অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

క్రొవ్వులు

  • ఇది గాఢత చెందిన శక్తి రూపంలో ఉంటుంది.
  • శరీర నిర్మాణానికి కావలసిన నిర్మితపదార్ధాలను మరియు కొన్ని విటమిన్ల వినియోగానికి క్రొవ్వులు తోడ్పడుతాయి.
  • కొవ్వుల నిచ్చే పదార్ధాలుః నూనెలు, మాంసం మరియు మాంస సంబంధఉత్పత్తులు, పెరుగు, వెన్న, నెయ్యి, కొన్ని రకాల చేపలు, గింజలు మరియు సోయాబీన్స్‌.

మేలు మరియు కీడు చేసే క్రొవ్వులు

  • ఆవశ్యక పదార్ధాలైన గ్లిసరాల్‌, కొవ్వు ఆమ్లాల తో అన్నిక్రొవ్వులు ఏర్పడతాయి.
  • కొవ్వులలో గల క్రొవ్వు ఆమ్లాల రకం పై ఆధారపడి మేలు లేదా కీడురకపు క్రొవ్వులుగా చెప్ప బడతాయి.
  • క్రొవ్వు ఆమ్లాలు అసంతృప్త, సంతృప్త క్రొవ్వు ఆమ్లాలుగా విభజించడమైనది.

అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు

  • ఇవి మరల మోనొ (ఏక)అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు(ఎమ్‌యుఎఫ్‌ఎ),అనేక(పోలి) అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు (పియుఎఫ్‌ఎ)గా వర్గీకరించబడ్దాయి.
  • పియుఎఫ్‌ఎ రెండు రకాలు ఒమెగా 3 ఫాటీ ఆసిడ్లు (క్రొవ్వు ఆమ్లాలు) మరియు మార్పు చెందిన క్రొవ్వు ఆమ్లాలు.

ఆహారపు వనరులలో

ఎమ్‌యుఎఫ్‌ఎ – వేరుసెనగ పప్పు నూనె లేదానువ్వుల నూనె, ఆలీవ్‌ నూనె మొదలగునవి.

పియుఎఫ్‌ఎ-జొన్న, సోయాబిన్‌,సేఫ్‌ ఫ్లవర్‌ , సన్‌ ఫ్లవర్‌ (పొద్దు తిరుగుడు పువ్వు)మొదలగు వాటినుండి తీసిన నూనెలు.

  • ఒమెగా-3 క్రొవ్వు ఆమ్లాలు-చేపలు చేప నూనెలు.ఆకు కూరలైన పుదీన, పప్పు ధాన్యాలు గింజల నుండితీసిన నూనెలు, ఆవాలు, మెంతులు , మసాలాలు .
  • (ట్రాన్స్‌ క్రొవ్వు ఆమ్లాలు)- రొట్టె,బిస్కెట్ల (బేకరి )ఉత్పత్తులు, బాగా  ఎండిన లేదా వేయించిన చిరుతిళ్ళు, సమోసాల వంటి వాటిలో ఎక్కువగా వేయించడానికి మరల మరల వినియోగించే  వనస్పతి వంటి నూనెలు.

సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు

  • పాలు, పాల ఉత్పత్తులు- నెయ్యి, వెన్న,పెరుగు.గ్రుడ్లు,మాంసఉత్పత్తులతోబాటు కొబ్బరి,పామ్‌ వంటి శాకీయనూనెలు , ఉదజని సంబంధిత (హైడ్రోజినేటెడ్‌)నూనెలలో (డాల్డ, వనస్పతి లాంటివి ) ఈ సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు ఉంటాయి.

ఆరోగ్య చిట్కా

ఒమెగా 3 క్రొవ్వు ఆమ్లాలు మనం తినే ఆహారంలో అధికంగా ఉంటే రక్త పీడనాన్ని తగ్గిస్తుంది. రక్తం గడ్డలుగా అవడం, హృదయ సంబంధిత వ్యాధులువచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.కాని ట్రాన్స్‌ క్రొవ్వు ఆమ్లాలుమరియు సంతృప్త ఆమ్లాలు ఆహారంలో ఉంటే గుండెపోటువచ్చేప్రమాదం ఎక్కువవుతుంది.

ఎందుకో మీకు తెలుసా?
  • ఒమెగా-క్రొవ్వు ఆమ్లాలు ట్రైగ్లిసరైడ్‌స్థాయిలను తగ్గిస్తాయి. కాని ట్రాన్స్‌ ఫాటీఆమ్లాలు మరియు సంతృప్త క్రొవ్వు ఆమ్లాలుఆహారంలో కలిసి ఉం టే శరీరంమొత్తంలో కోలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచుతుంది.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 4/24/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate