హోమ్ / ఆరోగ్యం / వికలాంగులైన స్త్రీలు ఆరోగ్య సంరక్షణ / ఉపయోగిస్తున్న లేదా మీరు ఉపయోగించవలసిన మందుల గురించిన సమాచారం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఉపయోగిస్తున్న లేదా మీరు ఉపయోగించవలసిన మందుల గురించిన సమాచారం

మీరు ఉపయోగిస్తున్న లేదా మీరు ఉపయోగించవలసిన మందుల గురించిన సమాచారం, ఒక ఆరోగ్య కార్యకర్తను లేదా మందుల దుకాణం వారిని అడిగి తెలసుకోవచ్చు.

aakupaccha1.pngఈ పుస్తకంలో ప్రస్తావించబడిన ఆధునికమైన మందుల గురించిన సమాచారాన్ని ఈ విభాగం అందిస్తుంది. మీరు సాంప్రదాయ సిద్ధమైన మందులను ఉపయోగించాలనుకున్నటైతే, మీ ప్రాంతంలో వుండే అటువంటి వైద్యుడిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం కాగల పరిహారం అక్కడ లభించవచ్చు. సాంప్రదాయంగా ఉపయోగింపబడే కొన్ని ఔషధాలు ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి ఎంతో వ్యత్యాసంగా వుంటాయి. ఒక చోట దొరికేవి, మరొక చోట దొరకకపోవచ్చు, లేదా మరొక చోట ఎక్కడా పని చేయకపోవచ్చు.

మందులను వేసుకోవటంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

మందులను, అవసరం అయినపుడే ఉపయోగించండి:

తమకు ఒంట్లో కొంచెం బాగుండక పోయేసరికి మందులు వేసుకోవాలి, లేకపోతే నయం కాదు అన్న అభిప్రాయంతో వుంటారు. అది సరైనది కాదు. జలుబు వంటి కొన్ని సమస్యలు, విశ్రాంతితో కొంత సమయంలో నయమవుతాయి. ఇతర సమస్యలు, మంచి ఆహారం సరిపడగ తీసుకోవటం, పరిశుభ్రమైన నీరు త్రాగటం వలన పరిష్కారమవుతాయి. ఎపుడూ కూడ మీతో ఎక్కువగాను, వేర్వేరు రకాలవి అయిన మందులను బ్రిమింగించే ఆరోగ్య కార్యకర్తలను నమ్మకండి.

మందులను పూర్తిగా వేసుకోవాలి

మీకు నయమైపోయినట్లుగా అనిపించినా సరే మందులను సిఫార్స్ చేయబడినంత కాలం మానకుండా వేసుకోవాలి. కొన్ని సందర్భాలలో మొత్తం మందు కాకుండా మోతాదు కన్నా తక్కువగా తీసుకోవటం వలన జబ్బు మళ్ళీ తిరగబెట్టే ప్రమాదం వుంటుంది. అందువలన ఔషధ నిరోధకత్వం కూడా వస్తుంది. అంటే అవే మందులు ఇకపైన ఆ అనారోగ్యానికి పనిచేయకుండా పోతాయి.

అధికంగా వేసుకోకండి

సిఫార్స్ చేయబడిన మోతాదు కన్నా ఎక్కువగా వేసుకోవటం వలన మీకు ఇంకా త్వరగా నయమైపోతుంది. అనుకోకండి. అది బహుశా మిమ్మల్ని మరింత అనారోగ్యం పాలు చేస్తుంది.

మందుల వల్ల కలిగే, దుప్పరిణామాలను తెలుసుకొని, చూసుకొంటూ వుండాలి

కొన్ని మందుల వలన హానికరమైన దుష్ఫలితాలు కలుగుతూ వుంటాయి. లేదా అలర్జీతో కూడిన రియాక్షన్ కలుగుతూ వుంటుంది. అది మరీ ప్రమాదకరం.

ఒక మందు గురించి మీరు తెలుసుకోగలిగినంత ఎక్కువ సమాచారం తెలుసుకోండి

మీరు ఉపయోగిస్తున్న లేదా మీరు ఉపయోగించవలసిన మందుల గురించిన సమాచారం, ఒక ఆరోగ్య కార్యకర్తను లేదా మందుల దుకాణం వారిని అడిగి తెలసుకోవచ్చు.

అలర్జీ

aakupaccha2.jpgకొందరికి కొన్ని మందులు పడవు. అటువంటి మందులను ఇచ్చినపుడు వారి శరీరంలో ఒక ప్రతిచర్య (రియాక్షన్) ఏర్పడటం జరుగుతుంది. ఆ ప్రతి చర్య అన్నది అసౌకర్యంగా, ఇబ్బందిని కలిగించేదిగా వుండవచ్చు. (ఉదాహరణకు, చర్మం దదుర్లు రావటం, చర్మం లేదా కళ్ళు మండటం, పెదవులు లేదా ముఖం వాయటం, ఆయాసంతో శ్వాస భారం కావటం), లేదా మరీ తీవ్రంగా మారి ప్రాణాపాయం కూడా కలిగించేది కావచ్చు. (ఉదాహరణకు పాలిపోయిన రంగుతో, చర్మం చల్లబడిపోయి చమటలు పోయటం, నాడి, గుండె చప్పడు నీరసపడిపోవటం లేదా అతి వేగంగా మారటం, శ్వాస తీసుకోవటంలో సమస్య ఏర్పడటం, రక్తపోటు తగ్గిపోవటం, లేదా స్పృహ కోల్పోవటం).

ఒక వ్యక్తి అలర్జీకి గురైనపుడు వెంటనే వైద్య సహాయం పొందటం చాలా అవసరం. ఎపినెఫ్రిన్ ఇవ్వాలి.

మీకు పడదని తెలిసిన మందులను వేసుకోకండి. ఇంకా, అదే కుటుంబానికి చెందిన ఇతర మందులను కూడా వాడకూడదు.

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు