కొన్ని ఆహార పదార్ధాలలో విష మిశ్రితాలు సహజంగానే ఉంటాయి. ఆయా పదార్ధాలను మనంతీసుకున్నట్లయితే మన ఆరోగ్యం చెడిపోతుంది. మన ఆహారంలో ఉండే కొన్ని ముఖ్యమైన విష పదార్ధాలు-
సైనొజెనిక్ గ్లైకొసైడ్స్
- కొన్ని మొక్కలు కాస్సావా , కర్రపెండలం టాప్యొక మరియు జొన్న వంటిమొక్కల తీనే భాగాలలో ఇవి ఉంటాయి.
- తాజాగా తొక్క తీసిన కస్సానా ను తినడం,చేదుగాఉన్ననులేదాదెబ్బతిన్న వాటిని తినక పోవడం వలన విష కారకాలకు దూరం కావచ్చు.
- తాజాగా తొక్క తీసిన కస్సవాను వండేముందు ప్రవహించే నీటిలోకడగడం ద్వారా గ్లైకొసైడ్స్ అన్నికూడ తొలగింపబడతాయి.
హీమో గ్లూటినైన్లు
- పందిరి చిక్కుడు, దొంతచిక్కుడు, ఉలవలు వంటి కొన్ని మొక్కలలో ఈవిష పదార్ధముంటుంది.
- ఎర్రరక్తకణాలను దగ్గరగా కూర్చుతాయి.
- వేడిమి వలన ఈ విషపదార్ధాలు నశించిపోతాయి.
- లేథ్రిజమ్ లేదా న్యూరొలేథ్రిజమ్
- జీనస్ లేథ్రిస్కు చెందిన కొన్ని పప్పులను ను తినడంవలన నరాల సంబంధమైన జబ్బులు వస్తాయి. లేథ్రిస్ సటైవస్ ప్రధానంగా దీనితోబాటు ఉండడం కారణంగా(దీనినేగడ్డి బఠాణి(గ్రాస్ పీ),కేసరిపప్పు అంటారు)
- ఈ విష పదార్ధంలో ఉండే న్యూరొటాక్సిన్ బీటా- ఆక్జలైల్ ఎల్-ఆల్ఫ,బీటా- డైయమినో ప్రోపియోనిక్ ఆమ్లం (ఒడిఎపి, దీనినే బీటా-ఎన్-ఆక్జైల్ అమైనో-ఎల్-ఆలనైన్, బిఒఎఎ అంటారు) వలన నరాలు బిగపట్టడం జరుగుతుంది.
- దీని కారణంగా పక్షవాతం వస్తుంది.కాళ్ళల్లో బలం తగ్గడంలేదాకదలించలేకపోవడమనే లక్షణం కన్పిస్తుంది.కండరాలలో కొవ్వు తగ్గడంవలన పిరుదులు పలుచనకావడం లేథ్రిజమ్ యొక్క ప్రత్యేక లక్షణం.
- తీసుకోవలసిన ముందు జాగ్రత్తలుఃకేసరి(ఎర్ర)పప్పు తినకపోవడమే శ్రేయస్కరం.ఒకవేళ తినాలనుకుంటే కేసరిపప్పు గింజలను బాగా వేడిచేసిన తర్వాత ఆ నీటిని తీసివేయాలి.
ఫ్లాట్యులెన్స్ వాయువు కారకాలు
- శనగలు, కందులు, లీమాబీన్స్, మినుములు, పెసలుమొదలగు లెగ్యూమ్ జాతి పప్పు గింజలలోధిక పరిమాణంలో వాయువులను ఉత్పత్తిచేసే (ఫాట్యులెన్స్) ఉండి జీర్ణక్రియను అస్తవ్యస్తం చేస్తాయి. ప్రేగులలో ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ తయారవుతుంది.
- శనగలను భుజించినప్పుడు అత్యధికంగాను, పెసలను భుజించినప్పుడు అల్పంగాను ఫ్లేట్యులెన్స్ ఉత్పత్తి అవుతుంది.
- ఓక రాత్రంతా అపరాలను నానబెట్టి, ఆనీటిని పారబోసి తర్వాత వండుకున్నట్లయితే ఫ్లేట్యులెన్స్ కారకాన్నిఉత్పత్తిచేయడం తగ్గిపోతుంది.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.