హోమ్ / ఆరోగ్యం / వ్యాధులు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వ్యాధులు

ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యవంతమైన మనిషిని మించి అదృష్టవంతులు మరొకరు లేరు అనేది చెప్పడంలో ఈమాత్రం సందేహం లేదు. మనషి తన సాధారణ జీవన విధానం లో తన ఆరోగ్యమును గూర్చి అలక్ష్యం చేయుచున్నాడు. అసలు మనిషి ఎటువంటి వ్యధులకి గురవుతాడో వాటికి తీసుకోనవలిసిన తగు జాగ్రత్తలు వాటి వివరములు ఈ పోర్టల్ నందు లభించును

కంటి జాగ్రత్తలు
కండ్ల కలక ముఖ్యంగా వైరస్ ద్వారా, బాక్టీరియా ద్వారా కళ్ళకి కలిగే ఇన్ ఫెక్షన్. దీంట్లో ముఖ్యంగా కళ్ళు బాగా ఎర్రబడి నీళ్ళు కారడం, కళ్ళమంటలు, కళ్ళలో పొడుచుకుంటునటువంటి బాధ, సరిగ్గా చూడలేకపోవడం ముఖ్య లక్షణాలు.
దంత సంరక్షణ
నోటి ఆరోగ్యం మరియు దంతాల ఆరోగ్యం అందరికీ చాలా ముఖ్యం.నోటి ఆరోగ్యం వలన అన్ని విధాలా ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చు. ఈ దిగువన ఇవ్వబడిన సూచనలు మీకు అద్భుతమైన నోటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి.
చెవి-ముక్కు-గొంతు
చిన్న పిల్లలలో చెవిలోంచి చీము కారడం చాలా సాధారణంగా చూసే వ్యాధి లక్షణం. చెవిలోని కర్ణభేరి పగిలి అక్కడ సూక్ష్మక్రిములు చేరి చీము తయారు చేస్తాయి. ఇది సరిగా చికిత్స చేయకపోతే పూర్తిగా చెముడు, అప్పుడప్పుడు మెదడుకు పాకి మెదడు వాపు వ్యాధి లక్షణాలు కలుగుతాయి.
చర్మ సంరక్షణ జాగ్రత్తలు
కాళ్ళుపగుళ్ళు, ఎక్జిమా (తామర), సోరియాసిస్, చర్మం రంగు మారటం (మచ్చలు రావటం), మొటిమలు, విటిలిగో- బొల్లి, స్కేబీస్ – గజ్జి తామర మొదలైన వ్యాదుల గురించి ఈ విభాగంలో చర్చించబడ్డాయి.
కండరాలు మరియు కీళ్ళ వ్యాధులు
ఆర్ త్రైటిస్ అంటే కీళ్ళలో మంట అనగా నొప్పి తో కూడిన వాపులు. ఇవి 170 రకాల కీళ్ళ జబ్బుల సముదాయం. దీని వలన కీళ్ళలో నొప్పి, వాపు, బిగుసుకు పోవడం వంటి లక్షణాలు కనపడుతాయి.
క్యాన్సర్
క్యాన్సరు అనే వ్యాధి శరీర నిర్మాణానికి కనీస అవసరమైన కణాలలో మొదలవుతుంది. ఇది దగ్గరి సంబంధం వున్న అనేక వ్యాధుల సముదాయం. దీనిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి సాధారణమైన కణాలు ఎప్పుడు క్యాన్సరు కలిగించేవిగా మారుతాయో తెలుసుకోవాలి.
సంక్రమణ వ్యాధులు
ఎయిడ్స్‌ కారక వైరస్‌.. ప్రధానంగా 'హెచ్‌ఐవి పాజిటివ్‌' వ్యక్తుల శారీరక ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. ఈ శారీరక ద్రవాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది- 1. పురుషుల వీర్యం 2. స్త్రీల యోని ద్రవాలు 3. రక్తం 4. ఉమ్మనీరు 5. మస్తిష్క నీరు 6. తల్లిపాలు 7. ఊపిరితిత్తుల నీరు 8. పొట్ట నీరు.
జన్యుపరమైన వ్యాధులు
జన్యుపరమైన అపసవ్యాలు, క్రొత్త రకమైన జన్యువులు ఏర్పడడం వల్ల, ఉన్న జన్యువులలో మార్పులు కలగడం వల్ల జరుగుతాయి. చాలా వ్యాధులకు జన్యు పరమైన కారణాలు వుంటాయి.
థైరాయిడ్ సమస్యలు
మన శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్‌ ఒకటి. ఇది మన శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు గతితప్పడం వలన హైపో థైరాయిడిజం, హైపర్‌ థైరాయిడిజం, గాయిటర్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఎబోలా మహమ్మారి
‘ఎబోలా’.. ఇప్పుడు పశ్చిమ ఆఫ్రికాలో విజృంభిస్తూ, ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి! దీని ముప్పును గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించింది.
నావిగేషన్
పైకి వెళ్ళుటకు