పంచుకోండి

గురక సమస్య

గురక సమస్య

పోస్ట్ చేయబడింది Vikaspedia తేదీ February 03. 2015

అధిక బరువు వల్ల మరియు ఇతర కొన్ని కారణాల వల్ల వచ్చు గురక సమస్య గురించి ఈ చర్చలో పాల్గొందాం.

Re: గురక సమస్య

పోస్ట్ చేయబడింది neelakanta sidda తేదీ March 14. 2016
సాదారణంగా అధిక బరువు వల్ల కాని లేక శరీరంలో వాతము,శ్లేష్మము అదికం కావడం వల్లగాని లేక శ్వాస వాహికలో ఏదైనా వాపులు,గద్దలుగాని ఉన్నట్లయితే రాత్రి సమయంలో నిద్రించేతపుడు ముక్యంగా వెల్లకిలా పడుకున్నపుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తి అది గురకగా పరిణమిస్తుంది దీనిని నిర్లక్షం చేస్తే దీర్గకాళిక సమయంలో హృదయ సంబంద వ్యాదులు,నరాల సంబంద వ్యాదులకు గురయ్యే అవకాశం అదికంగా ఉంటుంది..దీనికి సిద్ద ఆయుర్వేద పద్దతిలో శ్రీ అగస్త్య మహర్షి చక్కటి చికిస్తలను తెలిపారు....వాటిని క్రింద తెలుపుతున్నాను. 1. కారణాలు ఏవైనా కాని శరీరంలో అధికమైన శ్లేష్మం మరియు వాతం అధికం కావడం ద్వారా గురక అధికం అవుతుంది కాబట్టి ముందు ఈ రెండిటి ఉద్రుతిని తగ్గించాలి.ఇక్కడ ఒక విషయం గమనించాలి గురకకు ట్రీట్మెంట్ ఆధునిక వైద్యంలో ఎందుకు కష్టమైంది అంటే వాతాన్ని తగ్గించే మందులు స్లేష్మాన్ని వృద్ది చేస్తాయి అదేవిదంగా స్లేష్మాన్ని తగ్గించే మందులు వాతాన్ని పెంచుతాయి...ఇటువంటి సంక్లిష్ట వ్యాదికి పూర్తి చికిస్తను మా గురువుల ద్వారా నేను నేర్చుకున్నది,అనేక మందికి ఇచ్చి సత్పలితాలను పొందిన దానిని ఇక్కడ తెలియజేస్తున్నాను. 2.మొదటి రోజు ఉదయమే లేచి పళ్ళు తోముకుని ఒక చిన్న గ్లాస్ పాలలో ఒక స్పూన్ చిట్టి ఆముదం(చిన్న పిల్లలకు ఇస్తారు) కలిపి త్రాగితే అర్ద గంటకు విరేచనం అయ్యి ఉదరం శుబ్రం అవుతుంది...మరియు శరీరంలో శ్లేష్మం పెరగకుండా వాతం సమ స్తాయికి వస్తుంది.తర్వాత తేలికైన ఆహారం తీఉసుకుఒవాలి.ఆఆహారమ్ తీసుకున్న 30 నిముషముల తర్వాత ఈ క్రింది ఔషదాన్ని తేనెతో రెండు స్పూన్లు తీసుకోవాలి. * నల్ల జీలకర్ర- 10 గ్రాములు * వాయువిదంగాలు--10 గ్రాములు * ఉత్తిరేణి వేరు చూర్ణం--5 గ్రాములు * త్రిఫలములు చూర్ణం--25 గ్రాములు పైవాటిని చెప్పిన మోతాదుల్లో తీసుకుని చూర్ణం చేసి వస్త్రగాలితం చేసి ఉంచుకోవాలి పుటకు 5 గ్రాములు రెండు స్పూన్ల తేనెతో తీసుకోవాలి ఎటువంటి పరిస్తుతుల్లోను నీరు తగలరాడు.ప్రతి రోజు ఉదయం రాత్రి భోజనం తర్వాత తీసుకోవాలి....ఈ ఔషదం తీసుకున్న 30 నిముషాల వరకు ఎటువంటి పానీయాలు తీసుకోరాదు. 3.ఈ ఔషదం తీసుకుంటున్నా రోజులలో రాత్రి నిద్రించేతపుడు గసగసాలు,వాము,పచ్చకర్పురంలను కొద్దిగా వేడి చేసి ఒక పలుచటి గుడ్డలో మూటకట్టి 10 సార్లు దీర్గంగా వాసన పీల్చాలి... పైన చెప్పిన ఔషదాన్ని 15 దినములు సేవిస్తే గురక బాధనుండి పూర్తిగా విముక్తి పొందవచ్చు..పైగా శరీరంలో ధాతువులు సమ స్తితిలోకి చేరడం ద్వారా ఉబకాయం పూర్తిగా తగ్గడం జరుగుతుంది. ఈ ఔషద సేవన కాలంలో చేపలు,గుడ్లు,అరటిపండు,కందగడ్డ,పుల్లటి పదార్తాలు,పులిసిన పదార్తాలు,నెయ్యితో కూడిన పదార్థాలు ఎటువంటి పరిస్తితుల్లోను తినరాదు,చన్నీటి స్నానం,శీతల పానీయాలు తాగరాదు...15 దినముల తర్వాత అన్నీ తినవచ్చు.............ఏవైనా సందేహాలు ఉంటె నా నెంబర్ 99****51(నీలకంథ సిద్ద,సిద్ద ఆయుర్వేద వైద్యులు,పల్లిపట్టు,తమిళనాడు ) ద్వారా సంప్రదించవచ్చు
You are an anonymous user. If you want, you can insert your name in this comment.
(కావలయును)
Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు