హోమ్ / ఆరోగ్యం / పథకాలు / కంటి వెలుగు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కంటి వెలుగు

తెలంగాణప్రభుత్వ కంటి వెలుగు

స్వాతంత్య్రదినోత్సవం ఆగస్టు 15, 2018న కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది.కంటి చూపు లోపాలను అధిగమిద్దాం… ప్రజలందరికీ ‘కంటి వెలుగు’ లు ప్రసరింప చేద్దాం.అవగాహన లేకనో, కంటి పరీక్షలు నిర్వహించే సదుపాయం అందుబాటులో లేకనో, ఆర్థిక స్థోమత సరిపోకనో, కంటి చూపు లోపాలను గుర్తించలేకనో, అనేక మంది కంటి జబ్బులను నిర్లక్ష్యం చేస్తున్నారు. అంధత్వం బారిన పడుతున్నారు. నివారించగలిగే కంటి వ్యాధులతో 80శాతం మంది బాధపడుతున్నారంటే కంటిని కాపాడుకోకపోతే అత్యధికులకు కంటి వెలుగు శాశ్వతంగా మలిగిపోయే ప్రమాదం పొంచి ఉంది.కంటికి సంబంధించి వచ్చే వ్యాధుల్లో ప్రధానంగా వయసుతో వచ్చే చత్వారం, (Age Related Macular Degeneration (AMD), అన్ని రకాల కళ్ళ వైకల్యాలు (All Vision Impairment), అంధత్వం (Blindness), కాటరాక్ట్‌ (Cataract), మధుమేహంతో వచ్చే రెటినోపతి (Diabetic Retinopathy), గ్లకోమా (Glaucoma), ఓపెన్‌ యాంగిల్‌ (Open-angle), హైపోరోపియా (Hyperopia).

గణాంకాల ప్రకారం ప్రపంచంలో 253 మిలియన్ల మంది దష్టి వైకల్యాలతో ఉన్నారు. 36 మిలియన్ల మంది అంధత్వంతో బాధపడుతున్నారు. 217 మిలియన్ల మంది తీవ్ర కంటి లోపాలతో సతమతమవుతున్నారు. 50 ఏళ్ళు పై బడిన వాళ్ళల్లో 81శాతం మంది కంటి చూపు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. వయో వద్ధుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. వీళ్ళల్లో వయసుతో పాటు కాటరాక్ట్‌ సమస్యలు అధికమవుతున్నాయి. అవసరమైన ఆపరేషన్లు జరగకపోవడం వల్లే జబ్బులు ముదిరి ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సాధారణ చూపు లోపాలు, కంటి వైకల్యాలు, తీవ్ర కంటి చూపు లోపాలు, అంధత్వం అనే నాలుగు రకాల సమస్యలు ఉన్నాయి. వీటిల్లో 80శాతం నయం చేయతగిన సమస్యలు ఉన్నట్లుగా సర్వేలు తేలుస్తున్నాయి.

tsmagazine

రకరకాలుగా అంధత్వం విస్తతమవుతున్నది. 53శాతం ప్రజల్లో కంటి సమస్యలను గుర్తించక పోవడం, 25 శాతం ఆపరేషన్‌ అవసరం ఉన్నా చేయించుకోకపోవడం, 4శాతం వయసుతో వచ్చే సమస్యలు, 2శాతం గ్లకోమా, 1శాతం మధుమేహ సమస్యల వల్ల అంధత్వం సంప్రాస్తిస్తున్నట్లుగా తేలింది. 35శాతం మంది కంటి శుక్లాల శస్త్ర చికిత్సలు చేయించుకోకపోవడం, 21శాతం మంది కంటి సమస్యలను సరి చేసుకోకపోవడం, 8శాతం మంది గ్లకోమా వల్ల అంధత్వానికి గురవడానికి ప్రధాన కారణాలుగా గుర్తించారు. ఇక 15 ఏళ్ళలోపు పిల్లల్లో 19మిలియన్ల మంది కంటి సమస్యలతో బాధ పడుతున్నారు. వీళ్ళల్లో 12 మిలియన్ల మంది రిఫ్రాక్టివ్‌ సమస్యలతో ఉన్నారు. మొత్తంగా 1.4 మిలియన్లు తీర్చలేని అంధత్వంతో బాధపడుతున్నారు. ఇందుకు కంటి జబ్బుల పట్ల ప్రజలని చైతన్య పరచడం, కంటి వైద్యం అందించడమొక్కటే మార్గం. ఒకవేళ ఇది జరగకపోతే 2050 నాటికి ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న కంటి రోగుల సంఖ్య మూడింతలు పెరిగే ప్రమాదం ఉంది.
tsmagazine

ఇక దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో….ఆధునిక పరికరాలు అందుబాటులో ఉండటం, మెరుగైన మంచి వైద్యం అందుతున్న కారణంగా 75శాతం నివారించదగ్గ కంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయినప్పటికీ అందుబాటులో ఉన్న వైద్యం, రోగుల అవసరాల మధ్య వ్యత్యాసం ఇంకా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ తేడా ఇంకా ఎక్కువగానే నమోదవుతున్నది. ఆహారపు అలవాట్లు, సూర్యోదయ, సూర్యాస్తమయాలను చూడని, చూడలేని పనుల బిజీలో ఉండే జనాలకు సహజంగానే ఇలాంటి సమస్యలు ఎక్కువగా సంప్రాప్తిస్తున్నాయి. నిరంతర గజి బిజీ జీవితాలకు తోడుగా ఒత్తిళ్ళు, నానాటికీ పెరుగుతున్న కాలుష్యాలు, మధుమేహం వంటి వ్యాధులు, బీపీ వంటి నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌, నిర్లక్ష్యపు వాహన చోదనం, అనేక యాక్సిడెంట్లు, నిర్లక్ష్యాలు, అవగాహన లోపాలు వంటి అనేకానేక కారణాల వల్ల కూడా అనేక మంది అంధత్వం బారిన పడుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 824 వైద్య బందాలు పరీక్షలు చేస్తున్నాయి. అదనంగా 113 టీములు ప్రజలకు వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. 40 లక్షల కళ్ళ అద్దాలు ప్రజలకు అందుతున్నాయి. ఐదారు నెలల పాటు నిర్వహించే శిబిరాల సంఖ్య 12వేలు దాటనుంది. ప్రస్తుతం రోజుకు లక్షకు పైగా మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 35 ఏళ్ళ దాటిన చాలా మందిలో కంటి లోపాలు కనిపిస్తున్నాయి. కాటరాక్టు వంటి అనేక సమస్యల కు రెఫరల్స్‌ కూడా జరుగుతున్నాయి.

ఆధారం: తెలంగాణ ప్రభ్యత్వ తెలంగాణా మాస పత్రిక అక్టోబర్,2018

2.89743589744
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు