অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కాల్షియమ్

  • కాల్షియమ్‌ బలవైున  ఎముకల నిర్మాణానికి,  ఆరోగ్యకరమైన దంతాల ధృఢత్వానికి  దోహదం చేస్తుంది.
  • అస్థికండరాల మరియు హృదయకండరాలు పనిచేయుటకు రక్తం గడ్డకట్టడానికి , ఇతర కార్యకలాపాలకు కాల్షియమ్‌ ఆవశ్యకత ఉంది.

కాల్షియమ్‌ అత్యధికంగా  ఉండే ఆహార పదార్ధాలు.

  • పాలు, జున్ను, పెరుగు (యొగర్ట్‌) వంటి పాల   ఉత్పత్తులలో(జంతు సంబంధపు అహారాలలో అధికం)
  • పుదీన లేదా తోటకూర లేదా ముల్లంగి ఆకులు వంటి ఆకు కూరలలో (కాయగూరలలో అధికంగా)
  • రాగుల వంటి చిరు ధాన్యాలు
  • జామ ,పియర్స్‌, మరియు సీతాఫలం వంటి పండ్లు,
  • వీటన్నింటిలొ కాల్షిమ్‌ ఉంటుంది.

కాల్షియమ్‌ను మన శరీరం ఎలా వినియోగించుకుంటుందిః

  • బాల్య, కౌమా రదశలలొ గల  పిల్లలకు కాల్షియమ్‌ను ప్రతీరోజు క్రమం  తప్పకుండా తగినంతగా అందిస్తే ఎదుగుదలలో లోపం ఎముకల బలహీనత లేకుండా చేయవచ్చు.
  • ఒక వ్యక్తికి పదిహేడేళ్ళు నిండే నాటికి తన శరీరం లోని ఎముకలు తాను వయస్కుడైనప్పుడు కావలిసిన పూర్తి కాల్షియమ్ పరిమాణం లోని 91% కాల్షియమ్ ను సమకూర్చుకుంటాయి.
  • పదిహేడేళ్ళ వయస్సు నాటికి వయస్కుల కాల్షియం సాంద్రతలోని 91శాతం కాల్షియమ్‌ నిల్వ ఉంటుంది.
  • 35 ఏళ్ళ వయసులో స్త్రీ  పురుషులిద్దరి లో ఎముకలు పూర్తి స్థాయి సాంద్రతను కల్గి ఉంటాయి.
  • 40వ పడికి వచ్చేటప్పటికి ఎముకలలో గల కాల్షియమ్‌ పరిమాణం తగ్గె ప్రమదం ఉంది.  దీనిని నివారించుకునేందుకు శరీరంలో కాల్షియమ్‌ సాంద్రతను పెంచుకోవడం అవసరం.
  • వరి, గోధువు వంటి ప్రధాన ఆహార ధాన్యాలలోలేదా ఆకు కూరలలొ ఫైటేట్లు, ఆక్జలేట్లు ఉండి కాల్షియమ్‌ను బంధించడం వలన శోషణప్రక్రియ లో అవరోధం ఏర్పడుతుంది.
  • కాల్షియమ్‌ లోపం వలన ఎముకలు గుల్లబరుతాయి.

వివిధ వయసుల వారికి అవసరమగు కాల్షియమ్‌

సంవత్సరం లోపు 525
1 - 3  సంవత్సరాలు 350
4 – 6  సంవత్సరాలు 450
7 – 10 సంవత్సరాలు 550

గుర్తుంచుకోవలసిన ఆరోగ్య చిట్కా

చూలింతలు,  బాలింతలకు కాల్షియమ్‌ ఆవశ్యకత అధికంగా ఉంటుంది. కాబట్టి  కాల్షియమ్‌ అధికంగా ఉన్న ఆహారాన్ని  తీసుకోవడం అవసరం.  ఎందుకో మీకు తెలుసా?

  • పిండం పెరుగుదలకు కావలసిన కాల్షియమ్‌ను గర్భవతులు తీసుకోవలసి ఉంటుంది. అట్లాగె పాల ద్వారా బాలింతలనుంచి బిడ్డకు  కాల్షియమ్‌ చేరుతుంది.
  • ఆహారం లో తల్లికి గనుక తగినంత కాల్షియమం అందకపోతే ఆమె ఎముకలనుండి పీల్చబడిన కాల్షియమ్‌ పిండం పెరుగుదలకు సరిపడుతుంది. అదేవిధంగా పసిపిల్లలకు పాలిచ్చేటప్పుడు పాలద్వారా కాల్షియమ్‌ అందుతుంది. దీని ఫలితంగా ఆమె ఎముకలు పెళుసుబారి, బలహీనమౌతాయి.
  • సరిపడినంతగా పాలు, ఆకుకూరలు తీసుకోవాలని సూచించడవైునది.
  • భారత దేశంలో గల స్త్రీలలొ చూలింతలకు, బాలింతలకు తడి సున్నం పూసిన తవులపాకులు నమలడమనే అభ్యాసం సాధారణంగా ఉండడంతో వారిలొ కాల్షియమ్‌ వృద్ధి చెందుతుంది.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 4/24/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate