హోమ్ / ఆరోగ్యం / పిల్లల ఆరోగ్యం / తల్లిపాల వలన లాభాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

తల్లిపాల వలన లాభాలు

శ్రేష్టం మరియు ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి అనుబంధాన్ని పెంచుతంది.

  • తల్లిపాలు - శ్రేష్టం మరియు ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి అనుబంధాన్ని పెంచుతంది.
  • ముఖ్యమైన మరియు శ్రేష్టమైనది - మొదటి ఆరు నెలలు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. దీనివలన బిడ్డకు జీర్ణకోశ సంబంధిత సమస్యలు ఉండవు. జీర్ణకోశ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. చాలా తేలికగా అరుగుదల అవుతంది. బిడ్డకు మలబద్దక సమస్య ఉండదు. తల్లిపాల వలన ఆస్తమా, చెవి సంబందించిన వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
    తల్లిపాలవలన-స్ధూలకాయం ఉండదు ఇది శాస్త్రవేత్తల  పరిశోధన వలన తెలుస్తుంది. తల్లిపాలు-పిల్లల దశలో లుకేమియా వ్యాధి రాకుండాను అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధి పెద్దవయస్సులో రాకుండా కాపాడుతుంది.
    తల్లిపాలు- పిల్లల తెలివి తేటలను పెంచుతంది. తల్లి పాలలో చాలా ఫాటీ ఆసిడ్స్ ఉన్నందున, ఇవి పిల్లలలో మెదడు పెరుగుదలకు ఉపయోగపడుతంది. తల్లి పాలు అనుకూలమైనవి. ఇందుకు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. అతి ముఖ్యమైన విషయం, తల్లి బిడ్డల మధ్య భాంధవ్యం పెరుగుతుంది. తల్లి ఓడిలో బిడ్డ ఉన్నందున బిడ్డ  చాలా అనుకూలమైన స్ధితిలో ఉంటుంది.
  • ఇక తల్లికి లాభాలు - తల్లిపాలు ఇచ్చినందు వలన తల్లికి ప్రసవానంతర సమయంలో బరువు తగ్గుటకు దోహదపడుతుంది. మానసిక వత్తిడిని తగ్గించి బాలింత దశలో రక్తస్రవాన్ని తగ్గిస్తుంది. తల్లికి రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ లాంటివి రాకుండా స్త్రీని కాపాడుతుంది. ఎంత ఎక్కువ కాలం తల్లి బిడ్డకు పాలు ఇస్తే అంత మంచిది. వ్యాధులు నుండి అంతే ఎక్కువ కాపాడుతుంది. ఆవు లేక గేది పాలు తీసుకున్న పిల్లలు ఎక్కువ అలర్జీ సమస్యలకు గురి అవుతారు.
  • ఎప్పుటి నుండి తల్లి పాలు మొదలు పెట్టాలి - ప్రసవం అయిన వెంటనే ఎంత తొందరగా మొదలు పెడితే అంతమంచిది. ప్రసవం అయిన వెంటనే శిశువును శుభ్రపరిచిన వెంటనే తల్లి చర్మం తగులునట్లు, తల్లి రోమ్ములకు దగ్గరలో బిడ్డను ఉంచినచో బిడ్డ శరీర ఉష్ణోగ్రత పెంచుతుంది. తల్లి పాలు వచ్చుటకు ప్రేరేపణ జరుగుతంది. తల్లీ బిడ్డల మద్య ప్రేమ పెరుగుతుంది.
  • ఎందుకు వెంటనే తల్లి పాలు ఇవ్వాలి? దానికి గల కారణాలు?
    కారణాలు 4 అవి
    1. శిశువు పుట్టిన మొదటి 30 నుండి 60 నిమిషాలు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ సమయంలో పాలు చీకటానికి చాలా ఉత్సాహంగా ఉంటుంది.
    2. వెంటనే తల్లి పాలు ఇవ్వటం వలన, అదికూడా కోలాస్ట్రం మెట్టమొదట వచ్చే పాలలో ఉంటుది.ఇది త్రాగించటం వలన బిడ్డకు వ్యాధి నిరోధక శక్తిని పెంచి వ్యాధులనుండి దూరంగా ఉంచుతుంది. ఇది ఒక టానిక్ లా పనిచేస్తుంది.
    3. రొమ్ము వాపు నొప్పిని తగ్గించి బాలింత దశలో రక్తస్రవాన్ని తగ్గిస్తుంది.
    4. తల్లులు ఆపరేషన్ ద్వారా కానుపు అయినాకాని, తల్లిపాలు 4గంటల తరువాత ఇవ్వవచ్చు. తల్లిని ఒక ప్రక్కకు త్రిప్పి పాలు పట్టించవచ్చు.
  • ఎంతకాలం వరకు ఇవ్వవచ్చు?
    మొదట 6నెలలు ప్రత్యేకం.ఆ తరువాత రెండు సంవత్సరాల వరకు ఆపైన కూడా ఇవ్వవచ్చు.
  • రొమ్మునుండిపాలుకారుట - ఇది చాలా సామాన్యమైనది. రొమ్ముల వెలుపలి ఖాళీని చేతులతో నోక్కిపట్టినచో కొంత తగ్గవచ్చు. అనారోగ్యంగా ఉన్న తల్లి కూడ పాలు ఇవ్వవచ్చును. టైఫాయిడ్, మలేరియా, టిబీ, లాంటి సమయంలో కూడా ఇవ్వవచ్చు.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

తల్లిపాలు తాగిన వారిలో రోగనిరోధక శక్తి అధికం

తల్లిపాలే శ్రేయస్కరం

శిశువుకు తల్లిపాలను మించిన ఆహారం లేదు. ప్రోటీన్లు , విటమిన్లతో కూడిన తల్లిపాలను తాగించినప్పుడే బిడ్డ ఆరోగ్యంగా పెరగగలుగుతుంది. కానీ కొందరు తల్లులు బ్రెస్ట్‌ ఫీడింగ్‌పై ఉన్న కొన్ని అపోహలతో పిల్లలకు పాలివ్వరు. దీంతో అటు శిశువు , ఇటు తల్లి కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని శిశువు పుట్టిన కొంతసేపటి నుంచే తల్లి పాలివ్వడం అన్ని విధాలా శ్రేయస్కరం.

నవమాసాలు మోసే తల్లి తన రక్తమాంసాలను పంచి ఇచ్చి శిశువుకు జన్మనిస్తుంది. తొమ్మిది నెల ల పాటు తల్లి గర్భంలో పెరుగుతూ వచ్చే బిడ్డకు ఆహారం అంతా తల్లి నుంచే వస్తుంది. అనంతరం శిశువుకు జన్మనిచ్చిన తల్లికి వెంటనే పాలు రావ డం ప్రారంభమవుతాయి. సృష్టి కార్యంలో ఈ ప్రక్రియ ఓ భాగంగా కొనసాగుతూ వస్తోంది.

తల్లి పాలే ఆరోగ్యం...

శిశువుకు జన్మనిచ్చిన కొంతసేపటి నుంచే తల్లి తన బిడ్డకు పాలివ్వడం ప్రారంభించడం శ్రేయస్క రం.సాధారణ కాన్పు జరిగిన వారు ఒకటి , రెండు గంటల్లోపే సిజేరియన్‌ జరిగిన వారికి నొప్పి తగ్గిన 4,5 గంటల్లోపే బిడ్డకు పాలివ్వవచ్చు. దీంతో బిడ్డ ఆరోగ్యంగా , అవసరమైన బరువుతో పెరగగలుగు తుంది.దీంతో పిల్లలకు విరోచనాలు సక్రమంగా జరగడమే కాకుండా ఎటువంటి ఆరోగ్య సమస్య లు ఎదురుకావు. తల్లి పాలు పిల్లకు తొందరగా జీర్ణమవుతాయి. తల్లిపాలల్లో ప్రోటీన్లు , విటమిన్లు , కార్బోహైడ్రేట్లు , మినరల్స్‌ , కాల్షియం , పొటాషి యం తదితరాలు అవసరమైన మేరకు ఉంటాయి. ఫలితంగా బిడ్డ ఆరోగ్యంగా పెరుగగలుగుతుంది.

తల్లి పాలు తాగే శిశువుకు ఎటువంటి ఇన్‌ఫెక్షన్లు రావు. కొందరు తల్లులకు సరిగ్గా పాలురావు. అటు వంటి వారు వచ్చినంత మేరకు తల్లి పాలిచ్చిన అనంతరం తక్కువ పడితే బాటిల్‌తో పాలు పట్ట వచ్చు.ఇక తల్లి అస్సలు పాలివ్వకపోతే శిశువుకు మోకాళ్లు వంకరతిరగడం వంటి సమస్యలు ఎదు రుకావచ్చు. శిశువు తల్లిపాలు తీసుకోవడంతో వైర స్‌ ఇన్‌ఫెక్షన్స్‌ , అలర్జీ రాకుండా ఉంటాయి. ఈ పాలల్లో ప్రొటెక్టివ్‌ యాంటీబాడీస్‌ ఉంటాయి. దీం తో శిశువులో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. బిడ్డ ఆకలితో ఏడ్చిన వెంటనే సులభంగా తల్లి తన పాలివ్వవచ్చు. అదే డబ్బా పాలివ్వడానికి సమయం పడుతుంది.బ్రెస్ట్‌ ఫీడింగ్‌ చేస్తుంటే స్ర్తీలకు వెంటనే ప్రెగ్నెన్నీ రాకుండా ఉంటుంది. పాలివ్వడం మూ లంగా తల్లిలో యూటెరస్‌ తిరిగి మామూలు సైజు కు చేరుకుంటుంది.

మానసికంగా సిద్ధం చేయాలి...

మొదటి కాన్పు జరిగే గర్భిణులకు బిడ్డకు పాలి చ్చే విషయంలో ముందుగానే మానసికంగా సిద్ధం చేయాలి. 7,8 నెలల గర్భంతో ఉన్నప్పుడే వారికి పుట్టిన వెంటనే శిశువుకు పాలివ్వాలని చెప్పాలి. దీ నివల్ల ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రయ త్నించాలి. బిడ్డకు పాలిచ్చే బ్రెస్ట్‌ నిపుల్‌ను కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. నిపుల్‌ వెనక్కి ఉంటే పు ట్టిన బిడ్డ పాలు తాగేందుకు ఇబ్బందులు ఎదుర వు తాయన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని సరి చేయాలి. పాలిచ్చేటప్పుడు నిపుల్‌ చుట్టూ శు భ్ర పర్చుకోవాలని తల్లులకు చెప్పాలి.

ఆరు నెలల వరకు తప్పనిసరిగా...

తల్లి శిశువుకు ఆరు నెలల వరకు తప్పనిసరిగా పాలివ్వాలి. శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే తొమ్మిది నెలలవరకు పాలివ్వడం శ్రేయస్కరం. ఇక అయిదు నెలల నుంచి పాలతో పాటు పండ్లు , పిల్లలకు ఇచ్చే ఇతర పోషకాహారాన్ని అందజేయ డం మంచిది. ఇక బిడ్డకు ప్రతి రెండు , మూడు గం టలకొకసారి తప్పనిసరిగా తల్లి పాలివ్వాలి. ఒక వేళ శిశువు గాఢ నిద్రలోఉంటే నాలుగు గంటల కైనా పాలివ్వాలన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. తల్లి బిడ్డకు కనీసం అయిదు నిమిషాలైన పాలి వ్వాలి. పెరుగుతూ ఉండే శిశువుకైతే 10,15 నిమి షాల పాటు పాలిస్తే మంచిది. కడుపునిండా పాలు తాగగానే పిల్లలు వెంటనే పడుకుంటారు.

తల్లి పాలిచ్చినా ఇంకా ఏడుస్తుంటే బిడ్డకు పాలు సరిపో లేదన్న విషయాన్ని గమనించి బాటిల్‌తో పాలు తాగించాలి. సిజేరియన్‌ ఆపరేషన్‌ జరిగిన మగు వలు ప్రారంభంలో పడుకొని పాలిచ్చిన నొప్పి తగ్గిన తర్వాత కూర్చొని పాలివ్వాలి. కూర్చొని పిల్లలకు పాలిస్తేనే మంచి దన్న విష యాన్ని గమనించాలి. దీంతో శిశువు కడుపునిండా పాలు తాగగ ల్గుతాడు. పాలు తాగిన తర్వాత బిడ్డను భుజంపై వేసుకొని కొద్ది గా జో కొడితే పాలతో పాటు వెళ్లే గాలి మూలంగా వాంతులు రాకుండా ఉంటాయి. ఈ విధంగా చేస్తే శిశువుకు పాలు వెంటనే జీర్ణం అవుతాయి.

వయస్సు పెరిగిన కొద్ది సమస్యలు...

వయస్సు పెరిగిన తర్వాత డెలివరీ అయ్యే స్ర్తీలల్లో పాలు రావడం తగ్గుతుంది. ముఖ్యంగా 35 సంవత్సరాల తర్వాత కాన్పు జరిగే వారిలో ఈ సమస్య ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముందుగా గర్భం ధరించడం శ్రేయస్కరం. పిల్ల లకు పాలివ్వడంలో ఎటువంటి టెన్షన్‌ పడకూ డదు. ప్రశాంతంగా పాలిస్తేనే తల్లి బిడ్డకు సక్రమం గా పాలివ్వగల్గుతుంది. కొందరు స్ర్తీలలో కొన్ని రకా ల ఆరోగ్య సమస్యలతో సరిగ్గా పాలు రావు. బిపి , గుండె సమస్యలు , మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న మహిళల్లో ఈ సమస్య ఉంటుం ది.

పాలు సక్రమంగా రాని బాలింతలకు కాల్షి యం , ఇతర మందులను అందజేస్తా రు. ఈ మహిళలు ఎక్కువ క్యాలరీల తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోటీన్లు , విటమిన్లతో కూడిన ఆహా రంతో పాటు పాలు , బ్రెడ్‌ , రొట్టెలు తీసుకోవాలి. తల్లికి తగినంత నిద్ర ఉండాలి. నీళ్లు బాగా తాగాలి. ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడు తల్లి బిడ్డకు తగినంత పాలివ్వగల్గుతుంది. తల్లి పాలు కడుపు నిండా తాగిన పిల్లలు అవసరమైన బరువు పెరుగుతారు. కొందరు తమ బిడ్డకు ఎక్కువగా పాలిస్తారు. ఇది మంచిదికాదు. దీంతో శిశువుకు వాంతులు రావడం జరుగుతుంది.

ఆరోగ్య సమస్యలకు వెంటనే వైద్యం...

బ్రెస్ట్‌లో ఇన్‌ఫెక్షన్‌ , గడ్డలు ఉన్నప్పుడు తల్లి బిడ్డకు సరిగా పాలివ్వలేదు. ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడే వెంటనే డాక్టర్‌తో చికిత్స చేయించు కో వాలి. బిడ్డకు జలుబు ఉన్నప్పుడు ముక్కు పట్టేసి పాలు తాగడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. జలుబు ఉన్న పిల్లలకు వెంటనే వైద్యం చేయించా లి. తల్లిలో ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ ఉంటే పాల ద్వారా అది బిడ్డకు సోకవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్‌ఫెక్షన్‌కు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్య చికిత్సలు చేయించుకోవాలి.
తీవ్రమైన గుండె వ్యాధుతో బాధపడుతున్న తల్లులు బిడ్డకు పాలివ్వలేరు. ఇక డెలివరీ సమయంలో షాక్‌ తో సైకోస్‌గా మారిన వారు సైతం తమ పిల్ల లకు సక్రమంగా పాలివ్వలేరు. ఇటు వంటి వారు వెంటనే వైద్యం చేయించు కోవడం శ్రేయస్కరం.తల్లిపాలు ఎంత ఆరోగ్యకరమో ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రచారం చేస్తున్నది. మహిళలు అపోహలు వీడి బిడ్డలకు పాలిస్తే వారు భవిష్యత్తులో ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు. తల్లిపాలు తాగిన వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది.

- డా. పద్మావతి

- గైనకాలలజిస్ట్‌

ఆధారము: ఆయురారోగ్యాలు బ్లాగ్

తల్లిపాల ఆరోగ్యం అపోహలు

 

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా, ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు. ఆరోగ్యముగా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు. మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యముగా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము. ఇప్పుడు -Breast feeding and Doubts-తల్లిపాల ఆరోగ్యం అపోహలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం!. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి...

ప్ర్రకృతి ప్రసాదించిన తల్లిపాల గురించి ఎటువంటి ఆలోచన లేకుండా ఇతర క్షీరదాలు తమ పిల్లలను తమ పాలతోనే పెంచుతున్నప్పటికీ మనుషుల్లో ఎన్నో సందేహాలు ఉండటం మానవజాతి పరిణామంలో ఒకవిచిత్ర దశ. ఈ రచయిత తల్లిపాల సంస్కృతి రక్షణలో చేసిన కృషి ఫలితంగా ప్రభుత్వరంగంలో చిత్తూరు జిల్లా కేంద్ర ఆసుపత్రి దేశంలో మొట్టమొదటి శిశుమైత్రి ఆసుపత్రిగా రూపుదిద్దుకుంది. దాదాపు 12 సంవత్సరాలు బ్రెస్ట్‌ఫీడింగ్‌ ప్రమోషన్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఇండియా మొదటి రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా పనిచేసిన అనుభవంతో తల్లులు అడిగే కొన్ని సాధారణ ప్రశ్నలకు ఈ వ్యాసం ద్వారా జవాబులు ఇవ్వడంలో ఉద్దేశం తల్లులను చైతన్యపరచడమే.

అపోహ / సందేహం : ఈ మధ్యకాలంలో ఆరోగ్య కార్యకర్తలు అప్పుడేపుట్టిన శిశువుకు నీరు, గ్లూకోజు నీరు, తేనెలాంటి పదార్థాలు తాగించొద్దు అంటున్నారు. ఎందువల్ల?

 

జవాబు : తల్లిపాల ఉత్పత్తికి ప్రధానంగా చేయాల్సింది తల్లులు చిన్నా రులకు తరచుగా పాలుపట్టడం. పాల ఉత్పత్తి పాలు తాగడం మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడే పుట్టిన శిశువుకు చాలామంది నీరుగానీ, గ్లూకోజునీరుగానీ, చక్కెరగానీ, తేనెగానీ రకరకాల పదార్థాలు తాగిస్తుంటారు. వీటివల్ల కడుపు నిండి శిశువుపాలు తాగే ప్రయత్నం చేయదు. పాల ఉత్పత్తి ప్రక్రియ జరగదు. అంతేగాక వీటి ద్వారా చిన్నారులు సూక్ష్మజీవుల బారినపడే ప్రమాదముంది. చిన్నారుల రక్షణకు ఉపయోగపడే ముర్రుపాలు వారికి లభించవు.

అపోహ / సందేహం : మూడురోజుల వరకు తల్లిపాలు పడవు. ఇటీవల ఆరోగ్య కార్యకర్తలు శిశువు పుట్టిన మొదటి గంట లోనే తల్లిపాలు పట్టాలంటున్నారు. అదెలా సాధ్యం?

జవాబు : కాన్పు అయిన ప్రతీస్త్రీ శిశువు పుట్టినప్పటి నుండే బిడ్డకు పాలుపట్టగలదు. ముందుగా వచ్చే పాలను ముర్రుపాలు అంటారు. అవి పాపాయి ఆరోగ్య రక్షణకు ఎంతో అవసరం. తల్లిపాలు ఉత్పత్తి సరఫరా ప్రక్రియను ఇంగ్లీషులో 'టైలర్‌ మేడ్‌' అంటారు. ప్రకృతి శిశువులకు ఎప్పుడు ఏది అవసరమో అది తల్లుల ద్వారా అందించింది. మరో ఆలోచన అనవసరం. ప్రకృతి ఏర్పరచిన దారిలో నడవడం వివేకం.

అపోహ / సందేహం : కొందరు పిల్లలు పాలుతాగిన వెంటనే వాంతి చేస్తారు. ఎందువల్ల? ఎలాంటి మందులు వాడాలి?

జవాబు : అలా చేసే దానిని 'వాంతి' అనకూడదు. పాలు తాగేటప్పుడు పిల్లలు పాలతో పాటు కొంతగాలి కూడా మింగుతుంటారు. కొందరు తల్లులు పిల్లల్ని ఎక్కు వగా కదిలిస్తారు. అందువల్ల తాగినపాలు బయటకి వస్తాయి. దీనిని వైద్యపరిభాషలో 'పొసెట్టింగ్‌' అంటారు. ఇది వాంతి వ్యాధి కాదు. ఈ సహజ చర్యకు ఎలాంటి మందులు వాడకూడదు. తల్లిపాలు పట్టిన తర్వాత భుజంపై పడుకోబెట్టుకుని, శిశువు వీపుపై తరచుగా చేతితో తట్టాలి. ఇందువల్ల మింగిన గాలి బయటకు వస్తుంది. పాలుపట్టిన తర్వాత శిశువులను ఎక్కువగా కదిలించరాదు.

అపోహ / సందేహం : కొందరు చిన్నారులు ఊరకే ఎప్పుడూ ఏడు స్తుంటారు. తల్లిపాలు చాలనందువల్లా?

జవాబు : చిన్నారులలో ఏడుపునకు సవాలక్ష కారణాలు ఉన్నాయి. వాటిలో ఆకలి కూడా ఒకటి. తల్లిపాలు మాత్రమే తాగే పిల్లలు రోజుకు ఆరుసార్లకన్నా ఎక్కువ సార్లు మూత్రవిసర్జన చేస్తుంటే, సంతృప్తికరమైన పెరుగుదల ఉంటే చిన్నారులకు తల్లిపాలు సరిపోయినట్లే.

అపోహ / సందేహం : చిన్నస్తనాలు ఉంటే పాలు తక్కువ ఉత్పత్తి అవుతాయి. చిన్న స్తనాలు ఉండేవారు పాల ఉత్పత్తికి ఏమి చేయాలి?

జవాబు : స్తనాల సైజు కొవ్వుపదార్థంపై ఆధారపడి ఉంటుంది. పాలు ఉత్పత్తి చేసే గ్రంథులు అందరిలో సమానమే. స్తనాల సైజుకూ, పాల ఉత్పత్తికీ ఎలాంటి సంబంధం లేదు.

అపోహ / సందేహం : పాపాయికి పాలు పడితే స్తనాలు వదులై అమ్మల అందం తగ్గుతుందా?

జవాబు : ఇదో పెద్ద అపోహ. పవిత్రమైన మన తల్లుల ఆలోచనా విధానాన్ని సమాజం వక్రీకరించడం ఈ ఆలోచనకు కారణం. ఈ ఆలోచన మాతృత్వాన్ని, ప్రాకృత్రిక ధర్మాన్ని అవమానం చేసే ఆలోచన. నిజంగా మనం స్త్రీలు ఈ ఆలోచన చేయడంలేదు. వారు అలా అనుకుంటారని ఇతరులు అంటున్నారు. పాపాయికి పాలుపట్టడం ద్వారా అమ్మల అందం పెరుగుతుంది. పాలిచ్చే తల్లుల్లో కొవ్వుపదార్థం తగ్గుతుంది. పాలిచ్చే తల్లి మనస్సు నిర్మలంగా, చిన్నారిని గురించి భద్రతా భావంతో ఉంటుంది.

అపోహ / సందేహం : పాలు బాగా పట్టాలంటే ఎలాంటి మందులు తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తినాలి?

జవాబు : పాల ఉత్పత్తిని పెంచే మందులు లేవు. ఆహారానికి పాల ఉత్పత్తికి ఎలాంటి సంబంధం లేదు. తల్లులు సాధారణంగా తినే ఆహారం తింటే చాలు. అయితే మాములు కన్నా ఎక్కువగా తినాలి.

అపోహ / సందేహం : మాకు తల్లిపాలు పట్టడం ఎట్టి పరిస్థితుల్లో వీలుకాదు. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి, పోతపాలు వాడతాం. విదేశాల నుంచైనా పాల పొడి తెప్పించుకుంటాం. మంచి పాలపొడి ఏమిటో చెప్పండి?

జవాబు : మీరు నిత్య జీవితంలో ప్రకృ తి ప్రసాదించిన చాలా ప్రాణరక్షక వస్తువులకు బదులు ఏమిటని ఆలోచించడం లేదు. ప్రకృతి ప్రసాదించిన నీరు, గాలికి మరో మార్గం ఆలోచించడం లేదు. అదే పద్ధతిలో తల్లిపాలకు బదులు ఏమిటని ఆలోచించకండి. మరో ముఖ్య విషయం తల్లిపాలకు సమానమైన పాలపొడులు, పోతపాలు విదేశాల్లో కూడాలేవు.

అపోహ / సందేహం : తల్లిపాలు ఎప్పుడు మొదలుపెట్టాలి? ఎంతకాలం పట్టాలి?

జవాబు : బిడ్డ పుట్టిన మొదటిగంటలోనే తల్లిపాలు పట్టడం మొదలుపెట్టాలి. బిడ్డకు ఆరునెలలు పూర్తి అయ్యే వరకు తల్లిపాలు మాత్రమే పట్టాలి. ఆరవనెల ఆఖరు వారంలో ఇంటిలో తయరుచేసిన అదనపు ఆహారం మొదలుపెట్టాలి. అదనపు ఆహారంతోపాటు కనీసం రెండేళ్లు తల్లిపాలు పట్టాలి. రెండేళ్ల తర్వాత తల్లీ-బిడ్డ లకు ఇష్టమైతే ఎంతకాలమైనా తల్లిపాలు పట్టవచ్చు.

అపోహ / సందేహం : మీరెన్ని చెప్పినా, కొందరిలో తల్లిపాల ఉత్పత్తి అసలు ఉండదు?

జవాబు : తొందరపడవద్దు. తేలికపాటి నిర్ణయాలు తీసు కోకండి. ఈ తేలికపాటి నిర్ణయాలే ఇన్ని అనర్థాలకు కారణం. మీమాటే సత్యమైతే దాదాపు నాలుగు వేల పైబడి క్షీరజంతువులు మనేవి కావు. ఈ ప్రపంచంలో. సృష్టి చరిత్రలో మనుషుల్లో పోతపాల చరిత్ర దాదాపు 150, 200 సంవత్సరాలే. తల్లిపాల సంస్కృతి కోసం అంకితభావంతో కృషిచేసే ఆరోగ్యకార్యకర్తల, డాక్టర్ల సలహాలు తీసుకోవాలి.

ఆధారము : డాక్టర్‌ ఆరవీటి రామయోగయ్య--ఆర్గనైజేషన్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ సోషల్‌ డైమెన్షన్స్‌ ఆఫ్‌ హెల్త్‌, హైదరాబాద్‌ మరియు ప్రజాశక్తి న్యూస్ పేపర్

తల్లిపాలు అపోహలు- వాస్తవాలు

బిడ్డ పుట్టిన తరువాత మొదటి ఆరు నెలలు కూడా బిడ్డ ఎదుగుదలకు తల్లిపాలను మించిన ఆహారం మరొకటి లేదు. నేడు డాక్టర్లు కూడా బిడ్డకు తల్లిపా లు తప్పనిసరి అని, అవే అన్నింటికంటే అత్యు త్తమమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బిడ్డను తల్లిపాలకు దూరం చేయడం అర్థరహితం. తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడో, పాలు పడనప్పుడో బిడ్డకు ఇతర ఆహారం ఇవ్వాలి. తల్లిపాల విశిష్టత గురించి ఎంతగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ కొన్ని అపోహలు ఉన్నాయి. వాటిల్లో వాస్తవం ఎంతో చూద్దాం.

అపోహ : పాలు పట్టేటప్పుడు నొప్పి కలుగుతుంది.

నిజం : కొద్దిపాటి నొప్పి ఉంటే ఓర్చుకోవచ్చు. నొప్పి ఎక్కువగా ఉంటే, 5 లేదా 6 రోజులకు మించి కొనసాగుతుంటే మాత్రం చికిత్స చేయించుకోవాలి.

అపోహ : బిడ్డ పుట్టిన తరువాత మొదటి 3, 4 రోజులు బిడ్డకు సరిపోయేటన్ని పాలు రావు

నిజం : అలా వచ్చే పాలు సరి పోతాయి. బిడ్డ సరిగా పాలు తీసుకోకపోవడం వల్ల ఆకలి వేయవచ్చు.

అపోహ : వాతావరణం వేడిగా ఉన్నప్పుడు బిడ్డకు అదనంగా నీళ్ళు అవసరం.

నిజం : అలాంటిదేమీ ఉండదు. బిడ్డకు అవసరమైన నీళ్ళు తల్లిపాలలోనే సరిపోయేటంతగా ఉంటాయి.

అపోహ : తల్లిపాలు తాగే వారికి అదనంగా డి విటమిన్‌ అవసరం

నిజం : బిడ్డకు అవసరమైన పోషకాలన్నీ కూడా తల్లిపాలలోనే ఉంటాయి.

అపోహ : పాలు పట్టేందుకు ముందుగా ప్రతిసారి రొమ్ము శుభ్రం చేసుకోవాలి.

నిజం : రొమ్ము భాగాన్ని తరచూ శుభ్రం చేస్తుంటే, ప్రొటెక్టివ్‌ ఆయిల్స్‌ వెలువడుతాయి. పాలుపట్టే ప్రక్రియ ఇబ్బందికరంగా మారేఅవకాశం ఉంది.

అపోహ : బిడ్డ నీళ్ళ విరోచనాలు, వాంతులతో బాధపడుతుంటే బిడ్డకు తల్లిపాలు ఇవ్వకూడదు.

నిజం : వైద్యుల సూచన మేరకే పాలు పట్టడం ఆపాలి తప్పితే సాధారణ పరిస్థితుల్లో, సాధారణ అనారోగ్యాలు ఉన్నప్పుడు పాలు పట్టవచ్చు. వివిధ రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి బిడ్డను కాపాడేది తల్లిపాలే.

అపోహ : తల్లి మందులు వాడుతుంటే బిడ్డకు పాలు ఇవ్వకూడదు.

నిజం : కొన్ని రకాల మందులు మినహాయిస్తే, ఇతర మందులు వాడుతున్నప్పుడు, డాక్టర్‌ సూచన మేరకు బిడ్డకు పాలు పట్టడాన్ని కొనసాగించవచ్చు.

అపోహ : గర్భంతో ఉన్న తల్లి పాలు ఇవ్వకూడదు

నిజం : తల్లికి, పాలు తాగే బిడ్డకు ఎలాంటి సమస్య రానంత వరకూ, తల్లి గర్భంతో ఉన్నా కూడా బిడ్డకు పాలు ఇవ్వవచ్చు.

అపోహ : సిజేరియన్‌ ఆపరేషన్‌ అయిన పక్షంలో బిడ్డకు పాలు ఇచ్చేందుకు తల్లి ఒక రోజు వేచి ఉండాలి.

నిజం : అలాంటిదేమీ లేదు. సర్జరీ అయిన తక్షణం, తల్లి పాలు ఇవ్వగలిగే స్థితిలో ఉంటే, డాక్టర్ల సూచన మేరకు పాలు ఇవ్వవచ్చు.

అపోహ : పాలిచ్చే తల్లి తన ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

నిజం : తల్లి సరైన రీతిలో పోషకాహారం తీసుకుంటే చాలు. అతిగా ఆహారం తీసుకోవడం, మరీ ఎక్కువగా పాలు తాగడం చేయనవసరం లేదు.

అపోహ : పాలిచ్చే తల్లి బాగా ద్రవాలు, పళ్ళరసాలు తీసుకోవాలి.

నిజం : పాలిచ్చే తల్లి తన అవసరాలు, దాహం వేయడాన్ని బట్టే ద్రవాలు, పళ్ళరసాలు తీసుకోవాలి. అంతకు మించి అవసరం లేదు.

అపోహ : ఏ కారణంగానైనా, బిడ్డ వరుసగా కొన్ని రోజుల పాటు తల్లిపాలకు దూరంగా ఉంటే, ఇక తల్లిపాలు ఆపేయవచ్చు.

నిజం : అలాంటిదేమీ ఉండదు. బిడ్డ పాలు తాగినా, తాగకపోయినా తల్లిపాలు ఎప్పటికీ తాజాగానే ఉంటాయి.

ఆధారము: హెల్త్ కేర్ తెలుగు బ్లాగ్

3.11538461538
కుమారి Nov 22, 2016 03:21 PM

మొదటి కాన్పు రెండవ కాన్పు మధ్య ఇంట గ్యాప్ వుండాలి

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు