অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

తృణధాన్యాలు, చిరుధాన్యాలు

  • భారతదేశములో అధికంగా వినియోగించే తృణధాన్యాలు వరి, గోధుమ.అధికంగా వినియోగించే చిరుధాన్యాలు జొన్నలు,సజ్జలు,రాగులు.
  • వీటిలోని పిండి పదార్ధాల వల్ల దైనందిన అవసరాలకు సరిపడా శక్తిని 70-80 శాతం సమకూరుస్తాయి.
  • భారీపరిమాణాల్లో వినియోగిస్తుంటే,ఇవి ఇతరపోషకపదార్ధాలైన   మాంసకృత్తులు, కాల్షియం, ఐరన్, మరియు  బికాంప్లెక్స్ విటమిన్లను  కూడా అందజేస్తాయి.

గుర్తుంచుకోదగ్గ ఆరోగ్యచిట్కాలు

  • తృణధాన్యాలను కాయధాన్యాలతో కలిపితీసుకుంటే  బియ్యం పప్పు లాగా మాంసకృత్తుల నాణ్యత మెరుగవుతుంది.
  • ఉప్పుడు బియ్యం,బియ్యాన్ని నీటిలో నానబెట్టి,ఆవిరిపట్టే పద్ధతిద్వారా విటమిన్లు గింజయొక్క పై పొరలోకి స్రవిస్తాయి.దానివల్ల మరాడించి,పాలిష్ పట్టించినా ఉప్పుడుబియ్యం ఎక్కువ విటమిన్లను కోల్పోదు.
  • మన ఆహారములో రాగులు,జొన్నలు,సజ్జలు ఉండటం మంచిది.ఇవి మంచి ఖనిజాలను,పీచు ను బాగా కలిగిఉంటాయి.రాగుల్లో ఖనిజాలు ముఖ్యంగా కాల్షియం అధికంగా ఉంటుంది.అలాగే బియ్యములో కాల్షియం, ఐరన్ తక్కువగా ఉంటాయి.

తృణధాన్యాలు,చిరుధాన్యాల గురించిన పోషకాహార వాస్తవాలు

  • తృణధాన్యాలు 6-12శాతం మాంసకృత్తులను కలిగిఉంటాయి,ఇవి తక్కువ అమినో ఆసిడ్ లైసిన్ ను తక్కువగా కలిగియుండటమే గాక నిత్యమూ అవసరమయ్యే  మాంసకృత్తులలో 50శాతం అవసరాన్ని తీరుస్తాయి.
  • మన ఆహారములో తృణధాన్యాలు ముఖ్యంగా సంపూర్ణధాన్యాలు బి-విటమిన్లకు మంచివనరులు.
  • మనం ఎలా,ఎంతమేరకు బియ్యాన్ని శుభ్రం చేస్తున్నామో,పాలిష్ పట్టిస్తున్నామో దానిమీద ఆధారపడి బియ్యములోని బి-విటమిన్ కోల్పోతున్నామో తెలుస్తుంది.ఎందువల్ల అనగా బియ్యపు గింజయొక్క వెలుపలి భాగములోనే అధికశాతం విటమిన్లు ఉంటాయి.ఎక్కువ పాలిష్ పట్టించిన బియ్యములో అతితక్కువ బి కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి.
  • తృణధాన్యాలలో ఉండే క్రొవ్వుశాతం ప్రతి వందగ్రాములకు 2-5 గ్రాములుగా ఉంటుంది. తృణధాన్యాలు మనకు కావాల్సిన ఫాటీ ఆసిడ్ అవసరాల్లో 50శాతానికి పైగా తీరుస్తాయి,ఇది మనం ఎంతమేరకు ఎంత పరిమాణమములో తృణధాన్యాలను తీసుకుంటున్నామన్న దానిమీద ఆధారపడి ఉంటుంది.·
  • చిరుధాన్యాలలో ఖనిజాలు పీచు పదార్ధాలు విరివిగా ఉంటాయి,ఆవిధంగా ఆహారానికి స్ధూలాన్ని కలగజేస్తాయి.చిరుధాన్యాలలో ఫైటేట్ మరియు టానిన్ పుష్కలంగా ఉండి ఖనిజాల లభ్యతలో జోక్యం చేసుకుంటాయి.
  • చిరుధాన్యాలలో విటమిన్ ఎ,విటమిన్ సి ఉండవు,పసుపుపచ్చ మొక్కజొన్న,కొన్నిరకాల జొన్నల్లో కొద్దిమొత్తాల్లో బీటా-కెరొటిన్ ఉంటుంది.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 2/12/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate