పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మధుమేహం

ఈ విభాగంలోమధుమేహం గురించి వివరించబడింది

  • మధుమేహం   శరీరానికి ప్రధాన ఇంధన వనరు అయిన గ్లూకోజును ఎలా ప్రభావితం చేస్తుందన్న వ్యాధి.
  • సాధారణముగా ఇన్సులిన్ అనే హార్మొను శరీర కణాలు గ్లూకోజును తీసుకునేందుకు తద్వారా అదిశక్తిగా ఉపయోగపడేలా సహాయము చేస్తుంది.
  • అయితే మధుమేహం ఉన్నవ్యక్తిలో అవసరంమేరకు ఇన్సులిన్ ఉత్పత్తికాకపోవటమో లేదా ఇన్సులిన్ ను శరీరకణాలు గుర్తించలేకపోవటమో లేదా రెండిటికలయిక.
  • దీనివల్ల శరీరకణాలు లభిస్తున్న చక్కెరను గ్రహించలేకపోతాయి,తద్వారా రక్తములో చక్కెరస్థాయిపెరిగేందుకు దారితీస్తుంది.
  • మూత్రములో చక్కెర ఉన్నప్పుడు లేదా ఉపవాసం తర్వాత  లేదా మామూలు భోజనముఅయ్యాక 2గంటలతర్వాత రక్తములో చక్కెర 100మిల్లీలీటర్లకు 120మిల్లీగ్రాములకన్నా అధికంగా ఉంటే ఆవ్యక్తికి మధుమేహం ఉన్నట్లు.

మధుమేహం లక్షణాలు

  • మితి మీరిన మూత్రం ఉత్పత్తి (పాలియురియా) ఎందుకనగా మితి మీరిన రక్త చక్కెరను శరీరం మూత్రము ద్వారా వదిలించుకోవటానికి ప్రయత్నిస్తుంది.
  • మూత్రములో కోల్పోయిన ద్రవాల నష్టాలను పూడ్చుకునేందుకు గాను విపరీతమైన దప్పిక మరియు ద్రవాలను అధికంగా తీసుకోవటం(పాలిడిప్సియా)
  • అధిక రక్త గ్లూకోజు కంటిని ప్రభావితం చెయ్యటం వల్ల దృష్టి మసకబారటం,కంటిఅద్దాలను తరచూ మార్చాల్సిరావటం జరుగుతుంది.
  • శక్తి లేక పోవటం వల్ల ఆకలి పెరుగుతుంది
  • చక్కెరను మామూలుగా ఉపయోగించుకొలేకపోవటం వల్ల శరీరం కొవ్వును కండరాలను ఇంధనంగా వాడటం వల్ల వివరించలేని విధంగా బరువు తగ్గుతుంది
  • లభ్యమయ్యే చక్కెరను ఉపయోగించుకోలేకపోవటం వల్ల సోమరితనం లేదా అలసట
  • తెగిన గాయాలు త్వరగా మానక పోవటం
  • ఈ లక్షణాలు రక్తచక్కెర కొద్దిగా పెరగినట్లయితే తక్కువగానే కనిపిస్తాయి.

మధుమేహం రూపాలు

మధుమేహానికి మూడు ప్రధాన రూపాలున్నాయి
  • వర్గం1
  • వర్గం2మరియు
  • గర్భధారణ నుంచి ప్రసవకాలం వరకూ వచ్చే మధుమేహం

వర్గం1మధుమేహం లేదా ఇన్సులిన్ మీద ఆధారపడ్డ మధుమేహం

  • చాలా చిన్నవయసులో మొదలవుతుంది
  • ఇన్సులిన్ లోపము వల్ల కలుగుతుంది
  • దీనికి చికిత్శ ఉందికానీ పూర్తిగా నయము కాదు. ఇంజక్షన్ల వల్ల ఇన్సులిన్ ను అందించటం ప్రధాన చికిత్శా మార్గము.
  • ఆహారములో మార్పులు మరియు శారీరక వ్యాయామాలు ఇన్సులిన్ ఇంజక్షన్లు రక్తములో చక్కెర స్థాయిని నియంత్రించటములో సహాయం చేస్తాయి మరియు చిక్కులను పరిమితం చేస్తాయి

వర్గము2 మధుమేహం లేదా ఇన్సులిన్ మీద ఆధారపడని మధుమేహం

  • మెల్లగా మొదలవుతుంది, వాడుకగా చేయించే రక్తపరీక్షలలో బయటపడుతుంది
  • సాధారణంగా స్థూలకాయం వారిని లేదా బరువు ఎక్కువగా ఉన్నవారిని ప్రభావితులను చేస్తుంది.
  • మధ్య ఊబకాయం (నడుము చుట్టూ ఉండే కొవ్వు), వ్యక్తులకు ఇన్సులిన్ నిరోధకాన్ని కలిగించటంలో ప్రేరకంగా ఉంటుందని తెలుస్తూ ఉంది.
  • మందులు, నియమిత అహారం, బరువు తగ్గేందుకు మరియు రక్తములో చక్కెరస్థాయి పెరిగేందుకు వ్యాయామాలు చెయ్యటం వంటి జీవనశైలిలో మార్పులు అన్నీ చికిత్సలో భాగాలు

గర్భధారణ నుంచి ప్రసవకాలం వరకూ వచ్చే మధుమేహం

  • అన్ని గర్భధారణల లోను 1-2 శాతం ఇది సంభవిస్తుంది మరియు ప్రసవానంతరం మెరుగుపడటం కానీ పూర్తిగా నయమవటం కానీ జరుగుతుంది. దీనితో ప్రభావితులైన వారిలో 1-2శాతము మహిళలు తదనంతర జీవితములో వర్గము2 మధుమేహానికి గురవచ్చు.
  • గర్భధారణ నుంచి ప్రసవకాలం వరకూ వచ్చే మధుమేహంకు పూర్తిగా చికిత్శచేయవచ్చు కానీ గర్భధారణ సమయం మొత్తమూ తల్లికీ బిడ్డకూ మధుమేహ సంబంధిత వ్యాధులు తలెత్తకుండా వైద్యపర్యవేక్షణ శ్రద్ద అవసరం.
  • తల్లి అదుపులేని రక్తచక్కెర వల్ల బాధ పడవచ్చు. ఇలాంటి మహిళలకు సహజ ప్రసవం సాధారణంగా కష్టమవుతుంది.
  • భారీ పరిమాణములోని శిశువు మరియు ఇతరచిక్కులు మరణానికి దారితీయటంతో సహా బిడ్డకు ప్రమాదాలు ఉన్నాయి. మధుమేహం ఉన్నతల్లికి జన్మించిన పిల్లల వారు పెద్దయ్యాక  మధుమేహానికి గురికావచ్చు.

మధుమేహానికి సంబంధిత చిక్కులు

తీవ్రమైన చిక్కులు

రక్తములో గ్లూకోజు మాంద్యము (హైపోగ్లై సెమియా)

  • మధుమేహాన్ని నయం చేసేందుకు మందులు వాడుతున్నదశలో శీఘ్రంగా. తీవ్రంగా రక్త చక్కెర స్థాయి తగ్గటాన్నిరక్తములో గ్లూకోజు మాంద్యము (హైపోగ్లైసెమియా) అని అంటారు.
  • అధిక మోతాదులో ఇన్సులిన్ వాడటం,ఆహారములో పిండిపదార్ధములు చాలినంత లేక పోవటం, నోటి ద్వారా తీసుకునే యాంటీ బయాటిక్ మందులతో పాటు మద్యం తీసుకోవటం, లేదా మితి మీరిన వ్యాయాయం వల్ల కలగవచ్చు.
  • సాధారణ రోగలక్షణాలు నీరసం, చెమటలుపట్టటం,  కలత చెందటం, గుండె దడ, తలతిప్పటం
  • మధుమేహ వ్యాధిగ్రస్తులెవరన్నా రక్తములో గ్లూకోజు మాంద్యము (హైపోగ్లైసెమియా) బారిన పడితే వారికి తక్షణం చక్కెరకానీ గ్లూకోజుకానీ ఇవ్వాలి మరియు వైద్యుడిని సంప్రదించాలి.

కెటొఎసిడోసిస్

  • అదుపులేని మధుమేహం కెటొఎసిడోసిస్ కి దారితీస్తుంది ఇదొక తీవ్రమైన స్థితి మరియు అపస్మారకానికి దారి తీయవచ్చు.
  • ప్రారంభదశలో రోగికి తీవ్రమైన దప్పిక, నీరసం మరియు వాంతులతో కూడిన లేక వాంతులు లేని నిదుర మత్తు. ఇది ఒత్తిడికి మరియు తీవ్ర అంటువ్యాధులకు గురయినప్పుడు సంభవిస్తుంది.
  • ఇది వచ్చిందని అనుమానం కలిగినప్పుడు తక్షణం ఆసుపత్రికిరోగిని తీసుకువెళ్ళాలి

అంటువ్యాధులు

మధుమేహము గలవారు క్షయ,చర్మ మూత్రాశయద్వారము మరియు పాదాలఅంటువ్యాధులకు గురవుతారు.

ఆలస్యముగా నయమయే ప్రక్రియవల్ల అదుపులేనిపాదాల అంటువ్యాధుల వల్ల కణజాలము యొక్కమృతికి(గాంగ్రిన్) దారితీయవచ్చు తద్వారా ఆ పాదము యొక్క భాగాన్నితొలగించవలసిరావచ్చు.

చిన్నా పెద్దా రక్తవాహికలు దెబ్బతినవచ్చు(ఆంజియోపతి)తో సహా దీర్ఘకాలపు చిక్కులుఉన్నాయి. చిన్నరక్తవాహికలు దెబ్బతినటం మైక్రోఆంజియోపతికి దారితీయవచ్చు.అది ఈ క్రిందివాటిలోఒకదానికికానీ ఎక్కువవాటికి కానీ కారణమవవచ్చు:

  • మధుమేహనేత్రాంతఃపటలవైకల్యం ఇందులోనేత్రాంతఃపటలం దెబ్బతిని తీవ్రదృష్టిలోపానికి లేదాఅంధత్వానికి దారితీయవచ్చు.
  • మధుమేహనరాలవ్యాధి ఇది అసాధారణమైన,తగ్గిపోయిన స్పర్శకు దారితీస్తుంది,పాదాలతో మొదలై చేతివేళ్ళకు చేతులకు పాకుతుంది.
  • మధుమేహకండరాలవ్యాధి అనేది నరాలవ్యాధి వల్ల కలిగే బలహీనత
  • మధుమేహమూత్రపిండాలవ్యాధి,మూత్రపిండాలు దెబ్బతినటంవల్ల తీవ్రమైనమూత్రపిండాల వైఫల్యానికి గురిచేస్తుంది తదనంతరం రక్తశుద్ధి అవసరమవుతుంది. వయోజనులలో మూత్రపిండాలు విఫలమవ్వటానికి మధుమేహం అన్నది ఒకసాధారణకారణం
  • స్థూలరక్తనాళమయవ్యాధి హృదయకోశరక్తనాళమయవ్యాధికి దారితీస్తుంది దానికి వేగంగారక్తనాళాలు గట్టిపడడటమొకకారణం.

మధుమేహనిర్వహణ

మధుమేహానికి చికిత్శ ఉంది కానీ పూర్తిగా నయం కాదు మందులుకాకుండా ఆహారము మరియు వ్యాయాయము మంచిచికిత్సాప్రణాళికలు

ఆహారము

  • సాధారణ భారతీయ ఆహారము మధుమేహానికి తగినది.అయినప్పటికీ పోషకాహారము ఎంతతీసుకోవాలనేది వ్యక్తి యొక్క వయసు,లింగము,బరువు,పొడవు,శారీరకశ్రమ మరియు శరీరధర్మసంబంధమైన అవసరాలను బట్టి నిర్ధారించుకోవాల్సి ఉంటుంది
  • ఉండాల్సిన దానికన్నా పదిశాతము తక్కువ శరీరబరువు ఉండేలా చూసుకోవాలి
  • మొత్తము కాలరీలలో 60-65%శాతము పిండిపదార్ధాల నుంచి, 15 -20శాతము మాంసకృత్తులనుంచి, 15 -20శాతము కొవ్వునుంచి.
  • రక్తచక్కెరమీద పిండిపదార్ధాల ప్రభావంగురించితెలిపే గ్లిసెమిల్ ఇండెక్స్ తక్కువగా ఉండే తృణధాన్యాలను పైన పొట్టుతో లేదా కాయధాన్యాలను తీసుకోవటం అభిలషణీయం.
  • సరైన పరిమాణాల్లో ఫలాలను తీసుకోవచ్చు.
  • మాంసకృత్తులను శాఖాహారవనరుల నుండిస్వీకరించటం మంచిది ఎందుకనగా అవి ఆహారానికి వినియోగము లేనిపదార్ధాన్ని అందిస్తాయి మరియు జంతుమాంసకృత్తులు కొలెస్ట్రాల్ పెరగటానికి దోహదపడతాయి.
  • వ్యాధితీవ్రత తక్కువగా ఉంటే కాలరీలు తక్కువగా కలిగియున్న ఆహారము మరియు చక్కెరవినియోగమున్న మిఠాయిలను,జాములు జల్లీలను తీసుకోకపోతే సరిపోతుంది.
  • తీవ్రత పెరుగుతున్నప్పుడు వైద్యుని లేదా ఆహారశాస్త్రజ్ఞుల సలహా తీసుకోవటం ఉత్తమం.వారికి రక్తచక్కెర అంచనా దానితోపాటు మందులమోతాదులో హెచ్చింపులు తగ్గింపులు మరియు ఆహారపుసలహాలు తప్పనిసరి
  • గర్భధారణ సమయములోని మధుమేహం వైద్యపర్యవేక్షణ జాగ్రత్తగా జరగాలి.ఆమెప్రతి కిలోగ్రాముకు 30-35కిలో కాలరీలశరీరబరువును తీసుకొనితీరాలి.ఆమె ఆహారములో శరీరబరువుకు తగ్గట్టుగా ప్రతి కిలోగ్రాముకు 1.5 -2 .5 గ్రాముల మాంస కృత్తులు  ఉండాలి.గర్భధారణ మొత్తము సమయములో బరువులో 12కిలోగ్రాములకు మించకూడదు.తల్లీబిడ్దలకు చిక్కులెదురవ్వకుండా ఉండేందుకుగాను రక్తచక్కెర స్థాయిని గర్భిణీగా ఉన్నంతకాలము సాధారణస్థాయిలోనే కొనసాగించాలి.

వ్యాయాయము

  • వ్యాయాయము ఎవరికైనా మంచిదే ముఖ్యంగా మధుమేహముతో ఉన్నవారికి.మధుమేహం ఉన్నవారిలో క్రమంగా వ్యాయామం చేసేవారిలో మందుల అవసరం తక్కువగా ఉంటుంది.
  • వ్యాయామ పద్ధతులను తీసుకునే ఆహరము మరియు ఇన్సులిన్/నోటిమందులమోతాదు వంటివాటి మీద ఆధారపడి ఎంపికచెసుకోవాలి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.04651162791
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు