హోమ్ / ఆరోగ్యం / జీవన వాస్తవాలు / దగ్గు, జలుబు ఇంకా ఇతర తీవ్రమైన అనారోగ్యాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

దగ్గు, జలుబు ఇంకా ఇతర తీవ్రమైన అనారోగ్యాలు

దగ్గు, జలుబు ఇంకా ఇతర తీవ్రమైన (ఆందోళనకరమైన) అనారోగ్యాలు అనే అంశంపై సమాచారాన్ని తెలుసుకొని, పాటించటం.

దగ్గు, జలుబు ఇంకా ఇతర తీవ్రమైన అనారోగ్యాలు

దగ్గు, జలుబు ఇంకా ఇతర తీవ్రమైన (ఆందోళనకరమైన) అనారోగ్యాలు అనే అంశంపై సమాచారాన్ని తెలుసుకొని, పాటించటం ఎందుకు ముఖ్యమంటే-- దగ్గు, జలుబు, గొంతు నొప్పి మరియు నీళ్లుకారే ముక్కు పిల్లల జీవితాల్లో అతి సాధారణంగా సంభవించే వ్యాధులు. వీటివల్ల పెద్ద అపాయమేమీ ఉండదు. కాని, కొన్ని కేసుల్లో, దగ్గు, జలుబు అనేవి న్యూమోనియా లేదా ట్యూబర్ క్యులేసిస్ (టి.బి) లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు ముందస్తు హెచ్చరిక సంకేతాలుగా ఉంటాయి. శ్వాస సంబంధమైన ఇన్ ఫెక్షన్లు 2000 వ సంవత్సరంలో ఐదేళ్లలోపు వయస్సు పిల్లలను సుమారు 20 లక్షల మంది పొట్టన బెట్టుకున్నాయి.

ముఖ్య సందేశాలు :

దగ్గు, జలుబు, ఇంకా తీవ్రమైన అనారోగ్యాల గురించి ప్రతి కుటుంబం, సమాజం, ఏమేమి తెలుసుకొనే హక్కు కలిగి ఉన్నాయి.

  1. దగ్గు, జలుబుతో ఉన్న పిల్లలను వెచ్చగా ఉంచాలి. వారు ఎంత వీలైతే అంత ఎక్కువగా తినడానికి, త్రాగటానికి ప్రోత్సహించాలి.
  2. కొన్నిసార్లు, జలుబు మరియు దగ్గు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతాలుగా ఉంటాయి. వేగంగా లేదా అతి కష్టం మీద శ్వాస తీసుకునే పిల్లలకు ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకిన న్యూమోనియా వ్యాధి వచ్చి ఉండవచ్చు. ఇది ప్రాణాలకు అపాయం కలిగించే వ్యాధి. ఇలాంటి పిల్లలకు వెంటనే ఆస్పత్రిలో చికిత్స చేయించటం చాలా అవసరం.
  3. న్యూమోనియా వ్యాధిని నివారించటానికి శిశువుకు మొదటి ఆరునెలలు పాటు కేవలం రొమ్ముపాలు మాత్రమే ఇవ్వాలి. పిల్లలందరినీ పుష్టికరంగా ఉంచటంతో పాటు అన్ని రకాల టీకా మందులు ఇవ్వటం ద్వారా కుటుంబ పెద్దలు న్యూమోనియా వ్యాధి రాకుండా సహాయపడవచ్చు.
  4. గరుకుగా దగ్గే పిల్లలకు వెంటనే వైద్య సహాయం అవసరం. ఇలాంటి పిల్లలకు ట్యూబర్ క్యులోసిస్ (టి.బి.) వ్యాధి ఉండవచ్చు. ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ కలగటం వల్ల ఈ వ్యాధి వస్తుంది.
  5. పొగాకు లేదా వంటింటి నుంచి వచ్చే పొగకు దగ్గరగా ఉన్న పిల్లలు, గర్భవతులకు ఎక్కువగా అపాయం పొంచి ఉంటుంది.

ముఖ్య సందేశం - 1

దగ్గు, జలుబుతో ఉన్న పిల్లలను వెచ్చగా ఉంచాలి. వారు ఎంత వీలైతే అంత ఎక్కువగా తినడానికి, త్రాగటానికి ప్రోత్సహించాలి. శిశువులు, చిన్నపిల్లలు, తమ శరీరంలోని వేడిని సుళువుగా కోల్పోతారు. వాళ్లకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు వారి శరీరాన్ని కప్పి, వెచ్చగా, ఉంచాలి. దగ్గు, జలుబు, నీళ్లు కారే ముక్కు, పులిసిన గొంతు కలిగిన పిల్లలు శ్వాస తీసుకోవటం మామూలుగానే ఉంటే, ఎలాంటి మందులు లేకుండా ఇంటి వద్దనే చికిత్స చేయవచ్చు. వారిని వెచ్చగా ఉంచటం అవసరం. కానీ అతి వేడిగా చేయరాదు. వారు తినటానికి, త్రాగటానికి పుష్కలంగా ఇవ్వాలి. ఆరోగ్య కార్యకర్త సూచించిన ఔషధాలను మాత్రమే ఇవ్వాలి. జ్వరంతో ఉన్న పిల్లల ఒంటిని మామూలు చల్లని నీటిలో స్పాంజి అద్ది తుడవాలి లేదా స్నానం చేయించాలి. అయితే, ఇందుకు అతి చల్లని (శీతల) నీటిని ఉపయోగించరాదు. మలేరియా ప్రబలిన ప్రాంతాల్లో పిల్లలకు వచ్చే జ్వరం అపాయకరం. ఇలాంటి పిల్లలను ఆరోగ్య కార్యకర్త చేత వెంటనే పరీక్ష చేయించాలి. దగ్గు, జలుబు గల పిల్లల ముక్కును తరచూ శుభ్రం చేస్తుండాలి. ముఖ్యంగా పిల్లలు భోజనం చేయటానికి, నిద్ర పోవటానికి ముందర ముక్కును శుభ్రం చేయాలి. తేమ వాతావరణం శ్వాస తీసుకోవటానికి సులభంగా ఉంటుంది. మరిగే నీళ్లు కాకుండా మామూలు వేడి నీటిని గిన్నెలో పోసి, ఆ ఆవిరిని పిల్లలు పీల్చినట్లయితే స్వాంతన చేకూరుతుంది. రొమ్ముపాలు తాగే పిల్లలకు, దగ్గు, జలుబు వచ్చినప్పుడు పాలు త్రాగటం కష్టమవుతుంది. కానీ , రొమ్ముపాల వల్లే శిశువు అనారోగ్యాన్ని తట్టుకొని, ఎదుగుతారు. కనుక, తల్లి తరచూ రొమ్ముపాలు ఇవ్వటం కొనసాగించాలి. శిశువుకు పాలు చీకటం కష్టమైతే, రొమ్ము నుంచి పాలను ఒక శుభ్రమైన కప్పులో పిండి, ఆ కప్పు ద్వారా శిశువుకు తాగించాలి. తల్లి రొమ్ముపాలు లేని శిశువులైతే కొద్ది మొత్తాల్లో ఆహార పానీయాలు తరచూ తీసుకునేలా ప్రోత్సాహించాలి. అనారోగ్యం నుంచి కోలుకున్నాక, ఆ పిల్లలకు కనీసం ఒక వారం పాటు రోజూ అదనంగా ఒకపూట భోజనం ఎక్కువ పెట్టాలి. అనారోగ్యానికి ముందు పిల్లలు ఎంత బరువు ఉన్నారో, ఆ బరువును తిరిగి పొందే వరకూ వారు పూర్తిగా కోలుకోనట్లే లెక్క. దగ్గు, జలుబు సుళువుగా వ్యాపిస్తాయి. దగ్గు, జలుబుతో వున్న వారు పిల్లల సమీపంలో దగ్గటం, తుమ్మటం, ఉమ్మి వేయటం చేయరాదు.

ముఖ్య సందేశం - 2

కొన్నిసార్లు జలుబు మరియు దగ్గు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతాలుగా ఉంటాయి. వేగంగా లేదా అతి కష్టం మీద శ్వాస తీసుకునే పిల్లలకు ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకిన న్యూమోనియా వ్యాధి వచ్చి ఉండవచ్చు. ఇది ప్రాణాలకు అపాయం కలిగించే వ్యాధి. ఇలాంటి పిల్లలకు వెంటనే ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించటం అవసరం. దగ్గు, జలుబు, పులిసిన గొంతు, నీళ్లు కారేముక్కు చాలా వరకు ఎలాంటి ఔషధాలు లేకుండానే తగ్గిపోతాయి. కాని, కొన్నిసార్లు ఈ లక్షణాలు న్యూమోనియాను సంకేతాలుగా ఉంటాయి. ఇందుకు యాంటీ-బయోటిక్స్ మందులు అవసరం. న్యూమోనియా చికిత్సకు ఆరోగ్య కార్యకర్త యాంటీ-బయోటిక్స్ మందు ఇచ్చినట్లయితే, ఆ సూచనలను తు.చ తప్పక పాటించి, పిల్లలు కోలుకున్నట్లు కనిపించినప్పటికీ, నిర్దేశించిన పూర్తికాలం పాటు మందులు ఇస్తునే ఉండాలి. చాలా మంది పిల్లలు న్యూమోనియా కారణంగా ఇంటివద్దనే మరణిస్తారు. వారి సంరక్షకులు ఈ వ్యాధి చేయగల హానిని గుర్తించనందుకే ఈ ఘోరం వాటిల్లుతోంది. న్యూమోనియా కారణంగా లక్షలాది మంది పిల్లలకు వాటిల్లే మృత్యువును ఈ క్రింది సూచనలను పాటించి తప్పించవచ్చు. వేగంగా లేదా అతి కష్టం మీద శ్వాస తీసుకోవటమనేది అపాయానికి సంకేతంగా తల్లిదండ్రులు, సంరక్షకులు గుర్తించి, వెనువెంటనే (అర్జంటుగా) వైద్య సహాయం పొందాలి.

  • ఈ వైద్య సహాయం ఎక్కడ లభించగలదో తల్లిదండ్రులు సంరక్షకులకు తెలిసి ఉండాలి.
  • వైద్యం సహాయం, తక్కువ ధరకే యాంటీ-బయాటిక్ మందులు రెడీగా అందుబాటులో ఉంటాయి.

ఈ క్రింద పేర్కొన్న వాటిల్లో ఏ ఒక్క లక్షణం కనిపించినా పిల్లలను వెంటనే వైద్యశాలకు గానీ, ఆరోగ్య కార్యకర్త వద్దకు గానీ తీసుకెళ్లాలి.

  • మామూలు కన్నా వేగంగా పిల్లలు శ్వాస తీసుకోవటం 2 నుంచి 12 నెలలు శిశువు నిముషానికి 50 లేదా అంత కన్నా ఎక్కువ సార్లు, ఏడాది నుంచి ఐదేళ్ల పిల్లలు నిముషానికి 40 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు శ్వాస తీసుకోవటం సాధారణం.
  • పిల్లలు అతికష్టం మీద శ్వాస తీసుకోవటం లేదా ఎగ ఊపిరి తీసుకోవటం.
  • ఊపిరి పీల్చినప్పుడు శిశువు ఛాతీ కింద భాగం లోతుకుపోవటం లేదా కడుపు కిందికి - పైకి తన్నుకున్నట్లు కనిపించటం.
  • రెండు వారాల కన్నా ఎక్కువ కాలం పాటు పిల్లలు దగ్గుతుండటం.
  • శిశువు రొమ్ముపాలు గానీ ఇతర పానీయాలు గానీ త్రాగలేకపోవటం.
  • పిల్లలు తరచుగా వాంతులు చేసుకోవటం.

ముఖ్య సందేశం - 3

న్యూమోనియా వ్యాధిని నివారించటానికి శిశువుకు మొదటి 6 నెలలు పాటు రొమ్ముపాలు మాత్రమే ఇవ్వాలి. పిల్లలందరికీ పుష్ఠికరంగా ఉండడంతోపాటు అన్ని రకాల టీకా మందులను ఇవ్వటం ద్వారా కుటుంబ పెద్దలు న్యూమోనియా వ్యాధి రాకుండా సహాయ పడవచ్చు. న్యూమోనియా, ఇంకా ఇతర వ్యాధులు రాకుండా తల్లి రొమ్ముపాలు శిశువును కాపాడతాయి. శిశువుకు మొదటి ఆరునెలలు పాటు కేవలం రొమ్ముపాలు మాత్రమే ఇవ్వాలనేది చాలా ముఖ్యం. రొమ్ముపాలు చక్కగా తాగిన పిల్లలు ఏ వయస్సులో నైనా సరే తీవ్రమైన అనారోగ్యానికి గానీ మృత్యువుకు గానీ, గురయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. తీవ్ర శ్వాసకోశ వ్యాధులు, ఇతర అనారోగ్యాల నుంచి కాపాడి, త్వరగా కోలుకోవటానికి విటమిన్-ఎ తోడ్పడుతుంది. రొమ్ముపాలు, కార్జము (కలేజా), ఎర్ర పామాయిల్, చేపలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, నారింజ మరియు పసుపు రంగు పండ్లు, కూరగాయలు ఇంకా ఆకుకూరల్లో విటమిన్ -ఎ ఉంటుంది. విటమిన్ -ఎ ద్రవం ఆరోగ్య కార్యకర్త వద్ద అందుబాటులో ఉంటుంది. శిశువు ఏడాది వయస్సు పూర్తి చేయకముందే టీకా మందులు ఇప్పించాలి. అప్పుడే ఆ శిశువు మీజిల్స్ నుంచి రక్షణ పొందుతారు. మీజిల్స్ వ్యాధి న్యూమోనియా సహా ఇతర శ్వాస కోశ వ్యాదులకు, కోరింత దగ్గు, టి.బి.కి. దారితీయగలదు.

ముఖ్య సందేశం - 4

గరుకుగా దగ్గే పిల్లలకు వెంటనే వైద్య సహాయం అవసరం. ఇలాంటి పిల్లలకు ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ కలిగించే ట్యూబర్ క్యూలోసిస్ (టి.బి) ఉండవచ్చు. టి.బి చాలా ఆందోళనకరమైన జబ్బు. ఇది పిల్లల ప్రాణాలను బలిగొంటుంది. లేదా వారి ఊపిరితిత్తులను శాశ్వతంగా దెబ్బతీస్తుంది. టి.బిని నివారించటానికి కుటుంబాలు ఈ క్రింద పేర్కొన్న చర్యలను పాటిస్తేచాలు.

  • పిల్లలకు పూర్తిగా టీకా మందులు ఇవ్వాలి. బి.సి.జి. టీకా కొన్ని రకాల టి.బి. వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
  • టి.బి. వ్యాధి గ్రస్తుల నుంచి మరియు ఉమ్మిలో రక్తం పడే వారి నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి.

ట్యూబర్ క్యులోసిస్ తగ్గటానికి ఆరోగ్య కార్యకర్త ఇచ్చిన ప్రత్యేక మందును సూచించిన విధంగా నిర్దేశించిన కాలం వరకూ ఇవ్వాలి. ఒకవేళ, పిల్లలు కోలుకున్నట్లు కనిపించినప్పటికీ ఈ మందులు ఇవ్వటాన్ని మధ్యలోనే నిలిపివేయరాదు.

ముఖ్య సందేశం - 5

పొగాకు లేదా వంటింటి నుంచి వచ్చే పొగకు దగ్గరగా వున్న పిల్లలు, గర్భవతులకు ఎక్కువ అపాయం పొంచి ఉంటుంది. పొగతో నిండిన వాతావరణంలో ఉండే పిల్లలకు న్యూమోనియా లేదా ఇతర శ్వాస సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పొగ కారణంగా శిశువుకు పుట్టక ముందే హాని జరగగలదు. కనుక గర్భవతులు పొగత్రాగరాదు. పొగ నిండిన వాతావరణంలో ఉండరాదు. పొగాకు వాడటం సాధారణంగా కౌమారదశలోనే ప్రారంభమవుతుంది. తమ చుట్టు ఉన్న పెద్దలు పొగ త్రాగుతుంటే చూసి, కౌమార దశ పిల్లలు కూడా ఆ అలవాటును ప్రారంభిస్తారు. అంతేకాక, పొగాకును ప్రోత్సహిస్తూ వచ్చే అడ్వర్టయిజ్ మెంట్లు, చౌకధరకు సుళువుగా లభించే పొగాకు వల్ల కూడా కౌమారదశ పిల్లలు ఈ అలవాటు నేర్చుకుంటారు. పొగత్రాగటాన్ని నివారించేలా వారిలో పెద్దలు చైతన్యం తీసుకురావాలి. పొగాకు వల్ల కలిగే అపాయాల పై వారి స్నేహితులను హెచ్చరించేలా ప్రోత్సహించాలి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.02912621359
మనోహర్ Sep 14, 2018 09:37 AM

నాకు చాల రోజుల నుండి జలుబు,దగ్గు మరియు వరుసగా తుమ్ములు వస్తుంటుంది. అ సమయం లో ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది మల్లి కొంచం సేపటి తరువాత బాగనే ఉంట‌ంది.దయచేసి మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి.

లింగాల నారాయణ రెడ్డి Feb 01, 2017 11:19 AM

చాల రోజులనుండి దగ్గు పడిసము పోవుట లేదు దీనికి నేను చాల ఇబ్బంది పడుచున్నాను

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు