অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆరోగ్యం

  • healthimg8.jpg

    ఆహారంలో మార్పులతో సంపూర్ణ ఆరోగ్యం

    మన ఆకలిని సంతృప్తిపరచడంతోపాటు ఆరోగ్యకరమైన జీవనానికి ప్రాథమిక పోషకాలు ఆహారంలో తీసుకోవడం తప్పనిసరి. ఆరోగ్యంగా జీవించేందుకు పౌష్టికాహారం గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.

  • health-img4

    భారతీయ వైద్య విధానం

    ప్రజలకు పూర్వ భారతీయ వైద్య విధానం యొక్క వినియోగ సమాచారం మరియు వాటి ఉపయోగాలు  తెలుసుకొనే అవసరం చాలా ఉంది. దానిలో భాగంగా ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ మరియు హోమియోపతి (AYUSH) సంబంధించిన సమాచారం, వనరులను తెలియజేయటానికి ఈ పోర్టల్ ప్రయత్నం చేస్తుంది.

  • health-img6

    మానసిక ఆరోగ్యం

    మానసిక ఆరోగ్యం అనేది జ్ఞానం లేదా భావావేశముల ఆరోగ్యకరమైన స్థాయి లేదా మానసిక వైకల్యం లేకపోవడంగా నిర్వచింపబడుతుంది. సకారాత్మక మనోవిజ్ఞానశాస్త్రం లేదా సంపూర్ణత్వంల దృష్టికోణంలో మానసిక ఆరోగ్యం, జీవితాన్ని అనుభవించడానికి మరియు జీవన కార్యకలాపాలు మరియు మానసిక ఉత్తేజాన్ని సాధించే ప్రయత్నాల మధ్య సమతూకాన్ని సాధించే వ్యక్తి యొక్క సామర్ధ్యాన్ని కలిగి ఉండవచ్చు.

స్త్రీల అనారోగ్యం మరియు శిశు మరణాల భారాన్ని తగ్గించడానికి దేశంలో ఎన్నో సంవత్సరాలనుండి అభివృద్ధి ప్రణాళికలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఎంతో కాలంగా చాలా ప్రజాఆరోగ్య పధకాలు మరియు అభివృద్ధి సేవలు (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్ మెంట్ సర్వీసెస్ ICDS) ఈ దిశగా పనిచేస్తుంది. మాతా శిశు ఆరోగ్యానికి ప్రాధాన్యత నివ్వడంలో భారత దేశం శతాబ్ధి అభివృద్ధి లక్ష్యాలను ( మిలీనియం డెవలప్ మెంట్ గోల్స్ ) సాధించడానికి అంకిత భావంతో కృషిచేస్తోంది. భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న అనేక రకాల ప్రజాఆరోగ్య పథకాల పై అవగాహన కలుగజేయడం, వాటి వినియోగం అనేది ముఖ్యమైన ప్రాధమిక అంశం.

గ్రామీణ భారతదేశ ప్రజలకు ఆరోగ్య భద్రత పైన ముఖ్యంగా మాతా శిశు ఆరోగ్యానికి గల ప్రాధాన్యత పై అవగాహన కల్పించడం, దానికి కావలసిన ముఖ్యమైన సమాచారాన్ని అందజేయడం ఈ బహు బాషా పోర్టల్ యొక్క లక్ష్యం. ఈ పోర్టల్ లో దీనికి సంబందించిన ఇతర ముఖ్యమైన అంశాలు పౌష్టికాహారం, పరిశుభ్రత, ప్రాథమిక చికిత్స మరియు వ్యాధులు.

వ్యాధులు

ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యవంతమైన మనిషిని మించి అదృష్టవంతులు మరొకరు లేరు అనేది చెప్పడంలో ఈమాత్రం సందేహం లేదు. మనషి తన సాధారణ జీవన విధానం లో తన ఆరోగ్యమును గూర్చి అలక్ష్యం చేయుచున్నాడు. అసలు మనిషి ఎటువంటి వ్యధులకి గురవుతాడో వాటికి తీసుకోనవలిసిన తగు జాగ్రత్తలు వాటి వివరములు ఈ పోర్టల్ నందు లభించును.

సంపూర్ణ ఆహారం

సంపూర్ణ ఆహారం లభించాలంటే మనం తీసుకొనే దినసరి ఆహార ఎంపికలో బ్రెడ్ మరియు పప్పు ధాన్య ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాల పదార్థాలు, మాంసం, చేప మరియు ప్రోటీన్‌లతో కూడిన ఇతర పదార్థాలు తీసుకొవాలి. ధాన్యాలు, పండ్లు, పప్పు ధాన్యాలు మరియు కూరగాయలను అధికంగా తీసుకోండి.

స్త్రీ ఆరోగ్యం

స్త్రీ తన పట్ల తన ఆరోగ్యం పట్ల వివిధ సమయములున అనగా కౌమార దశ లో, గర్బస్థ దశలో మరియు పునరుత్పత్తి దశలో తీసుకోనవలిసిన సంరక్షణ మరియు జగ్రత్తలు.వాటికి సంబంధించిన సమాచారం ఈ పోర్టల్ ద్వారా అందుబాటులోకి తీసుకరావడమైనది.

పిల్లల ఆరోగ్యం

చిన్నారుల ఆరోగ్యం పట్ల తీసుకోనవలిసిన జాగ్రత్తలు, సలహాలు మరియు సూచనలు.

మానసిక ఆరోగ్యం

దేశాభివృద్దికి, సౌభాగ్యానికి ఆరోగ్యం ముఖ్యమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యు.హెచ్.ఓ) ఆరోగ్యం అంటే “శారీరక, మానసిక మరియు సాంఘిక, ఆధ్యాత్మిక కుశలత, అంతే కాని కేవలం ఏదైనా ఒక వ్యాధిగాని లేక వైకల్యం గాని లేకపోవడం మాత్రమే కాదు“ అని వివరిస్తుంది.

ప్రాధమిక చికిత్స

ప్రతి ఫ్యాక్టరీ, ఆఫీసు, పాఠశాల, ఇళ్లల్లో అందరికీ అందుబాటులో ప్రథమ చికిత్స పెట్టె ఉండాలి. ఇది షాపులో రెడీమేడ్ గా లభిస్తుంది. మీరైతే రేకు లేదా అట్టపెట్టెతో మీ ఇంట్లో ప్రథమ చికిత్స బాక్స్ ను తయారు చేసుకోవచ్చు. ఈ క్రింద పేర్కొన్న పరికరాలు, వస్తువులు మీ ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాలి.

పారిశుధ్యం మరియు పరిశుభ్రత

మనిషి ఆరోగ్యవంతమైన జీవితానికి పారిశధ్యత మరియు పరిశుభ్రత ఎంతగానో దోహదపడతాయి. మరి అలాంటి వాటి గూర్చి మనం తెలిసి తెలియక చేసే తప్పులు వాటిని ఏ విధంగా సరిదిద్దుకోవడం, ఆ పరిణామాల వలన కలుగు ఫలితాలు ఇచ్చట తెలుసుకొనవచ్చును.

పథకాలు

జాతీయ గ్రామీణ ఆరోగ్య సంస్థ (ఎన్.అర్.హచ్.ఎమ్), ఇది జాతీయ పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం నెలకొల్పబడింది. దీని లక్ష్యం దేశం లోని గ్రామీనా జనాభాకు సురక్షితమైన మరియు సమర్థవంతమైన ఆరోగ్య సంరక్షణ అందించడం. ఈ మిషన్ను 2005 ఏప్రిల్ 12న మన గౌరవనీయులైన శ్రీ ప్రధాన మంత్రి గారి చే ప్రారంభించబడింది.

ఆయుష్

అయుష్ అనునది ఆయుర్వేదం, యోగ, యునాని, ప్రకృతి వైద్యం (నాచురోపతి), సిద్ధ, హోమియోపతిల కలయిక. ఇచ్చట అనేకనేక వ్యాదులకు అయుష్ కి సంబందించిన వైద్య విధానాలు, చికిత్స మొదలగు సూచనలు పొందుపరచదమైనది.

చర్చా వేదిక - ఆరోగ్యం

ఈ చర్చా వేదిక యందు ఆరోగ్య సంబంధిత విషయముల గూర్చి చర్చించెదరు.

చివరిసారిగా మార్పు చేయబడిన : 11/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate