హోమ్ / ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం / ఎముకల దృఢత్వానికి
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఎముకల దృఢత్వానికి

వాతదోషప్రకోపం వల్ల ఎముకలు గుల్ల బారి బలహీనంగా తయారవుతాయి అని ఆయుర్వేదం చెబుతుంది.


వాతదోషప్రకోపం వల్ల ఎముకలు గుల్ల బారి బలహీనంగా తయారవుతాయి అని ఆయుర్వేదం చెబుతుంది.

ఈ వ్యాధినే ఆయుర్వేద వైద్యులు ‘ఆస్టియోపోరోసిస్‌’ అని పిలుస్తారు. ఈ వ్యాధి బారిన పడినవారికి నడుము, వెన్నెముక, మణికట్టు వద్ద ఎముకలు సులభంగా విరిగిపోతాయి.

శరీరంలో కాల్షియంతో పాటు విటమిన్‌- డి తగ్గిపోవటం, థైరాయిడ్‌ గ్రంథి క్రియలో అతిగా స్పందించడం, మధుమేహం బారిన పడినవారు, వయసుమీరిన వారు ఈ వ్యాధి బారినపడతారు.

నడుంనొప్పి, ఎత్తుతగ్గటం, ఎముకల్లో కదలికలు లేకపోవటం లాంటివి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. ఎముకలు గుల్లబారిపోకుండా ఇంట్లోనే కొన్ని సులభ చికిత్సలు చేయవచ్చు

  • రోజూ ఉదయం, రాత్రి పావు టీ స్పూన్‌ దాల్చిన చెక్కను మెత్తని చూర్ణంగా చేసి పాలల్లో కలిపి తాగాలి.
  • గ్లాసు పాలల్లో అల్లం రసం, తేనెలను ఒక టీ స్పూన్‌ చొప్పున కలిపి తాగాలి.
  • రోజూ ఉదయాన్నే రెండు చిటికెల పిప్పిళ్ల చూర్ణాన్ని తేనెలో కలిపి తీసుకోవాలి.
  • ఒక టీ స్పూన్‌ మద్ది చెక్క మెత్తని చూర్ణాన్ని పాలల్లో కలిపి తాగాలి.
  • కప్పు వేడిపాలలో టీ స్పూన్‌ నువ్వుల పొడిని కలిపి రోజుకు మూడుసార్లు తాగుతుంటే ఎముకలు గట్టిపడతాయి.
  • కాల్షియం ఎక్కువగా ఉండే మునగ ఆకులతో కూరను, పువ్వులతో చట్నీ చేసుకోవాలి. తరుచూ మునగ కాయలతో పులుసు చేసుకుని తింటుంటే చక్కని ఫలితం కలుగుతుంది.
  • ఎనిమిది బాదం గింజలు నీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటి పై పొరలు తీసి ఆవుపాలలో కలిపి నూరి గ్లాసు పాలలో తాగాలి.
  • ఇసుకలో దొరికే పసుపురంగు గవ్వను కానీ, తెల్లని నత్తగుల్లను కానీ నీటిలో శుభ్రంగా కడిగి రాత్రి ఒక గ్లాసులో వేసి ఒక నిమ్మకాయ రసం పిండి మూతపెట్టాలి. ఉదయాన్నే ఆ గ్లాసులోని నీటిని వడబోసి తాగుతుంటే త్వరగా వ్యాధి తగ్గిపోతుంది.  -కందమూరి, ఆయుర్విజ్ఞానకేంద్రం

ఆధారము: ఆంధ్రజ్యోతి

 

 

3.06329113924
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు