অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వృద్ధులు

వయసు మళ్ళడంతో పాటు, శారీరక మార్పులు రావడం వలన సాధారణంగా 60 ఏళ్ళకు, ఆ వయసుకు మించిన వాళ్ళను , పనికి, చురుకైన ఉద్యోగ జీవితానికి వృద్ధులైనట్లు ప్రకటిస్తారు.

వృద్ధులకు సంబంధించి పోషకాహార విషయం లో సమస్యలు

  • శారీరకంగా, కొన్ని మార్పులు రావడంవలన, అవి, వృద్ధుల భోజన విషయం పై ప్రభావం చూపుతాయి.
  • లాలజల గ్రంధుల పరిమాణం కృశించడం వలన లాలజల స్రావం కూడా తగ్గుతుంది.  - ఉదరకోశ స్రావాల పరిమాణం, ఆమ్ల గాఢత కూడా తగ్గుతుంది.  - పేగులలో పోషకాలను గ్రహించే ప్రక్రియ కూడా సన్నగిల్లుతుంది.
  • ఆకలి తగ్గుతుంది.  - దంతాలు ఊడిపోవడం వలన నమిలి మింగడం కష్టమవుతుంది.
  • బీదరికం, ఒంటరితనం, కుంగుబాటు, వీటితో పాటు వృద్ధాప్యంలో వచ్చే వైకల్యాలు, జబ్బుల వలన ఆహార పదార్ధాలను కొనడం, తయారు చేసుకోవడం వారికి సమస్య గామారుతుంది.
  • ఇంకో వైపు, కొంతమంది వృద్ధులు, సులభంగా అందుబాటులో ఉన్న ఏ సిద్ధంగా ఉన్న ఆహారాన్నైనా (రెడీ టు ఈట్‌) అధికంగా  భుజించడం వలన, వారి అవసరాలకు మించి తీసుకోవడం వలన అతి పోషకాల వ్యాధి సోకే ప్రమాదముంది.

వృద్ధులకు పోషకాహారం - అనుసరించదగ్గ సూచనలు

  • ఆరోగ్యవంతమైన ఒక వృద్ధునికి, ఆహార అవసరాలు, ఒక యువకునికి వలెనే అన్ని పోషకాల తో కూడి ఉండాలి. కాని ఆ వ్యక్తి శారీరక శ్రమ ననుసరించి  ఆ ఆహారంలో మార్పులు చెయ్యాలి.
  • కేలరీలను నియంత్రించండి : వయసుతో పాటు, శారీరకపు చురుకుదనం తగ్గడం వలన, ప్రాధమిక జీవక్రియ వేగం  (బేసల్‌ మెటబాలిక్‌ రేట్‌ - బిఎమ్‌.ఆర్‌ ) కూడా మందగిస్తుంది. అందువలన కేలరీల అవసరం కూడా తగ్గుతుంది. కాని యవ్వనంలో ఏర్పడిన ఆహారపు అలవాట్లు తరువాత కూడా కొనసాగుతాయి. దీనివలన, స్థూలకాయం, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అందువలన, 10 శాతం కేలరీలను తగ్గించడం మంచిది.
  • మంచి నాణ్యత కలిగిన ఆహారాన్ని భోజనం లో చేర్చుకోవాలి. ధాన్యాలు, పప్పులు, గింజలు, పాలు, గుడ్లు, మాంసాహారం తగిన మోతాదులో తీసుకోవాలి.
  • కనిపించే గాఢత కలిగిన కొవ్వు పదార్ధాలైన, నెయ్యి, వేపుళ్ళు మొదలైన వాటిని నియంత్రిచాలి. దీని వలన కొలెస్ట్రాల్‌ స్థాయి తగ్గి రక్త పోటు (హైపర్‌  టెన్షన్‌), అథిరోస్కెలొర్సిస్‌ మరియు గుండె జబ్బు అదుపులో ఉం టాయి.
  • పిండి పదార్ధాలను ( కార్బో హైడ్రేట్స్‌) నియంత్రించండి- ధాన్యాలు, చక్కెరలు, కంద దుంపలు, వేళ్ళు,  కంద  వంటివి. ఇందు వలన కొన్ని రకాల పోషకాలను కోల్పోయే పరిస్థితి రావచ్చు.
  • పీచు పదార్ధాన్ని ఎక్కువగా తీసుకోండి - పండ్లు, కూరగాయల లో ఉండే  పీచు పదార్ధములు, శుద్ధి చేయబడిన ధాన్యాలు, మలబద్ధకాన్ని నివారించడంలోనూ, మధుమేహం, కొలెస్ట్రాల్‌ ను నియంత్రించడం లోనూ తోడ్పడతాయి. కూరగాయలు, ముఖ్యంగా ఆకు పచ్చని కూరగాయలు, ఆకు కూరలు తీసుకోవాలి. కూరగాయలను తినడం కష్టమైతే, వాటిని సన్నగా తరిగి కాని, కోరి కాని ధాన్యాలతో కలిపి వండి తీసుకొనడం వలన నమలడం సులభంగా ఉంటుంది.
  • ఖనిజ లవణాలు (మినరల్స్‌) తప్పనిసరి - వృద్ధులలో, ఆస్టియోపొరోసిస్‌ (ఎముకల బలహీనత), పెరియో డోన్టల్‌ ( దంత సంబంధమైన ) వ్యాధులు  సాధారణంగా వస్తాయి. ఇవి దీర్ఘకాలిక కాల్షియం లోపం వలన వస్తాయి. పాలు మరియు పాల ఉత్పత్తులు, ఆకు కూరలు, కూరగాయలు కాల్షియం అధికంగా కలిగిన ఆహార పదార్ధములు. అందువలన, వాటిని మీ ఆహారంలో చేర్చుకోండి.
  • 20 - 30 మిల్లీగ్రాముల  ఐరన్‌ ను భోజనంలో చేర్చుకోవాలి, ఎందుకంటే చాలా కొంచెం ఐరన్‌ ను మాత్రమే శరీరం ఆహారం నుండి గ్రహించగలుగుతుంది. ఆకు కూరలు, కూరగాయలు, ధాన్యాలు, పప్పులు మరియు జొన్నలు ఐరన్‌ అధికంగా కలిగిన ఆహారపదార్ధములు.
  • వృద్ధాప్యంలో, శరీరం, ఐరన్‌, కాల్షియం ను గ్రహించడం తక్కువగా ఉంటుంది కాబట్టి, వాటిని ఎక్కువ మోతాదులో స్వీకరించాలి.
  • ఉప్పును నియంత్రించి వాడాలి. రక్తపోటు, గుండె జబ్బులు, మూత్ర పిండ వ్యాధులతో బాధపడే వృద్ధులకు ఇది ఎంతో ఉపయోగకరం. దీని కోసం, ఊరగాయలు, పచ్చళ్ళు, జున్నులు (చీజ్‌), ఎండు చేపలు వంటివి తగ్గించి , ఆహారంలో అదనంగా ఉప్పు చేర్చుకోవడం మానివేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది.
  • రోజుకు, 6-8 గ్లాసుల మంచినీటిని త్రాగండి.
  • ఒకవేళ, ఎవరైనా వృద్ధుడు, అల్సర్‌ (పుండు), అసిడిటి (ఎక్కువ ఆమ్లం  ఉత్పత్తి కావడం), గుండె మంటతో బాధపడుతున్నట్లైతే, వేపుళ్ళు, ఘాటైన పదార్ధాలను వాడకుండా ఉండడం చేత ఆ సమస్యను అధిగమించవచ్చు.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate