অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పండ్లు

  • యాంటీఆక్సిడెంట్స్ కు పండ్లు మంచి ఆధారవనరు.
  • పండ్లలో విటమిన్ సి బాగా లభిస్తుంది.ఉసిరి,జామకాయల్లో  విటమిన్ సి చాలా ఎక్కువగా లభిస్తుంది.
  • మామిడి మరియు బొప్పాయి లాంటి పచ్చటి పళ్ళలో విటమిన్ -ఎ కు ముందుండే రూపమైన బీటా కెరొటిన్ ఉంటుంది.
  • మామూలు అరటిపళ్ళలో పిండిపదార్ధాలు ఎక్కువగా ఉండి శక్తినిస్తాయి.
  • ఎండబెట్టిన పళ్ళలో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది.
  • ఆహారానికి అనుపానాన్ని కలగజేసి,  ప్రేవుల్లో కదలికకు ఉపకరించే  పెక్టిన్ ను ఫలాలు కలిగిఉంటాయి.

గుర్తుంచుకోదగ్గ ఆరోగ్యచిట్కాలు

  • ఋతువుల్లో దొరికే ఫలాలను తినాలి.(జామ.ఉసిరి,సీతాఫల)ఆయా ఋతువుల్లో ఇవి చౌకగా దొరుకుతాయి.
  • అన్ని ఫలాలు తాజాగా,పండాక తింటే రుచికరంగానూ,బలవర్ధకంగానూ ఉంటాయి.
  • ఫలాల పైన ఉండే తొక్కను తీసివేసి తిన్నాసరే ఆ పండును పూర్తిగా నీటితో కడిగి తినాలి.ఫలాల(జామ.ఆపిల్)పై ఉండే పై తినదగ్గపైతొక్కను అలాగే ఉంచి లేదా బాగా తక్కువగా తొలగించి తినాలి. ఈ తొక్కలో  కానీ దాని కింద కానీ విటమిన్లు,ఖనిజాలు,పీచు ఉంటాయి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate