অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

శక్తి యొక్క భావన

శక్తి యొక్క భావన

  • మనకార్యకలాపాలన్నిటికీ (విశ్రాంతితోసహా)మరియు ఎదుగుదలకు శక్తికావాలి.
  • మాంసకృత్తులు, కొవ్వు,పిండిపదార్ధాలు అహారములోని శక్తిని కలిగించే భాగాలు.
  • శక్తిచాలనియెడల పోషకలోపానికి,అధికమైన తిండి ఊబకాయానికి దారితీస్తాయి.
  • అవసరమైన శక్తిని కాలరీల్లొ  కొలుస్తారు.

శక్తి అవసరం

1. ఒక వ్యక్తి శక్తి అవసరాలు రెండుప్రధాన భాగాలపై ఆధారపడియుంటాయి.

  • బేసల్ లేదా విశ్రాంతి సమయం లో అవసరమైన శక్తి: శరీరం భౌతికంగా,మానసికంగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఖర్చయ్యే శక్తిని బేసల్ జీవక్రియ (బేసల్ మెటబాలిజం బి యమ్)లేదా విశ్రాంత జీవక్రియ(రెస్టింగ్ మెటబాలిజం) అని అంటారు. శ్వాసక్రియ, రక్తసరఫరా, జీర్ణక్రియ, శోషణం, విసర్జన, మరియు శరీర ఉష్ణోగ్రత కాపాడటం  వంటి అత్యవసరవిధులను నిర్వహించేందుకు వ్యయమయ్యే శక్తిని కూడా కలిపాలి.
  • ఈ బి యమ్ ను ప్రభావితం చేసే కారకాలలో వయసు,లింగం,ఎత్తు,బరువు,ఆ వ్యక్తి యొక్క పోషకాహార స్థితి వంటివి ఉన్నాయి.
  • వ్యక్తికి వాస్తవంగా భౌతికశ్రమకు అవసరమైన శక్తి: తేలికపాటిదయినా,భారీది అయినా శారీరకంగా చేసే పనికి అదనపుశక్తిసరఫరా కావాలి. శారీరకశ్రమ లేనప్పుడు కూడా వ్యక్తులు కనీసపు పనులు, కూర్చోవటం, చదవటం, నడవటం లాంటివి చేయవలసి ఉంటుంది,వీటికి కూడా శక్తి కావాలి. దీనిని పోషణశక్తి అని పిలుస్తారు. పోషణశక్తి అవసరం బేసల్ శక్తికన్నా  సుమారు 1.5 రెట్లు ఎక్కువ.
  • తృణధాన్యాలు, చిరుధాన్యాలు, కాయధాన్యాలు, దుంపల వల్ల భారతదేశము ఆహారములో మొత్తము కాలరీల లో 70-80 శాతం లభిస్తాయి.
  • పిల్లలు కిశొరబాలబాలికలతో  కలిపి వారికి రోజూ కావాల్సిన కాలరీలలో 55-60 శాతం పిండిపదార్ధాల నుండి పొందుతారు.

2. గర్భం దాల్చినప్పుడు పిండం ఎదుగుదలకు,గర్భిణీస్త్ర్రీయొక్క ఆరోగ్యం కోసం అదనపుశక్తి కావాల్సిఉంటుంది.

భారతీయులకు సిఫారసు చెయ్యబడిన రోజువారీ ఆహారపు పరిమాణాలు

సమూహం శరీర బరువు (కిలో) వివరాలు శక్తి
కి.కా/రోజు
ప్రోటీనులు
గ్రా/రోజు
క్రొవ్వులు గ్రా/రోజు
పురుషులు 60 మితంగా 2425 60 20
మధ్యస్తం 2825 60 20
అధికంగా 3800 60 20
స్త్రీలు 50 మితంగా 1875 50 20
మధ్యస్తం 2225 50 20
అధికంగా 2925 50 20
గర్భిణీ +300 +15 30
బాలింత +550 +25 45
మగపిల్లలు 0-6 నెలలు
6-12 నెలలు
+400 +18 45
10-12 సంవత్సరాలు 2190 54 22
ఆడపిల్లలు 6-12 నెలలు +550 +25 45
6-12 నెలలు +400 +18 45
10-12 సంవత్సరాలు 1970 57 22
ఈ కాలరీలు మితంగా పని చేసేవారికి ఉద్దేశించబడ్డవి
అధికశారీరకశ్రమ చేసేవారికి వారి అవసరాలకు తగ్గట్టుగా కాలరీలను తీసుకోవాల్సి ఉంటుంది.
50 ఏళ్ళకు పైబడ్డవారికి ఒక్కొకదశాబ్దం పెరిగే కొద్దీ పదిశాతం  తక్కువ కాలరీలు అవసరమవుతాయి.
స్వల్పంగా మధుమేహవ్యాధి ఉన్నవారికి పదిశాతం తక్కువగా కాలరీలు ఉన్న ఆహారం అవసరం,మరియూ వారు మిఠాయిలు,తాండ్ర,జెల్లీల వంటి చక్కెరవస్తువులను తీసుకొనరాదు.

శక్తి-బలమైన ఆహారము

  • ఆహారములో మనకు లభించేశక్తిలో కొవ్వు నుండి వచ్చే శక్తి 30 శాతము దాటకూడదు, మిగిలినది పిండిపదార్ధాలనుండి (50-60 శాతము) మాంసకృత్తులనుండి(10-20 శాతము)గా ఉండటము వాంఛనీయము.
  • మనం మన ఆహారములో-తృణధాన్యాలు,కాయధాన్యాలు,చిరుధాన్యాలు,దుంపలు,శాఖాహార నూనెలు,నెయ్యి,వెన్న,నూనె విత్తనాలు,గింజలు,చక్కెర,బెల్లము  మొదలైనవాటిని కలుపుకోవాల్సిన అవసరముంది.
  • మనకు కావాల్సిన కాలరీలు తృణధాన్యాల నుంచి అధికంగా లభిస్తున్నందున పలురకాల తృణధాన్యాలను,చిరుధాన్యాలను తీసుకోవటాన్ని ప్రోత్సహించాలి. శక్తికి మంచి వనరులు ముతకతృణధాన్యాలయిన  జొన్నలు, సజ్జలు, చిరుధాన్యాలయిన రాగి లాంటివి చౌకగా లభిస్తాయి.
ఆహారపదార్ధాలు శక్తి(కిలో కాలరీలు/గ్రా.తినదగ్గభాగము)
బియ్యము 345
గోధుమపిండి 341
జొన్న 349
సజ్జలు 361
రాగి 328
మొక్కజొన్న 342

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate