অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పోషకాహారలోపము మరియు శరీర ధర్మ సంబంధమైన విధులపై దాని ప్రభావము

పోషకాహారలోపము మరియు శరీర ధర్మ సంబంధమైన విధులపై దాని ప్రభావము

పోషకాహారలోపము మరియు  శరీర ధర్మ సంబంధమైన విధులపై దాని  ప్రభావము

  • పోషకాహారలోపము అంటే "గరిష్ఠస్థాయి విధినిర్వహణ" కొరకు కణాలకు చాలినంతగా పోషకాలు అందకపోవటం అనే స్థితి.
  • ఇది‘అతి పోషకత’ మరియు ‘తక్కువ పోషకత’ కావచ్చు.
  • భారతదేశములో పోషకాహారలోపము ఒక ప్రజారోగ్యసమస్య, అయితే, జనజీవన శైలిలోని మార్పుల వల్ల అతి-పోషకత కూడా ప్రాముఖ్యత పొందుతుంది.
  • పోషకాహార లోపమున్న వ్యక్తులలో ఎదుగుదలను మందగింపజేస్తుంది, మెదడు అభివృద్ధిని, రోగనిరోధక శక్తి మీద ప్రభావము చూపుతుంది.

పోషకాహార లోపము మరియు ఎదుగుదల

  • పోషకాహారలోపము బిడ్డలో బరువు పెరగటం లో ఉన్న వృద్ధి ఎత్తు పెరగటంలో ఉన్న వృద్ధికన్నా నెమ్మదిగా ఉంటుంది.
  • పాపాయి దేహపు బరువు మొదటి ఏడాదిలో మూడురెట్లు పెరగుతుంది కానీ ఎత్తు పెరగటం కేవలం 50 శాతమే ఉంటుంది. కాబట్టి వృధా అన్నది ఒక తీక్షణమైన ప్రక్రియ కానీ ఎదుగుదల మందగించటం అనేది సుదీర్ఘకాలము కొనసాగే ఒక దీర్ఘవ్యాధి.
  • ఎదుగుదల నిలిచిపోయిన పిల్లలలో పుట్టిన మొదటి నెలలలోనే బరువు ఎత్తులలోని లోటు మొదలవుతుంది. ఈ లోటు రెండవ సంవత్సరములో చాలా ప్రాబల్యంగా ఉంటుంది. ఆతర్వాత పిల్లలు చనిపోని వారు, చాలా వరకూ కోలుకుంటారు.
  • మాంసకృత్తుల శక్తి పోషకాహార లోపము (పి.ఇ.యమ్) నుంచి కోలుకుంటున్న పిల్లలకు, నిర్దేశిత ఎత్తు-బరువు లలో 85 శాతము బరువు పెరిగేవరకూ వృద్ధి మొదలవదు.

ఎదుగుదల మందగించటానికి కారణాలు

  • ఏదయినా పోషక పదార్ధాల లోపం, ప్రత్యేకించి మాంసకృత్తులు సూక్ష్మపోషకాలైన జింకు, ఐరన్, మరియు సల్ఫర్.
  • వినాళ గ్రంధి ఇబ్బందులు, వృద్ధి నిర్మాణ కణ (హార్మోను) లోపము మరియు థైరాయిడ్ గ్రంధి మాంద్యం (హైపోథైరారాయిడిజమ్)
  • బాల్యములోని దీర్ఘవ్యాధులైన మూత్రపిండవ్యాధులు లేదా పుట్టుకతో వచ్చిన హృద్రోగాలు
  • తరచూ వచ్చే మరియు కొనసాగుతున్న సంక్రమించే వ్యాధులు అతిసారము, శ్వాసకోశ వ్యాధులు మరియు కడుపులోని పురుగులతో బాధపడటం
  • తగినంత మానసిక సాంఘిక ఉత్తేజం లేకపోవటం
  • బీదరికం మరియు లేమి

ఎదుగుదల మందగించటం వల్ల కలగే క్రియాత్మకపరిణామాలు

  • పోషకాహారలోపము గల పిల్లలు పెద్దయ్యాక పెద్దగా ఎత్తు ఉండరు. ఎదుగుదల మందగించటంయొక్క దీర్ఘకాలిక పరిణామాలు పోషకాహారలోపము యొక్క తీవ్రత, సమయము, కాలవ్యవధి వంటి అంశాల పై ఆధారపడి ఉంటాయి.
  • అతను/ఆమె ఎంత ఆరోగ్యముగా ఉన్నప్పటికీ ఎదుగుదల మందగించటం వారి పని చేసే గరిష్థ సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది.
  • ఎదుగుదల మందగించిన స్త్రీలు చిన్నపరిమాణములో ఉండే పిల్లలకు జన్మనిస్తారు,లేదా వారికి కానుపు అవ్వటం కష్టమవుతుంది.
  • ఎదుగుదల మందగించిన పిల్లలలోని రోగ నిరోధక శక్తి లోపభూయిష్టంగా ఉంటుంది తద్వారా వారు వ్యాధులకు ఎక్కువగా గురవుతారు.
  • దిగువ సాంఘికార్ధిక సమాజములో ఎదుగుదలమందగించటంతో మానసికాభివృద్ధి  లోపము గమనించవచ్చు.

పోషకాహార లోపము మరియు అంటురోగాలు

  • పోషకాహార లోపము ,ముఖ్యంగా మాంసకృత్తుల శక్తి పోషకాహార లోపము వ్యక్తి యొక్క రోగ నిరోధక శక్తిని చాలా రకాలుగా ప్రభావితం చేస్తుంది.
  • ఐరన్, జింకు ఖనిజాల లోపము కణ సంబంధమైన విధులను బలహీనపరుస్తుంది.
  • విటమిన్ ఎ లోపము కూడా మానవ రోగ నిరోధకశక్తిని ప్రభావితం చేస్తుంది

పోషకాహారలోపము మరియు మెదడు యొక్క ఎదుగుదల

  • తల్లిలోని అయోడిన్ లోపము ఎదిగేదశలో ఉన్న గర్భస్థపిండము యొక్క మెదడును దెబ్బతీస్తుంది.
  • మాంసకృత్తుల శక్తి పోషకాహారలోపము (పి.ఇ.యమ్) తీవ్రంగా ఉన్నప్పుడు శారీరక అభివృద్ధిని మందగింపజేస్తుంది, జీవితారంభ దశలో నాలుగు నెలలకు మించి చికిత్స చేయించకుండా ఉంటే బిడ్డయొక్క మానసిక, చలన అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది.

గుప్తమైన ఆకలి

  • గుప్తమైన ఆకలి అంటే చౌకబారు ఆహారపదార్ధాలు తినటంవల్ల కడుపునిండినట్లనిపించినా అందులో విటమిన్లు కానీ, సూక్ష్మ పోషకాలు కానీ ఉండవు తద్వారా కలిగే లోపము.
  • సామాజిక సమూహాలలో వీటిని పెద్దగా గమనించరు.కాబట్టి సూక్ష్మపోషకాల లోపాలను గుప్తమైన ఆకలి అనవచ్చు.
  • తమ ఆహారములోసూక్ష్మపోషకాలను కలిగి యుండే వైవిధ్యమైన ఫలాలు,కూరగాయలు లేదా జంతు సంబంధమైన ఆహారపదార్ధాలను చాలినంత  పరిమాణములో తీసుకోనివారికి లోపాలు గుప్తమైన ఆకలికి దారితీస్తాయి.
  • ఐరన్,అయోడిన్ మరియు విటమిన్ ఎ విస్తృతంగా ఉండే సూక్ష్మపోషకాహారలోపములు.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate