অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మానసిక ఆరోగ్యంపై ఒక అవగాహన

మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి?

దేశాభివృద్దికి, సౌభాగ్యానికి ఆరోగ్యం ముఖ్యమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యు.హెచ్.ఓ) ఆరోగ్యం అంటే “శారీరక, మానసిక మరియు సాంఘిక, ఆధ్యాత్మిక కుశలత, అంతే కాని కేవలం ఏదైనా ఒక వ్యాధిగాని లేక వైకల్యం గాని లేకపోవడం మాత్రమే కాదు“ అని వివరిస్తుంది. ఒక వ్యక్తి (అతను లేక ఆమె) యొక్క సామర్ధ్యాన్ని గురించి తెలుసుకుని ఉండడం, జీవితంలో సంభవిస్తూ ఉండే సాధారణ శ్రమ, ఒత్తిడికి తట్టుకుని ఉండగలగడం, ఉత్పాదక శక్తితో పనిచేయగలగి ఉండడం మరియు అతను లేక ఆమె జాతికి తన వంతు తోడ్పాటును అందించడంతో ఉండే మానసిక ఆరోగ్యాన్ని ఒక మనో-కుశలతగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ వర్ణిస్తుంది. ఇటువంటి వాస్తవిక దృష్టితో చూసినపుడు, మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి యొక్క మానసిక శ్రేయస్సుకు పునాది వంటిది మరియు జాతి సమర్ధంవంతంగా పనిచేయడానికి ఉపయోగపడేది.

మానసిక ఆరోగ్యం ఈ క్రింది వాటిపై ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

  • విద్యా సంబంధిత ఫలితాలు
  • పనిలో ఉత్పాదకత
  • ప్రోత్సాహకరమైన వ్యక్తిగత బాంధవ్యాలను పెంపొందించుకోవడం
  • నేరాల సంఖ్య/సూచిక (రేట్)
  • మత్తుపానీయాలు మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగం

మానసిక ఆరోగ్యం ఎందుకు ముఖ్యమైనది?

45 కోట్లకన్నా ఎక్కువ మంది ప్రజలు మానసిక దుర్భలత్వంతో, వైకల్యంతో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రకారం 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఒత్తిడి అనేది రెండవ అతిపెద్ద, తీవ్రమైన వ్యాధిగా ఈ భారాన్ని మోయవలసి రావచ్చు.(ముర్రే అండ్ లోపెజ్, 1996). అభివృధ్ది చెందిన దేశాలకు, లాగే అభివృధ్ది చెందుతున్న దేశాలకు ప్రపంచ వ్యాప్తంగా మోయవలసి వచ్చే ఈ మానసిక దౌర్భల్యం అనే భారం చికిత్సచేయడానికి వీలుకానంత స్ధాయికి చేరుకోవచ్చు. పెరిగిపోతున్న ఈ మానసిక దౌర్భల్య భారంతో ముడిపడివున్న సాంఘిక మరియు ఆర్ధిక భారం, ఖర్చులు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంపైనా, అలాగే మానసిక రుగ్మతలను నివారించడంపైన ఉండే అవకాశాలపై దృష్టిని కేంద్రీకరిస్తాయి. అ విధంగా, మానసిక ఆరోగ్యం మానవ ప్రవర్తనతో ముడిపడి ఉండి, శారీరక ఆరోగ్యానికి మరియు నాణ్యమైన జీవనశైలికి ప్రాథమిక అంశంగా గోచరిస్తాయి.

  • శారీరక ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యం అన్నవి దగ్గర సంబందం కలిగి ఉన్నటువంటివి. అలాగే ఒత్తిడి,  గుండె మరియు రక్తనాడుల వ్యవస్ధ సంబంధిత వ్యాధులకు నిస్సందేహంగా దారితీస్తుందని ఋజువు చేయబడింది.
  • మానసిక వైకల్యాలు మనుషుల ప్రవర్తనలను, అంటే వివేకవంతంగా, విచక్షణతో ఆహారాన్ని తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరిపోయేంతగా నిద్రపోవడం, ఆరోగ్యకరమైన, క్షేమకరమైన లైంగిక అలవాట్లను అనుసరిస్తూ ఉండడం, మత్తుపానీయాలు మరియు పొగాకు వాడకం, వైద్య చికిత్సా నియమాలను జాగ్రత్తగా పాటిస్తూ ఉండడం వంటి వాటిపై చెడుప్రభావాన్ని చూపిస్తూ శారీరక అనారోగ్యాన్ని పెంచుతూ, హాని కలిగిస్తాయి.
  • మానసిక అనారోగ్యం సాంఘికపరమైన సమస్యలకు కూడా దారితీస్తుంది, అంటే నిరుద్యోగం, విఛ్చిన్నమయ్యే కుటుంబాలు, పేదరికం, మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు తత్సంబంధిత నేరాలు వంటివి.
  • బలహీనమైన మానసికారోగ్యం వ్యాధినిరోధక శక్తిని పనిచేయనివ్వకుండా క్షీణింపచేయడంలో చెప్పుకోదగ్గ పాత్ర వహిస్తుంది.
  • వైద్యపరంగా ఒత్తిడి, మాంద్యంతో పాటుగా అనారోగ్యంగా ఉండే రోగులు, ఇది లేకుండా మామూలుగా ఉండే వారికంటే చాలా తీవ్రమైన ఫరిణామాలను ఎదుర్కొంటూ వుంటారు.
  • దీర్ఘకాలిక వ్యాధులు – మధుమేహం, కేన్సర్, హృద్రోగం వంటివి ఒత్తిడిని, మాంద్యాన్ని మరింత ప్రమాదకరంగా పెంచుతాయి.

అమలుచేయడంలో ఉన్న ఇబ్బందులేమిటి?

అన్ని విషయాలలోనూ అంటే చదువులోనూ, ఉద్యోగంలోనూ, వివాహ విషయం మొదలగు వాటన్నింటిలోనూ కూడా తాము సమాజంలో చిన్న చూపు చూడబడుతున్నామనే న్యూనతా భావం, కళంకం, మానసిక అనారోగ్య నివారణను చేపట్టడంలో వైద్య సలహాను తీసుకోవడంలో ఆలస్యానికి, అలసత్వానికి దారితీస్తుంది. మానసిక ఆరోగ్యం మరియు అనారోగ్యం అన్న భావనలో ఉండే అస్పష్టత, సందిగ్ధత, వీటికి సంబంధించి ఖచ్చితమైన సంకేతాలు గాని లక్షణాలు గాని కనిపించకపోవడం, రోగ నిర్ధారణలో సందేహాలకు, సందిగ్ధతలకు తావిస్తుంది.

  • మానసికంగా బలహీనంగా ఉండే వారిలోనూ లేక దుష్టశక్తుల ప్రభావం వల్ల మానసిక వైకల్యాలు ప్రాప్తిస్తాయని ప్రజలు భావిస్తూ ఉంటారు.
  • చాలామంది చికిత్స ఏదీ వాస్తవంగా ఫలిస్తూ ఉండదనే వాదానికి దారితీస్తూ మానసిక వైకల్యం తిరిగి నయం చేయలేనటువంటిదనే అభిప్రాయంతో ఉంటారు .
  • చాలామంది ముందు జాగ్రత్త చర్యలు విజయవంతమయ్యే అవకాశాలు లేవని భావిస్తూ ఉంటారు.
  • మానసిక అనారోగ్యాన్ని నయం చేయడానికి వాడే మందులు అనుషంగ ప్రభావాలకు (సైడ్ ఎఫెక్ట్స్) కారణమవుతాయని, వాటికే బానిసగా మారిపోవడానికి దారితీయిస్తాయని భావిస్తూ ఉంటారు. మందులు కేవలం నిద్రను ప్రోత్సహిస్తాయని వారి అభిప్రాయం.
  • ప్రపంచ ఆరోగ్య సంస్ధచే సేకరించబడిన సమాచారం మానసిక అరోగ్యంతో భరించవలసివచ్చే సమస్యలకు మరియు వాటిని పరిష్కరించడంలో అనేక దేశాలలో ఇటువంటి వ్యాధులను చికిత్సతో నయం చేయడానికి లభ్యమవుతున్న వసతులు, వనరుల మధ్య తీవ్ర అగాధం ఉందని రూఢిగా నిరూపిస్తోంది.
  • ఇటీవల కాలం వరకూ ప్రపంచంలో అనేక చోట్ల మానసిక అనారోగ్యానికి చికిత్స మిగతా మందుల నుండి, ఆరోగ్య పరిరక్షణా విధానం నుండి అన్యాక్రాంతం (ఎలీనేటెడ్) చేయబడి, దూరం చేయబడి ఉంది.
  • సామాజిక కళంకం వల్ల మరియు వారి హక్కులను గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల, మానసిక లేక సంభంధిత రోగులు మరియు వారి కుటుంబాలు, ఏకం అవడానికి సంసిధ్దంగా ఉండకపోవడంతో, ఒత్తిడి స్ధాయిని పెంచగలిగే బృందాలుగా ఏర్పడడంలో విఫలమవడం జరుగుతుంది.
  • చివరికి స్వచ్ఛంద సేవా సంస్ధలు (ఎన్.జి.ఓ.లు) కూడా దీనిని ఒక ఇబ్బందికరమైన, కష్టమైన రంగంగా భావిస్తారు. ఎందుకంటే దీర్ఘకాలిక నిబధ్దత, ఈ అంశానికి కట్టుబడి ఉండడం అనేవి అవసరమవుతాయి అందుకే మానసిక వికలాంగులతో పనిచేయడానికి వారు భయ పడుతూ ఉంటారు.

మానసిక రుగ్మతను కలుగజేసేదేమిటి?

భౌతిక లక్షణాలు:

  • నాడీ సంబంధిత ప్రసరణ వ్వవస్ధ (న్యూరో ట్రాన్స్ మిట్టర్స్): మానసిక రుగ్మతలు మెదడులోని న్యూరో ట్రాన్స్ మిట్టర్స్ అని పిలువబడే ప్రత్యేక రసాయనాలలో కలిగే అసాధారణమైన సమతుల్యానికి సంబంధం కలిగి ఉంటాయి. మెదడులో ఉండే నాడీ కణాలు ఒకదానితో మరొకటి సంబంధాన్ని నెరపుతూ ఉండడానికి సహకరించుకుంటాయి. ఒకవేళ ఈ రసాయనాలలో సమతౌల్యం లోపించినా లేక అవి సరిగా పనిచేస్తూ ఉండకపోయినా, మెదడులో సంకేతాలు ఒకచోట నుండి మరొకచోటకు సరిగా పంపబడుతూ ఉండవు, మానసిక అనారోగ్య లక్షణాలకు దారి తీస్తాయి.
  • జన్యు శాస్త్రం (వారసత్వం ద్వారా సంక్రిమించేవి): కుటుంబాలలో వస్తూ వుండే మానసిక రుగ్మతలు తమ కుటుంబంలో మరో ఏ సభ్యుడికైనా అటువంటివి ఉన్నట్లయితే, మిగతా వారు కూడా అటువంటి మానసిక రుగ్మతల బారిన పడే అవకాశాలను ఎక్కువగా కలిగి ఉంటారని సూచిస్తున్నాయి. అయితే ఇటువంటి పరిణామం వంశానుగతంగా సంక్రమించిన జన్యువుల వల్లనే సంభవిస్తుందనే కారణం మీదనే ఈ సమస్యను నెట్టివేయడం జరుగుతుంది. నిపుణులు కేవలం ఇది ఒక దానిలో మాత్రమే కాదు, అనేక మానసిక రుగ్మతలకు జన్యువులలో ఉండే అసాధారణ అంశాలతో సంబంధం కలిగి ఉంది అని అభిప్రాయపడుతున్నారు. అందుచేత, మానసిక రుగ్మత బారిన పడే అవకాశాన్ని ఒక వ్యక్తి వంశానుగతంగా కలిగి ఉంటాడు, అంతే గాని స్వతఃసిధ్దంగా అటువంటి ఏ వ్యక్తి కూడా తప్పనిసరిగా ఈ వ్యాధిని కలిగివుండాలని ఏమీ లేదు. మానసిక రుగ్మత, వైకల్యం అనేది అనేక జన్యువుల పరస్పరక్రియ, ప్రభావం (ఇంటరాక్షన్) వల్ల మరియు ఇతర అంశాల వల్ల – అంటేః ఒత్తిడి, దుర్వినియోగం, లేకపోతే ఒక శరాఘాతం (ట్రోమా) కలిగించే సంఘటన వంటివాటి వల్ల సంభవిస్తుంది. ఒక వ్యక్తి వారసత్వంగా ఈ రుగ్మతకు గురయ్యే అవకాశాన్ని కలిగివున్నప్పుడు ఆ వ్యక్తిలో ఇవి అనారోగ్యాన్ని మరింత ప్రభావితం చేయడమో లేక అనారోగ్యాన్ని ఉసిగొల్పడమో చేస్తాయి.
  • అంటురోగాలు: మెదడు దెబ్బతినడానికి మరియు మానసిక రుగ్మత వృధ్ది చెందడానికి లేక క్షీణించిపోతూ ఉండే పరిస్ధితిని తెలియజేసే రోగ లక్షణాలతో సంబంధం కలిగివుంటాయి. ఉదాహరణకు పీడియాట్రిక్ ఆటో ఇమ్యూన్ న్యూరో సైకియాట్రిక్ డిజార్డర్ (పి.ఏ.ఎన్.డి.ఏ) గా పిలువబడే పరిస్ధితి పిల్లలలో స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా అనేది అబ్సెస్సివ్-కంపల్సివ్ డిజార్డర్ (నిరంతరం ఒకే భావంతో ఉండే స్ధితి-తప్పనిసరి, బలవతంమైన వైకల్యం) మరియు ఇతర మానసిక రుగ్మతలు పెరగడంతో సంబంధం కలిగి ఉంటుంది.
  • మెదడులో లోపాలు లేక గాయం: మెదడులో లేక మెదడులోని కొన్ని భాగాలలో లోపాలు కలుగడం లేక గాయాలు కలిగి వుండడం అన్నది కొన్ని మానసిక రుగ్మతలతో సంబంధం కలిగి ఉంటుంది.

జాతీయ మానసిక ఆరోగ్య విధానాలు కేవలం మానసిక వైకల్యాలకే సంబంధించి వాటికే పరిమితమై ఉండకూడదు. అవి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే ఇతర విస్తృతమైన అంశాలను గుర్తించి వాటిని కూడా చక్కబెట్టేవిగా ఉండాలి. ఇవి సామాజిక జనస్రవంతిలో ఆరోగ్యాన్ని అమలుపరిచే విధానాలుగా, కార్యక్రమాలుగా ప్రభుత్వంలోనూ మరియు వ్యాపార సంస్ధలలోనూ, విద్య, శ్రామికశక్తి, న్యాయం, రవాణా, పర్యావరణం, గృహవసతి మరియు సంక్షేమం అలాగే ఆరోగ్య రంగంలోనూ కూడా పెంపొందించబడి, ప్రోత్సహించబడడంతో సహా ఇమిడి ఉంటాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్ధ యొక్క స్పందన?

ప్రపంచ ఆరోగ్య సంస్ధ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలోనూ అలాగే ప్రోత్సహించడాన్ని ధ్యేయంగా పెట్టుకున్న ప్రభుత్వాలను బలపరుస్తూ, చేయూతనిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, ప్రోత్సహించడానికి ఉన్న అవకాశాలను, ఋజువులను, సాక్ష్యాలను మదింపు, మూల్యాంకనం చేసింది. అలాగే ఈ సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్ధ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలోనూ అలాగే ప్రోత్సహించడాన్ని ధ్యేయంగా పెట్టుకున్న ప్రభుత్వాలను బలపరుస్తూ, చేయూతనిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, ప్రోత్సహించడానికి ఉన్న అవకాశాలను, ఋజువులను, సాక్ష్యాలను మదింపు, మూల్యాంకనం చేసింది. అలాగే ఈ సమాచారాన్ని ప్రభుత్వాలతో పంచుకోవడానికి, అవగాహనను పెంపొందించడానికి, సమర్ధవంతమైన వ్యూహాలను విధానాలుగా మరియు ప్రణాళికలుగా ఏకీకృతం చేయడానికి, సంఘటిత పరచడానికి కృషి చేస్తోంది. తొలిదశలో బాల్యంలోనే తీసుకునే చొరవ, జోక్యంచేసుకోవడం వంటి చర్యలే ఇవి. (అనగా గర్భిణీతో ఉన్న స్త్రీల కోసం వారి ఇళ్లను దర్శించడం, బడిలో చదువు ప్రారంభించడానికంటే ముందు దశ (పూర్వ ప్రాథమిక విద్య), ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన ప్రజానీకానికి).

  • పిల్లలకు చేయూతనివ్వడం (అనగా పనితనాన్ని, నైపుణ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు, శిశు మరియు యుక్తవయసు వారి కోసం అభివృధ్ది కార్యక్రమాలు వంటివి)
  • సాంఘిక-ఆర్ధికపరంగా మహిళా సాధికారికతను కలుగజేయడం (అంటే విద్యారంగంలో వారికి మరింత అవకాశాన్ని, వెసులుబాటును కలిగించడం మరియు సూక్ష్మ ఋణాల పధకాలు వంటివి)
  • వయో వృధ్దులకు సాంఘిక సహాయ, సహకారాలనందించడం. (అంటే చొరవ తీసుకోవడంలోనూ, కొత్త ప్రయత్నాలు చేపట్టడంలో వారిలో స్నేహభావం పెంపొందించడం, వయసు మీరిన వారికి సామాజిక మరియు పగటిపూట నడుపబడే కేంద్రాలు (డే సెంటర్స్) వంటివి)
  • దుర్భలమైన, హానికి గురయ్యే అవకాశం ఉన్న బృందాలకోసం ఉద్దేశింపబడిన కార్యక్రమాలు, అల్పసంఖ్యాకులు (మైనారిటీలు), స్వదేశస్తులు, వలసవారు, మరియు వివాదాలు, విపత్తులలో ఇరుక్కుపోయిన (అంటే విపత్తులు సంభవించిన తరువాత మానసిక-సాంఘికపరమైన చొరవ, జోక్యం) వారితో సహా
  • పాఠశాలలో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించి, ప్రోత్సహించే కార్యకలాపాలు (అనగా పాఠశాలలోనూ మరియు శిశు-స్నేహపూరితమైన పాఠశాలలోనూ పర్యావరణ సంబంధిత మార్పులను బలపరుస్తూ ఉండే కార్యక్రమాలు).
  • పనిచేసే చోట మానసిక ఆరోగ్యంపై చొరవ, జోక్యాన్ని కలుగజేసుకోవడం.(అనగా ఒత్తిడిని నివారించే కార్యక్రమాలు).
  • గృహవసతికి సంబంధించిన విధి, విధానాలు (అంటే గృహవసతిని మెరుగుపరచడం)
  • హింసను నివారించే కార్యక్రమాలు (అంటే ప్రజోపయోగార్ధం రక్షకదళ సంబంధిత కొత్త ప్రయత్నాలు చేపట్టడం) మరియు సమాజాభివృధ్ది కార్యక్రమాలు (అంటే ‘శ్రధ్ద తీసుకునే, జాగ్రత్త వహించే కమిటీలు‘ కై ప్రయత్నాలు చేయడం, చొరవ తీసుకోవడం, సమగ్ర గ్రామీణాభివృధ్ది వంటివి).

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate