హోమ్ / ఆరోగ్యం / జీవన వాస్తవాలు / ఉపవాసం పద్థతితో మధుమేహాన్ని...
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఉపవాసం పద్థతితో మధుమేహాన్ని...

ఉపవాసం పద్థతితో మధుమేహాన్ని...

ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీక మధు మేహులు స౦ఖ్య ఎక్కువవుతూనే వున్నట్తు మనం చూస్తూనే వున్నాము. అయితే వీరికొక శుభ వార్త అందిస్తున్నారు పరిశోధకులు. అదేమిటో చూద్దాము. రక్తం లో గ్లూకోజు స్థాయిలు నియంత్రణకు మందులు, ఇన్సులిన్ ఇంజక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండక పోవచ్చు. ఉపవాసం గా ఆహార పద్దతి తోనే మధుమేహాన్ని అదుపులో వుంచుకోవచ్చుట.  అంతే కాదు మధుమేహహాన్ని వెనక్కి తిప్పి కొట్టవచ్చుట.  అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియా విశ్వ విద్యాలయం ఎలుకల మీద నిర్వహించిన తాజా అధ్యయనం సాక్షాత్తు ఇటవంటి ఆశాభావాన్ని లేవ నెత్తుతోంది. ఇన్సులిన్ ని ఉత్పతి చేసే కణాలను ఉపవాసం మాదిరి ఆహార పదాతి సరి దిద్దుతున్నట్టు తేలడమే ఇందుకు నిదర్శనం. ఇది మందులు, ఇన్సులిన్ సూదుల అవసరం లేకుండానే మధుమెహ వ్యాధి చికిత్స చేయటం లో సహకరించగలదని వైద్య పరిశోధకులు  భావనగా వున్నది.  ఉపవాసాన్ని పోలిన ఆహార పద్దతి క్లోమ గ్రంథిలో ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే కొత్త కానాల వృద్ధిని ప్రోత్సహిస్తున్నట్టు పరిశోధకులు  గుర్తించారు మరి. ఇది టైపు ఒకటి, టైపు-2 (రెండు) మధుమెహ వ్యాధి  లక్షణాలు తగ్గు ముఖంపట్టానికి సహకరిస్తున్నట్టు కనిపెట్టారు పరిశోధకులు. ఎలుకలకు ఒకేసారి మాములు ఆహరం, మరొక సరి ఉపవాసం తరహాలో ఆహరం.. ఇ విధంగా నాలుగు రోజుల పాటు క్రమమైన పద్దతిలో ఇవ్వటంతో క్లోమ గ్రంధి లో అప్పటివరకు ఇన్సులిన్ ఉత్పత్తి చేయని కణాలు తిరిగి ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే కణాలుగా మరి పోయాయని విశ్వా విద్యాలయానికి చెందిన వార్తార్ లంగో వివరిస్తున్నారు.  దీని ద్వారా మానవుల క్లోమ గ్రంధి కణాలను ఇన్సులిన్ ఉత్పత్తిని తిరిగి ప్రేరెపించామన్నారు. మరీనా కణాలు దెబ్బ తిన్న కణాలలో తిరిగి ఉత్పత్తిని అయ్యేట్టు చేశాయని, ఈ కొత్త కణాలు దెబ్బ తిన్న కానాల స్థానాన్ని ఆక్రమించాయని కూడా వివరించారు. ఉపవాసం వంటి ఆహారాన్ని ఇవ్వగా ఎలుకల్లో ఇన్సులిన్ ఉత్పత్తి పుంజుకోవటమే కాదు నిరోధకం కూడా తగ్గిందని, రక్తం లో గ్లూకోజు స్థాయిలు చాల మటుకు   స్థిరంగాఈ  కొనసాగాయని కూడా పరిశోధకులు వెల్లడిస్తున్నారు.  మధు మేహం టియువరా దశలూ వున్నా ఎలుకల లోను ఇది ఇలాంటి ప్రభావమే చూపటం పరిగణించాల్సిన విషయం అంటున్నారు.  పిండం లో క్లోమ గ్రంధి ఏర్పడేటప్పుడు కోన్ని జన్యువులు చురుకుగా కూడా పని చేస్తుంటాయిట. అయితే ఉపవాస ఆహార పద్దతి మూలంగా పెద్ద ఎలుకనలోను అలాంటి జన్యువులు క్రియశీలకంగా మారటం  మరింత విశేషం. ఈ జన్యువులు న్యూరోజెనిన్ మూడు అనే ప్రోటీన్ ఉత్పత్తి అయ్యి విధంగా చేశాయని, దింతో ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే కొత్త ఆరోగ్య కరమైన బైట కణాలు పుట్టుకుని వచ్చాయని అంటున్నారు.

 

వ్యాసం.. అనూరాధ

3.03448275862
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు