పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఫ్లోరోసిస్

ఫ్లోరోసిస్ సమాజం మీద కలిగించే ప్రభావాన్ని తెలుసుకోడం.

లక్ష్యం

 1. ఫ్లోరోసిస్ సమాజం మీద కలిగించే ప్రభావాన్ని తెలుసుకోడం.
 2. శాశ్వతంగా నియంత్రించడానికి చేపట్టాల్సిన చర్యలను తెలుసుకోడం. అమలు చేయడం.

నేపథ్యం

ఫ్లోరిన్ ఒక రసాయనిక మూలకం. ఆవర్తన పట్టికలో 7వ గ్రూపుకు చెందిన హాలోజన్లలో మొదటి మూలకం. దీని సాంకేతికం F. దీని పరమాణుసంఖ్య  9. పరమాణుభారం 18.99 గ్రా. అని పీలే అను శాస్రవేత్త 1771లో ఫ్లోరిన్ గురించి తెలియజేశాడు. 1886లో హెన్రీ మాయిజన్ దీనిని వేరుచేశాడు. దీని చర్యాశీలన చాలా ఎక్కువ. అందువల్ల ఇది ప్రకృతిలో దాదాపు 55 పైగా సమ్మేళనాల రూపంలో లభిస్తుంది. ఇది ఘన, ద్రవ, వాయు రూపాలలో లభిస్తుంది. భూగర్భ జలాలలో ద్రవరూపంలోనూ రాతి పొరలలో ఫునరూపంలోనూ కర్మాగారాల వ్యర్థపదార్ధాలలో వాయురూపంలోనూ దీనిని చూడవచ్చు. నల్గొండ, రంగారెడ్డి, ప్రకాశం జిల్లాలలో ఫ్లోరైడ్ ప్రభావం తీవ్రంగాఉంది.

పద్ధతి

 1. 5 మంది విద్యార్థుల చొప్పన జట్టుగా ఏర్పడండి. వారా పత్రికలు, మాగజైన్లు, కరదీపికలు పరిశీలించి సమాజంపై ఫ్లోరోసిస్ ప్రభావాన్ని తెలియజేస్తూ వ్యాసం రాయండి.
 2. ఫ్లోరోసిస్ వ్యాధికి గురైన వ్యక్తులు, కుటుంబాలను సందర్శించి వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సామాజిక సమస్యలపై నివేదిక తయారుచేయండి.
 3. ఫ్లోరోసిస్ వ్యాధి తీవ్రత నుండి తగ్గించడానికి లేదా అసలు వ్యాధికి గురికాకుండా పాటించాల్సిన చర్యలను వారికి తెలియజేయండి.

మన రాష్ట్రంలో ఫ్లోరోసిస్ పీడిత గ్రామాల్లో ఉన్న ఫ్లోరైడ్ శాతం కన్నా ఎన్నోరెట్లు ఎక్కువ ఫ్లోరైడ్ నీటిని తాగే కొన్ని దేశాల ప్రజలు మనలా ఫ్లోరోసిస్ బారిన పడడం లేదు. ఎందుకు? ఫ్లోరోసిస్ వ్యాధికి తాగునీరు ఒక్కటే కారణం కాదు. తినే ఆహారం, ఆర్థికస్థితి, శారీరక శ్రమ, పోషకాహార లోపం ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. ఫ్లోరైడ్తో నీరు విషతుల్యమైపోతోంది. ఫ్లోరోసిస్ వ్యాధి సోకిన వ్యక్తి పూర్తిగా నిర్విర్యమై, తనకు తానే భారమై, సమాజానికి కూడా బారంగా తయారవుతాడు.

మన రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులుండడం అనేది కేవలం ఒక ఆరోగ్య సమస్య మాత్రమే కాదు. ఇది ఆర్ధిక, సామాజిక సమన్య, ఫ్లోరైడ్ ప్రభానికి గురైతున్నప్పటికీ ఎన్ని భాదలనైనా అనుభవిసూ ప్రజలు అక్కడే నివసిస్తున్నారు. స్థిరాస్తులను వదులుకొని మరొక ప్రాంతానికి వలస వెళ్ళలేకపోతున్నారు. ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాలలో పారిశ్రామికంగా, ఉద్యోగరీత్యా ఎటువంటి అభివృద్ధి ఉండదు. ఈ ప్రాంతాలలో ఉద్యోగం చేయడానికి సైతం ఇతర ప్రాంతాలనుండి ప్రజలు రావడానికి ఇష్టపడరు. ఇక్కడి ప్రజలు చిన్న వయసులోనే తీవ్రమైన వ్యాధికి గురౌతుండడం వలన పనిచేసే సామర్థ్యం తగ్గిపోయి. జాతీయ ఆదాయంలో ఈ ప్రాంత ప్రజల పాత్ర స్వల్పమైపోతోంది.

తదుపరి చర్యలు

 1. ఫ్లోరోసిస్ బాధిత గ్రామాలలో ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందుతోందా? బోరుబావుల నీరే తాగుతున్నారా? ఒకవేళ చెరువులు, టాంకులలో నీరు తాగుతున్నట్లయితే అవి పరిశుభ్రంగా ఉన్నాయా? లేవా? అనేది గమనించాలి.
 2. ఎక్కువ బోరుబావులు తవ్వడం వలన భూగర్భజల మట్టాలు పడిపోతున్నాయి. అందువల్ల మరింత లోతుగా తవ్వుతున్నారు. ఇది ఏ రకంగా ఫ్లోరైడ్ ప్రభావాన్ని అధికం చేయడానికి కారణమవుతోందో చర్చించండి.
 3. రోజువారీ ఆహారంలో రాగులు, జొన్నలు మొదలైన చిరుధాన్యాలు తొటకూర, కరివేపాకు వంటి ఆకుకూరలతో తక్కువ ఖర్చుతో పోషకాహారం తినేలా అవగాహన కలిగించాలి.
 4. పిల్లలకు నువ్వులు, గసాలు, బెల్లం ఉండలు, జామ, ఉసిరి, రేగు మొదలైన పండ్లు ఇవ్వాలి. వీలైనంత వరకు ప్రతిరోజు కనీసం పావులీటరు పాలు ఇవ్వాలి అని ప్రచారం చేయాలి.
 5. ఫ్లోరిన్ కలిగిన నీటితో తయారుచేసిన ఎక్కువగా తాగటం కూడా వ్యాదికి కారణమౌతుంది. అని తెలిపే నినిదాలు తయారు చేయండి.

ఆధారము: http://apscert.gov.in/

3.06666666667
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు