పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

వ్యక్తిగత పరిశుభ్రత

మనం తినే భోజనం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకునే తీరు, వ్యాయామం, సురక్షితమైన లైంగిక సంబంధము శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో ముఖ్య పాత్ర వహిస్తాయి. మన గ్రామాలలో వచ్చే వ్యాధుల్లో శరీర పరిశుభ్రత లోపించడం వల్ల వచ్చే వ్యాధులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి.

సురక్షితమైన ఆహారానికి కీలకమైన ఐదు సూచనలు వీక్షించేందుకు క్రింద చిత్రం పైన క్లిక్ చేయండి

మనం తినే భోజనం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకునే తీరు, వ్యాయామం, సురక్షితమైన లైంగిక సంబంధము  శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో ముఖ్య పాత్ర వహిస్తాయి. మన గ్రామాలలో వచ్చే వ్యాధుల్లో శరీర పరిశుభ్రత లోపించడం వల్ల వచ్చే వ్యాధులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. తలలో పేలు, గజ్జి, పుండ్లు, పిప్పిపళ్ళు, నీళ్ల విరేచనాలు, బంక విరేచనాలు ఇలాంటి జబ్బులన్నీ శరీర పరిశుభ్రత లేకపోవటము వలన వస్తాయి. శుభ్రత పాటించటం వలన వీటన్నిటినీ నివారించవచ్చును.

తల శుభ్రత

 1. స్నానం చేయకుండా ఉంటే మురికి, చమట, నూనె వలన తలలో గడ్డలు పుండ్లు ఏర్పడతాయి.
 2. తలపైవున్న చర్మంలో చెమటలాంటి జిగట పదార్థం మురికిని వదిలించడానికి కనీసము వారానికి ఒకసారి తలస్నానం చేయాలి.

కండ్లు, చెవి, ముక్కు శుభ్రత

 1. శుభ్రమైన నీటితో ప్రతి రోజు కళ్ళను కడుక్కోవాలి.
 2. చెవి,ముక్కులో తయారయ్యే ద్రవాలు పొక్కులుగా మారి నిల్వ ఉంటాయి. కాబట్టి వారానికొక రోజు చెవిలో గుబిలి తీసేయాలి. నీరు, నూనె పోయకూడదు.
 3. పిల్లలకు జలుబు చేసినప్పుడు శ్రద్ధగా ముక్కులను మెత్తటి నూలు బట్టతో శుభ్రపరచాలి లేకపోతే వారికి గాలి పీల్చటము కష్టమవుతుంది.

నోటి శుభ్రత

 1. దంతాలకు బొగ్గుపొడి, ఉప్పుపొడి, గరకుపండ్లపొడి వాడితే పింగాణిపొర అరిగిపోయి పన్ను పుచ్చుతుంది. పండ్ల పొడి, టూత్ పేస్టుతో పళ్ళు తోముకోవాలి.
 2. ప్రొద్దున నిద్రలేచిన తరువాత రాత్రి నిద్ర పోయేముందు, ఏదైనా తిన్నప్పుడల్లా నోటిని పుక్కిలించాలి. లేదంటే పండ్ల మధ్యలో ఇరుకున్న ఆహార పదార్థాలు పులిసి నోటి దుర్వాసనను చిగుర్లకు హాని కలిగిస్తాయి. నోటి దుర్వాసన వలన పళ్ళు కూడా తొందరగా పుచ్చుతాయి.
 3. చాక్లెట్లు, స్వీట్లు, ఐస్ క్రీములు, కేక్స్ వంటి పదార్థాలు తక్కువగా తింటే పుచ్చి పళ్ళు రావు
 4. రోజూ మంచి పోషక ఆహారం తీసుకోవాలి.
 5. పుచ్చిపోయిన పళ్ళు ఉంటే వెంటనే దంత వైద్యుల దగ్గరికి వెళ్ళి సరైన చికిత్స తీసుకోవాలి.
 6. పళ్ళు తీయటము వలన కళ్ళకి ఎలాంటి ప్రమాదము ఉండదు.
 7. సరిగా పళ్ళని శుభ్రం చేసుకోకపోవడం వలన పళ్ళ మీద పొరలాగా ఏర్పడి చిగుర్లకు హాని కలిగించి, దుర్వాసనని కలిగిస్తాయి. దీని కోసం దంత వైద్యులను సంప్రదిస్తే పళ్ళని వారే శుభ్రపరచుతారు. ఇలా చేసుకోకపోతే పళ్ళు ఊడిపోయే ప్రమాదము ఉన్నది.

లక్షణాలు

ఇది బి విటమిన్ లోపం వల్ల వస్తుంది. బి విటమిన్ లో చాలా రకాలు ఉన్నాయి. అందుకనే వీటిని బి కాంప్లెక్స్ అంటారు.

నివారణ

నిండు గింజ ధాన్యాలలోను, పాలలోను, మాంసము, తాజా కూరగాయలు, దుంపలు, పప్పు దినుసులలో బి కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.

చర్మానికి తీసుకోవలసిన జాగ్రత్తలు

 1. చర్మం శరీరాన్నంతా కప్పి శరీర ఉష్ణ్రోగ్రతను అదుపు చేసి శరీర అవయవాలకు రక్షణ కల్పిస్తుంది.
 2. మలిన పదార్థాలను చెమట రూపంలో బయటకు వదులుతుంది. ఈ చెమట శరీరంపై అలాగే నిలువవుంటే, ఎండిపోయి చెమట వచ్చే రంద్రాలను మూసివేయటం వలన నిల్వ ఉండి పుండ్లు గడ్డలు ఏర్పడతాయి.
 3. అందుచేత రోజు స్నానం చేయటం ద్వారా చర్మాన్ని శుభ్రపరచుకోవాలి.

చేతులు కడుక్కోవటం

 1. మనం చేసే పనులన్నీ చేతుల ద్వారానే జరుగుతాయి. అన్నం తిన్నా, ముక్కు చీదినా, పేడతీసినా చేతితోనే చేస్తాం. ఇన్ని రకాల పనులు చేసేటప్పుడు ఆ పనికి సంబంధించిన మలినాలన్నీ చేతికి అంటుకుంటాయి.
 2. గోళ్ళుపెద్దవిగా ఉంటే గోటి క్రింద మట్టి రూపంలో నిలువ ఉంటాయి. కాబట్టి గోళ్ళను పొట్టిగా, శుభ్రంగా ఉంచుకోవాలి.
 3. మల విసర్జన తరువాత, భోజనం చేసే ముందు చేతులు సబ్బుతో కడుక్కోవాలి.
 4. పశువులను శుభ్రం చేయడం, పేడెత్తడం, మొదలైన పనులు చేసిన తరువాత, వంట చేయబోయే ముందు చేతులు కడుక్కోవాలి. పిల్లలు మట్టిలో ఆడుతుంటారు. కనుక తరచుగా చేతులు కడుక్కోవటం అలవాటు చేయాలి. తినడానికి ఏదైనా, ఇచ్చే ముందు సబ్బుతో చేతులు శుభ్రంగా ఉన్నాయో లేదో చూడాలి. గోళ్ళు ఎప్పటికప్పుడు తీసివేయాలి.

పునరుత్పత్తి అంగాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం

 • పురుషులు, స్త్రీలు ఇద్దరూ కూడా వారి పునరుత్పత్తి అంగాలను (జననాంగాలను) ఎల్లపుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
 • మహిళలు రుతుక్రమం సమయంలో పరిశుభ్రమైన మెత్తటి గుడ్డలను లేదా సానటరీ నాప్కిన్స్ మాత్రమే ఉపయోగించాలి. వీటిని రోజుకు కనీసం రెండు సార్లయినా మార్చండి.
 • మహిళలు ఋతుక్రమం సమయంలో దుర్వాసనతో కూడిన తెల్లబట్ట అవుతున్నట్లయితే వెంటనే డాక్టరును సంప్రదించాలి.
 • మూత్ర, మల విసర్జన తర్వాత శుభ్రమైన నీటితో జననాంగాలను కడుక్కోండి.
 • జననాంగాల్లో (మూత్రాశయ లేదా గర్భాశయ) ఏదైనా ఇన్ఫెక్షన్  సోకినట్లు మీకు అనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.
 • సురక్షితమైన సెక్స్ కోసం కండోమ్ వాడండి.
 • లైంగిక సంభోగానికి ముందు, ఆ తర్వాత కూడా జననాంగాలను శుభ్రం చేసుకోండి.

మల, మూత్ర పరిశుభ్రత

మల, మూత్రాలు చేసిన తరువాత అవయవాలను శుభ్రపరుచుకోవాలి. చేతులు సబ్బుతో కడుక్కోవాలి. బహిష్టు సమయంలో స్త్రీలు ప్రత్యేక పరిశుభ్రత పాటించాలి. మూత్రం చేసే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. మరుగుదొడ్డి ఉన్న వారు దానిని ప్రతి రోజు శుభ్రపరచాలి.

జననావయవాల శుభ్రత

జననావయవాలు పరిశుభ్రత పాటించకపోవటం వల్ల ఇతర వ్యాధులకు దారి తీస్తుంది. కాబట్టి జననాంగాల పరిశుభ్రత తప్పక పాటించాలి.

 • బహిష్టు సమయంలో శుభ్రమైన మెత్తటి గుడ్డలను వాడాలి.
 • మల మూత్ర విసర్జన తరువాత అవయవాలను శుభ్రపరచుకోవాలి.
 • జననావయవాల రోగాలను గుర్తించి చికిత్స తీసుకోవాలి
 • లైంగిక ఆరోగ్యము కొరకు నిరోధ్ ఉపయోగించవలెను.
 • వాసనతో కూడిన తెల్లబట్ట అవుతున్న స్త్రీలు తప్పక డాక్టరును సంప్రదించాలి.
 • లైంగిక సంబంధము ముందు మరియు తరువాత కూడా శుభ్రం చేసుకోవాలి.

పరిశుభ్రమైన వంటకం మరియు ఆహారం

వంట చేస్తున్నపుడు పరిపూర్ణమైన పరిశుభ్రతను పాటించండి. తద్వారా ఆహారం కలుషితం కాదు. విషపూరితమవదు.  తిన్నవారు వ్యాధుల పాలుకారు.

 • వంట చేస్తున్న ప్రదేశాన్ని, పాత్రలను శుభ్రంగా ఉంచండి.
 • కుళ్లిన లేదా  ఇన్ ఫెక్ట్ అయిన ఆహారాన్ని నివారించండి.
 • వంట చేయటానికి ముందు, వడ్డించటానికి ముందు కూడా మీ చేతులను శుభ్రంగా కడుక్కోండి.
 • వండటానికి ముందు కూరగాయలు లాంటి పదార్థాలను బాగా కడిగి వండండి.
 • ఆహార పదార్థాలను సక్రమంగా నిల్వ చేయండి.
 • ఆహార పదార్థాల ప్యాకెట్లపై ముద్రించి ఉన్న లేబుల్ ను జాగ్రత్తగా గమనించండి.  గడువు తీరిన పదార్థాలను షాపులో తీసుకోరాదు. కొనరాదు.
 • వంటింట్లోని వ్యర్థాలను సక్రమంగా తొలగించండి. విసిరేయండి.

వైద్యంలో పరిశుభ్రత

 • గాయాలకు తగిన బ్యాండేజితో కట్టుకట్టి జాగ్రత్తగా చూసుకోండి.
 • ఔషధాలను కొనుగోలు చేసేటపుడు గడువు తీరిన వాటిని గమనించండి.
 • అవసరం లేని ఔషధాలను జాగ్రత్తగా నిర్మూలించండి.
 • డాక్టరు సలహా లేకుండా ఔషధాలను వాడరాదు.

పరిశుభ్రమైన త్రాగు నీరు

బాగా కాచి, చల్లార్చిన తరువాత నీరు త్రాగడం శ్రేయస్కరం. నీరు మరుగుట మొదలైనప్పటి నుండి 15 నిమిషాలు కాచండి. నీటి రక్షణలో ఇది ఉత్తమమైన చర్య. ఏ పాత్రలో కాస్తారో, అదే పాత్రలో చల్లారనీయండి. అవసరమనుకుంటే కాచే ముందు వడగట్టండి.

తాగునీరుతో వ్యాధుల గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు మీరు పాటించండి. ఈ జాగ్రత్తలు అందరికీ తెలపండి. వారు పాటించేలా చూడండి.

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

హాయిగా ఆరోగ్యంగా

పిల్లలు పారిశుధ్యం - బొమ్మల కథ.

వ్యక్తిగత పరిశుభ్రతను మరింత ప్రజలకు, పిల్లలకు ప్రచారం చేయటానికి అపార్డ్ సంస్థ వారు ముఖ్యమైన సమాచారాన్ని చక్కటి బొమ్మల రూపంలో పుస్తకం రూపొందించారు. బొమ్మలతో ఆడుకోవడం పిల్లలకి సరదా, పిల్లల మనసుకి మరింత హత్తుకునేలా చెప్పటానికి ఉపయోగపడే అద్భుత ప్రక్రియ బొమ్మల కథ. ఆ పుస్తకాన్ని ఈ క్రింద గల లింకులలో చూడవచ్చు.

 1. 1వ భాగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
 2. 2వ భాగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
 3. 3వ భాగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
 4. 4వ భాగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
 5. 5వ భాగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
 6. 6వ భాగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
 7. 7వ భాగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఆధారము : అపార్డ్

2.99115044248
sathya Mar 20, 2017 01:31 PM

పురాసేవా అప్ ను డౌన్లోడ్ చేయండి --- మీ సమస్యలను పరిషక్రించుకోండి
చెత్త పనులు చేయకండి నగరాన్నిపరిశుబ్రముగా vunchandi

P.Venkata Ratnam, Panchayat Secretary, Vangalapudi, Seethanagaram Mandal, EGDist. Oct 13, 2014 08:38 AM

** పరిశుభ్రత పై నినాదములు **

స్వచ్చ భారత్ - స్వచ్చ ఆంధ్ర ప్రదేశ్
జై స్వచ్చ భారత్
జై స్వచ్చ ఆంధ్ర ప్రదేశ్
ఆరోగ్యమే మహా భాగ్యము
చెత్తని రోడ్లపై వేయకండి
డ్రైన్లను చెత్తతో నింపకండి
ఇంటింటా మరుగు దొడ్డి - ఊరంతా ఆరోగ్యం
గోదావరి హోరు - స్వచ్ఛత కై పోరు
సింగవరం గ్రామం - స్వచ్ఛత నినాదం
ఒక్కటే మాట - పరిశుభ్ర బాట
ఇంట్లో మరుగుదొడ్డి - ఆత్మగౌరవ చిహ్నం
పచ్చదనం పరిశుభ్రం - ప్రగతికి సోపానం
బహిరంగ మల విసర్జన - నిలిపి వేద్దాం నిలిపి వేద్దాం
మరుగుదొడ్డి లేదా? - సిగ్గు సిగ్గు . . .సిగ్గు సిగ్గు
వ్యక్తిగత మరుగుదొడ్డి - అభివృద్దికి చిహ్నం
మరుగుదొడ్డి కట్టుకో - బ్రతుకు బాట దిద్దుకో
చేత్తవేయకుండా చూద్దాం - అంటువ్యాధుల్ని తరిమేద్దాం
బహిరంగ మలవిసర్జన - సామాజిక రుగ్మత
ఇంటిలోని వ్యర్థాలను - డస్ట్ బిన్లో వేద్దాం
గృహ వ్యర్థాలను - చెత్తకుండీలో పార వేద్దాం
పరిసరాలను - పరిశుభ్రంగా ఉంచుదాం
అంటువ్యాధుల్ని - తరిమి తరిమి కొడదాం
పరిసరాల పరిశుభ్రత - మన ఆరోగ్యానికి భద్రత

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు