অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆహారముతో సురక్షితంగా వ్యవహరించటం

ఆహారాన్నితాకటం మరియు వ్యక్తిగతపరిశుభ్రత

అంటువ్యాధులకు గురయిన వ్యక్తి ఆహారాన్ని తాకటం వల్ల ఆ ఆహారం ద్వారా ఎక్కువజబ్బులు ఒకరినుంచి మరొకరికి అంటుతాయి.

ఆహారాన్ని తాకినవ్యక్తి వంటిపై నున్న రోగాణువులు పచ్చి లేదా వండిన ఆహారాన్ని కలుషితం చేస్తాయి.వాటికి మంచి అవకాశం దొరికితే ప్రమాదకరమైన స్థాయికి పెరుగుతాయి.కాబట్టి ఆహారాన్ని తాకేవారు సాధ్యమైనంతవరకూ ఆరోగ్యంగా ఉండాలి

ఆహారాన్ని తాకేవారికి చిట్కాలు

  • మరుగుదొడ్డిని ఉపయోగించాక,ఆహారాన్ని తాకకపూర్వం తాకినతరువాత సబ్బు,నీళ్ళుపెట్టి చేతులు కడుక్కోవాలి.
  • వేలిగోళ్ళను కురచగా కత్తిరించుకోవాలి
  • వదులుగా ఉన్నజుట్టు పడకుండా ఆపేలా తలకు ఏదన్నా కట్టుకోవాలి.
  • ఆహారాన్ని తాకేటప్పుడు తలగోక్కోవటం,ముక్కు,నోరుచుట్టూ మరియూ లోపల వేళ్ళు పెట్టటం కూడదు.
  • ఆహారం మీద చెయ్యి అడ్డుపెట్టకుండా దగ్గటం,తుమ్మటం లాంటివి చెయ్యరాదు.
  • పొగాకు,వక్క లేదా కిళ్ళీలు నమలరాదు మరియు వంటగదిలోని చేతులు కడిగే మరియు గిన్నెలు కడిగే వెడల్పాటి పాత్రలలో ఉమ్ముఊయకూడదు.
  • తెగినగాయాలను నీరుఅంటని కట్టుతో కప్పి ఉంచాలి.
  • తినేందుకు సిద్ధంగా ఉన్న ఆహారాన్ని పటకారు మరియు ఇతరవంటయింటిపరికరాలతో తాకాలి
  • కత్తులు మరియు ముళ్ళగరిటెలను వాటికాడలతో మరియు పళ్ళెములను అంచులతో అందుకోవాలి.
  • తాగునీరు కానీ మరేయితర పానీయాలను అందించేటప్పుడు చేతివేళ్ళు ఆగ్లాసుల్లో మునకకుండా చూడాలి.
  • అతిసారం,చర్మవ్యాధులు మరియు చేతి మీద గాయాలున్నప్పుడు ఆహారాన్ని తాకకుండా దూరంగా ఉండాలి.

ఆహార సేవలందించే సంస్థలలో ఆహారభధ్రతా చర్యలు

  • ఆవరణ పరిశుభ్రంగా,దుమ్ముధూళికి దూరంగా ఉండాలి.
  • కుక్కలు,పిల్లులు,పందికొక్కులు.పక్షులు,ఈగలు మరియు ఇతరకీటకాలు లోపలికి రావటాన్ని అరికట్టాలి.
  • భవనానికి మంచితాగునీటిసరఫరా మరియు మంచి మురుగునీటిపారుదల వ్యవస్థా ఉండాలి.
  • చేతులు కడుక్కోవటానికి,మరుగుదొడ్లు వేరువేరుగా ఉండాలి,సిబ్బందికి గదులు ఏర్పాటుచెయ్యాలి.
  • చెత్తపడవేసే చోటును ఈగలనుంచి కాపాడాలి.
  • వంటగదిలో సహజంగానయినా కృత్రిమంగానయినామంచివాయుప్రసరణ మరియు వెలుతురు ఉండాలి.

సాధనసామగ్రి

  • వంటపాత్రలు సాధ్యమయినంతవరకూ స్టెయిన్ లెస్ స్టీల్ వి అయ్యుండాలి
  • ఒకవేళ యిత్తడిపాత్రలను వాడుతున్నట్లయితే,ఆమ్లాహార మూలంగాలోహాలు కలవటం వల్ల కాడ్మియం,సీసం లేదా రాగి విషానికి గురికాకుండా ఉండేలా మంచి మందపాటిరేకు కలిగినదై ఉండాలి.
  • ప్లాస్టిక్ పాత్రలను వాడుతుంటే అవి ఆహారస్థాయి ప్లాస్టిక్ అయ్యుండాలి.
  • తరుగుడుకు వాడే ప్లాస్టిక్ పలక విషరహితపాలిమర్ సమ్మేళనముతో కూడినదై ఉండాలి.
  • తరుగుడుకు వాడే ప్లాస్టిక్ పలక ,ముక్కలుగాచేసేది లేదా కత్తులు ముడిఆహారానికి వండిన అహారానికి వేరువేరుగా ఉండాలి.
  • శీతలగిడ్డంగి:రిఫ్రిజిరేటర్లు చలిపుట్టించే లేదా గడ్డకట్టించే స్థాయిలో ఆహారాన్ని  నిలవచేసేందుకు సరిపడా సామర్ధ్యమున్నవి ఏర్పాటుచెయ్యాలి.

ఆహారపరిశుభ్రత

  • సమర్ధవంతమైన మరియు నిత్య్యమూ సాధనసామగ్రిని, వంటపాత్రలను, కత్తులూ కటారులూ,పనిజరిగే ఉపరితలాలు వగైరాలను శుభ్రపరచాలి.
  • మురికిని తొలగించేందుకు మంచి సబ్బులను వాడాలి తర్వాత సరైన క్రిములను దూరము చేసే
  • సాధనముతో క్రిములను తొలగించాలి.
  • సురక్షితమైన తాగునీటిని వంటవండేందుకు ఉపయోగించాలి.
  • వండినవంటకాలను దాదాపు  65డిగ్రీల సెంటీగ్రేడుకు పైన 7 సెంటీగ్రేడు దిగువ న భద్రపరచాలి.
  • వ్యర్ధాలన్నిటినీ సరియైన రీతిలో తొలగించాలి.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate