ముడతలను ఆపుతుంది.
  • బయటకు వెళ్ళెటప్పుడు చర్మానికి సన్ స్క్రీన్ ను రాయడం మంచిది.ఇది మిమ్మల్ని ముడతల బారి నుంచి కాపాడుతుంది.
  • మీ ఆహార పద్దతులలో సరియైన సమ్యమనం పాటించండి, శరీర బరువు శాతం తగ్గినా చర్మం పై ముడతలు పడే ప్రమాదం ఉంది.
  • చర్మం ఎప్పుడూ పొడిగా మారకుండా తేమగా ఉంచడానికి ” మాయిశ్చరైజర్” ను ఉపయోగించండి.
  • తగిన పోషకపదార్దాలు లభించాలంటే మీ భోజనంలో పండ్లు, కూరగాయలు, గింజలు,తీసుకుంటే మంచిది, వీటిలో ఉన్న పొషకపదార్దాలు మీ చర్మాన్ని ముడతల బారి నుండి రక్షిస్తాయి.
  • అత్యంత సులభమైన చిట్కా ఏమిటంటే, సరియైన సమయం అంటే కనీసం 6 గంటలు నిదుర పోతే, మీ చర్మం ముడతలు పడకుండ కాపాడుకోవచ్చు.
  • మీ ఆహారంలో “విటమిన్ A,C,E,K”కలిగి ఉన్నవి తీసుకుంటే, మీ చర్మాన్ని కాపాడుకోవచ్చు .
  • ఒక నమ్మలేని నిజం ఏమిటంటే, ఒత్తిడి వల్ల కూడ మన చర్మం ముడతలు పడడానికి దారి తీస్తుంది.
  • సాద్యమైనంత వరకూ ప్రశాంతమైన మనస్సు, ఆలోచనలతో ఉంటే మంచిది.

చర్మవ్యాధి నిపుణులు సలహా ప్రకారం మీ ముఖాన్ని ఎక్కువగా శుబ్రం చేయరాదు, అలా చేస్తే మీ చర్మంలోని సహజమైన కణాలు పోయి, ముడతలకు దారి తీసే ప్రమాదం ఉంది.

మీరు సూర్యునికాంతి ప్రభావం నుండి బయటపడాలంటే “విటమిన్ C” ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది.

అందం కోసం “చందనం(గంధం)”తో చేసే ఫేస్ ప్యాక్స్,ఫేస్ మాస్క్స్

 

అందం, దీనికోసం అందరూ ఏమిచేయడానికైన సిద్దపడతారు,దీన్ని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూంటారు, అయితే అందమైన చర్మం కోసం చందనం చెప్పే మరింత అందమైన చిట్కాలు చుసేద్దామ. చందనం, గులాబీలు, ఈ రెండిటి కలియక అనేక సత్ఫలితాలను ఇస్తుంది, ఈ రెండింటిని కలిపి ముఖానికి పట్టించుకుంటే మీ చర్మం ఎంతో తాజాగా, అందంగా, మరియు యవ్వనంగా కనిపించడమే కాకుండా, మీ ముఖం పై ఉన్న మొటిమలు, నల్ల మచ్చలు తొలగిపోయి, మీ ముఖం మృదువుగా మారి ,ఎంతో కాతివంతంగా మెరుస్తుంది.

అందమైన చర్మానికి చందనం ఇలా అంటుంది..

చందనం(గంధం)ఫేస్ ప్యాక్స్ 1:

చందనం మన చర్మానికి ఎంతో మంచిది, ఇది మన చర్మంలోని నల్ల మచ్చలు, మొటిమములు,ముడతలు, ఇలా అన్నింటినీ తొలగించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.అయితే దీనిని జిడ్డు మరియు పొడి చర్మం కోసం ఉపయోగించుకోవచ్చు,

జిడ్డు గల చర్మం అయితే కొన్ని క్రీము పదార్థాలతో కలిపి ఉపయోగించండి,పొడి చర్మం అయితే పన్నీరుతో కలిపి ఉపయొగిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

కావలసినవి:

  • 2 టేబుల్ స్పూన్లు చందనం పొడి
  • పన్నీరు

తయారుచేసుకునే పద్దతి:

2 టేబుల్ స్పూన్లు చందనం పొడి, కొంచెం పన్నీరు తీసుకుని పేస్ట్ లా చేయండి.మీ ముఖాన్ని శుబ్రంగా చల్లని నీటితో శుబ్రం చేసుకుని,ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించండి,

20 నిమిషాల తరువాత మెల్లగా చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి సత్ఫలితాలు పొందుతారు.

ఈ పన్నీరులోని సువాసన పరిమళం మీ మనసుని,మెదడుని ప్రశాంతంగా ఉంచి మీ శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది.

ఈ పన్నీరు వల్ల మన చర్మంలోని మలినాలు అన్నీ పొయి, మీ చర్మంలోని చర్మ కణాలు తెరుచుకుని, మీ చర్మం ఎంతో అందంగా, కాంతివంతంగా మారుతుంది.

అధిక వేడివల్ల మీ ముఖం పై వచ్చే ఎర్రని కందిన మచ్చలను దూరం చేసి మంచి మచ్చ రహితమైన చర్మాన్ని మీ సొంతం చేస్తుంది.

చందనం(గంధం)ఫేస్ ప్యాక్స్ 2:

కావలసినవి:

  • రోజ్ రేకుల
  • నూరిన వోట్స్

తాయారుచేసుకునే విధానం:

2 రోజా పూల రేకులు తీసుకుని, 2 టేబుల్ స్పూన్లు నూరిన వోట్స్ తీసుకుని,కొంచెం నీరు కలిపి, పేస్ట్ లాగా చేసి 5 నిమిషాల్లో మీ ఫేస్ ప్యాక్ రెడీ అయిపోతుంది.

మీ చర్మం పొడిగా ఉంది అనిపించిన ప్రదేశంలో కొంచెం నీరుతో శుబ్రం చేసి ఈ మిశ్రమాన్ని పట్టించి 20 నిమిషాల తరువాత చూసుకుంటే, మీరు ఊహించని అందమైన, కోమలమైన,యవ్వనమైన చర్మం మీ సొంతం అవుతుంది.

చందనం(గంధం)ఫేస్ ప్యాక్స్ 3:

ఈ ఫేస్ ప్యాక్ మన చర్మంలోని మొటిమలను, మచ్చలను తొలగించి యవ్వనమైన చర్మాన్ని ప్రకాశించేలా చేస్తుంది, అయితే ఈ మిశ్రమంలో పసుపుని కూడా కలిపితే మీ చర్మంలో ఉన్న క్రిములని నాశనం చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

కావలసినవి:

  • 1 టేబుల్ స్పూన్ పసుపు
  • 2 టేబుల్ స్పూన్ లు గంధం పొడి
  • 3 టేబుల్ స్పూన్ లు తేనె

తాయారుచేసుకునే విధానం:

పైన సూచించిన వన్నీ ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలిపి ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి.మంచి సువాసనతో పరిమళించే ఈ మిశ్రమాన్ని మీ ముఖం, మెడ, మీ శరీరం అంతా పట్టించుకోవచ్చు, 20 నిమిషాల తరువాత చల్లని నీటితో మీ ముఖాన్ని శుబ్రం చేసుకుంటే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.

మగ వారి చర్మ రక్షణకు చిట్కాలు చూసేద్దామా

 

అందం అనగానే గుర్తొచ్చేది ఆడవాళ్ళు, అలా అని వదిలేస్తే మగవాళ్ళు ఏమైపోతారు.వాళ్ళు కూడా అందంలోను, దాని సం రక్షణలోను ఆడవారితో పోటీ పడుతున్నారు.ఆడవారికి ఉన్నట్లుగా మగవారికి అన్ని రకముల “కాస్మటిక్స్” లేకపొయినప్పటికి, ఎన్నో సహజమైన పద్దతుల ద్వారా వారి అందాన్ని కాపాడుకుంటూ, అందంలో వారుకూడ ఆడవారికి తక్కువ కాదు అని చెప్పడానికి ఈ పద్దతులు, రండి చూసేద్దాం:

సాధారణంగా మగవారి కన్నా ఆడవారికే చర్మం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి,అయితే కొన్ని అధ్యాయనాల ప్రకారం మగవారి చర్మం ఆడవారి చర్మం కన్నా ఆలస్యంగా ముడతలు పడుతుందంట కాని, మగవారి జీవనశైలి, వారి అలవాట్లు, వారిని చర్మ సమస్యలలో ముందుకు తీసుకు వచ్చి,ఆడవారితో సమానం చేసేశాయి.

సరే అయ్యిందేదో ఔతుందిలే కాని, మగ వారి చర్మ రక్షణకు చిట్కాలు చూసేద్దామా,

  • ధూమపానం: ధూమపానం అనేది మగవారి యొక్క “Manliness”కి చిహ్నము లాంటిది.కాని దీని వల్లనే మగవారి వయస్సు వారి అసలు వయస్సుకన్నా ఎక్కువగా అనిపిస్తుంది,ధూమపానము మగవారి అసలు వయస్సుకి మరికొంత వయస్సు కలిపి, చర్మం ముడతలకు, పొడిబారిపోవడానికి కారణం అవుతుంది.
  • షేవింగ్ : సాధరణంగా మగవారు షేవింగ్ ఎక్కువగా చేసుకోవడం వల్ల చర్మ సమస్యలు అధికంగా ఉంటాయి,షేవింగ్ వల్ల చర్మం కఠినంగా అయిపొయి, చర్మంలోని తేమను తీసివేస్తుంది, అందువల్ల చర్మం పొడిగా మారి ముడతలకు దారి తీస్తుంది. మీరు షేవింగ్ ను చల్లని నీటితో చేసుకుని,తరువాత “మాయిశ్చరైజర్” ఉపయోగిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
  • ద్రాక్ష రసం: మగ వారి చర్మ సౌందర్యానికి ద్రాక్ష రసం ఎంతో మంచిది, ప్రతీ రోజూ ఆహారంతో పాటు ద్రక్ష రసాన్ని కలిపి తీసుకుంటే, అది మీ చర్మంలోని “Elasticity” స్థితిస్థాపకతను పెంచి, మీ చర్మాన్ని అందంగా, యవ్వనంగా ఉంచుతుంది.
  • మద్యం: మగవారికి ముఖ్యమైన, ఎంతో ఉపయోగకరమైన చిట్కా ఏమిటంటే మద్యాన్నికి దురంగా ఉండటం, ఎందుకంటే మద్యం వల్ల రక్త నాళాలు అవసరమైన దానికంటే ఎక్కువగా సాగి ఇబ్బందులు కలిగిస్తాయి.
  • వ్యాయామం: వృద్దాప్యంగా కనిపించడం అనేది మన చర్మం వల్లే కాదు మన కుంగిపోయిన కండరాలు కూడా దీనికి కారణం అవుతాయి,అందుకే ప్రతీ రోజూ వ్యాయామం తప్పనిసరిగా చేయడం వల్ల కండరాలు బలపడి చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.
  • మసాజ్: రోజూ మీ ముఖం పై మెల్లగా మసాజ్ చేయడంవల్ల రక్త ప్రసరణ సజావుగా సాగి చర్మాన్ని తాజాగా, యవ్వనంగా ఉంచుతుంది.
  • రోజూ పాలతో మీ ముఖాన్ని శుబ్రం చేసుకుంటే చర్మంలోని మలినాలు అన్నీ పోయి మంచి ఫలితం కనిపిస్తుంది.
  • ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు.
  • ముఖ్యంగా బచ్చలికూర లేదా చిక్కుళ్ళు వంటి కూరగాయలలో చర్మం ముడతలు పడకుండా చూసుకోవచ్చు.
  • సూర్యుని కాంతి: మీ చర్మాన్ని అధికంగా సుర్యుని కాంతిలో ఉంచకండి, దాని వల్ల మీ చర్మం ముడతలు పడటానికి ఎక్కువ అవకాశం ఉంది.
  • మంచి నీరు అధికంగా తీసుకోవడం వల్ల కూడా చర్మాన్ని ముడతల బారి నుంచి కాపాడుకోవచ్చు.
  • రోజుకి కనీసం 8 గ్లాసులు, లేదా 2 లీటర్ల నీరు తీసుకుంటే చర్మ రక్షణలో ఎంతో ఉపయోగపడుతుంది.

అందమైన చర్మం కోసం “ఆముదము(Castor oil)” చెప్పే చిట్కాలు చూద్దామా.

 

అందమైన మీ చర్మ సౌందర్యం కోసం ఆముదము, దాని ప్రయోజనాలు.

1. వయస్సులో వచ్చే మచ్చలు:

సాధారణంగా ప్రతీ ఒక్కరికీ టీనేజ్ లో ముఖం పై మచ్చలు వస్తాయి, వీటిని వదిలించడంలో ఆముదము ఎంతగానో ఉపయోగపడుతుంది.

2.జుట్టు పెరగడానికి:

పూర్వం జుట్టుకి ఈ “ఆముదమును”, నూనెలా ఉపయోగించేవారు, కాని కొబ్భరి నూనే, దీని స్తానాన్ని బర్తీ చేసింది అనిచెప్పవచ్చు,ఎందుకంటే ఆముదము కొంచెం చిక్కగా, జిగురుగా,ఉండి, సుగంధముగా ఉండకపోవడమే కారణం. కానీ ఆముదము జుట్టు తిరిగి పెరగడానికి సహాయపడుతుంది.వేడి చేసిన ఆముదము మీ జుట్టుకి పట్టించి, షాంపూతో స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

3. హెయిర్ కండీషనర్ గా :

దీనిని మన జుట్టుకు కండీషనర్ గా కూడ ఉపయోగించుకోవచ్చు.దీనిలోని కొవ్వు పదార్దములు మీజుట్టు పెరుగుదలకి ఎంతో మంచిది.

4. పగినిల గోళ్ళకు,వేళ్ళ చిగుళ్ళకు:

ఈ ఆముదము మీ పగిలిన వేళ్ళకు రాత్రి పూట పట్టించి మరుసటి రోజు శుబ్రం చేసుకుంటే పగిలిన మీ గోళ్ళకు ఎంతో మంచిది.

5. అందమైన, మృదువైన చర్మం కోసం:

ఈ ఆముదమును మీ ఒంటికి పట్టించి 15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తేం, మీ చర్మం లోని చనిపొయిన, వృదా చర్మ కణాలని తుడిచేసి అందమైన, మెరిసే చర్మాన్ని ఇస్తుంది.

6. పగిలిన పాదాలను రక్షిస్తుంది:

మీ పాదాలు పగిలి మిమ్మల్ని భాదిస్తున్నాయా, అయితే వేడి చేసిన ఆముదమును రాత్రి నిదురపొయేముందు మీ పాదాలకు పట్టించి, ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే నొప్పి నుంచి విముక్తినిస్తుంది, అలా నిరంతరం చేస్తూ ఉంటే, పగిలిన పాదాలనుండి కుడా విముక్తి లబిస్తుంది.

7. ముదతలు పడిన చర్మానికై:

మీ అందమైన చర్మం చిన్న వయస్సులోనే ముడతలు పడి మిమ్మల్ని బాదిస్తుందా,అయితే మీ ముడతలు పడిన చర్మానికి వేడి చేసిన ఆముదమును రాసి, మెల్లగా మర్దనా చేస్తే మంచి ఫలితాలు లబిస్తాయి.

8. చర్మం పై మచ్చల నిర్మూలనకు:

మీ చర్మం పై మచ్చలతో అందమైన మీరు అందంగా కనబడటం లేదా, అయితే ఆముదముతో,”బేకింగ్ సోడా” కలిపి మచ్చలపై రాస్తే, మచ్చరహితమైన చర్మం మీ సొంతం అవుతుంది.

9. చర్మం పై, గీతలు, మొటిమలు:

మీ చర్మం పై, గీతలు, మొటిమలు, మచ్చలు ఎలాంటి వాటికైన ఈ ఆముదము మంచి చికిత్సలా ఉపయోగపడుతుంది.

10. చర్మాన్ని తేమగా ఉంచడానికి:

ఆముదము చర్మాన్ని తేమగా ఉంచడానికి “చర్మం యొక్క మాయిశ్చ్చరైజర్” గా ఉపయోగపడుతుంది .

పొడి బారిన చర్మము(పొడి చర్మం), తగిన చికిత్స

 

మీ చర్మం పొడిగా మారటం అనేది ముఖ్యముగా ఎండ వల్ల, వేడి నీటి వల్ల, ఎక్కువ గాలి వల్ల వస్తుంది, దీని వల్ల చర్మం దానిలోని తేమని, మృదుత్వం ను కోల్పోయి చాల పొడిగా, గట్టిగా,కఠినంగా తయారవుతుంది.

పర్యవరణంలోని మార్పుల కారణం చేత కూడ ఈ సమస్య తలెత్త వచ్చు.

ముఖ్యంగా సూర్యిని కాంతి వల్ల, గాలి, చలి, రసాయనాలు, ఎక్కువగా కఠినమైన సబ్బులు ఉపయోగించడం వల్ల, చర్మం పొడిగా మారిపోయి ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుంది.

దీని వల్ల చర్మ తామర, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు కూడా వస్తాయి.

తేనె, పొడిబారిన చర్మం నుంచి కాపాడుతుంది:

1\2 స్పూన్ తేనెలో 1-2 టేబుల్ స్పూన్లు పన్నీరు కలిపి, ముఖానికి,మెడకి,పొడిబారిన చర్మానికి పట్టించాలి, 15-20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే పొడితనం నశించి, చర్మం తేమగా మారుతుంది,అంతే కాకుండా చర్మంలోని కణాలు శుబ్రపడి, తేజోవంతమైన చర్మం, మీ సొంతం ఔతుంది.

గుడ్డులోని పచ్చ సొన, తేనె కలిపిన మిశ్రమము:

ఒక టీస్పూన్ గుడ్డులోని పచ్చసొన,ఒక టీస్పూన్ తేనె, 1-2 ఒక టీస్పూన్ల పాల పొడి తీసుకుని బాగా కలిపి చర్మానికి పట్టించి 15-20 నిముషాల తరువాత చల్లని నీటితో సుబ్రం చేసుకుంటే మంచి ఫలితం లబిస్తుంది.

బలమైన, పొషక పదార్దాలతో కూడిన ఆహారం తీసుకొవడం వల్ల కూడ ఈ సమస్యను అదిగమించవచ్చు.

కొంచెం నూనెలో Glycerin కలిపి, పొడిగా ఉన్న చర్మం పై రుద్దితే మంచి మార్పు ఉంటుంది.

కాచిన వెన్న లేదా పాలు మీగడను మీ పగిలిన పెదాలపై రోజూ రాస్తే, మీ పెదాలు అందంగా మారి,మంచి ఫలితం ఉంటుంది.

సౌందర్యానికి ‘మందారం’

 

నేటి ప్రపంచంలో అదీ ఈ యాంత్రిక జీవనంలో ఆహారానికి పెడుతున్న ఖర్చు కంటే సౌందర్యానికి పెడుతున్న ఖర్చు అంతా ఇంతా కాదు. ఇక కేశ సమ్రక్షణ కోసం మరింత ఖర్చే పెడుతున్నారు. అయితే సౌందర్యాన్ని కాపాదుకునేందుకు,పోషణకు మార్కెట్లో ఎన్నో ఉత్పత్తులున్నప్పటికీ సహజంగా లభించేవాటిలో సౌందర్య పరిరక్షణ చేసుకోవడం సులువే కాక ఖర్చు తక్కువ కూడా.

అలాంటి కోవకు చెందిన వాటిలో ఎంతో మేలైనది మందారం.మందారం ఉపయోగలను తెలుసుకుందమా..

మందార మొక్క నుంచి లభించే ఆకులు, పువ్వులు కూడా సౌదర్యాన్ని పరిరక్షించేందుకు ఎంతగానో తోడ్పడతాయి. ఈ మొక్క నుంచి నూనె తీస్తారు. మందార నూనెతో తలవెంట్రుకలను పరిరక్షించుకోవటమే కాక చర్మ రక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మందార నూనెలో తేమ ఉంటుంది కనుక చర్మానికి, కేశాలకు మృదువుగా ఉందేందుకు తోడ్పడుతుంది. మందార నూనె కలిపిన నూనె కేశాలకు రాస్తే ఆ కేశాలు మరింతగా మెరిసి అందానీ, మెరుపుని ఇస్తుంది. ఈ నూనెతో మసాజ్ చేస్తే చుండ్రు నివారించవచ్చు. జుట్టు రాలటం తగ్గతమే కాకుందా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కేశాలు తెల్లబడకుండా ఉందేందుకు ఉపకరిస్తుంది. అంతేకాక దృఢంగా ఉండేందుకు మెరుపుతో ఉందేందుకు ఈ నూనె ఉపయోగపడుతుంది. కేశాలకు వృధప్య చాయలు దరి చేరకుండ చూస్తుంది. చర్మం నునుపుగ ఉండెల చూస్తుంది. చర్మం లో మృత కణజాలం లేకుండా చూస్తుంది. స్నానానికి వెల్లేముందు మందార నూనె నీటిలో వేయటం వల్ల శరీరం అందంగా ఉండటమేకాక సుగంధభరితంగా ఉంటుంది. పాదాల సంరక్షణలోనూ తన ఉనికి కాపాడుకుంతోంది. పాదాల పగుళ్ళు తగ్గేందుకు ఈ నూనెతో మసాజ్ ఇస్తే మంచి ఫలితాలొస్తాయి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేమంటే మందారం అన్నిచోత్ల విరివిగా దొరకుతుంది.

మీ అందం,చర్మం,జుట్టు మరియు గోళ్ళ సంరక్షణకు నిమ్మరసం చెప్పే చిట్కాలు

 

నిమ్మకాయని అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్చు,ఇది “సిట్రస్ పండ్ల”రకమునకు చెందినది, దీనిలో “విటమిన్ సి”ఉంటుంది, ఈ విటమిన్ మన చర్మంలోనికి చొచ్చుకుపోయి, దుమ్ము, ధూళి, మలినాలతో మూసుకుపొయిన రంద్రాలను శుబ్రం చేసి చర్మానికి మంచి కాంతిని ఇస్తుంది.

చర్మం మరియు జుట్టు సంరక్షణకి నిమ్మరసం ఎలా పని చేస్తుందో చుద్దామా….

కాంతివంతమైన చర్మం కోసం నిమ్మరసం ఎల ఉపయోగపడుతుందంటే:

కొంచెం నిమ్మరం తీసుకుని, మీరు స్నానం చేసే నీటిలో కలపాలి,దీనివల్ల మీ చర్మంలో ఉన్న మలినాలు అన్ని పొయి, మీ చర్మంపై రంద్రాలు శుబ్రముగా అవుతాయి,

మీ కాళ్ళను నీటిలో ముంచి 10-15 నిమిషాల తరువాత తీస్తే, మీ చర్మం పై ఉన్న చనిపొయిన, పనికిరాని కణాలు తొలగిపొయి, మీ చర్మం కాంతివంతముగా ప్రకాశిస్తుంది.

దీనిలోని సిట్రిక్ యాసిడ్ లక్షణము మీ ముఖం పై ఉన్న నల్ల మచ్చలను తొలగించుటలో ఎంతగానో సహయపడుతుంది.

కాంతివంతమైన చర్మం కోసం:

2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్లు వైన్, 2 టేబుల్ స్పూన్లు నీరు తీసుకుని, బాగా కలిపి మీ ముఖానికి పట్టించాలి, కాసేపటి తరువాత మీ ముఖాన్ని శుబ్రం చేసుకుంటే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.

చెడు చర్మ నిర్మూలనకు:

మీ చర్మం పై ఉన్న మలినాన్ని శుబ్రం చేసుకోవాలంటే నిమ్మ కాయ ముక్కని తీసుకుని చక్కెరలో ముంచి దానిని మీ ముఖం పై రుద్దాలి, ఒకవేళ చక్కెర తరిగిపోతే మళ్ళీ ముంచి రుద్దడం వల్ల, మీ చర్మం పై మంచి మెరుగు వచ్చి, కాంతివంతంగా ప్రకాశిస్తుంది.

నిమ్మ “మాయిశ్చురైజర్”(తేమను కలిగించే పదార్దం)”లా ఎలా ఉపయోగపడుతుంది.

సాదారణంగా మీ చర్మం పొడిబారిపోతే, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకొని బాగా కలపండి, ఈ మిశ్రమాన్ని పొడి బారిన చర్మంపై పట్టించి 10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకోండి, ఇది మీ చర్మంలో తేమను పుట్టించి మంచి ఫలితాలను ఇస్తుంది.

నల్లని మచ్చల నిర్ములనలో:

మీ అందమైన చర్మం పై నల్ల మచ్చలు బాధిస్తుంటే,వాటిపై కొంచెం నిమ్మ రసాన్ని రుద్దండి,10-15 నిమిషాల తరువాత శుబ్రం చేసుకోండి, ఇది మీ చర్మం పై ఉన్న నల్ల మచ్చలకు కారణమైన మీ చర్మ రంధ్రాలని శుబ్రం చేసి, మీ చర్మాన్ని మచ్చలు లేకుండా చేస్తుంది.

మీ జుట్టు సంరక్షణ కోసం నిమ్మకాయ ఎలా ఉపయోగపడుతుంది:

నిమ్మరసం మీ జుట్టు సంరక్షణకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది, ఇది మీ జుట్టుకోని చుండ్రుని తగ్గించి మంచి “జుట్టు కండీషనర్”గా పనిచేస్తుంది.1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్,1 టేబుల్ స్పూన్ తేనె, 3టేబుల్ స్పూన్లు నిమ్మ రసం,బాగా కలిపి మీ జుట్టుకి పట్టించండి, 30 నిమిషాల తరువాత తలస్నానం చేస్తే మంచి మార్పు వస్తుంది.

మీ గోళ్ళు సంరక్షణ కోసం నిమ్మరసం ఎలా పనిచేస్తుంది:

నిమ్మరసాన్ని ఒక గిన్నెలోకి పిండి, మీ గోళ్ళని 10 నిమిషాలు అందులో ఉంచండి, తరువాత బయటకు తీసి బ్రష్ తో శుబ్రముచేసుకోవాలి.మంచి ఫలితాల కోసం నిమ్మరసం కు వెనిగర్ను జోడించండి.ఇది మీ గోళ్ళను అందంగా,గట్టిగా చేస్తుంది.

“గ్లిసరిన్” వల్ల చర్మ రక్షణ మరియు జుట్టు సంరక్షణ ఎలా సాద్యమంటే??

 

గ్లిసరిన్ అనేది కార్బన్ మిశ్రమాలలో ఒకటి. దీనిని రసాయనిక శాస్త్రంలో “C3H8O3″ లేదా గ్లిసరాల్ అని పిలుస్తారు. ఈ గ్లిసరాల్ అనేది చుట్టుపక్కల ఉండే నీటిని గ్రహిస్తుంది. దీనిని మనం ఉపయోగించినట్లయితే మన చర్మాన్ని తేమగా ఉంచేటందుకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఇది ప్రముఖమైన ఫార్మసీ దుకాణాలలో లభిస్తుంది. దీనిని తయారుచేసిన తరువాత 2 సంవత్సరాల వరకు ఉపయోగించవచ్చు, ఐతే కొనుగోలు ముందు లేబుల్ని చూసి తీసుకోండి.

అందం కోసం “గ్లిసరిన్” చెప్పే అందమైన చిట్కాలు చూద్దామా

“చర్మం యొక్క మాయిశ్చరైజర్ గా”

ఒక వేళ మీ చర్మం పొడిగా ఉంటే , కొంచెం గ్లిసరిన్, మరి కొంచెం తేనె కలిపి,ఈ మిశ్రమాన్ని పొడిగా ఉన్న చర్మానికి,లేదా చేతులకి, లేదా కాళ్ళకి పట్టించి 20 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే పొడిగా ఉన్న మీ చర్మము యొక్క సమస్య పోయి తేమగా మారుతుంది.

వాడిన\మాడిన\ఎండిన జుట్టు సం రక్షణకై:

ఎంతో మంది వారి జుట్టు ఎండిపొయినట్లుంది అని ఎంతగానో బాధపడుతూ ఉంటారు, ఈ సమస్య జుట్టులోని తడితనం అంటే తేమ లేకపొవడం వల్లనే, అయితే మీ జుట్టుకి గ్లిసరిన్ పట్టిస్తే మంచి మార్పును మీరు గమనించి అందమైన,మృదువైన జుట్టుని మీ సొంతం చేసుకోవచ్చు.

హెయిర్ స్ప్రే:

కొంచెం గ్లిసరిన్ , నీరు కలిపి, ఒక స్ప్రే బాటిల్లో పోసి మీ జుట్టుకి పట్టిస్తే మీ గిరజాల జుట్టును కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇది జుట్టుకి మంచి కండిషనర్ గా కూడా పనిచేస్తుంది.

చర్మాన్ని శుబ్రపరచడంలో “గ్లిసరిన్” పాత్ర:

1 టేబుల్ స్పూన్ గ్లిసరిన్, 2 టేబుల్ స్పూన్లు తేనె, 2 టేబుల్ స్పూన్లు పాలు తీసుకోండి.ఈ మూడు పదార్థాలు కలపండి,ఈ మిశ్రమాన్ని వోట్మీల్ జోడించండి, ఒక పేస్ట్ లాగా చేసి ముఖానికి పట్టించండి, గ్లిసరిన్ ను తక్కువ శాతంలో వాడటం మంచిది, ఇలా రాసుకున్న మిశ్రమము మీ చర్మంలోని దుమ్ము, ధూళి, వల్ల మూసుకుపొయిన చర్మ రంద్రాలను శుబ్రం చేసి, మీ ముఖానికి అందమైన, మరియు ప్రకాశవంతమైన సౌందర్యన్ని తెస్తుంది.

ఇంకెందుకు ఆలస్యం, పైన చెప్పినవన్నీ పాటించండి, తళ తళ లాడే అందాన్ని మీ సొంతం చేసుకోండి.

మిల మిల మేరిసే సహజ చర్మ సౌందర్యం కోసం 5 చిట్కాలు

 

ఎన్నో ఏళ్ళుగా మనకు వినిపిస్తున్న మాట “అందంగా ఉండడం అంటే మరింత అందమైన చర్మం కలిగి ఉండడమె”

అప్పట్లో స్త్రీలు మాత్రమే వారి అందం గురించి ఆలోచించేవారు,చర్మం, జుట్టూ,ఇలా ప్రతీది వారికెంతో గొప్పవి.ప్రస్తుత సమాజంలో స్త్రీలతో పాటు మగవారు కూడా వారికి వారు అందంగా ఉండాలి అని ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నారు.ప్రతీ విషయంలోను, అందంగా, సమర్దవంతంగా, ఉండేలా చూసుకుంటున్నారు.

మీ అందాన్ని కాపాడే విధానంలో, మీకోసం మేము మీకు అందించే చిట్కాలు.

మంచినీరు ఎక్కువగా తాగండి

ఎన్నో ఏళ్ళుగా ఎంతో మంది ఉపయోగిస్తున్న ఒకే ఒక చిట్కా ఏమిటి అంటే. నిస్సందేహంగా

రోజుకి 8-10 గ్లాసులు నీళ్ళు తాగడమే అని చెప్పవచ్చు.అంతే కాకుండా అన్ని చిట్కాల కన్నా ఎంతో చౌకైన చిట్కా ఇది.నీరు ఎక్కువగా తాగడం వల్ల మీ శరీరానికి, వ్యాధి సోకడానికి క్రిములు పుట్టించే విషము బయటకు పోయి,మీ శరీరాన్ని కాపాడుతుంది.

కలబంద తీసుకుని, దానిని ముఖానికి పట్టించాలి, ఒకవేళ మీ ఇంట్లో కలబంద లేకపోతే దగ్గర్లో ఉన్న మందుల షాపులో దొరికే కలబంద జల్ లేదా జూస్ ని కూడా ఉపయోగించుకోవచ్చు.

ఇవి సహజమైన కలబంద లాగానే ఉపయోగపడతాయి,వీటితో పాటు ఐస్ ముక్కలు తీసుకుని ముఖానికి పట్టించి, కాసేపటి తరువాత శుబ్రం చేసుకుంటే కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.

మీ రోజువారీ ఆహారంలో వెల్లుల్లి తీసుకోండి,పరిశోధకులు ప్రకారం వెల్లుల్లి మన చర్మంలోని కణాల కాలాన్ని పెంచి, చర్మాన్ని ఎంతో తాజాగా, యవ్వనంగా ఉంచుతుంది.

నిమ్మరసం, తేనె మన చర్మ సౌందర్యానికి ఎంతో మంచిది,2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ తేనె ఈ రెంటిని కలిపి, ముఖానికి పట్టించి, ఒక 20 నిమిషాల తరువాత శుబ్రం చేసుకోవాలి, ఇలా రోజు చేస్తే మెరుగైన చర్మం పొందుతారు.

రోజు లేత కొబ్బరి కాయ నీరు తాగితే మీ చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగ పడుతుంది.

రోజు నారింజ రసం తాగడం ఎంతో మంచిది,వీటిలో “C” విటమిన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల, అవి మీ చర్మాన్ని ఎంతో కాంతివంతంగా, మరియు యవ్వనంగా ఉంచుతాయి.

పైన సూచించిన వాటితో మరికొన్ని జతచేద్దామా:

రోజూ మీ ముఖాన్ని 2-3 సార్లు ఒక మంచి ” ఫేస్ వాష్” తో శుబ్రం చేసుకోండి, ఎక్కువగా చేసుకోవడం మంచిది కాదు.

సహజమైన స్క్రబ్స్ ఉపయోగించి మీ చర్మాన్ని వారానికి 2-3 సార్లు “ Exfoliate ” చేయండి. దాని వల్ల చనిపొయిన చర్మ కణాలు తొలగిపొయి, కొత్త కణాలు వస్తాయి.

వేడి నీటితో స్నానం చేయడం మంచిది కాదు, దాని వల్ల చర్మం పొడిబారిపోయే ప్రమాదం ఎక్కువ.

ఎక్కువగా మీ ముఖమును, చేతులతో తాకవద్దు, ఎందుకంటే మీ చేతులకు ఉన్న మురికి వల్ల మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది.

సాద్యమైనంతవరకు సహజంగానే ఉండండి, “కాస్మటిక్స్” వాడకం తగ్గించడం ఎంతో అవసరం.

మీ చర్మము జిడ్డుగల చర్మం అయితే ఎక్కువగా పౌడర్ రాయడం మంచిది.

కాలనికి అనుగుణంగా మీ క్రీంలు, సబ్బులు మర్చడం ఎంతో అవసరం.

ఈ పై చెప్పినవన్నీ పాటిస్తే మీ చర్మము అందంగా, యవ్వనంతో కాంతివంతంగా ఉంటుంది అనడంలో సందేహంలేదు.

మీ చర్మ సంరక్షణలో బేకింగ్ సోడా ఎలా ఉపయోగపడుతుంది?

 

బేకింగ్ సోడాను అందరూ వంటగదిలో ఉపయోగించడం సహజమే, కాని ఎంతో మందికి తెలియని విషయం ఏమిటంటే బేకింగ్ సోడా మన చర్మ సౌందర్యాన్ని రక్షించడంలో కూడ ఎంతో ఉపయోగపడుతుంది.

బేకింగ్ సోడాని “సోడియం కార్బోనేట్ ” అని పిలుస్తారు, దీని రసాయన లక్షణాలు మన చర్మాన్ని వ్యాధులభారీనుండి రక్షించడంలో ఎంతో సహాయపడుతుంది.

మన చర్మ సం రక్షణ కోసం బేకింగ్ సోడా చెప్పే చిట్కాలు తెలుసుకుందామా

చర్మ సంరక్షణ కోసం బేకింగ్ సోడా దాని ప్రయోజనాలు

బేకింగ్ సోడాని,నీటిలో కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖానికి పట్టించి 5 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే కాంతి వంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.

మీ చర్మం లోని అందం దూరమైతే, కాంతివంతం కోసం చిట్కా కావాలంటే, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా మరియు 2 టేబుల్ స్పూన్లు ఓట్స్(oats) తీసుకుని నీటిలో కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖానికి పట్టించి కాసేపటి తరువాత శుబ్రం చేసుకుంటే, బేకింగ్ సోడా, మలినాలతో పూడిపొయిన మీ చర్మ రంద్రాలని శుబ్రం చేసి సహజత్వం లేని మీ చర్మాన్ని ఎంతో కాతివంతంగా, మరియు మృదువుగా చేస్తుంది.

మీరు అరికాళ్లు పగుళ్ళతో బాధపడుతుంటే, కొంచెం బేకింగ్ సోడాని గోరు వెచ్చని నీటీతో కలిపి ఒక 30 నిమిషాలు మీ కాళ్లని నీటిలో ఉంచి, తరువాత శుబ్రం చేసుకోవాలి, ఈ పద్దతి వల్ల కొత్త చర్మ కణాలు పుడతాయి అందువల్ల మీకు అరికాళ్ళ పగుళ్ళనుండి విముక్తి లబిస్తుంది.

బేకింగ్ సోడాని మీరు స్నానం చేసే తొట్టెలో కాని, నీటిలో కాని వేసి ఒక 30 నిమిషాలు పాటు ఆ తొట్టెలో స్నానం చేస్తే మీ శరీరంలోని చనిపొయిన కణాలు తొలగిపోయి, కొత్త కణాలు వస్తాయి, అవి మీ శరీరంలో దుర్వాసనను నశింపజేసి ,శరీరాన్ని తాజాగా ఉంచ్చుతుంది.

సూర్యుని కాంతి వల్ల, కందిపొయిన, దురద వస్తున్న, చిరాకు కలిగిస్తున్న శరీర సం రక్షణ కోసం, ఒక చిన్న కప్పులో బేకింగ్ సోడాని కొంచెం నీటితో కలిపి చర్మానికి రాస్తే శరీరం చల్లబడుతుంది.

మీ చేతి గోళ్ళు మరియు వాటి చిగుళ్ళ సం రక్షణలో కూడా ఈ బేకింగ్ సోడాని ఉపయోగించుకోవచ్చు, ఎలా అంటే, బేకింగ్ సోడాని, నీటిని 2:1 నిష్పత్తిలో కలిపి, కాటన్, లేదా బ్రష్ తో మీ గోళ్ళ పై, వాటి చిగుళ్లపై రాయండి, 20 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే మిల మిల మేరిసే గోళ్ళతో పాటు మృదువైన చిగుళ్ళు లబిస్తాయి.

నల్ల మచ్చలు, మొటిమల వల్ల బాదపడేవారికి, కొంచెం బేకింగ్ సోడాని నీటితో కలిపి ముఖానికి పట్టిస్తే మంచి కాంతివంతమైన చర్మంతో పాటు, నల్ల మచ్చలు, మోటిమలు తోలగిపోతాయి.

ఇలా వారానికి ఒక్క సారి చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

మొటిమలు, నల్ల మచ్చల నిర్మూలన కోసం సహజమైన పద్దతులు – “ఫేస్ ప్యాక్స్ మరియు ఫేస్ మాస్క్”

 

పసుపు– చర్మాన్ని సం రక్షించే పదార్దాలలో, పసుపు ఎంతో ముఖ్యమైనది. ఇది మన చర్మంలోని జిడ్డు తనాన్ని తొలగించి, దద్దుర్లు, మొటిమల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఇది మన చర్మాన్ని నిగారింపచేసి ఎంతో అందంగా మరియు మృదువుగా మారుస్తుంది.

పసుపులోని గుణాలు చర్మాన్ని శుబ్రపరిచి, పనికిరాని అంటే సరిగా లేని చర్మాన్ని తోలగించి కొత్తగా, అందమైన మరియు, ఎంతో మృదువైన చర్మాన్ని ఇస్తుంది.

ఈ పసుపుతో చేసిన “ఫేస్ ప్యాక్” మొటిమల్ని నిర్మూలించి, చర్మాన్ని ఎంతో కాంతివంతంగా చేస్తుంది.

ఇది మీ శరీరంలోని మలినాలని, దుమ్ము, ధూళిని, మరియు బ్యాక్టీరియా ని తొలగించి యాంటీ బాక్టీరియల్ గా పనిచేస్తుంది.

పసుపు మీ చర్మంలోని జీవం కోల్పోయిన కణాలని తొలగించి, శుబ్రపరిచి, ఎంతో కాంతివంతమైన, మరియు తేజోవంతమైన చర్మాన్ని ఇస్తుంది.

మన చర్మం లోని రంద్రాలని దుమ్ము మరియు మలినాల నుండి శుబ్రపరిచి, సహజత్వంతో కూడిన చర్మాన్ని ఇస్తుంది.

పసుపు మరియు ఓట్స్ పిండితో తయారు చేసిన “ఫేస్ ప్యాక్”

కావలసినవి:

  • పసుపు: 2 చిటికెలు (కొద్దిగా),
  • ఓట్స్ పిండి: 4-5 స్పూన్లు,
  • తేనె: 3-4 స్పూన్లు,
  • పచ్చి పాలు: 4-5 స్పూన్లు

తయారుచేసుకునే విధానం:

పైన సూచించినవన్నీ ఒక గిన్నేలొ కలిపి పేస్టులా చేసుకోవాలి, దానిని మీ ముఖానికి రాసుకుని 15-20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే, పాలు తేనే మన ముఖంలోని తేమను కాపాడతాయి, పసుపు మన ముఖం పై ఉన్న మచ్చలు, మోటిమలను శుబ్రం చేసి, ఎంతో కాంతివంతమైన చర్మాన్ని ఇస్తుంది.

ఈ చిట్కా పొడిగల చర్మం ఉండి మొటిమలతో బాధపడేవారికి ఎంతో మంచి ఫలితాలని ఇస్తుంది.

పసుపు & పెరుగుతో తయారు చేసిన “ఫేస్ ప్యాక్”

కావలసినవి:

  • పసుపు: 3-4 చిటికెలు (కొద్దిగా),
  • పెరుగు: 1\2 కప్పు

పైన సూచించినవన్నీ ఒక గిన్నేలొ కలిపి పేస్టులా చేసుకోవాలి, దానిని మీ ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే,సుర్యుని వేడి వల్ల మాడిన, లేదా రంగు మారిన చర్మం అందంగా మారుతుంది, ఈ మిశ్రమాన్ని ముఖానికే కాకుండా కాళ్ళు, చేతులకు కూడా రాసుకుని 15-20 నిమిషాల తర్వాత శుబ్రపరుచుకుంటే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.

పసుపు మరియు గంధముతో (sandal) తయారు చేసిన “ఫేస్ ప్యాక్”

కావలసినవి:

  • పసుపు: 3-4 చిటికెలు (కొద్దిగా),
  • గంధపు పొడి (sandal wood powder) 1-2 టేబుల్ స్పూన్లు,
  • పాలు: 1-2 స్పూన్లు

పైన సూచించినవన్నీ ఒక గిన్నేలొ కలిపి పేస్టులా చేసుకోవాలి, దానిని మీ ముఖానికి రాసుకుని 10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే,మీ చర్మంలోని నల్లదనం మొత్తం పోయి ఎంతో కాంతివంతమైన, మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది.

పసుపు మరియు తేనెతో తయారు చేసిన “ఫేస్ ప్యాక్”

కావలసినవి:

  • పసుపు: 2 చిటికెలు (కొద్దిగా),
  • తేనె 2-3 టేబుల్ స్పూన్లు
  • పన్నీరు 1-2 టేబుల్ స్పూన్లు

పైన సూచించినవన్నీ ఒక గిన్నేలొ కలిపి పేస్టులా చేసుకోవాలి, దానిని మీ ముఖానికి, మెడకి రాసుకుని 10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే, మీ ముఖం పై ఉన్న ముడతలు పోయి మృదువైన చర్మాన్ని పొందుతారు.

పసుపు మరియు నిమ్మరసంతో తయారు చేసిన “ఫేస్ ప్యాక్”

కావలసినవి:

  • పసుపు 1 టేబుల్ స్పూన్
  • నిమ్మరసం 1-2 టేబుల్ స్పూన్లు

పైన సూచించినవన్నీ ఒక గిన్నేలొ కలిపి పేస్టులా చేసుకోవాలి, దానిని మీ ముఖానికి, మెడకి రాసుకుని 10 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే, ఈ మిశ్రమం ఒక బ్లీచింగ్ లా ఉపయోగపడి మీ ముఖానికి కాంతినిస్తుంది.

పైన సూచించినవి అన్నీ మీ చర్మ సౌందర్యాన్ని కాపడటానికి ఎంతో ఉపయోగపడతాయి, అందమైన చర్మం పొందాలంటే పైన సూచించిన పాటించండి, మెరుగైన ఫలితాలు పొందుతారు.

మీ చర్మ సౌందర్య సం రక్షణలో-పన్నీరు (rosewater) ఎలా ఉపయోగపడుతుంది.

స్త్రీలు వారి అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు, ఇప్పుడు ఎన్నో రకముల, చర్మ సౌందర్యాన్ని రక్షించే వస్తువులు మార్కెట్లో లభిస్తున్నాయి. కాని తర తరాలుగా, స్త్రీ యొక్క సౌందర్య సం రక్షణలో పన్నీరు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఈ పన్నీరు, మరియు “రోజ్ ఆయిల్ ” మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కలుపుకుంటే మీ మృదువైన చర్మాన్ని, చర్మ వ్యాధులు నుంచి కాపడుకోవచ్చు.

ఒకప్పటి కాలంలో పన్నీరుని ఎక్కువగా అన్నింటిలో ఉపయొగించేవారు, కానీ ఇప్పుడు కొన్ని కొన్ని ఉత్పత్తులలో మాత్రమే దీనిని ఉపయోగిస్తున్నారు.

మీ చర్మం పై పన్నీరు చేసే అద్భుతాలు తెలుసుకుందాం రండి:

1. ఈ పన్నీరు మీ చర్మంలో ఉన్న రంద్రాలని శుబ్రం చేసి, చర్మంలోని జిడ్డుని తీసేస్తుంది, అంతే కాకుండా నల్ల మచ్చలు, మొటిమలను దూరం చేసి, మీ ముఖం పై ఉన్న దుమ్ము, ధూళిని తొలగిస్తుంది.

2. మన ముఖంలో ఉన్న మంటపుట్టించే చర్మం, దద్దుర్లు, ముడతలు, మొటిమలు, వీటన్నిటిపై పోరాడే తత్వం కలిగి ఉండడం వల్ల, వీటి యొక్క నివారణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

3. దీనిని మీరు మీ “ఫేష్యల్” తర్వాత ఉపయోగిస్తే మీ చర్మంలోని ఓపెన్ రంధ్రాలను మూసివేసి, కణాలని ఆరొగ్యంగా ఉంచుతుంది, అంతే కాకుండా, దద్దుర్లూ, ఎర్రబడిన ప్రదేశాన్ని తగ్గించి, మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.

4. ఈ పన్నీరులోని సుగంధ పరిమళాలు మీ యొక్క మనసిక స్థితిని పెంచి, భావోద్వేగంతో కూడిన ఆలోచనలని తగ్గించి ప్రశాంతత ఇస్తాయి. ఇది మీకు నిద్ర సరిగా పట్టడానికి మరియు లేచిన వెంటనే మనసంతా ఎంతో ప్రశాంతంగా, ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

5. చాల సులువైన, మార్గం ఏమిటంటే మీరు రాత్రి పూట నిదురించే ముందు ఇది రాసుకుని పడుకుంటే, మీ ముఖం లోని మలినాలను శుద్ది చేసి, మరుసటి రోజు ఎంతో కాంతివంతంగా మెరిసే చర్మాన్ని ఇస్తుంది.

మగవారి చర్మం మిల మిల మెరవాలంటే, పాటించాల్సిన పద్దతులు, సహజ సూత్రాలు

 

వినడానికి వింతగా అనిపించినా కొన్ని నిజాలు నమ్మక తప్పదు, అందరు మనల్ని, కళ్ళు ఆర్పకుండా చూస్తూ,మనం ఎంతో గొప్ప వాళ్ళం అని మన అందాన్ని ఆధారంగా చేసుకునే నిర్ణయించుకుంటారు. మనం ఎంత ధనవంతులమైన, గొప్పవారిమైన అందంగా లేకపొతే దాని వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కునే ప్రమాదం ఉంది.ఎంతోమంది అనుకుంటారు అందం, దాని సం రక్షణ, కేవలం ఆడవారికే అని, అది చాల తప్పు, మగవారు కూడ అందంగా ఉండాలి, అప్పుడే ఎదుటివారు గౌరవిస్తారు.

మీ అందం గురించి దాని రక్షణ గురించి తెలుసుకునే ముందు అసలు మీ చర్మం ఏ రకం,జిడ్డుగల చర్మమా, పొడి గల చర్మమా, లేదా సాదారణ చర్మమా,సుర్యకాంతి వల్ల ఇబ్బంది కలిగే రకమా, ఇలా ముందుగా మీ చర్మం యొక్క రకాన్ని తెలుసుకుని దానికి తగిన పద్దతులలో,అందంగా చేసుకోవాలి.

మిమ్మల్ని అందంగా చేసి, అందరూ కళ్ళు ఆర్పకుండా చుసేలా ఏమి చేయాలో తెలుసుకుందామా:

ముఖాన్ని శుబ్రపరుచుకోవాలి:

మీరు బాగా బద్దకం కలిగి ఉండి, చర్మ సౌందర్యం కోసం అంతగా ఆలోచించని వారైననూ, రోజూ మీ ముఖాన్ని “ఫేస్ వాష్” తో కాని, ఏదైన “క్రీం” తో కాని శుబ్రం చేసుకోవడం ఎంతోఅవసరం.ముందుగా మీ చర్మం యొక్క తత్వాన్న్ని తెలుసుకుని, తగిన క్రీం ని మాత్రమే ఉపయోగించాలి.సబ్బుని వాడకపోవడం ఎంతో మంచిది, ఎందుకంటే ఒక ఫ్రాన్స్ రచయిత్రి రచించిన “బ్యూటీ” అనే పుస్తకంలో సబ్బు గురించి ఇలా వర్ణించారు,”సబ్బు యొక్క ప్రభావం మెడ కింది బాగం లో ఉన్న చర్మానికే ఉపయోగ పడుతుంది” అని,

అందుకే సబ్బు కన్నా రోజూ మీ ముఖాన్ని “ఫేస్ వాష్” తో కాని, ఏదైన “క్రీం” తో కాని శుబ్రం చేసుకోవడం ఎంతోఅవసరం.

చర్మంలోని మార్పు ఎంతో అవసరం:
  • మన చర్మంలోని కణాలు ఎప్పటికప్పుడు మారుతూ, చనిపొయిన చర్మ కణాలను తొలగిస్తూ ఉండాలి.దీని వల్ల చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది.
  • ఇటీవల ఒక అధ్యయనంలో ఆడవారి కన్నా మగవారు అధిక శాతం యవ్వనంగా కనిపిస్తారు, ఎందుకంటే దానికి కారణం మగవారు షేవ్ చేసుకునే ప్రతీసారి వారి చర్మంలోని కణాలలో మార్పు వస్తూ, కొత్త కణాలు పుడతాయి.
“సన్ స్క్రీన్”
  • ప్రముఖ చర్మ సం రక్షణ నిపుణులు, చర్మ రోగ నిపుణులతో ” Oprah Winfrey’s publication ‘O’” వారు ఒక ప్రముఖ టాక్ షో నిర్వహించారు.అందులో ప్రతీ ఒక్కరు మన చర్మానికి సన్ స్క్రీన్ ఎంతో ఉపయోగకరం అని సూచించారు.
  • అయితే మనం బయటకు వెళ్ళే 30 నిమిషాల ముందు “సన్ స్క్రీన్ SPF 15″ ఉపయోగించుట అవసరం, చాలా జగ్రత్తగా వాడాలి.
  • ఎక్కువసేపు బయట ఉండేవారు SPF30 ఉపయోగించుట మంచిది.
“షేవ్ లేదా కత్తిరించండి”
  • మగవారిలో జుట్టు పెరుగుదల సాధారణంగా ఉంటుంది, ఎక్కువగా షేవ్ చేసుకోవలసిన అవసరం లేదు,
  • కాని మీరు చేసుకునే అప్పుడు మాత్రం ఒక్కసారి అన్నీ సరిచూసుకోండి.
  • మంచి “రేజర్”, క్రిములను నాశనం చేసి మృదువుగా చేసే జల్ కాని క్రీం కాని ఉపయోగించండి.
  • ఆల్కహాల్ లక్షణాలు ఉన్న వాటిని దూరంగా ఉంచండి, ఎందుకంటే ఇవి మన చర్మంలో ఉన్న సహజ నూనెలను కరిగించేసి మన ముఖాన్ని పొడిగా,నిర్జీవంగా, అందవికారంగా తయారు చేస్తాయి.
“మీ చర్మాన్ని ఎప్పటికప్పుడు తేమగా ఉంచండి”
  • సాధారణంగా మగవారి చర్మం స్త్రీల కన్నా ఎక్కువ జిడ్డు కలిగి ఉంటుంది, అందువల్ల ఎక్కువ శాతం ముడతలు వచ్చే ప్రమాదం ఉంది.
  • మన చర్మాన్ని ఎప్పటికప్పుడు తేమగా ఉంచే “మాయిశ్చరైజర్ లేదా క్రీమ్” ని వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది.
  • షేవింగ్ మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తే, షేవ్ చేసుకున్న తరువాత, లేదా పడుకునే ముందు మాయిశ్చరైజర్ లేదా క్రీమ్ ఉపయోగిస్తే ఎంతో మంచిది.
  • మనం పైన అనుకున్న విదంగా చేయడం కోసం,ఖరీదైనవి వాడవల్సిన పని లేదు, మన చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం అనేదే, మంచిదే,అలోచించి, ఆచరించండి.

అందానికి, ఆరోగ్యానికి, కోడి గుడ్డు చెప్పే సూత్రాలు

 

ప్రపంచంలోని ప్రతీ ఒక్కరు, తమ చర్మ సౌందర్యం కోసం, జుట్టు సం రక్షణ కోసం ఎంతగానో అలోచిస్తారు. అయితే మీరు కూడా మీ జుట్టు పొడవుగా, అందంగా,ఉండాలని కోరుకుంటు న్నారా, లేదా, మృదువైన చర్మం కోసం ఏమిచేయాలి అని సతమతమవుతున్నారా, అయితే తక్కువ ఖర్చుతో మీ ఇంట్లోనే మీ ప్రశ్నలకు సమాధానం లబిస్తుంది. అది ఏమిటంటే,

ఈ ప్రశ్నలన్నింటికి కోడి గుడ్డ్లు చెప్పే చిట్కాలు చూద్దామ.

కోడి గుడ్డ్లలోని “లూటిన్” మీ చర్మాన్ని “ఎలాస్టిక్” గా చేయడానికి, మరియు “హైడ్రేట్” చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇవి మీ చర్మ కణాలని సుద్దిచేసి, మీ చర్మాన్ని గట్టిగా చేస్తాయి. అంతేకాకుండా మీ జుట్టుకి బలంతో పాటు , మెరుపుని ఇస్తాయి. వీటిలోని “ప్రొటీన్లు” మనలోని జుట్టు మరియు గోళ్ళు పెరుగుటలో ఎంతో సహాయ పడతాయి. మీరు అందమైన చర్మం, సహజమైన జుట్టు పొందాలంటే, మీరు రోజూ తినే ఆహారంలో కోడి గుడ్డుని కూడా కలిపి తీసుకోండి. మీ అందం పైన, మీ జుట్టు పైన మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.

మీ చర్మ సౌందర్యం కోసం కోడి గుడ్డ్లు వాటి ప్రయోజనాలు మీ మెరుగైన చర్మం కోసం:
ఒక గుడ్డు తీసుకుని,దానిలోని సోనని ముఖానికి పట్టించి అది గట్టి పడిన తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే, చర్మం గట్టిపడడమే కాకుండా, మంచి కాంతివంతముగా మెరుస్తుంది.

మీ చర్మం యొక్క గట్టిదనం కోసం:
ఒక గుడ్డు తీసుకుని, దానిలోని పచ్చ సొన, తెల్ల సొన రెండింటిని వేరు చేసి,తెల్లసొనని ఒక గిన్నెలో బాగా కలిపి ముఖానికి పట్టించాలి, అది గట్టి పడిన తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే అది మన చర్మ కణాలని గట్టి పరచడమే కాకుండా, మొటిమలును తగ్గించేందుకు సహాయపడుతుంది

కళ్ళ కింద సహజత్వం కోల్పోయిన, లేదా ఉబ్బిన చర్మం కోసం:
మీరు మీ కంటి కింద చర్మం వాపుతోటి బాధపడుతున్నారా,ఎంతో అలసటగా అనిపిస్తుందా అయితే ఒక గుడ్డు తీసుకుని, దానిలోని తెల్ల సొనని ఆ వాచిన ప్రదేశం పై రాసి ఒక 10 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రపరుచుకుంటే, ఆ వాపులు తగ్గి మంచి సత్ఫలితాన్నిస్తుంది.

కోడి గుడ్లతో తయారు చేసుకునే “ ఫేస్ ప్యాక్స్”, వాటి ప్రయోజనాలు:

మీ జిడ్డుగల చర్మం కోసం కోడి గుడ్డు-బియ్యపు పిండి మిశ్రమము:
గుడ్డులోని తెల్ల సొనని తీసుకుని,కొంచెం కొబ్బరి నూనె కలిపి ,బాగా మిక్స్ చేసి మీ ముఖానికి , మెడకి పట్టించాలి, తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి, ఇలా చేస్తే మీ చర్మము జిడ్డు లేకుండా కాంతివంతంగా అవుతుంది, ఈ పద్దతి మీ జిడ్డుని పొగొట్టుకోవడానికి ఎంతో సులభమైనది.

మీ పొడిబారిన చర్మం కోసం:

గుడ్డులోని పచ్చ సొన, ఆలీవ్ నూనె మిశ్రమం:
గుడ్డులోని పచ్చ సొన తీసి, కొంచెం నిమ్మ రసం,కొంచెం పచ్చి ఆలివ్ నూనె కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, కాసేపటి తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే,మీ పొడి చర్మం ఎంతో అందంగా మారుతుంది, ఈ పద్దతి పొడి చర్మంతో బాదపడే వారికి ఎంతో ఉపయోగకరం.

మీ మృదువైన, తేజోవంతమైన, మెరిసే చర్మం కోసం:

గుడ్డు, తేనే, రోజ్ వాటర్ మిశ్రమము:
గుడ్డు,ఒక స్పూన్ తేనే, కొంచెం ఆలీవ్ నూనే, 2 స్పూన్లు రోజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి,20 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే, మృదువైన, ఎంతో కాంతివంతమైన చర్మంతో పాటు, నల్ల మచ్చలు సైతం తొలగిపోతాయి.

మీ మెరిసే చర్మం కోసం:

గుడ్డు, పెరుగు మిశ్రమము:
గుడ్డులోని పచ్చ సొనలో కొంచెం తేనే, పెరుగు కలిపి మీ ముఖానికి పట్టించి, 20 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే, మెరిసే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.

మీ చర్మం యొక్క మెరుగైన చాయ కోసం:

గుడ్డు, తేనే మిశ్రమము:
గుడ్డులోని తెల్ల సొనని తీసుకుని ఒక స్పూన్ తేనె కలిపి మీ ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే, నల్ల మచ్చలు పోయి, మీ చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది.

అందమైన జుట్టు కోసం కోడి గుడ్డు చిట్కాలు:

గుడ్డు, పెరుగు హయిర్ కండీషనర్:
ఒక గుడ్డు, పెరుగు, 1 స్పూన్ పచ్చి ఆలీవ్ నూనె, కొంచెం బాదం నూనె కలిపి, ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించి 45 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే, మిల మిల మెరిసే జుట్టు మీ సొంతం అవుతుంది.

గుడ్డు, నిమ్మరసం హయిర్ కండీషనర్:
కొంచెం నిమ్మరసం తీసుకుని, గుడ్డుని కలిపి మీ జుట్టుకి పూర్తిగా పట్టించాలి, ఒక అరగంట తరువాత మీ షాంపూతో తలస్నానం చేయాలి,ఈ పద్దతి వల్ల మీ జుట్టు బాగ పెరగడమే కాకుండా, ఎంతో మృదువుగా కూడా అవుతుంది.

అందం కోసం కోడి గుడ్డు చిట్కాలు:

జిడ్డుగల జుట్టు కోసం గుడ్డులోని తెల్ల సొన:
మీ జుట్టు పొడిగా,జిడ్డుగా, నిర్జీవంగా ఉంటుందా, అయితే ఈ చిట్కా మీ కోసమే, గుడ్డులోని తెల్ల సొన తీసుకుని మీ జుట్టుకి పట్టించి, అరగంట తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేస్తే, మంచి ఫలితం లబిస్తుంది.

పొడి జుట్టు కొసం గుడ్డు, వెన్న తీసిన పాల మిశ్రమము:
ఒక కప్పు వెన్న తీసేసిన పాలలో గుడ్డు కలిపి, మీ జుట్టికి పట్టించి 30 నిమిషాల తరువాత షాంపూతో స్నానం చేస్తే ఎండిపొయినట్లు, జీవం కోల్పోయినట్లు ఉన్న జుట్టుకి మంచి మెరుపు లభిస్తుంది.

మొటిమ రహితమైన చర్మం కోసం “ఫేస్ ప్యాక్స్” , “ఫేస్ మాస్క్స్”

 

మిమ్మల్ని మొటిమలు వేదిస్తున్నాయ, ఎన్ని రకములుగా ప్రయత్నించినా ఫలితం లేక ఇబ్బంది పడుతున్నరా, మీ చర్మం మొటిమ రహితంగా కావాలంటే ఈ సహజ పద్దతులు పాటించండి మంచి ఫలితాలతో పాటు అందమైన, సొగసైన చర్మాన్ని పొందుతారు. సహజ పద్దతులంటే పండ్లు, మూలికలతో మీ సమస్యని దూరం చేసి మీ శరీరం పై మంచి ప్రభావాన్ని చూపించి మీ ముఖం పై మచ్చలు లేకుండా అందంగా మారుస్తుంది. ఈ పద్దతులు శరీరం పై ఏ దుష్ప్రబావం లేకుండా మొటిమలపై పోరాట పటిమను ప్రదర్శిస్తాయి, మొటిమల నిర్మూలన కోసం చర్మ వైద్య నిపుణులు సూచించిన కొన్ని సహజ పద్దతులు మీకోసం:

“కలబంద మరియు పసుపు” ప్యాక్:

కలబందలోని enzymes అయిన Polysaccharides మరియూ న్యూట్రీన్లు, antibacterial&antifungal గా పోరాట ప్రతిభను ప్రదర్శిస్తాయి.

ఇది సహజ టాక్సిన్స్ వ్యతిరేకంగా పోరాడి చర్మాన్ని మృదువుగా, కోమలంగా ఉంచుటలో సహాయపడుతుంది.

పసుపు:

పసుపు మహాద్బుతంగా చర్మాన్ని కాపాడే ప్రక్రియలొ సహాయపడుతుంది.

మీ చర్మానికి మంట కలిగే ప్రదేశాలని చల్లగా చేసి, మచ్చలని తొలగించి, వాపు వచ్చిన ప్రదేశాలలో వాపుని కరిగించుటలో సహాయ పడుతుంది.

మీ చర్మ చాయని పెంచి కోమలంగా మరియూ తేజోవంతంగా చేస్తుంది.

“ఫసుపు, తేనే, పాల” ప్యాక్:

1 Tbsp పసుపు, తేనె, పన్నిరు, మరియు కలబంద కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకుంటే, మచ్చ మరియు మొటిమ రహితమైన చర్మం పొందుతారు.

“సిట్రస్ పండ్లు” ప్యాక్:

సిట్రస్ పండ్లు నిమ్మ, నారింజ, అనేవి రక్త స్రావ లక్షణాలు కలిగి, చర్మంలోని “బ్యాక్టీరియ”ను తుడిచేసి చర్మాన్ని తేజోవంతంగా, మరియు అందంగా ఉంచుతుంది.

ఈ పండ్ల యొక్క గుజ్జుని ముఖమునకు రాసుకుని, 15 నిమిషాలు అలాగే ఉంచాలి, అంతేకాకుండా నిమ్మరసాన్ని ముల్తాని మట్టీ,నీరు కలిపి కూడా ఉపయోగించుకోవచ్చు, ముల్తాని మట్టి వల్ల మొటిమల పెరుగుదలని అణచి వేస్తుంది, ఈ విధముగా ముఖమునకు రాసుకుని కాసేపటి తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రపరచాలి.

ముందు మీ చర్మం యొక్క తత్వాన్ని అర్దం చేసుకోండి:

ఈ సహజ పద్దతులు అన్నీ ఎంతో మంచి ఫలితాలని ఇచ్చేవే, కాకపోతే మీ శరీర యొక్క తత్వాన్ని అర్దం చేసుకుని వాడుట ఎంతో శ్రేయస్కరం.

సాదారణ చర్మం:

ఒకవేళ మీ చర్మం సాధారణ రకం అయితే మీ చర్మం యొక్క కణాలు అ విదమైన జిడ్డుని విడువవు.

సాధారణ చర్మం అతి స్వల్ప సమస్యాత్మక శరీరం.

పొడి చర్మం:

ఒకవేళ మీది పొడి చర్మం అయితే కాగితం చాల పొడిగా ఉండి తీసినవెంటనే మీ చర్మం గట్టిగా, పొడిగా, పొరలుగా అనిపిస్తుంది.

జిడ్డు చర్మం:

మీది జిడ్డు చర్మం అయితే కాగితం, మీ ముఖ భాగంలోని బుగ్గలు, ముక్కు, మరియు నుదురు సంబంధిత ప్రదేశాలలో, జిడ్డుని గ్రహిస్తుంది.

ఈ చర్మం, ఎంతో సమస్యాత్మకమైనది, ఇది పేలగ, మందముగా కనిపిస్తుంది.అందువల్ల మోటిమలు పెరిగే అవకాసం ఎక్కువ.

కలయిక చర్మం:

చాల మంది స్త్రీలలో ఈ కలయిక చర్మం ఎక్కువగా ఉంటుంది.

ఈ చర్మం పై కాగితం ముక్కు, నుదురు పై తప్పితే బుగ్గలపై జిడ్డు గ్రహించదు.

సున్నితమైన చర్మం:

సున్నితమైన చర్మం సాధారణంగా చాలా పొడి ఉండి గట్టి అనుభూతినిస్తుంది.

ఎక్కువగా వాపు రావడం, చిరాకు కలగడం,దురద పుట్టడం, చర్మం ఎర్రగ అవడం,చివరకు ముఖం పై చిన్న చిన్న మచ్చలకు దారితీస్తుంది

పాలు: పాలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల, ఇది పొడి చర్మానికి చాలా ఉపయోగపడుతుంది,

జిడ్డు చర్మాన్ని పాలకు దూరంగా ఉంచడం చాల అవసరం ఎందుకంటే పాలలో ఉన్న కొవ్వు వల్ల జిడ్డు చర్మం మరింత జిడ్డుగా మారే ప్రమాదం ఉంది.

సిట్రస్ పండ్లు: ఇది పొడి చర్మం పై ఉపయోగిస్తే, తేమని తొలగించి మరింత పొడిగా మారుస్తుంది.అందుకే జిడ్డు చర్మం పై ఉపయోగిస్తే జిడ్డుని తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది.

సాదారణ చర్మం కలవారు బాగా సాంద్రత తగ్గిన నిమ్మ రసాన్ని కూడా ఉపయోగించవచ్చు.

తేనె: ఇది సాదారణంగా తేమను తగ్గించేదిగా పని చేస్తుంది, అందువల్ల అన్ని రకముల చర్మాలకు ఉపయోగించుకోవచ్చు.

అందానికి, చర్మ సౌందర్యానికి నారింజ చెప్పే “ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్”

 

మన చర్మ సౌందర్యానికి పండ్ల ఫదార్దములు ఎంతో మేలు చేకూరుస్తున్నయి,అందువల్లనే ఇప్పటికీ ఎంతో మంది ఆరోగ్యకరమైన, కాంతివంతమైన చర్మం కోసం “కాస్మొటిక్ ప్యాక్స్” కన్నా “ఫ్రూట్ ప్యాక్స్” ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉపయోగిస్తూ ఉంటారు. చర్మ సౌందర్య సం రక్షణను పెంపొందించే పండ్లలో నారింజ ఎంతో ఉపయోగకరమైనది.

నారింజలొ “కాల్షియం” మరియు “విటమిన్ భ్” పుష్కలంగా ఉన్నయీ అనడంలో సందేహం లేదు,ఇవి మనలోని ఎముకల్ని ధ్రుడంగా చేయడంలో ఎంతో సహయపడతాయి.మన శరీర సం రక్షణలో నారింజది ఒక అద్భుతమైన పాత్ర అని చెబితే అతిశయోక్తి కాదు, ఎందుకంటే ఫ్రూట్ జూస్ రూపంలో, గుజ్జు చేసుకుని, పండు పై భాగము అనగ తొక్కని పొడి చెస్కుని ఎలా ఎన్నొ రకాలుగా ఉపయోగపడుతుంది.

“ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్”", వాటి ఉపయోగాలు తెలుసుకుందాం

ఆరెంజ్ ఫేస్ ప్యాక్ 1:

నారింజని 2 ముక్కలుగా కోసి ఒక ముక్కలోని రసాన్ని పిండి, అందులో 2 Tbsp పెరుగు కలిపి ముఖమునకు పట్టించి 15-20 నిమిషముల తరువాత చల్లని నీటితో కడిగితే, ముఖమంతా చల్లగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, అంతే కాకుండా జిడ్డుతనం పోయి మ్రుదువుగా మరియు కాంతివంతంగా కూడా అవుతుంది.

ఆరెంజ్ ఫేస్ ప్యాక్ 2:

నిమ్మరసాన్ని ఒక గ్రాము పిండిలో కలిపి పేస్ట్ గా మారిన తరువాతా ముఖానికి పట్టించి 20 నిమిషాల అరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే చాలా మ్రుదువైనా, కాంతివంతమైన, కోమలమైన చర్మం లభిస్తుంది.

ఆరెంజ్ ఫేస్ ప్యాక్ 3:

2 Tbsp నారింజ రసంలో, 1 Tbsp తేనె, 1 Tbsp నిమ రసం కలిపి ముఖమునకు రాస్తే మొటిమలని నివారించడమే కాకుండా, మచ్చ రహితమైన, అంటే మచ్చలు లేని పరిశుబ్రమైన, తేజోవంతమైన చర్మం లభిస్తుంది

ఆరెంజ్ ఫేస్ ప్యాక్ 4:

నారింజ రసంలో బంక మట్టి, లేదా ముల్తాని మట్టి+పాలు కలిపి ఒక అరగంట సేపు తరువాత ముఖానికి రాసి మరొక 20 నిమిషముల తరువాత గొరు వెచ్చని నేటితో శుబ్రపరుచుకోవాలి.

ఆరెంజ్ ఫేస్ ప్యాక్ 5:

నిమ్మ కాయ బయట ఉండే తొక్కని పొడిగా చేసి అందులో, గంధం పొడిని జతపరిచి, పాలు\నీళ్ళూ\రోజ్ వాటర్ ని కలిపి పేస్ట్ గా అయిన తరువాత ముఖానికి పట్టించి పొడిగా మారిన తరువాత అంటే ఒక 30 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగి మెత్తటి టవల్ తో శుబ్రం చెసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.

ఒక వేళ మీది మొటిమలకు గురైన చర్మం అయితే పైన సూచించిన విదానంలో పాలకు బదులు \నీళ్ళూ\రోజ్ వాటర్ ఉపయోగించితే మంచిది.

ఆరోగ్యవంతమైన మరియు తేజోవంతమైన చర్మం కోసం టమటా చెప్పే చిట్కాలు.

 

పార్టీకి వెళ్తున్నాం అందంగా, కనపడాలి అని ఎంతో మంది ఖరీదైన “క్రీంలు” మరియు “ఫేష్యల్స్” వాడతారు, చిత్రమేమిటంటే తెలిసీ తెలియక మన డబ్బుతో మనమే మన చర్మ సౌందర్యాన్ని ఎంతో ప్రమాదకరమైన “కేమికల్స్” కు గురి చేసి పాడు చేసుకుంటున్నాము. సరిగా గమనిస్తే తాజా పండ్లు మన చర్మాన్ని ఎంతో అందంగా మరియు కాంతివంతంగా తయారు చేసి మంచి సం రక్షణను చేకూరుస్తాయి. టమాటా మన అపురూపమైన చర్మాన్ని కాపాడు కోవడానికి, ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మన చర్మ రంద్రాలను శుద్ది చేస్తూ చర్మ రక్షణకై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది.

  • సహజమైన, కాంతివంతమైన చర్మం కోసం టమాట “ఫేస్ ప్యాక్స్”…… . మీరు చేయవలసిందల్లా ముందుగా కొన్ని టమాటాలు తీస్కొండి, గుజ్జుగా చేసి, కొంచెం ఓట్స్ (బియ్యపు పిండి), ఒక స్పూన్ పెరుగు కలిపి, మీ ముఖమునకు, మెడకు పట్టించి కొన్ని నిమిషాల తర్వాత శుబ్రం చేసుకుంటే మీ చర్మాని నల్లగా చేసే పదార్దాలు తొలగిపొయి, చర్మం ఎంతో కాంతివంతంగాను మరియు మ్రుదువుగా తయారవుతుంది.
  • గుజ్జుగా చేసిన టమాటాలు, నిమ్మకాయలోని సగం తీసుకుని, నిమ్మరసాన్ని, టమాట గుజ్జుని కలిపి ముఖమునకు, మెడకు పట్టించుకొని అది పొడిగా అయ్యేవరకు వేచి ఉండాలి కొన్ని నిమిషాల తర్వాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే మీ చర్మాని నల్లగా చేసే పదార్దాలు తొలగిపొయి మంచి ఉపసమనాన్ని పొందుతారు.
  • మి ముఖాన్ని నల్లమచ్చలు ఇబ్బంది పెడుతుంటే “ముల్తానీ మట్టీ “, టమాటా గుజ్జు కలిపి ముఖానికి రాసుకుని మెల్లగా రుద్దాలి, ఎక్కువగ రుద్దినను ప్రమదమే, శరీరం ముడతలు పడిపొతుంది.15 నిమిషాల తరువాత గొరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి ఫలితాన్ని ఆస్వాదించవచ్చు.
  • మంచి అందమైన కాంతివంతమైన చర్మం కోసం గంధం పొడిని టమాట గుజ్జుతో కలిపి కొంచెం నిమ్మరసం వేసి ఆ పేస్ట్ ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి ప్రభావం చూపిస్తుంది.
  • బిజీ సమయంలో, టైము లేదు అనుకుంటే టమాటాల గుజ్జుని 2 Tbsp పాలతో కలిపి ముఖానికి పట్టించి 5 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే చర్మం ఎంతో కాంతివంతంగా, ప్రకాసిస్తుంది.

మెరిసే చర్మం కోసం సహజ పద్దతులతో కూడిన జాగ్రత్తలు

 

ఈ ఆదునిక ప్రపంచంలో అందాన్ని కాడుకోవటం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, మార్కెట్లో దొరికే ఎన్నో వస్తువుల్ని కొనుగోలు చేసి వాడుట వల్ల మన అందానికి వచ్చే ఫలితం ఎమీ లేకపోగా మన జేబులు ఖాళీ ఔతున్నాయి. ఎందుకంత ఖర్చు పెట్టడం, మీరు సరిగ్గా గమనిస్తే , మన ఇంట్లోనే ఖర్చు లేకుండా మన అందాన్ని కాపాడుకునేవి ఎన్నో ఉన్నాయి, ఇవి ఎంతో సహజమైనవి మరియు ఆరోగ్యానికి, చెర్మానికి హాని కలిగించనివి. ఖర్చు లేకుండా మీ చర్మ రక్షణ కై ఈ 10 సూత్రాలు పాటించండి.

మీ చర్మ రక్షణకై ఉత్తమమైన 10 సూత్రాలు ఇవే:
  • కొంచెం వెనిగర్, కొంచెం నీరు తీసుకుని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడ భాగానికి పట్టించి కాసేపటి తరువాత మెత్తని గుడతో కాని, లేదా కాటన్ తో తుడిస్తె మంచి ఫలితాన్నిస్తుంది
  • రోజ్ వాటర్ లో కర్పూరాన్ని కలిపి మెత్తని గుడ్డతో ముఖాన్ని రోజుకి 3-4 సార్లు తుడుచుకుంటే మంచి ఉపయోగం ఉంతుంది
  • ఇంకా తేలికైన చిట్కా ఎమిటంటే నిమ్మ రసాన్ని మీ ముఖానికి పట్టించి 10 నిమిషాలు ఉంచి చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే ఎన్నో సత్ఫలితాలు పొందవచ్చు.
  • 4 Tbsp రోజ్ వాటర్ లో 1\3 Tbsp పటికను, 100గ్రాం గ్లిసరిన్, బాగా కలిపి ముఖానికి పట్టించి 10 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకోవాలి.
  • కీరా దోసకాయని తీసుకుని అర కప్పు పెరుగులో కలిపి 5-10 నిమిషాలు ఉంచి చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే ఎన్నో సత్ఫలితాలు పొందవచ్చు.
  • ఆపిల్ ని ఒక 1 Tbsp తేనె తో కలిపి మీ ముఖానికి పట్టించి 5-10 నిమిషాలు ఉంచి చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే చర్మము ఎంతో తాజాగా మరియూ కాంతివంతమవుతుంది.
  • చమోమిలే టీ బ్యాగ్ ని 100మి నీటిలో వేడి చేసి ముఖంపై ఆ నీటిని రాసుకుని 20 నిమిషాల తరువాత చలని నీటితో శుబ్రం చేసుకుంటే చర్మము ఎంతో తాజాగా ఉంటుంది.
  • మీ ముఖాన్ని ముందుగా శుబ్రం చేసుకుని కోడి గుడ్డు లోని తెల్ల సొనని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకోవాలి
  • 1\4 Tbsp నూనెలో 1\4 XXX నిమ్మ రసం, 1 Tbsp తేనె కలిపి మీ ముఖానికి పట్టించి 10 నిమిషాలు ఉంచి వెచ్చనినీటితో శుబ్రం చేసుకుంటే ఎన్నో సత్ఫలితాలు పొందవచ్చు.
  • 1 Tbsp పాలు, 1 Tbsp తేనె, 1 కోడి గుడ్డు కలిపి మీ ముఖానికి పట్టించి 10-15 నిమిషాలు ఉంచి చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే చర్మము ఎంతో తాజాగా మరియూ కాంతివంతమవుతుంది.

ముడతలు పడిన మరియు ఒడిలి పోయిన చర్మ సంరక్షణకై టిప్స్

 

ముడతలు పడిన మరియు ఒడిలి పోయిన చర్మ సంరక్షణకై టిప్స్

ఎవరో చెప్పినట్లు “మానవుడు ఎది తినాలనిపిస్తే అదే తినొచ్చు” పెద్దలు చెప్పినట్లు మంచి ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొవడం ఎంతో అవసరం. అదే విధంగా మనం తీసుకునే ఆహారం మన శరీరంలో అనేక మార్పులకు కారణం కావచ్చు, ఈ మార్పులు తిరగ దోడటానికి వీలులేనవిగా ఉండవచ్చును, ముఖ్యంగా బాహ్య ప్రపంచానికి వచ్చేసరికి చుట్టుపక్కల వాతావరణము, సూర్య కాంతి,కాలుష్యము ఇలాంటి ఎన్నో వాటి నుండి మనల్ని రక్షించే మన శరీర బాహ్య భాగము అయిన మన చర్మం వీటి వల్ల తిరగ దోడటానికి వీలులేని ఇబ్బందులని ఎదుర్కునే ప్రమాదం ఉంది.

మన శరీర ఆక్రుతిలోని మార్పులకు శరీరంలోని తేమ శాతం తక్కువగా ఉండటం ఒక కారణం అందువలన మన చర్మ సం రక్షణ కై ఎంతో జాగ్రత్త వహించాలి. మంచి ఆహారం తెసుకోవడమే కాకుండా అది మన శరీర తత్వానికి సరియైనదో కాదో తెలుసుకోవాలి. అయితే, బదులుగా ఖరీదైన చికిత్సలు మునిగిపోవడం కంటే కొన్ని సాధారణ గృహ చిట్కాలు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయి. మీ చర్మం యొక్క భద్రత కోసం ఈ సాధారణ మరియు సులభంగా ఇంట్లో తయారు చేసుకునే “ఫేస్ మాస్క్” ల గురించి తెలుసుకుందాం.

ముడతలు పడిన మరియు ఒడిలి పోయిన చర్మం కోసం ఇంట్లో తయారు చేసుకునే “ఫేస్ మాస్క్ “

  • 2 టేబుల్ స్పూన్ ల పాలు , 1\2 టేబుల్ స్పూన్ తేనెని విటమిన్ ఏ నూనెను కలిపి మీ ముఖం మరియు మెడ మీద పట్టించాలి. 10 నిమిషాలు తర్వాత చల్లటి నీటితో కడగండి. విటమిన్ ‘ ఏ’ చర్మంలో ఉన్న మచ్చలను మరియు ముడతలను తగ్గించుటలో సహాయపడుతుంది
  • అరటి పండుని గుజ్జుగా చేసి ఈ పేస్ట్ ని మీ ముఖం మరియు మెడ మీద పట్టించాలి.10 నిమిషాలు తర్వాత చల్లని నీటితో కడగండి.అరటి పండు మన చర్మాన్ని గట్టిపరచి మ్రుదువైన కోమలత్వాన్ని ఇస్తుంది.రెండు టేబుల్ స్పూన్ ల పెరుగుని నిమ్మ రసంతో కలిపి మంచి ఫలితాల కోసం రోజూ చేయండి.
  • తాజా కలబంద వేరా జెల్ / రసం తో మీ ముఖాన్ని మర్దనా చేసినచో కలబందలో ఉన్న ఔషద లక్షణాలవల్ల చెర్మం గట్టిపడి ఏ విధమైన చర్మ వ్యాదులు వ్యాపించకుండా సహాయ పడుతుంది.
  • ఒక గిన్నె లో ఒక అవెకాడో పండు గుజ్జు తీసుకుని దానికి అదనపు పచ్చి ఆలివ్ నూనె 2 స్పూన్స్ జోడించండి. ఈ పేస్ట్ ని మీ ముఖం మరియు మెడ మీద పట్టించాలి. 30 నిమిషాలు తర్వాత చల్లని నీటితో కడగండి.
  • గులాబి నీటిలో గంధం పొడిని కలిపి, ఈ పైన సూచించినవన్నీ చేయడం వల్ల మీరు మంచి తేజోవంతమైన, మ్రుదువైన చర్మాన్ని పొందుతారు,
  • దీనితో పాటు రోజుకి 8 గ్లాసులు నీరు తాగితే చెర్మంలొ తేమ తత్వం పెరిగి చర్మం పొడిబారకుండా చెర్మ వ్యాదులకు దూరంగా పటుత్వంతో ఉంటుంది

ముందుగా మీ చెర్మానికి క్రీం లేదా లోషన్ ని పట్టించి క్రమం తప్పకుండా ఈ చిట్కాలు పాటిస్తే మంచి సత్ఫలితాలు పొందవచ్చును.

చక్కటి చర్మం కోసం సహజమైన పద్ధతులు

 

మనం తీసుకునే రోజూ వారి జాగ్రత్తలలో స్కిన్ టోనింగ్ అనేది ఎంతో ముఖ్యమైనది, మన శరీర ఆక్రుతిని, సహజత్వాన్ని కాపడుకోవడానికి ఈ పద్దతి ఎంతో అవసరం.

ఇది మన శరీరంలో ఉన్న అధిక జిడ్డు, దుమ్ము, ధూలిని తగ్గించి చర్మాన్ని ఎంతో కాంతివంతంగా ఉంచుతుంది.

మనం మన ముఖసౌందర్యం కోసం,ఎంతో ఖర్చుపెడుతూ, మార్కెట్లో దొరికే ఎన్నో ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నాము, మన జేబులు ఖాళీ అవడం తప్పితే, వీటి వల్ల ఇబ్బందులే తప్ప ఉపయోగం ఉండదు.

అలా అని చింతించనవసరం ఏ మాత్రమూ లేదు, మీ ఇంట్లొనే సహజ పద్దతులతో,ఎన్నో అద్బుతాలు చేయవచ్చు. ఏ దుష్ఫలితాలు లేని ప్రభావాన్ని పొందవచ్చు.

మనకు ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతో, కూడిన ఈ పద్దతి ఎంతో సులభంగా మరియు తక్కువ ఖర్చుతో మంచి ఫలితాల్ని ఇస్తుంది.

  • 1.5 లీటర్ల వేడి నీటిని పుదీనా ఆకుతొ కలపాలి, 10 నిమిషాల తరువాత, రెండింటిని వీరుచేసి చూస్తే చక్కటి పుదీనా మిస్రమము మిగులుతుంది, కాటన్ ప్యాడ్ ని ఉపయోగించి మొహాన్ని శుబ్రపరుచుకోవలి.
  • దొసకాయని చల్లటి పెరుగుతో కలిపి ముఖమునకు పట్టించి 5-10 నిమిషాలు ఉంచితె మంచి సత్ఫలితాల్ని ఇస్తుంది, ఇది జిడ్డు ఎక్కువగా వ్యాపించే చర్మానికి ఎంతో శ్రేయస్కరం.
  • గులాబీ నీరు సీసా లో కర్పూరం ఒక చిటికెడు ఉంచండి, రోజుకి 3-5 సార్లు మొహానికి పట్టించండి, మంచి ఫలితాలు పొందవచ్చు.మోటిమలతొ భాధపడేవారికి ఇది మంచిగా ఉపయోగపడుతుంది
  • వెనిగర్ ని గులాబీ నీటిని సమ పాళ్ళలొ కలిపి ముఖానికి పట్టిస్తే చర్మం పై ఉన్న క్రిములు అన్ని నశించి మంచి ఫలితాన్ని ఇస్తుంది.
  • ఛమొమిలె టీ బ్యాగ్ ని 5 నిమిషాలు వేడి నీటిలో ఉడికించి ఉపయొగిస్తే మంచి ఫలితాల్ని ఇస్తుంది.
  • నిమ్మ రసం కూడా మన చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో ఎంతో ఉపయొగపడుతుంది,
  • 10 నిమిషాలు నిమరసాన్ని పట్టించి మసాజ్ చేసుకుంటే చర్మం ఎంతో కాంతివంతంగా prakaasistundi.
  • ఇంట్లో లబించే ఏ నివారణి అయిన రాసుకుని తరువాత ముఖం పైన కోడి గుడ్డులోని తెల్ల సొన మాస్క్ వేసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ఆద్భుతమైన ఫలితాలు వస్తాయి అనడంలో సందేహం లేదు.

శరీర దుర్వాసన నియంత్రణకు చిట్కాలు

శరీర దుర్వాసన, చెమట మరియు ఇతర చర్మ స్రవాలు నుంచి తలెత్తు చెడు వాసన.ఈ దుర్వాసనను భరించడం ఎంతో కష్టం, ఇది మిమ్మల్ని స్నేహితుల లేదా ఇతర సమావేశాల నుంచి దూరం చేస్తుంది.మీరు ఎలాంటి కోవకు చెందిన వారైనను, ఈ చెడు వాసన మితో ఉన్నవారినే కాదు మిమల్ని కూడా ఎంతో ఇబ్బందికి గురిచేసి అసౌకర్యాన్ని కలిపిస్తుంది.

  • ఇది ప్రతి మనిషిలొ ఉండే సమస్య అయినప్పటికి ప్రతీ వ్యక్తి వివిధ రకముల శరీరం కలిగి ఉండటం వల్ల, మనిషికి ఒకరికీ మరొకరికీ మద్య మార్పు ఉంటుంది.
  • ఈ దుర్వాసన మన శరీరంలో “eccrine” మరియు “apocrine” అనే గ్రంధుల వల్ల వ్యాపిస్తుంది.
  • మొదటిగా శరీరం అంతటా వ్యాపించి ఉన్ననూ ముఖ్యంగా చేతులు పై, చేతుల కింది భాగము, చంకలు, అరికాళ్ళు, నుదురు పై ప్రభావం చూపిస్తాయి. తరువాత తొడల మధ్య చేరి ఎంతో ఇబ్బందిని కలిగిస్తాయి.
  • మార్కెట్లో ఎన్నో రకముల వివిధ ఉత్పత్తులు ఉన్నను అవి తాత్కాలిక రక్షణ మాత్రమే ఇస్తాయి, కానీ ఈ సమస్యకు శాస్వత పరిష్కారం ఎంతో అవసరం.
  • Deodorants, perfumes ఈ దుర్వాసనను కొంతవరకు తగ్గించినా శాస్వత పరిష్కారం ఎంతో అవసరం. వ్యక్తి యొక్క మానసిక మరియు భావోద్వేగ ఒత్తిడి వల్ల కూడా ఈ దుర్వాసన వ్యాపిస్తుంది

చెడు వాసనకు కారణం:

పరిశుభ్రత సమస్య: మనం నివసించే ప్రదేశం శుబ్రంగా లేకపోయినా,స్నానము సరిగా చెయకపొయినా, పరిశుభ్రమైన బట్టలు వేసుకోకపోయిన, ఎంతో చిన్నవిగా అనిపించే ఇవి

మన శరీర దుర్వాసనకు కారణం అవుతాయి

చర్మం సమస్య: చెడు వాసనకు కారణములలొ మరొకటి చర్మ సమస్యలు, మీకు “eczema” లేదా “psoriasis” అనే అలెర్జీలు ఉంటే నిర్దారించుకుని డాక్టరు ని సంప్రదించడం ఎంతో అవసరం

నివారణ మార్గములు:

  • ప్రతీ రోజు స్నానం లొ క్రిమి సం హారిక సబ్బును ఉపయొగించాలి
  • కాటన్ దుస్తులు ధరించాలి, ముఖ్యముగా undergarments, ఇవి మీ చర్మానికి గాలి తగిలేలా చేసి దుర్గందాన్ని దూరం చేస్తాయి.
  • ఎప్పటికప్పుడు 80% చెమట పట్టిన, మరియు దుర్వాసన కలిగించే ప్రదేశాలని సబ్బుతొ శుబ్రముగా కడుక్కోవాలి.
  • నేరుగా నాడీ వ్యవస్థను ప్రభావితం మరియు మరింత చెమట ఉత్పత్తికి దారి తీసే టీ,కాఫీలను తీసుకోవద్దు
  • రక్త కణాల పై ప్రభావితం చూపి చెమటకు మరియు శరీర దుర్గందానికి kaaraNam అయ్యే మద్యం కి దూరంగ undatam ఎంతో అవసరం
  • మీ రోజు వారి మందులు అనగా గర్భ మాత్రలు, స్టెరాయిడ్ ఆస్త్మా మందులు వల్ల కూడా చెమట వ్యాపించే అవకాశం ఎక్కువ, వీటి పై శ్రద్ద చూపించి సరైన మోతాదులో తీస్కోవాలి.

చెడు వాసనతో పోరాడేందుకు సహజ నివారణలు:

  • మీ స్నానం తర్వాత చివరిగా ఒక టేబుల్ స్పూన్ తేనెను నీటిలో కలిపి స్నానం చేస్తే ఇది మీ శరీర దుర్వాసనని నియంత్రిస్తుంది
  • మీ స్నానం నీటిలో ఒక టేబుల్ స్పూన్ పటికను జోడించి తీసుకుంటే, ఎంతో తాజా, దుర్వాసన రహితమైన చర్మాన్ని పొందవచ్చు.
  • పొడి రూపంలో ఉన్న బేకింగ్ సోడాను ఉపయోగించడం వల్ల అది రసాయనాలను గ్రహించి శరీర దుర్గందాన్ని తగ్గిస్తుంది
  • ఉడికించిన పుదీనా ఆకులు స్నానపు నీటిలొ కలిపి చేస్తే రోజంతా చర్మం ఎంతో తాజాగా ఉంటుంది.
  • సరైన ఆహారం తీసుకోవడం వల్ల కూడ శరీర దుర్వాసనను తగ్గించటానికి ఎంతో సహయపడుతుంది,
  • ముఖ్యముగా మీ ఆహారం 20% మాంసకృత్తులు, 20% నూనెలు మరియు కొవ్వులు కలిగి ఉండి పండ్లు మరియు కూరగాయలు తో తీసుకొవడం ఎంతో అవసరం
  • మంచి నీళ్ళు ఎక్కువగా తీసుకొవడం వలన కూడ ఎంతో అవసరం.
  • ఒక టేబుల్ స్పూన్ సొంపుగింజలను తీసుకొవడం ద్వారా మీ శరీర తాజాతనమునకు ఎంతో ఉపయోగ పడుతుంది .
  • మన జీవన శైలి మన చేతుల్లోనె ఉంటుంది,అదనపు అలసట మరియు ఒత్తిడి మన మానసిక స్తితిని పాడుచేస్తుంది అందుకే
  • దుర్వాసన అనేది మి వ్యక్తిత్వానికి మంచిది కాదు, దీని నియంత్రణకు

పైన సూచించిన విధముగా పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

ఆధారము: తెలుగు టిప్స్.ఇన్

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate