హోమ్ / ఆరోగ్యం / స్త్రీ ఆరోగ్యం / గర్భస్థ దశ లో స్త్రీ ఆరోగ్యం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గర్భస్థ దశ లో స్త్రీ ఆరోగ్యం

గుండెజబ్బుతో బాధపడుతున్న స్త్రీ బోధనాసుపత్రిలో కానీ కార్పోరేట్ ఆసుపత్రిలో కానీ కాన్పు చేయించుకోవాలి.

గర్భస్థ ఆరోగ్యం

గుండెజబ్బు

గుండెజబ్బుతో బాధపడుతున్న స్త్రీ బోధనాసుపత్రిలో కానీ కార్పోరేట్ ఆసుపత్రిలో కానీ కాన్పు చేయించుకోవాలి. క్రింద వివరించిన లక్షణాలు గల స్త్రీలు గర్భిణీ అని తెలియగానే వెంటనే ప్రసూతి వైద్యులు యితర ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి. కొంచెం వత్తిడికి కానీ విశ్రాంతిలో ఉన్నప్పుడు కానీ శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, గోళ్ళు, పెదవులు నీలిరంగులో ఉండడం, అప్పుడప్పుడు స్పృహ కోల్పోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం లేదా గుండె కొట్టుకోవడాన్ని గుర్తించలేకపోవడం, కాళ్ళ వాపు, ముఖం ఉబ్బినట్లు ఉండడం, మెడ నరాలు ఉబ్బి ఉండడం, ఈ లక్షణాలు గల స్త్రీలు అధిక శ్రమ తీసుకోరాదు. విశ్రాంతి తీసుకోవాలి. ఒక పక్కకు తిరిగి పడుకోవాలి. మందులు తీసుకోవాలి. డాక్టరు సలహాలను ఖచ్చితంగా పాటించాలి.

రక్తహీనత

రక్తంలో ఐరన్ తక్కువ అవడం వల్ల రక్తహీనత కలుగుతుంది. రక్త హీనతకు కారణాలు .....
అ. ఆకుకూరలు, బెల్లం, పాలు, క్యాబేజీ, మాంసం, కాలేయం వంటి వాటిని తినకపోవడం
ఆ. బహిష్టులో అధిక రక్తస్రావం, మొలలు, ప్రేగులలో కొంకి పురుగు వలన రక్తస్రావం మొదలైన కారణాల వలన కూడా రక్తహీనత కలుగుతుంది. చెప్పులు లేకుండా నడవడం, కొంకి పురుగులు కల మల పదార్థాలను తొక్కినప్పుడు కొంకిపురుగు శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ పురుగు అరికాలిలో ప్రవేశించి ఊపిరితిత్తుల ద్వారా ప్రేగులలో ప్రవేశించి రక్తము పీల్చడం ద్వారా బలపడుతుంది. అందువల్ల ఎవరు కూడా ఆరు బయట చెప్పులు లేకుండా నడవకూడదు. ఇంట్లోకి చెప్పులతో రాకూడదు.
ఇ. గర్భణీ సమయంలో తల్లి, బిడ్డ యిద్దరికీ కూడా ఐరన్ అవసరం ఎక్కువగా ఉంటుంది.
ఈ. రక్తం తయారవడానికి అవసరమైన ఆహారపదార్థాలు అంటే ఫోలిక్ ఆసిడ్, కాల్షియం, విటమిన్-సి కల ఆహారం తీసుకోకపోవడం వలన.
శరీరంలోని అన్ని భాగాలకు రక్తం పోషకాలను, గాలిని తీసుకువెళ్తుంది. ఇందులో ఐరన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. శిశువు పెరుగుదలకు ఐరన్ చాలా అవసరం. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా గర్భిణీ సమయంలో ఈ క్రింద వివరించినవి తప్పకుండా పాటించాలి.

అ. రక్తహీనత లక్షణాలు, చిహ్నాలు :

  • భారత దేశ స్త్రీలలో రక్త హీనత అతి సాధారణం
  • రక్త హీనతతో బాధపడుతున్న స్త్రీలు పాలిపోయినట్లు కనిపిస్తారు. ముఖం ఉబ్బినట్లు ఉంటుంది. శ్వాస తీసుకోవడానికి యిబ్బంది పడతారు. అలసిపోయినట్లు ఉంటారు.
  • కళ్ళు, అంగిలి, నాలిక పాలిపోయి ఉంటాయి.
  • గోళ్ళు తెల్లగా ఉంటాయి. మెత్తగా, సన్నగా, బలహీనంగా ఉంటాయి. వంగే లక్షణాన్ని కోల్పోతాయి.
  • గోళ్ళరంగు, తాంబూలం, కాటుక వంటివి వాడినప్పుడు ఈ గుర్తులు / లక్షణాలు కనపడక పోవచ్చు.

తీవ్ర రక్తహీనత గల స్త్రీలలో ఈ క్రింది లక్షణాలు కన్పిస్తాయి.

  • శ్వాస తీసుకోలేక పోవడం
  • కాళ్ళు, వేళ్ళు వాచి ఉండడం
  • అతి నీరసం
  • Sahil’s పద్దతిలో పరీక్షించినప్పుడు హిమోగ్లోబిన్ 7 గ్రా. కంటే తక్కువ ఉండటం

ఆ. రక్తహీనత పరీక్షలు
గ్రామాలలో నిర్దేశించబడిన రోజులలో హీమోగ్లోబిన్ స్థాయిని పరీక్షించే సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆ రోజుల్లో తప్పక పరీక్ష చేయించుకోవాలి. ఒక వేళ అందుబాటులో లేనట్లయితే ఏరియా ఆసుపత్రిలో కానీ ఏదేని పరీక్షా కేంద్రాల్లోకానీ చేయించుకోవాలి.

ఇ. రక్తహీనత నివారణ

  • పైన వివరించిన విధంగా ఐరన్ మరియు ఫోలిక్ ఆసిడ్ ఎక్కువగా కల ఆహార పదార్థాలు తినాలి. ప్రతి రోజూ ఒక గ్లాసు పాలు తాగాలి. రోజూ ఒక గుడ్డు తినాలి. ఒక పండు కూడా తినాలి.
  • ఆరు బయట నడిచేటప్పుడు ఎప్పుడూ చెప్పులు వేసుకోవాలి.
  • మల విసర్జనకు టాయిలెట్స్ / మరుగుదొడ్లు వాడాలి.
  • మొలలు, అధిక రక్తస్రావం, మలేరియా వంటి సమస్యలకు చికిత్స తీసుకోవాలి.
  • కాన్పు తర్వాత నాల్గవ నెల నుండి మూడు నెలల వరకు 100 ఎం.జి. ఐరన్ మరియు ఫోలిక్ ఆసిడ్ మాత్రలను క్రమం తప్పకుండా వాడాలి.

ఈ. ప్రమాద సూచనలు
రక్తహీనత తీవ్రమైతే చికిత్స అవసరం. 8వ నెల వరకు హీమోగ్లోబిన్ స్థాయి 7 గ్రా. కంటే తక్కువ ఉన్నట్లయితే ఏరియా ఆసుపత్రికి పంపాలి.

  • అధిక రక్తపోటు

రక్తనాళాలలో రక్తం ప్రవహిస్తున్నప్పుడు ఉన్న పీడన స్థాయి, గుండె రక్తాన్ని బయటకు పంపినప్పుడు అది ఎంత పీడనంతో వస్తుంది అన్నది రక్త పీడనం. సాధారణంగా ఇది 120/80 ఎం.ఎం. మెర్య్కురీ (పాదరసం) ఉంటుంది. ఈ స్థాయి కంటే ఎక్కువ ఉంటే అధిక రక్త పీడనం అంటారు. అధిక రక్తపోటు వల్ల తల్లికి మూర్చ రావచ్చు. గర్భస్థ శిశువుకు ఆక్సిజన్ సరఫరా సరిగా జరగదు. ఇందువల్ల గర్భస్థ శిశువు చనిపోవచ్చు కూడా. నిర్ణీత దినాలలో గర్భిణీ పరీక్షలు జరిపేటప్పుడు రక్తపోటు స్థాయిని కూడా కొలవాలి.

అ. లక్షణాలు

  • తల నెప్పి
  • ఉంగరం, జాకెట్టు బిగుతుగా అవడం
  • చేతులు, కాళ్ళ మీద వాపు
  • ముఖం ఉబ్బి ఉండడం
  • బరువు ఎక్కువగా పెరగడం

ఆ. పరీక్షలు

  • రక్తపోటు స్థాయి పరీక్షించండి
  • అల్బుమిన్ కోసం యూరిస్టిక్స్ తో మూత్ర పరీక్ష చేయండి

ఇ. వెంటనే తీసుకోవలసిన చర్యలు

  • గర్భిణీ స్త్రీని విశ్రాంతి తీసుకోమనండి
  • మామూలుగా భోజనం, పానీయాలు తీసుకోమనండి
  • గర్భస్థ శిశు కదలికల సంఖ్యను రికార్డు చేయండి. 12 గంటల వ్యవధిలో 10 కంటే తక్కువ కదలికలు రికార్డయితే ఈ విషయాన్ని డాక్టరు దృష్టికి తేవాలి.

ఈ. ప్రమాద సూచనలు
రక్తపోటు 140/90 కంటే అధికంగా ఉన్నా, దానికి తోడు ఈ క్రింద వివరించిన లక్షణాలు కనిపించినా వెంటనే ఏరియా ఆసుపత్రి లేదా నర్సింగ్ హోమ్ లోని ప్రసూతి వైద్యుల వద్దకు పంపండి.

  • తీవ్రమైన తలనొప్పి, బైర్లు కమ్మటం
  • చేతులు, అరికాళ్ళు ముఖం అంతటా వాపు
  • కళ్ళు మసకబారడం, రెండుగా కన్పించడం
  • వికారం లేదా వాంతి
  • మూత్రం పరిమాణం తగ్గడం
  • అల్బుమనురియా
  • మూర్చలు

ఈ లక్షణాలు గలవారికి మూర్చరావచ్చు. వీరిని ఆసుపత్రికి తరలించేటప్పుడు నోటిలో అడ్డుగా ఉంచడానికి బట్ట సిద్ధంగా ఉంచుకోవాలి. వీరిని పక్కకు తిరిగి పడుకోవాలని చెప్పాలి. ఒక వేళ వీరు వంకర్లు తిరిగిపోతూ ఉంటే, పళ్ళు కొరుకుతూ ఉంటే పైపళ్ళకూ క్రింది పళ్ళకు మద్య బట్ట మడిచి పెట్టాలి. ఇందువల్ల వాళ్ళు నాలిక కొరుక్కొని రక్త స్రావం కాకుండా సహాయపడుతుంది.
140/90 స్థాయి కలిగి పై లక్షణాలు లేనట్లయితే డాక్టరును సంప్రదించాలి.

మధుమేహం

మూత్రంలో చక్కెర, రక్తంలో అధిక స్థాయిలో గ్లూకోస్ ఉండటాన్ని మధుమేహ వ్యాధి అని అంటారు. ఇది సాధారణంగా అనువంశికంగా వస్తుంది. జన్యువుల ద్వారా నిర్ధారించవచ్చు. ప్రస్తుతం ఈ వ్యాధి చాలా మందిలో ఉంటోంది.

అ. లక్షణాలు

  • దాహం
  • తరచూ మూత్ర విసర్జన
  • బరువు తగ్గడం
  • గాయాలు ఆలస్యంగా మానడం

ఆ. పరీక్ష
యూరిస్టిక్స్ ద్వారా మూత్ర పరీక్ష మూత్రంలో చక్కర ఉన్నదీ లేనిదీ తెలియచేస్తుంది. అయితే రక్తంలో ఉన్నదీ లేనిదీ కూడా పరీక్ష చేశాకే దీనిని నిర్ధారించుకోవాలి. గర్భిణీ నమోదు చేసినప్పుడు తప్పనిసరిగా మూత్రపరీక్ష చేసి మూత్రంలో చక్కర ఉన్నది లేనిదీ తెలుసుకోవాలి.

ఇ. గర్భిణీ – మధుమేహ వ్యాధి
మూత్రంలో చక్కెర కన్పించినట్లయితే గర్భిణీ స్త్రీ స్పెషలిస్టును సంప్రదించాలి. కాన్పు ఆసుపత్రిలో చేయించుకోడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ వ్యాధిని చాలా వరకు నియంత్రించవచ్చు కానీ పూర్తిగా నయం చేయలేము. జీవితాంతం మందులు వాడాలి. సరైన చికిత్స తీసుకోకపోతే అంధత్వం, మూత్రపిండాలు, కాలేయం పనిచేయకపోవడం యింకా ఎన్నో యితర సమస్యలు వస్తాయి. మధుమేహం ఉన్న స్త్రీలకు పుట్టిన బిడ్డల బరువు సాధారణంగా ఎక్కువగా ఉంటుంది.

క్షయ

ఇది మైక్రో బాక్టీరియం వలన కలిగే అంటు. ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపుతుంది. అంటు లక్షణం కలది. గాలి ద్వారా సంక్రమిస్తుంది. క్షయ వ్యాధి గల వారు దగ్గినప్పుడు లేదా చీదినప్పుడు వదిలిన గాలి లోని సూక్ష్మజీవులు దగ్గరలో ఉన్న వ్యక్తి గాలి పీల్చినప్పుడు వారిలో ప్రవేశించి వారిలో కూడా అంటు కలగచేస్తాయి. ఒక్కోసారి క్షయ వ్యాధిగల పశువులనుండి కూడా యిది వ్యాపిస్తుంది. పాశ్చరైజ్ కాని పాలు తాగడం వలన కూడా క్షయ వ్యాధి రావచ్చు.

అ. నివారణ
దగ్గినప్పుడు లేదా చీదినప్పుడు నోటికి, ముక్కుకు బట్ట అడ్డు పెట్టుకోవడం మంచి అలవాటు. ఆరుబయట ఉమ్మడం మానాలి.
పుట్టిన వెంటనే శిశువులకు బి.సి.జి. యివ్వడం అమలులో ఉంది. ఆసుపత్రిలో కాన్పు చేయడం వలన లాభాలలో ఇది ఒకటి. ఇది పిల్లలకు రక్షణనిస్తుంది.

ఆ. లక్షణాలు

  • దగ్గు – కళ్ళెతో కూడిన / కళ్ళె లేని
  • జ్వరం
  • బరువు తగ్గడం
  • ఆకలి లేకపోవడం
  • రాత్రి పూట చెమట పట్టడం

ఇ. పరీక్షలు
ఎవరికైనా ఒక వారం కంటే ఎక్కువ రోజులు దగ్గు. జ్వరం ఉన్నట్లయితే కళ్ళె పరీక్ష చేయించుకోవాలి. అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ఈ సదుపాయం ఉంది. నిర్ణీత దినాలలో కళ్ళె పరీక్ష కోసం నమూనాలు యివ్వవచ్చు.

ఈ. గర్భణీ – క్షయ వ్యాధి
కళ్ళెలో వ్యాధి క్రిములున్నట్లయితే క్షయ వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది. తల్లి నుండి బిడ్డకు అంటు రావచ్చు. క్షయ వ్యాధి చికిత్స కాలం ఒక సంవత్సరం. జిల్లా క్షయ వ్యాధి కేంద్రంలో స్పెషలిస్టులు చికిత్స చేస్తారు. మందులు కూడా ఉచితంగా ఇస్తారు.

హైపో థైరాయిడ్ గాయిటర్

ఇది చాలావరకు అయోడిన్ లోపం వల్ల వస్తుంది. ఆహారంలో అయోడిన్ లోపించడం దీనికి చాలా వరకు కారణం.

అ. లక్షణాలు

  • గొంతు ముందు భాగంలో ఉబ్బుగా కనిపిస్తుంది
  • బరువు పెరగడం
  • మలబద్ధకం
  • కనుబొమ్మల వెంట్రుకలు రాలిపోవడం
  • రక్త హీనత
  • చర్మం ఎండిపోవడం
  • నీరసం

ఆ. నివారణ

  • అయోడైజ్డ్ ఉప్పు వాడకం
  • మూత్రనాళ యిన్ఫెక్షన్

స్త్రీలలో మూత్రనాళ అంటు చాలా సాధారణం. దీనికి తోడు మగ వారితో పోలిస్తే ఆడవారు మూత్ర విసర్జన తక్కువగా చేస్తుంటారు. మరుగు అవసరం దీనికి ముఖ్య కారణం. అజ్ఞానం వల్ల చాలా మంది ఆడవారు మలవిసర్జన తరువాత ముందు నుండి వెనుకకు కడుక్కోవడం చేయరు. మూత్ర విసర్జనా ద్వారం యోనిలోన ఉంటుంది. యోనిలో కలిగే ఏ అంటయినా సరే (మగవారిలో వలె యిది మనకు కన్పించదు) మూత్ర నాళంలోకి సులభంగా ప్రవేశిస్తుంది. బహిష్టు / ఋతుస్రావ సమయంలో శుభ్రపరచన బట్టలు వాడడం, అనారోగ్యపు అలవాట్లు కూడా యితర కారణాలు.

అ. లక్షణాలు

  • జ్వరం – వణుకుతో కూడిన / వణుకు లేని
  • వాంతులు
  • మూత్ర విసర్జన సమయంలో నొప్పి
  • మూత్రంలో రక్తం
  • పొత్తికడుపులో నొప్పి

ఆ. పరీక్షలు
చీము కణాలు, రోగ క్రిములను గుర్తించడం కోసం మూత్ర పరీక్ష చేయాలి. జిల్లా ఆసుపత్రులు, ప్రైవేటు రోగ నిర్ధారణ కేంద్రాలలో ఈ పరీక్షలకు సదుపాయం ఉంది. రూ. 100.00 నుండి 200.00 వరకు ఖర్చవుతుంది.

ఇ. నివారణ

  • పానీయాలు ఎక్కువగా తాగాలి
  • మర్మావయవాలను శుభ్రంగా ఉంచుకోవాలి
  • మూత్రం పోయాలనిపించినప్పుడు మూత్ర విసర్జన చేయాలి
  • మల విసర్జన తరువాత ముందు నుంచి వెనుకకు కడుగుకొనే అలవాటు పాటించాలి
  • బహిష్టు సమయంలో శుభ్రమైన సానిటరీ నాప్ కిన్ లు వాడాలి

ఈ. గర్భిణీ – మూత్రనాళ అంటు జబ్బు
పెద్ద ప్రమాదం కాకపోయినా గర్భిణీలో మూత్ర నాళ అంటు అధికంగా ఉంటుంది. సరిగా చికిత్స చేయనట్లయితే దీర్ఘకాలిక అంటుగా మారే అవకాశం ఉంది. డాక్టరును చికిత్సకై సంప్రదించాలి.

సుఖ వ్యాధులు మరియు జననేంద్రియ వ్యాధులు

అంటు కలిగిన వ్యక్తితో లైంగిక సంపర్కం వలన సుఖ వ్యాధులు సంక్రమిస్తాయి. మూత్రనాళం నుండి స్రావాలు, మూత్రం పోసేటప్పుడు మంట, మర్మావయవాలపై పుళ్ళు, స్ర్కోటమ్ వాపు మొదలైన లక్షణాలు గల మగ వారి నుండి లైంగిక సంపర్కం ద్వారా స్త్రీలకు ఈ అంటు వస్తుంది. జననాంగాల లోపల బయట వచ్చే అంటును జననేంద్రియ వ్యాదులు అంటారు. సుఖ వ్యాధుల వల్ల సాధారణంగా జననేంద్రియ వ్యాధులు వస్తాయి.

అ. లక్షణాలు

  • యోని నుండి స్రవించే (దురద లేని / దురదతో కూడిన) సాధారణమైన స్రావం జిగురుగా ఉంటుంది. అంటు ఉన్నప్పుడుదుర్వాసన, రక్తంతో కూడి, తొరకల వలె, దురదతో కూడి ఉంటుంది.
  • జననాంగాలపై పుళ్ళు
  • పొత్తికడుపులో నొప్పి
  • వెన్ను నొప్పి, ఉదరం క్రింద బాగంలో నొప్పి
  • జ్వరం

ఆ. కలిగే వ్యాధులు

  • ఫంగల్ అంటు, కాండిడయలల్ అంటు – థ్రష్
  • పారసైటిక్ అంటు, ట్రైకోమొనోస్ వెజైనైటిస్
  • గోనోకోకల్ అంటు - గనేరియా

ఇ. నివారణ

  • ఒకే భాగస్వామితో లైంగిక సంపర్కం
  • కండోమ్ వాడడం
  • జననాంగాల పరిశుభ్రత
  • అంటు గల వారికి, వారి భాగస్వాములకు చికిత్స, అంటు తగ్గేంతవరకూ వారితో సంభోగంలో పాల్గొనకపోవడం
  • మధుమేహానికి చికిత్స
  • గర్భిణీలు ఎనిమిదిన్నర నెలల తర్వాత సంభోగంలో పాల్గొనకపోవడం

ఈ. గర్భిణీ – సుఖవ్యాధులు / జననేంద్రియ వ్యాధులు
ఈ అంటు జననేంద్రియ ద్వారంలో ఉండడం వలన శిశువు ఈ ద్వారం ద్వారా ప్రయాణించినప్పుడు అంటు సోకే అవకాశం ఉంది. దీని వల్ల ప్రమాద కరమైన పరిణామాలు అంటే శిశువుకు అంధత్వం లేదా మరణం లాంటివి కూడా సంభవించవచ్చు. ఈ అంటు రక్త ప్రసరణలో కలిసిపోయి గర్భస్థ శిశువుకు కూడా అంటు సోకే ప్రమాదం ఉంది. ఈ అంటును వీలున్నంత తొందరగా గుర్తించి భాగస్వాములిద్దరికీ చికిత్స చేయడం చాలా అవసరం.

హెచ్.ఐ.వి. / ఎయిడ్స్

హెచ్.ఐ.వి. పాజిటివ్ స్త్రీలు కూడా గర్భం ధరించడం శిశువుకు జన్మనివ్వడం జరిగే అవకాశం ఉంది. ఇటువంటి స్త్రీలకు అవసరమైన ఆదరణ అందించి బోధనా ఆసుపత్రులలో కాన్పు చేయించుకునేలా చూసే అవసరం ఉంది. బోధనా ఆసుపత్రులలో తల్లి నుండి బిడ్డకు యిన్ఫెక్షన్ రాకుండా నివారించే పద్ధతులు అమలులో ఉన్నాయి. హెచ్.ఐ.వి. అంటు కలవారిలో చాలా మందికి సుఖవ్యాధులు ఇతర అంటు రోగాలు ఉంటాయి.

మలేరియా

మలేరియా వ్యాధి దోమ కాటు వల్ల వస్తుంది. మలేరియా వ్యాధి గ్రస్తుని కుట్టడం వలన అంటు గ్రహించిన దోమ తిరిగి వేరొక ఆరోగ్య వంతుడైన వ్యక్తికి ఇది అందిస్తుంది. ఇతర ఎన్నో రకాల దోమలు ఫైలేరియాసిస్, డెంగూ జ్వరం, మెదడువాపు వ్యాధి (జపనీస్ ఎన్ సెఫలైటిస్) వంటి ప్రమాదరకమైన అంటులను కలుగచేస్తాయి. మెదడువాపు వ్యాధి దోమ / పందుల ద్వారా వ్యాపిస్తుంది. దోమలు, నిలువ నీటిలో పెరుగుతాయి. వీటికి పెద్ద జలాశయాలు అవసరం లేదు. ఒక కొబ్బరి చిప్పలో 10 రోజుల కంటే ఎక్కవ కాలం నిల్వ ఉన్న చారెడు నీటిలో ఒక గ్రామం మొత్తాన్ని బాధించగల దోమలు పెరుగుతాయి. దోమలు రాకుండా పైగొట్టానికి పెట్టే మెష్ లేని సెప్టిక్ టాంకులు, మురుగుకాలవలు, మూతలేని ఓవర్ హెడ్ టాంకులు కాలువలలో నిలువ నీరు మొదలైన వాటిలో కూడా దోమలు పెరుగుతాయి.

అ. లక్షణాలు

  • జ్వరం – వణుకుతో కూడిన / వణుకు లేని
  • తలనొప్పి
  • ఆగి ఆగి వచ్చే జ్వరం (చికిత్స తీసుకోకపోతే)

ఆ. నివారణ

  • నిలువ నీటిని పారబోయడం, నీటిని ప్రవహింపచేయడం, చెరువులు, సరస్సులలో చేపలు పెంచడం, నీటి ఉపరితలాన్ని వాడిన డీజిల్ ఆయిల్ ద్వారా కప్పడం వంటి చర్యల ద్వారా దోమలు పెరిగే స్థలాలను నివారించివచ్చు.
  • అన్ని గిన్నెలు / గ్లాసులను వాడని సమయంలో బోర్లించి పెట్టడం.
  • మరుగు దొడ్డి గొట్టాలకు దోమలు రాకుండా మెష్ పెట్టడం.
  • జ్వరం కేసులన్నింటికీ మలేరియా పరీక్ష చేయడం, స్లైడులను సేకరించడం.
  • నీరు పారే సదుపాయాలలో చెత్త వేయకుండా ఉండడం.
  • దోమ కాటు నుండి రక్షణ పొందడానికి దోమ తెరలు వాడడం.
  • పిల్లలకు నిండుగా బట్టలు వేయడం, నిద్రపోయేటప్పుడు దోమతెరలు వాడడం.
  • గర్భిణీ స్త్రీలందరికీ మలేరియా పరీక్ష జరపడం.

ఇ. పరీక్షలు

  • రక్త పరీక్ష ద్వారా మలేరియాను నిర్ధారించవచ్చు. అన్ని ఆసుపత్రులలో ఈ సౌకర్యం ఉంది.

ఈ. గర్భిణీ – మలేరియా

  • మలేరియా వల్ల గర్భస్రావం, నెలలు నిండకుండా ప్రసవం, రక్తహీనత కూడా కలగవచ్చు. మలేరియా వ్యాధికి చేసే చికిత్స వలన కూడా కొన్ని సమస్యలు రావచ్చు. కాబట్టి మలేరియా వ్యాధితో బాధపడుతున్న గర్భిణీ స్త్రీ డాక్టరును చికిత్స కోసం సంప్రదించాలి. అంతేకాదు. తాను గర్భిణీనన్న విషయం డాక్టరుకి తెలియచేయాలి.

గర్భిణీ సమయంలో ప్రమాదాలు – అత్యవసర పరిస్థితులు
1. రక్తస్రావం
5 నెలల గర్భిణీ తరువాత రక్తస్రావం ప్రమాదం. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. రక్తం ఎక్కించే సదుపాయం ఉన్న ఏరియా ఆసుపత్రి లేదా నర్సింగ్ హోములకు మాత్రమే తీసుకు వెళ్ళాలి. జననాంగం ముఖం ద్వారా వద్ద మాయ చేరడం వలన శిశువు తల లేదా యితర భాగాలు బయటకు రాకుండా అడ్డుకోవడం లేదా మాయ ముందుగా విడిపోవడం వలన ఈ రక్తస్రావం జరగవచ్చు.

అ. నివారణ

  • అత్యవసర రవాణా సదుపాయాన్ని వాడాలి
  • తీసుకువెళ్ళేటప్పుడు పేషంట్ ను పక్కకు పడుకోబెట్టాలి
  • పేషెంట్ కు రక్త దానం యివ్వగలిగే అవకాశం ఉన్న బంధువులు కొందరిని వెంట తీసుకు వెళ్ళాలి
  • రక్తం ఎక్కించే అవకాశం ఉన్న ఆసుపత్రికి మాత్రమే పేషెంట్ ను తీసుకు వెళ్ళాలి
  • అవసరమైన సదుపాయాలు తొందరగా చేయగలిగితే ప్రాణం నిలుస్తుంది

2. ఉమ్మ నీరు ముందుగానే పోవడం
కాన్పు జరగవలసిన తేదీ కంటే చాలా ముందుగానే ఉమ్మ నీరు బయటకు పోవడం జరుగుతుంది. వెంటనే కాన్పు జరగకపోతే అంటు కలుగుతుంది. ఇది తల్లి ప్రాణానికి ప్రమాదం. ఇటువంటి కేసులను ప్రసూతి వైద్యులు, ఆపరేషన్ సౌకర్యం కలిగిన ఆసుపత్రులకు మాత్రమే చేర్చవలసిన అవసరం ఉంది.

ఉమ్మనీరు--హెచ్చుతగ్గులు... హెచ్చరికలే

శిశువు ఎదుగుదలలో.. సౌకర్యాన్నందించడంలో కీలకం ఉమ్మనీరు. బిడ్డకు పలువిధాల మేలుచేసే ఈ ద్రవం కొన్నిసార్లు సహజంగా ఉండాల్సిన స్థాయికన్నా పెరుగుతుంది లేదా తగ్గుతుంది. సాధారణంగా అయితే.. గర్భం ధరించినప్పటి నుంచీ ఈ ఉమ్మనీటి శాతం పెరగాలి. రెండున్నర నెలలకు ఇది 30 ఎం.ఎల్‌.. ఆ తరవాత అంటే తొమ్మిదో నెలకు ఇది వెయ్యి ఎం.ఎల్‌వరకు చేరవచ్చు. గర్భస్థశిశువు ఇందులో కదలడమే కాదు అప్పుడప్పుడు స్వీకరించడం.. మళ్లీ మూత్రం ద్వారా వదిలేయడం కూడా బిడ్డ ఎదుగుదలలో భాగమే.

ఉమ్మనీరు చేసే మేలు..

బిడ్డ గర్భంలో సౌకర్యంగా ఉండేందుకు ఉమ్మనీరు ఎంతో మేలు చేస్తుంది. ఎముకలు, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. బిడ్డ చుట్టూ సమాన ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి.. వేడి తగ్గినప్పుడు ఉమ్మనీరు రక్షణ కవచంలా కూడా పనిచేస్తుంది. బయటి నుంచి శిశువుకు గాయాలు కాకుండా కాపాడే బాధ్యత కూడా ఉమ్మనీరుదే.

తగ్గినా, పెరిగినా ప్రమాదమే...

అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉమ్మనీరులో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఆ పరిస్థితులు ఎలా తలెత్తుతాయో చూద్దాం..

ఓలిగోహైడ్రామ్నియోస్‌:
ఉమ్మనీరు ఉండాల్సిందానికన్నా తక్కువగా ఉండటాన్నే ఇలా పరిగణిస్తారు. శిశువు స్వీకరించిన ఉమ్మనీటిని మూత్రం ద్వారా విసర్జించకపోవడం వల్ల ఈ స్థాయి బాగా తగ్గిపోతుంది. అలాగే శిశువులో మూత్రం తయారు కాకపోయినా, విసర్జించిన మూత్రం ఉమ్మనీరు ఉన్న సంచిలోకి చేరకపోయినా, మూత్రనాళం ఏర్పడకపోయినా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఉమ్మనీటికి కారణమైన పొరలు రాసుకుపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురవ్వవచ్చు. బిడ్డకు రక్తసరఫరా సరిగా అందకపోయినా, గర్భస్థ శిశువు మూత్రపిండాల పనితీరులో సమస్యలున్నా ఇలాంటి సమస్య తలెత్తవచ్చు. తల్లి వాడే కొన్నిరకాల నొప్పి నివారణ మాత్రలతో పాటు నెలలు నిండినా ప్రసవం కాకపోవడం.. (వైద్యులు చెప్పిన తేదీ దాటి రెండు వారాలు గడిచినా ప్రసవం కాకపోవడం..) వంటి కారణాల వల్ల కూడా ఉమ్మనీరు స్థాయి బాగా తగ్గిపోతుంది.

పాలీహైడ్రామ్నియోస్‌:
గర్భంలో బిడ్డ చుట్టూ ఉండాల్సిన దానికన్నా ఉమ్మనీరు అధికంగా ఉండటాన్ని పాలిహైడ్రామ్నియోస్‌గా పరిగణిస్తారు. గర్భస్థ శిశువు ఉమ్మనీటిని స్వీకరించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా.. అసలు స్వీకరించకపోయినా.. శిశువు ఉదర సంబంధ పేగు (గ్యాస్ట్రోఇంటస్త్టెనల్‌ ట్రాక్‌) మూసుకుపోవడం వల్లకూడా ఇలా జరుగుతుంది. సహజ ప్రక్రియలో శిశువు ఉమ్మనీటిని స్వీకరించడంలేదంటే.. అందుకు ఉదరం, మెదడు, నాడీవ్యవస్థకు సంబంధించిన సమస్యలతో పాటు.. మరికొన్ని కారణాలు ఉండొచ్చు. ఒక్కరు కాకుండా ఇద్దరు, ముగ్గురు శిశువులు ఉండటం, తల్లికి జెస్టేషినల్‌ డయాబిటీస్‌.. వంటి కారణాలు ఇందుకు దారితీస్తాయి. కొన్ని సందర్భాల్లో కారణాలు విశ్లేషణకు అందకపోవచ్చు.

ఉమ్మనీరులో హెచ్చుతగ్గులు, సమస్యలు: నెలలు నిండకుండానే నొప్పులు రావొచ్చు. ప్రసవానికి ముందుగానే మాయ (ప్లాసెంటా) వేరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రసవ సమయంలో బిడ్డ ఉండాల్సిన స్థితిలో కాకుండా అసాధారణ(మాల్‌ప్రెజెంటేషన్‌) స్థితిలో ఉండవచ్చు. ఒక్కోసారి అధిక రక్తస్రావం, బొడ్డుతాడు జారిపోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఫలితంగా సిజేరియన్‌ చేయాల్సిన అవకాశాలు ఎక్కువ.

ఇలా తెలుసుకోవచ్చు...

ఉమ్మనీరు పెరుగుతోందా.. తగ్గుతోందా అని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చక్కటి పరిష్కారం. అలాగే బిడ్డ ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. డాప్లర్‌ ఫ్లో స్టడీలతో బిడ్డకు రక్తసరఫరా తీరుతెన్నులు పరీక్షించడం తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో అధికంగా ఉన్న ఉమ్మనీటిని తగ్గించడానికి తల్లికి మందులు కూడా సిఫారసు చేస్తారు. కాస్త అవగాహన, ముందుచూపుతో వ్యవహరిస్తే పండంటి పాపాయిని ఆహ్వానించవచ్చు.

3. నెలలు నిండక ముందే ప్రసవం
చాలా ముందుగానే అంటే 4 నుండి 6 వారాల ముందు అంటే ఎనిమిదవ నెలలో ప్రసవం జరిగితే శిశువు సరిగా పెరగకపోవడమే కాక ఆరోగ్య రీత్యా ప్రమాదం కూడా. శిశువుకు అత్యవసరంగా శ్వాసనందించడం, ఇంక్యుబేటర్ సౌకర్యం అవసరం. ఈ సౌకర్యాలు ఉన్న ఆసుపత్రికి శిశువును తరలించడం సహాయపడుతుంది.

4. నెలలు నిండినా కాన్పు రాకపోవడం
ఒక్కోసారి నెలలు పూర్తిగా నిండినా కూడా కాన్పు జరగకపోవచ్చు. ఇటువంటప్పుడు కూడా గర్భస్థ శిశువుకు ప్రమాదం. ఈ కేసులలో అత్యవసరంగా కాన్పు జరపాలి. ఇటువంటి కేసులను కూడా ఆసుపత్రులకు తరలించాలి.

5. గర్భస్థ శిశు మరణం
దురదృష్ట వశాత్తు గర్భస్థ శిశువు మరణించినట్లయితే కాన్పు వెంటనే జరగకపోవచ్చు. అంటు రావడం రక్తం గడ్డకట్టడంలో లోపం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు కూడా ఆసుపత్రి సదుపాయము అవసరం.

గర్భిణీ సమయంలో జాగ్రత్తలు – వ్యాధి నిరోధక టీకాలు –
టెటనన్ (ధనుర్వాత టీకా)
ధనుర్వాతం రాకుండా గర్భిణీ స్త్రీకి టీకాలు యివ్వాలి. ఇది తల్లికి మాత్రమే కాక గర్భస్థ శిశువుకి కూడా రక్షణ కల్పిస్తుంది. ధనుర్వాతాన్ని కలిగించే సూక్ష్మ క్రిములు గుర్రం, పశువుల పేడలో సాధారణంగా ఉంటాయి. ఈ పేడ వల్ల కలుషితమైన ఏ వస్తువైనా వ్యక్తులకు పిల్లలకు తగిలినప్పుడు అంటు సోకే అవకాశం ఉంది. ముఖ్యంగా దెబ్బలు తగిలి చీరుకుపోయినప్పుడు, పుళ్ళు, కోసిన బొడ్డు వంటి గాయాలకు ఈ అంటు సోకే ప్రమాదం ఉంది. ధనుర్వాతం చాలా ప్రమాదకరమైన వ్యాధి. చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. పేడతో కలుషితమైన కొడవళ్ళను బొడ్డు తాడు కోయడానికి ఉపయోగించే అలవాటు వల్ల పూర్వం కాన్పు సమయంలో ఎంతో మంది పిల్లలు చనిపోయేవారు. ప్రస్తుతం కాన్పు సమయంలో 5 శుభ్రతలు పాటించడం వల్ల మరణాలు చాలా వరకు తగ్గిపోయాయి. ధనుర్వాతం చికిత్స ఖర్చుతో కూడినది. ఏరియా మరియు జిల్లా స్థాయి ఆసుపత్రులలో మాత్రమే లభ్యమవుతుంది.

నివారణ
టీకాలు యివ్వడం ద్వారా ధనుర్వాతాన్ని నివారించవచ్చు. గర్భిణీ నమోదు చేసిన రోజు ఒక డోసు టి.టి. యింజెక్షన్ యివ్వాలి. ఒక నెల తరువాత రెండవ డోసు ఇవ్వాలి. కాన్పుకు ఒక నెల ముందే రెండు డోసులు యివ్వడం పూర్తవ్వాలి. ఒక వేళ గర్భిణీ అంతకు ముందే టి.టి. యింజెక్షన్ తీసుకుని ఉన్నట్లయితే ఒక డోసు యిస్తే చాలు. పిల్లలకు యిచ్చే డి.పి.టి. టీకాలలో ధనుర్వాత టీకా కూడా ఉంది. మొత్తం మూడు డోసులు, బూస్టర్ డోసు తీసుకున్నట్లయితే పిల్లలకు ధనుర్వాతం రాకుండా నివారించవచ్చు. ఏవైనా గాయాలు తగిలినప్పుడు కూడా అదనపు టి.టి. యింజక్షన్ యివ్వడం అవసరం.

అంటు నివారణ
రోగ క్రిములు అంటును కలుగజేస్తాయి. రోగ క్రిములు అతి చిన్న జీవులు. వీటిని మామూలు కంటితో చూడలేము. అవి విసర్జన పదార్థాలలో అంటే మలము, కళ్ళె, వీర్యము, చీము, రక్తము వంటి స్రావాలలో ఉంటాయి. సూక్ష్మ క్రిముల ద్వారా కలుషితమైన నీరు, ఆహారం వంటివి సేవించడం వలన ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తాయి. అంటు కల వ్యక్తులతో సంభోగంలో పాల్గొనడం వలన, సుక్ష్మక్రిములు గల గాలిని పీల్చడం వలన కూడా యివి ఒకరి నుండి మరొకరికి చేరతాయి. ఈ రకమైన వ్యాప్తికి చేతులు, ఈగలు, కీటకాలు, దోమలు, కళ్ళె వంటివి వాహకాలు.
సమతుల ఆహారం, సురక్షితమైన నీరు, ఆరోగ్యకరమైన అలవాట్లు, పరిశుభ్రమైన వాతావరణం అంటును నివారించడానికి అతి ముఖ్యం.

1. పరిశుభ్రత
అ. నీరు
నీళ్ళ విరేచనాలు, నులి పురుగులు పెరగడం, టైఫాయిడ్, కామెర్లు, పోలియో వంటి వ్యాధులు రావడానికి కలుషితమైన నీరు మూల కారణం. చెరువులలో జంతువులను కడగడం, బట్టలు ఉతకడం, తాగే నీటి సరస్సుల వద్ద మల విసర్జన చేయడం వంటి చర్యల ద్వారా నీరు కలుషితమవుతుంది. నీటిని సేకరించడం, నిలువ చేయడం, సరఫరా చేయడంలోనూ కలుషితమయ్యే అవకాశం ఉంది. నైట్రేట్, అధిక శాతం ఫ్లోరిన్ (రసాయనాలు ఎక్కువగా ఉండడం) వలన కూడా నీరు కలుషితమవుతుంది.

నీటి కాలుష్య నివారణ

  • గుడ్డతో నీటిని వడబోయాలి
  • క్లోరినేటెడ్ నీటినే ఎప్పుడూ వాడాలి
  • నీటిని మరిగించాలి
  • పెంపుడు జంతువులు, పిల్లలకు నీటిని అందనంత ఎత్తులో ఉంచాలి
  • నీటి తెడ్డు లేదా పంపు ద్వారా మాత్రమే కుండ నుంచి నీరు తీసుకోవాలి. చేతులు, గ్లాసులు ముంచరాదు.

ఆ. ఆహారం
ఆహారాన్ని సరిగా ఉడికించకపోయినా, తినడానికి ముందు ఎక్కువ కాలం నిలువ చేసినా సూక్ష్మక్రిముల వల్ల ఆహారం కలుషితమవుతుంది. కులుషితమైన ఆహారం / పాలు, వల్ల నీళ్ళ విరేచనాలు, నులి పురుగులు, టైఫాయిడ్, కామెర్లు వంటి వ్యాధులు వస్తాయి. కాచని పాలలో జంతువులలోని క్షయ క్రిములు ఉండే అవకాశం ఉంటుంది.

నివారణ

  • కూరగాయలను వండే ముందర కడగాలి
  • సరిగా ఉడికించాలి
  • మూత ఉన్న గిన్నెలలోనే ఆహారాన్ని ఉంచాలి
  • గరిట / చెంచాతోనే వడ్డించాలి
  • ఆహారం తినే ముందు, పిల్లకు తినిపించే ముందు చేతులు కడుగుకోవాలి
  • తినడానికి కడిగిన చెంచాలను ఉపయోగించాలి
  • ఆహారం వెచ్చగా ఉండగానే తినాలి, కాచిన పాలనే త్రాగాలి

2. అలవాట్లు
అ. ఆరుబయట మల విసర్జన
ఆరుబయట మల విసర్జన చేస్తే ఈగలు, యితర కీటకాలు మలంపై వాలి రోగక్రిములను ఆహార పదార్థాలకు చేరవేస్తాయి. దీని వలన వ్యాధులు ప్రబలుతాయి. ఆరు బయట మల విసర్జన, చిన్న పిల్లల మలాన్ని చుట్టుపక్కల పారవేయడం ప్రమాదాలను కొని తెస్తాయి. కారణం ఈగలు, యితర కీటకాలు వాటిపై వాలి వ్యాధి క్రిములను తిరిగి ఆహార పదార్థాలకు చేరుస్తాయి.

సురక్షిత అలవాట్లు

  • మల విసర్జనకు మరుగుదొడ్లను వాడాలి
  • పాఠశాలలు, రోడ్డు వంటి ప్రదేశాలలో మల విసర్జన చేయరాదు
  • మల విసర్జన తరువాత మలంపై మట్టి పోసి కప్పాలి
  • ఆరుబయట నడిచేటప్పుడు చెప్పులు ధరించాలి
  • బయట నుంచి వచ్చాక చెప్పులతో యింటిలో నడవరాదు
  • చిన్న పిల్లల మలాన్ని ఒక గుంటలో పారవేసి కప్పివేయాలి

ఆ. చేతులు కడుగుకునే అలవాట్లు

  • చేతులను సబ్బుతో లేదా బూడిదతో రుద్దుకొని కడుగుకోవాలి – ఈ క్రింది సమయాలలో ఇది తప్పక చేయాలి
  • చేతి వ్రేళ్ళతో పళ్ళు తోముకునే ముందర
  • ఆహారం తినేముందు
  • పిల్లలకి ఆహరం తినిపించేముందు
  • మలవిసర్జన తర్వాత
  • పిల్లలు మలవిసర్జన తరువాత కడిగిన చేతులను శుభ్రంగా కడుగుకోవాలి
  • పిల్లల మలము, జంతువుల పేడను తాకిన తరువాత

చేతులు కడుగు కోవడంలో పాటించాల్సిన ఆరు అంశాలు

  • అరచేతులను వేళ్ళతో రుద్ది కడగాలి
  • చేతుల వెనుక భాగాలను కడగాలి
  • వేళ్ళను వేలి కణువులను
  • బొటన వేళ్ళను
  • వేలి కొసలను
  • చేతుల వెనుక భాగాన్ని రుద్ది కడగాలి

ఇ. ఆరుబయట ఉమ్మివేయడం
ఆరుబయట ఉమ్మి వేయడం వలన రోగ క్రిములు ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తాయి. పిల్లలు యితరులు ఆడే చోట, నడిచే ప్రదేశాలలో ఉమ్మి వేయరాదు.

ఈ. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు నోటికి బట్టకాని, చేతులు కాని అడ్డు పెట్టుకోవడం ఎవరైనా తుమ్మేటప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ వారి నుండి రోగ క్రిములు 50 నుండి 100 అడుగుల దూరం వరకు వాతావరణంలోకి చిమ్మబడతాయి. ఇతరులు ఈ రోగక్రిములను పీల్చడం వలన వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఈ సమయాలలో ఎల్లప్పుడూ నోటిని బట్టతో కానీ, చేతి రుమాలుతో కానీ, కనీసం చేతితో కానీ కప్పుకోవాలి.

ఉ. బహిష్టు పరిశుభ్రత
బహిష్టు సమయంలో శుభ్రమైన బట్టలనే వాడాలి. తరువాత దానిని సబ్బుతో శుభ్రంగా ఉతికి తిరిగి వాడాలి. ప్రసవం తర్వాత రక్తస్రావం ఆగే వరకు ఇలాంటి శుభ్రమైన గుడ్డలనే వాడాలి.

ఊ. దంతాల పరిశుభ్రత
దంతాలకు వచ్చినా శరీరంలోని యితర భాగాలకు కూడా పాకే అవకాశం ఉంది. పళ్ళను ఎప్పుడూ టూత్ పేష్టు లేదా పౌడర్ వంటి వాటితోనే శుభ్రం చేయాలి. చేతివేలితో కడుగుకునే అలవాటు గలవారు ముందుగా చేతులు కడుగుకోవాలి.

ఎ. జుట్టు పరిశుభ్రత
శరీరంలోని అన్ని భాగాలలో జుట్టు విషయంలో పరిశుభ్రత పాటించాలి. ప్రసవానికి ముందు యోని ప్రాంతంలో గల వెంట్రుకలను తీసి వేయడం మంచిది.

ఏ. గోళ్ళు
చేతి వేళ్ళ అంచులకు గోళ్ళకు మధ్యగల ప్రదేశంలో మురికి, రోగ క్రిములు చేరే అవకాశం ఉంది. గోళ్ళు కత్తిరించే సాధనంతో పెరిగిన గోళ్ళను కత్తిరించాలి. పిల్లలకు కూడా గోళ్ళు వెరిగిన వెంటనే వాటిని కత్తిరించాలి. గోళ్ళను కొరకరాదు.

3. ఇంటి చుట్టుపక్కల వాతావరణం
అ. దోమల బెడద
దోమల వల్ల మలేరియా, ఫైలేరియా, డెంగు వంటి ప్రమాదకరమైన జబ్బులు రావడమే కాక బెడద కూడా ఉంది. దోమలు నిద్ర పోనివ్వవు. అలర్జీ కలిగిస్తాయి. నిలువ నీటిని పారబోయడం ద్వారా, నీటిని ప్రవహించనీయడం, చెరువులు, సరస్సులలో చేపలు పెంచడం, వాడని నీటి ఉపరితలాన్ని వాడిన డీజల్ ఆయిల్ తో కప్పడం వంటి చర్యల ద్వారా దోమలు పెరిగే అవకాశం ఉన్న అన్ని ప్రదేశాలను నిర్మూలించాలి.

ఆ. ఊర కుక్కలు
కుక్క కాటు వల్ల గాయాలు, రక్తస్రావం జరగడం మాత్రమే కాదు, కొన్ని సార్లు అనేక ప్రమాదకరమైన నయం కాని వ్యాధి కూడా కలుగుతుంది. కొన్ని రాబిస్ కుక్కలు రాబిస్ వైరస్ ను స్రవిస్తాయి. కుక్క కరిచినప్పుడు యిది వాటి లాలాజలం ద్వారా మనిషి శరీరంలోకి వ్యాపిస్తుంది. ఈ జబ్బు నయం కాదు. రోగి మరణిస్తాడు. కరిచిన కుక్క కూడా చనిపోతుంది. రక్షణ లేని, తోడు లేని పిల్లలను కూడా కుక్కలు కరచి గాయాలు చేస్తాయి.

సురక్షిత పద్ధతులు

  • పెంపుడు కుక్కలతో సహా అన్ని కుక్కలకు రాబిస్ వ్యాక్సిన్ యిప్పించాలి
  • కుక్కలు ఉన్న చోట చిన్న పిల్లలను తోడు లేకుండా, రక్షణ లేకుండా వదలి వేయరాదు
  • కుక్క కరచిన వెంటనే వ్యాక్సిన్ యిప్పించాలి

ఇ. పొగ
పొగ ఏ రకమైనదైనా (పుగాకు లేదా వంట గది) తల్లీ బిడ్డలకు ప్రమాదం. ఎక్కువగా పొగ పీల్చే స్త్రీలకు రక్తహీనత కలగడమేకాక బరువు తక్కువ పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంది.

సురక్షిత పద్ధతులు

  • వంటిల్లు వేరుగా ఉంచడం మంచిది
  • పొగ రాని పొయ్యిలను వాడాలి
  • వంటకు గ్యాస్ లేదా కిరోసిన్ వంటివి వాడాలి
  • పొగ నిండిన గదులలో పిల్లలను మసలనీయవద్దు
  • గర్భవతిగా ఉన్నప్పుడు పొగత్రాగరాదు
  • పిల్లలను పొగ త్రాగే వారికి దూరంగా ఉంచండి

గర్భధారణ

గర్భధారణ జరిగి చివరన శిశువు పుట్టడాన్ని గర్భిణీ దశ అంటారు (స్త్రీ పురుషుల మధ్య లైంగిక చర్య అనంతరం పురుషుని వీర్యకణం స్త్రీ యొక్క అండంతో కలిసి ఫలదీకరణ చెంది గర్భధారణ జరుగుతుంది. శిశువు స్త్రీ యొక్క గర్భాశయంలో పెరుగుతుంది. (ఇంగ్లీషు కాలెండరు ప్రకారం) గర్భధారణ కాలం సాధారణంగా 280 రోజులు లేదా 40 వారాలు లేక 9 నెలల 7 రోజులు, తెలుగు కాలెండర్ ప్రకారం 10 నెలలు.

గర్భధారణను నిర్ధారించడం

ఈ దిగువన తెలిపిన పరీక్షల ద్వారా గర్భధారణను నిర్ధారించవచ్చును

  1. నెలసరి / ముట్టు తప్పిన 10 రోజుల తర్వాత మూత్ర పరీక్ష చేయుట
  2. నెలసరి / ముట్టు తప్పిన 15 రోజుల తర్వాత పొట్ట భాగాన్ని అల్ట్రాసోనోగ్రఫీ పరీక్ష ద్వారా గర్భధారణను తెలుసుకుని నిర్ధారించవచ్చును.
  3. నెలసరి / ముట్టు తప్పిన 6 నుండి 10 వారాల తర్వాత డాక్టరు చేసే అంతర్గత శరీర పరీక్ష ద్వారా కూడా గర్భధారణను నిర్ధారించవచ్చు.
వాంఛిత - అవాంఛిత గర్భం

గర్భధారణ అన్ని సందర్భాలలోనూ వాంఛితం కాకపోవచ్చును. అవాంఛిత గర్భాన్ని కొనసాగించడం స్త్రీలకు శారీరక, మానసిక ఆందోళనను కలిగిస్తుంది. అవాంఛిత గర్భం ఏ కారణంగానైనా రావచ్చు. యాధృచ్చికం లేదా బలవంతంగా జరగవచ్చు. ఈ కారణాల వల్ల గర్భం వచ్చినప్పుడు స్ర్తీలకు అనుభవజ్ఞులైన డాక్టర్ల సలహా సంప్రదింపులు అవసరం. వైద్య రీత్యా గర్భస్రావం యిప్పుడు చట్టబద్దం. అయితే గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ ఆధారంగా గర్భస్రావం అనైతికం. వైద్యరీత్యా గర్భస్రావం రెండు నెలల లోపు అయితే సులభం, సురక్షితం, ఖర్చుతక్కువ, ఏరియా, మరియు జిల్లా ఆసుపత్రులు, ప్రైవేటు నర్సింగ్ హోములలో ఈ సదుపాయం ఉంది. ఆరోగ్య కేంద్రంలో వివరాలు తెలుసుకోండి.

కాన్పు జరిగే తేదీని నిర్ధారించుట

ఒక గర్భవతికి కాన్పు ఏ తేదీ జరిగేది అన్నది లెక్క వేయడానికి ఆమె చివరి ఋతుస్రావం మొదటి రోజు ఎప్పుడో తెలుసుకోవాలి. గ్రామాలలో నివసించే చాలా మందికి ఇంగ్లీషు కాలెండర్ తేదీల గురించి అంతగా అవగాహన ఉండదు. వాళ్ళు సాధారణంగా పౌర్ణమి, అమవాస్యల ఆధారంగా రోజులు లెక్క పెడ్తారు, కాబట్టి తెలుగు కాలెండర్ ను దగ్గర ఉంచుకోవడం ఉపయోగంగా ఉంటుంది. వీలయినంత తొందరగా గర్భిణీ గా నమోదు చేయించడం, కాన్పు జరిగే రోజును నిర్ధారించడంలోఉపయోగపడుటమేకాక గర్భిణీ స్ర్తీకి అవసరమైన సూచనలు, సలహాలు, సేవలు అందించడానికి కూడా ఉపయోగపడుతుంది.
చివరి ఋతుస్రావపు మొదటి రోజుకు ఏడు రోజులు కలిపి దానికి 9 నెలలు కలిపితే కాన్పు జరిగే తేదీని తెలుసుకోవచ్చును. క్రమంగా రాని పీరియడ్స్, ఒక బిడ్డ పుట్టిన వెంటనే గర్భం రావడం మొదలయిన సందర్బాలు చివరి ఋతుస్రావపు మొదటి రోజును, కాన్పు జరిగే తేదీని నిర్ధారించడాన్ని కష్టతరం చేస్తాయి. అటువంటప్పుడు ఏరియా హాస్పిటల్ లోని కాన్పుల గురించిన విషయాలలో అనుభవజ్ఞులైన డాక్టర్లను సంప్రదించి తెలుసుకోవాలి.

వేవిళ్ళు

ప్రధమ గర్భిణీ సమయంలో ఇది సాధారణం. ఇదేమీ జబ్బుకాదు. దీని వల్ల ప్రమాదం ఏమీ లేదు. టీ లేదా కాఫీ తీసుకునే ముందు ఇష్టమైన పదార్థం ఏదైనా తినమని గర్భిణీ స్త్రీలకు సూచించాలి. ఏదైనా తిన్నాక 15 నిముషాల తర్వాత టీ, కాఫీలు త్రాగవచ్చును. ఆహారం కొద్ది మొత్తంలో ఎక్కువ సార్లు తీసుకోవాలి (రోజుకు 4 నుండి 6 సార్లు). తిన్న వెంటనే పడుకోవడం చేయరాదు. 15 నిమిషాల వరకు ఆగాలి. గుండెలో మంటగా అన్పిస్తే మెల్లిగా కొంచెం పాలు త్రాగాలి. మసాలా ఆహారం తీసుకోకపోవడం మంచిది. తాగినవి ఏవీ ఇమడకపోయినా, ఎక్కవ సార్లు వాంతులు అయినా, మూత్రం పరిమాణం తక్కువైనా, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, ఏరియా ఆసుపత్రిలోని డాక్టరుని సంప్రదించాలి.

ఏ మందులు తీసుకోరాదు

నకిలీ వైద్యుల సలహా మేరకు ఏవైనా మందులు తీసుకున్నట్లయితే గర్భస్రావం, లేదా గర్భస్థ శిశువుకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కొన్ని మందులు శిశువులకు హానికరం. అందువల్ల అర్హుడైన డాక్టరుని సంప్రదించి ఏ మందులు సురక్షితమో తెలుసుకోవడం చాలా అవసరం. గర్భిణీగా ఉన్న మొదటి మూడు నెలలలో ఏ మందూ తీసుకోరాదు. ఈ దశలో గర్భిణీ స్త్రీ ఏ సమస్య వచ్చినా కేవలం అర్హుడైన డాక్టరును మాత్రమే సంప్రదించాలి. ఏ కారణంచేతనైనా డాక్టర్లు ఎక్స్ రే తీయించమన్నప్పుడు గర్భిణీ స్త్రీలు డాక్టరుకు తాము గర్భిణీతో ఉన్నామన్న విషయం తెలియచేయాలి. గర్భిణీగా ఉన్నప్పుడు మొదటి మూడు నెలలలో ఎక్కువ ఎక్స్ రేలు తీయడం గర్భస్థ శిశువుకు హానికలిగించవచ్చు.

స్నానం

గర్భిణీ స్త్రీ రోజూ సబ్బుతో స్నానం చేయాలి. మర్మావయవాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

విశ్రాంతి

గర్భిణీ స్ర్తీ రాత్రిపూట 8 గంటలు, పగలు 2 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. దీనివల్ల గర్భస్థ శిశువుకు రక్త ప్రసరణ మెరుగవుతుంది. వీలున్నంతవరకూ పక్కకు తిరిగి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల గర్భిణీ స్త్రీ కాళ్శకు శిశువుకూ రక్తప్రసరణ బాగా జరుగుతుంది.

పని

రోజూ చేసే ఇంటి పని చేసుకోవచ్చు. ఎక్కువ బరువు ఎత్తడం, ఎక్కువ వంగడం వంటి అధిక శ్రమ కలిగించే పనులు చేయరాదు.

ప్రయాణం

మొదటి మూడు నెలలు, ఏడు నెలల తర్వాత ఎక్కువ దూరం శ్రమ కలిగించే ప్రయాణాలు మానడం మంచిది.

లైంగిక సంపర్కం

36 వారాల గర్భిణీ తర్వాత లైంగిక సంపర్కం మానడం మంచిది.

భోజనం-పోషకాలు

ఎక్కువసార్లు తినాలి (ప్రతి రోజు 4 నుండి 6 సార్లు) మామూలుగా తీసుకునే ఆహారంతో పాటు, గ్లాసు పాలు, ఒక గ్రుడ్డు, ఒక అరటిపండు లేదా ఆయా కాలాలలో లభించే పళ్ళు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల సుఖ ప్రసవం జరిగేందుకు అవసరమైన శక్తి ఆమెకు లభించడమే కాక శిశువు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. బెల్లం, పెరుగు, ఆకు కూరలు, చేప లేదా మాంసం వంటివి తరచూ తినాలి. పొగాకు లేకుండా తాంబూలం కూడా తీసుకోవచ్చు.

పొగ

గర్భిణీ సమయంలో పొగ త్రాగరాదు. పొగ త్రాగేవారికి దగ్గరగా ఉండడం కూడా చేయరాదు. పొగ నిండి ఉన్న గదులలో కూడా ఉండరాదు. పొగ శిశువు పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. పొగ సోకిన తల్లికి పిల్లలు తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉంది.

మల బద్ధకం

మలబద్ధకాన్ని నివారించడానికి గర్భిణీ స్త్రీ ప్రతి రోజు 2 సీసాల (2 లీటర్ల) నీళ్ళు తాగాలి. పళ్ళు, కూరగాయలు రోజు తినాలి.

శిశువు కదలికలు

16 నుండి 20 వారాల మధ్య గర్భంలో శిశువు కదలికలు తెలుస్తాయి. ఇవి సీతాకోక చిలుక రెపరెపలవలె ఉంటాయి. ఏ రోజు నుంచీ ఈ కదలికలు మొదలయ్యాయో గుర్తుంచుకోవడం కాన్పు జరిగే రోజును నిర్ధారించడంలో సహాయపడుతుంది. 8 నెలల తర్వాత కూడా ఈ కదలికలు జరగకపోతే ఈ విషయాన్ని డాక్టరు దృష్టికి తేవాలి. సాధారణంగా ఈ కదలికలు గంటకు ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి. ఈ కదలికలు లేకపోవడం గర్భస్థ శిశువు అనారోగ్యాన్ని సూచిస్తుంది.

గర్భస్రావాలు

ఒకసారి గర్భస్రావం జరిగిన స్త్రీలు తరువాత గర్భంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మొదటి మూడు నెలల్లో గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది స్త్రీలలో అంతర్గత అవయవాల లోపం వల్ల 5 నుండి 7 నెలల సమయంలో శిశువు చనిపోయే అవకాశం ఉంది. గర్భిణీ మొదటి దశలో జరిగే గర్భస్రావాలలో చాలా వరకు పిండం సరిగా ఏర్పడక పోవడం వల్ల జరిగేవే. ఇలాంటప్పుడు నొప్పితో కూడిన లేదా నొప్పి లేని రక్త స్రావం జరగవచ్చు. రక్తస్రావం కన్పించినప్పుడు గర్భిణీ స్త్రీ వెంటనే విశ్రాంతి తీసుకోవాలి. అప్పటికీ రక్తస్రావం తగ్గనట్లయితే వీలున్నంత తొందరగా డాక్టరును సంప్రదించాలి. గర్భిణీ స్త్రీ ఏ దశలోనైనా సరే రక్త స్రావం కానీ నొప్పి కానీ ఎక్కువగా ఉన్నట్లయితే సురక్షితంగా గర్భస్రావం జరిగే అవకాశం, డాక్టరు ఉన్న దగ్గరలోని ఏరియా ఆసుపత్రి లేదా ప్రసూతి వైద్యశాలకు వెళ్ళాలి.

గర్భిణీ స్త్రీ ఎత్తు

గర్భిణీ నమోదు చేసే సమయంలో స్త్రీ యొక్క ఎత్తును రికార్డు చేయడం చాలా ముఖ్యం. ఒకసారి రికార్డు చేస్తే చాలు. తరువాత వచ్చే గర్భిణీలో మళ్ళీ చూడనవసరం లేదు. 145 సెం.మీ. కంటే తక్కువ ఎత్తు గలిగిన స్త్రీలకు కాన్పు కష్టమయ్యే అవకాశం ఉంది. అంతేకాదు. శిశువుకు కూడా ప్రమాదం. నమోదు చేసినప్పుడు ఈ స్త్రీలకు తప్పనిసరిగా ఆసుపత్రిలోనే పురుడు పోసుకోవాలని చెప్పాలి. అవసరమైతే అపరేషన్ చేసే అవకాశం ఉన్న ఆసుపత్రిలోనే పురిటికి ఏర్పాట్లు చేసుకోమని చెప్పాలి. ఆపరేషన్ ఖర్చుల కోసం తగినంత డబ్బు సమకూర్చుకుని ముందుగానే ఆసుపత్రిని ఎంచుకుని ఉండాలి. చివరి మూడు నెలలలో వీలున్నన్ని సార్లు గర్భిణీ పరీక్షలు చేయించుకోవాలి. కాన్పు కోసం కొంచెం ముందుగానే ఆసుపత్రిలో చేరడం మంచిది. లేదా నొప్పులు ప్రారంభం కాగానే చేరాలి. గర్భిణీ స్త్రీ ఎత్తు కొలిచేటప్పుడు ఆమె చెప్పులు వేసుకోరాదు. నిటారుగా, కాళ్ళు తల వెనుకభాగం గోడకు కానీ స్కేలుకు కానీ ఆనించి నిలబడాలి. ఎత్తు సెంటీమీటర్లలో కొలవడం మంచిది.

గర్భిణీ బరువు

మొదటి మూడు నెలల గర్భిణీ 38 కిలోల బరువు కంటే తక్కువ ఉంటే కాన్పు కష్టం అయ్యే అవకాశం మాత్రమే కాక శిశువుకు కూడా ప్రమాదం. అందువల్ల గర్భిణీ గా నమోదు చేసేటప్పుడు వీరికి కేవలం ఆసుపత్రిలో మాత్రమే కాన్పు చేయించుకోవాలని సలహా ఇవ్వాలి. పైన వివరించిన విధంగా వాళ్ళు ఆసుపత్రిలో ప్రసవానికి ఏర్పాట్లు చేసుకోవాలి. ఆపరేషన్ చేసే అవకాశం ఉన్న ఆసుపత్రిలోనే కాన్పుకు ఏర్పాట్లు చేసుకోవాలి. ఆపరేషన్ ఖర్చుకోసం తగినంత డబ్బు సమకూర్చుకుని ముందుగానే ఆసుపత్రిని ఎంపిక చేసుకోవాలి. చివరి మూడు నెలల్లో వీలున్నన్ని సార్లు గర్భిణీ పరీక్షలు చేయించుకోవాలి. కాన్పు కోసం కొంచెం ముందుగానే ఆసుపత్రిలో చేరడం మంచిది, లేదా నొప్పులు ప్రారంభం కాగానే చేరాలి. ప్రతి నెల గర్భిణీ స్త్రీ యొక్క బరువు చూసి రికార్డు చేయాలి. ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. (1) గర్భిణీ యొక్క ఆరోగ్యం గురించి తెలుసుకోవడం, (2) శిశువు యొక్క పెరుగుదల తెలుసుకోవడం. మొదటి మూడు నెలల సమయంలో బరువు పెరుగుదల ఎక్కువగా ఉండకపోవచ్చు. అయితే మొదటి మూడు నెలలలో గర్భిణీ స్త్రీ బరువులో విపరీతమైన పెరుగుదల (నెలకు 2 కిలోలకు మించి) ఉంటే ప్రసూతి వైద్యులను సంప్రదించాలి. అంతేకాక గర్భిణీ ఏదశలోనైనా సరే బరువులో తగ్గుదల కనిపిస్తే ప్రసూతి వైద్యులను సంప్రదించాలి.
గర్భిణీ దశ మొత్తం 9 నెలల కాలంలో పెరగవలసిన బరువు 10 కిలోలు. నెలకు 2 కిలోలు లేదా వారానికి 0.5 కిలో బరువు పెరగాలి. ఒక గర్భిణీ స్త్రీలో బరువు పెరగడం లేదని గమనిస్తే ఆ స్త్రీని ఎక్కువ ఆహారం తీసుకోమని చెప్పాలి. బరువు తగ్గిపోతున్నట్లయితే ఏరియా ఆసుపత్రికి గాని నర్సింగ్ హోములకు గానీ తీసుకు వెళ్ళాలి.
బరువు చూసే ముందు స్కేలును 0 వద్ద సరిచేయాలి. పారలాక్స్ దోషాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. సూచికకు ఎదురుగా నిటారుగా, సరిగా నిలబడాలి. బరువు తూచే ముందు గర్భిణీ స్త్రీని చెప్పులు, ఇతర బరువైన సామాగ్రిని తీసివేయమని చెప్పాలి. బరువు తూచేటప్పుడు ఆమె ధరించిన దుస్తులు తప్ప ఏవీ ఉండరాదు. బరువు తూచేటప్పుడు గర్భిణీ స్త్రీ నిటారుగా నిలబడాలి. వంగడం, ఏదైనా ఆధారాన్ని పట్టుకోవడం దేనిమీదైనావంగడం వంటివి చేయరాదు.

గర్భిణీ సమయానికి వయస్సు (అతి చిన్న వయస్సు లేదా పెద్ద వయస్సులో గర్భం)

16 సంవత్సరాల వయస్సు లోపు గర్భం ధరిస్తే ప్రమాదం అధికంగా ఉంటుంది. ఈ దశలో తల్లి ఇంకా పెరిగే దశలోనే ఉండి శారీరకంగా పూర్తి పరిపక్వతతో ఉండదు. తల్లికీ గర్భస్థ శిశువుకూ కూడా పోషకాల ఆవశ్యకత ఎక్కువగా ఉండి ఇద్దరూ పోషకాహార లోపంతో ఒకరితో ఒకరు పోటీపడుతుంటారు. ఇటువంటి తల్లులకు సాధారణంగా బరువు తక్కువ పిల్లలు పుడతారు. ప్రసవ ద్వారం పూర్తిగా అభివృద్ధి చెంది ఉండక పోవడం వలన కాన్పు కష్టమవుతుంది. అలాగే 35 సంవత్సరాలకు పైబడ్డ స్త్రీలలో మొదటి సారి గర్భధారణ జరిగితే ప్రమాదమయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. పిల్లలు కూడా అసాధారణ లక్షణాలతో పుట్టవచ్చు.
పిల్లలను కనడానికి స్త్రీకి సరైన వయస్సు 20 నుండి 30 సంవత్సరాలు. ఈ వయసుకి వారు శారీరకంగా మానసికంగా పరిపక్వత చెంది. పిల్లల ఆలనా పాలనా చూసుకోగలిగి, ఆర్థికంగా స్థిరపడి ఉంటారు.

ఎడం లేకుండా మళ్ళీ గర్భం

ప్రతి గర్భం తర్వాత కొంత వ్యవధి ఉండాలి. ఒక బిడ్డ పుట్టిన వెంటనే మళ్ళీ గర్భం దాల్చడం తల్లి మీద ఎంతో వత్తిడిని తెస్తుంది. పిల్లలకు పోషకాహారం, సంరక్షణ విషయంలో కొరత ఏర్పడుతుంది. తల్లికి కూడా సరిపడా తీరిక, విశ్రాంతి ఉండదు. కాన్పుల మధ్య కనీసం మూడేళ్ళయినా విరామం అవసరం.
బిడ్డ పుట్టిన వెంటనే ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ గురించిన సలహాలు తీసుకొమ్మని గర్భిణీ స్త్రీలకు చెప్పండి.

అంతకు ముందు కాన్పులు కష్టమైన వారు

ముందు జరిగిన కాన్పులలో సమస్యలు, కష్టమైన కాన్పు అయిన వారు ప్రస్తుతం గర్భిణీగా ఉన్నప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ప్రసూతి వైద్యులను సంప్రదించి వారి సలహాలు పాటించాలి. ఆసుపత్రిలో ప్రసవిం చుకోడానికి సిద్దంగా ఉండాలి.
ఈ క్రింద వివరించినవి గర్భిణీకి క్లిష్టమైన పరిస్థితులు -

  • ముందు కాన్పులు శస్త్ర చికిత్స ద్వారా జరిగినది.
  • ముందు కాన్పులలో కాన్పు సమయంలో బిడ్డ చనిపోవడం లేదా చనిపోయిన బిడ్డ పుట్టడం
  • ఎక్కువ సేపు నొప్పులు తీయడం (24 గంటల కంటే ఎక్కువ)
  • కాన్పుకు ముందు – తర్వాత అధిక రక్త స్రావం
  • మాయ గర్భంలోనే ఉండిపోవడం (గంట తర్వాత కూడా మాయ దానంతట అదే బయటపడక పోవడం)
  • వెంట వెంటనే గర్భస్రావాలు
  • సరిగా రూపుదిద్దుకోని పిండం
విలువైన బిడ్డ

35 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సులో మొట్టమొదటి సారిగా గర్భవతి అయినవారు, పుట్టబోయే బిడ్డ తరువాత కుటుంబాన్ని పరిమితం చేసుకోవాలని చెప్పాలి.

గర్భధారణ---మందులు

గర్భవతి ఆరోగ్యంకోసం, ఆమె కడుపులోని పిండం ఆరోగ్యంకోసం , ఒక్కొక్కసారి మందులు వాడడం తప్పనిసరి కావచ్చు. అలాంటప్పుడు, సాధారణ అస్వస్థతల విషయంలో తమంతట తామే కొనుక్కునే మందులైనా, లేదా బలవర్ధక ఆహారంగా వాడే మందులైనా సరే, వాటిని వేసుకునే ముందు , గర్భిణి తప్పనిసరిగా వైద్య సలహా పొందాలి. గర్భంతో వున్నప్పుడు కొన్ని విటమిన్లను, ఖనిజ లవణాలను వాడాలని వైద్యులు సూచిస్తుంటారు.

గర్భంలోని పిండంపై మందుల ప్రభావం

గర్భస్త పిండం చక్కగా ఎదగడానికి అవసరమైన ప్రాణవాయువు (ఆక్సిజన్) , పోషక పదార్థాలు పిండాన్ని కప్పివుండే ఏ మాయ గుండా పిండానికి అందుతాయో, గర్భవతి తీసుకునే ఏ మందులైనా, అదే మాయ గుండా వెళ్ళి , పిండాన్ని చేరుకుంటాయి. అందువల్ల, గర్భవతిగా వున్న సమయంలో తీసుకునే మందులు పిండంపై అనేక రకాలుగా ప్రభావాన్ని చూపవచ్చు.

  • గర్భస్త పిండంపై అవి నేరుగా ప్రభావం చూపవచ్చు. వాటి దుష్ఫలితంగా పిండం విచ్ఛిన్నం కావచ్చు, లేదా పిండం పెరుగుదల మామూలుకంటె భిన్నంగా వుండి, శిశువు శారీరక, మానసిక లోపాలతో పుట్టవచ్చు, లేదా గర్భస్త పిండం ఊపిరి కూడా పోవచ్చు.
  • పిండాన్ని కప్పివుండే మాయ రక్తనాడులను కుంచింపజేసి ( సంకోచింపజేసి), మాతృగర్భం నుంచి పిండానికి ప్రాణవాయువు (ఆక్సిజన్) సరఫరాను , పోషకాల సరఫరాను తగ్గించి, మాయ పనితీరునే మార్చివేయవచ్చు. ఇందువల్ల పుట్టే శిశువు బరువు తక్కువగా, ఎదిగీ ఎదగకుండా పుట్టవచ్చు
  • గర్భకోశ కండరాలను కుచించుకు పోయేలాచేసి, పిండానికి రక్తం సరఫరాను తగ్గించి పరోక్షంగా పిండాన్ని గాయపరచవచ్చు, లేదా నెలలు నిండకుండానే ప్రసవపు నొప్పులకు, ప్రసవానికి దారితీయవచ్చు మాయకు అటువైపు వేలి ఆకారంలో వుండే నాళాంకురాలలోని పిండపు రక్తానికి, తల్లి రక్తానికి మధ్య వుండే మాయపొర చాలా పలుచగా వుంటుంది. గర్భవతి వేసుకునే మందులు ఆ మె రక్తంనుంచి, నాభి (బొడ్డు) నాళంగుండా పిండానికి చేరుకుంటాయి.

ఏ మందైనా పిండంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది, పిండం ఎదుగుదల దశనుబట్టి, ఆ మందు శక్తిని, మోతాదును బట్టి వుంటుంది. గర్భం ప్రాథమికదశలో, (అండం ఫలదీకరణచెందిన 20 రోజులలోగా) తీసుకునే కొన్ని మందులు పిండాన్ని చంపివేయవచ్చు లేదా పిండంపై ఏ మాత్రం ప్రభావం చూపకపోవచ్చు. ఈ ప్రాథమిక దశలో, పుట్టుకతో శిశువుకు లోపాలు ఏర్పడకుండా పిండం తీవ్రంగా ప్రతిఘటిస్తుంది.
అయితే, ఫలదీకరణ జరిగిన 3వ-8వ వారాల మధ్య కాలంలో, పిండానికి అవయవాలు ఏర్పడే దశలో, పుట్టుకతో లోపాలు ఏర్పడడాన్ని ఏ మాత్రం ప్రతిఘటించలేని స్థితిలో పిండం వుంటుంది.ఈ దశలో పిండానికి చేరే మందులు పిండంపై ఎలాంటి ప్రభావాన్ని చూపకపోవచ్చు; లేదా గర్భస్రావం కలిగించ వచ్చు, లేదా గమనించగలిగే శారీరకమైన లోపం ఏర్పడవచ్చు; లేదా పుట్టిన తర్వాత ఎప్పుడో బయటపడే చిన్న శాశ్వతలోపం ఏర్పడవచ్చు. అండానికి అవయవాలు పూర్తిగా ఏర్పడిన తర్వాత తీసుకునే మందులవల్ల గమనించగలిగే లోపాలేవీ ఏర్పడకపోవచ్చు. అయితే, అవయవాల, జీవకణాల సాధారణ ఎదుగుదలను, వాటి పనితీరును ఈ మందులు దెబ్బతీయవచ్చు.

గర్భవతిగా వున్న దశలో తీసుకుంటే , పిండానికి ఏ మేరకు ముప్పు ఏర్పడవచ్చుననే దానిని బట్టి, ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్ధ ( ఎఫ్ డి ఏ ) మందులను వర్గీకరిస్తుంది. కొన్ని మందులు మిక్కిలి విషపూరితమైనవి ; అవి పుట్టుకతో తీవ్రమైన లోపాలకు దారి తీస్తాయి.అందువల్ల, ఆ మందులను గర్భవతులు ఎట్టిపరిస్థితిలో వేసుకోకూడదు . ఇలాంటి మందులకు ఒక ఉదాహరణ " తిలిడోమిడే '" (దీని వ్యాపార నామం " తలిడోమిడ్ ) .కొన్ని దశాబ్దాల కిందట మాట.. గర్భవతిగా వుండగా ఈ మందును వేసుకున్నందువల్ల వారికిపుట్టిన పిల్లలు , సరిగా ఎదగని కాళ్ళు, చేతులతో ;చిన్నప్రేగులు, గుండె, రక్తనాళాలకు సంబంధించిన తీవ్రమైన లోపాలతో పుట్టారు .కొన్ని మందులు పశువులలో పుట్టుకతో వచ్చే లోపాలకు కారణమవుతాయి; అయితే, మనుషులలో అలాంటి లోపాలు కనిపించలేదు. ఒక ఉదాహరణ : " మెక్లిజైన్" (వ్యాపార నామం: యాంటివెర్ట్ ). విరేచనాలు, వాంతుల విషయంలో ఈ మందును తరచుగా వాడేవారు.

గర్భవతిగా వున్నప్పుడు తీసుకునే మందుల వల్ల ఎదురయ్యే వివిధ రకాల విపత్తులు.
విపత్తు రకం వివరణ
ఈ మందులు మిక్కిలి సురక్షితమైనవి . మనుషులపై ఈ మందుల ప్రభావాన్ని గురించి జరిపిన శాస్త్రీయ అధ్యయనాలు, ఈ మందులవల్ల పిండానికి ఎలాంటి హాని వుండదని తేల్చాయి .
బి జంతువులపై జరిపిన అధ్యయనాలు పిండానికి ముప్పు వుండదని నిర్ధారించాయి. అయితే, మనుషులకు సంబంధించి శాస్త్రీయమైన అధ్యయనాలేవీ జరుగలేదు
లేదా
జంతువులపై జరిపిన అధ్యయనాలు పిండానికి ముప్పు వుంటుందని నిర్ధారించాయి. అయితే, మనుషులకు సంబంధించి శాస్త్రీయమైన అధ్యయనాలేవీ జరుగలేదు
సి జంతువుల విషయంలో కాని, మనుషుల విషయంలో కాని తగినంతగా అధ్యయనాలు జరుగలేదు
లేదా
ఈ మందులను జంతువులపై ప్రయోగించి చూసినపుడు ,పిండానికి హానికలిగింది. అయితే, మనుషుల విషయంలో ఈ మందులు పిండంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే సమాచారం లేదు.
డి మనుషులలో పిండానికి ముప్పు వుంటుందని ఋజువైంది. అయితే, కొన్ని సందర్భాలలో, ఈ మందుల వినియోగంవల్ల కీడు కంటె మేలు ఎక్కువ జరిగే అవకాశం వుంది. ఉదాహరణకు, తల్లికి ఏదైనా ప్రాణాంతకమైన లేదా ఎంతో తీవ్రమైన అస్వస్థత వుండవచ్చు, అది సురక్షితమైన మందులతో నయం కాకపోవచ్చు.
ఎక్స్ ఏవైనా కొన్ని ప్రయోజనాలు వున్నప్పటికి , పిండానికి కలిగే హాని ముందు అవి లెక్కలోకిరావు

గర్భవతిగా వున్నప్పుడు , హానికలిగించే అవకాశంవున్న మందులకు బదులుగా , సురక్షితమైన మందులను ఉపయోగించవచ్చు. థైరాయిడ్ గ్రంధి చురుకుదనం పెరిగినప్పుడు, సాధారణంగా ప్రొపైల్ థియోరసిల్ ను వాడమని చెబుతారు. రక్తం గడ్డకట్టకుండా నివారించడానికి హెపారిన్ ను వాడడం మంచిది. పెన్సిలిన్ వంటి ఎన్నో సురక్షితమైన యాంటీ బయోటిక్స్ అందుబాటులో వున్నాయి.
కొన్ని మందులను వాడడం నిలిపివేస్తే దుష్ఫలితాలు రావచ్చు. ఉదాహరణకు , చర్మ వ్యాధులు సోకకుండా నివారించడానికి ఉపయోగించే , ఐసోట్రెటినాయిన్ ( వాణిజ్య నామం: యాక్యుటేన్ ) చర్మపు పొరల కిందవుండే కొవ్వులో పేరుకుని వుండి , నెమ్మదిగా విడుదలవుతుంటుంది. ఈ మందు వాడడాన్ని నిలిపివేసిన రెండువారాలలోగా గర్భవతి అయినవారికి , శిశువు లోపాలతో జన్మించవచ్చు. అందువల్ల, స్త్రీలు ఈ మందువాడకాన్ని నిలిపివేసిన 3-4 వారాలవరకు గర్భం రాకుండా జాగ్రత్తపడడం అవసరం.

రుబెల్లా, వేరిసెల్లా వంటి సజీవమైన వైరస్‌లతో తయారయ్యే వ్యాక్సీన్లను గర్భవతులకు ఇవ్వకూడదు. కలరా, హెపిటైటిస్ ఏ, హెపిటైటిస్ బి, ప్లేగు, రాబిస్, టెటనస్, డిఫ్తీరియా, టైఫాయిడ్ వంటి వ్యాక్సీన్లను, వారికి ఆ ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం వుంటేనే ఇవ్వాలి. అయితే, ఇన్‌ఫ్లుఎంజా ( ఫ్లూ) సీజన్‌లో, 6వ నెల, లేదా 9వ నెల నిండిన గర్భవతులందరికి ఆ ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన వ్యాక్సీన్‌ను తప్పనిసరిగా ఇవ్వాలి.
గర్భందాల్చడానికి ముందు, లేదా గర్భవతిగా వుండగా అధిక రక్తపోటు ( హై బ్లడ్ ప్రెషర్) కు గురయ్యే వారికి అధిక రక్తపు పోటును తగ్గించే మందులు వాడవలసి రావచ్చు. ఈ రెండిటిలో ఏ రకం రక్తపు పోటువల్లనైనా, గర్భవతికి ఆమె గర్భస్త పిండానికి ముప్పు ఏర్పడవచ్చు. అయితే, గర్భవతులకు రక్తపు పోటును వేగంగా తగ్గించే మందులను వాడితే, అవి మాయకు రక్తం సరఫరాను తగ్గించే ప్రమాదంవుంది. అందువల్ల, గర్భవతులకు ఈ మందుల వాడకం వైద్య పర్యవేక్షణలోనే జరగాలి. యాంజియో టెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైం (ఏ సి ఇ) ఇన్‌హిబిటర్లు, థియజైడ్ డైరెటిక్స్ అనే రెండురకాల, అధిక రక్తపు పోటు నివారణ మందులను సాధారణంగా గర్భవతులకు ఇవ్వకూడదు. ఇవి పిండానికి చాలా చేటు చేస్తాయి.

గుండె పనిచేయనప్పుడు, లేదా గుండె కొట్టుకోవడం అసాధారణంగా వున్నప్పుడు వాడే డైజాక్సిన్ ( వాణిజ్య నామం: లెనాక్సిన్) , వెంటనే మాయను దాటివెళ్ళగలుగుతుంది. అయితే, శిశువు పుట్టకకు ముందు కాని, లేదా పుట్టిన తర్వాత కాని అది శిశువుపై ఎలాంటి ప్రభావం చూపదు.

గర్భిణులుగా ఉన్న కాలంలో సమస్యలను సృష్టించే కొన్ని మందులు
మందు రకం ఉదాహరణలు సమస్య
ఆందోళనను నివారించే మందు డయాజెపాం ( వాణిజ్య నామం-
డయాస్టట్ వాలియం)
గర్భవతికి నెలలు పైబడిన దశలో ఈ మందు వాడడం వల్ల, మానసికంగా కుంగిపోవడం, అసహనం, వణుకు, అప్పుడే పుట్టిన శిశువుకు మూర్చ మాదిరిగా రావడం
యాంటీ బయాటిక్స్ క్లోరాంఫెనికాల్ (క్లోరాంఫెనికాల్) గ్రే బేబీ సిండ్రోం (శిశువు శరీరం లేత నీలం రంగుకు మారడం) . గర్భవతిలో లేదా ఆమె గర్భస్త పిండంలో జి6 పిడి (గ్లూకోజ్ -6-ఫాస్ఫేట్ డిహైడ్రోజెనస్) లోపం కారణంగా, ఎర్ర రక్తకణాలు విచ్ఛిన్నం కావడం
సిప్రో ఫ్లోక్సాసిన్ ( సిలోక్సాన్ సిప్రో), ఆఫ్లోక్సాసిన్ ( ఫ్లాక్సినోక్యుఫ్లాక్స్) లెవోఫ్లాక్సాసిన్ (లెవా క్వింక్విక్సిన్) , నార్ ఫ్లాక్సాసిన్ (నారోక్సిన్) వంటి ఫ్లూరోక్వినోలోన్స్ కీళ్ళకు సంబంధించిన లోపాలు వచ్చే అవకాశం వుంది (జంతువులలో మాత్రమే గమనించడం జరిగింది )
కేనామైసిన్ పిండం చెవి దెబ్బతింటుంది, చెవుడుకు దారితీస్తుంది
నైట్రో ఫ్యూరంటైన్
(ఫ్యూరాడాంటిన్మా క్రోడాంటిన్)
గర్భవతిలోలేదా ఆమె గర్భస్త పిండంలో జి6పిడి (గ్లూకోజ్ -6-ఫాస్ఫేట్ డిహైడ్రోజెనస్) లోపం కారణంగా, ఎర్ర రక్తకణాలు విచ్ఛిన్నం కావడం
స్ట్రెప్టో మైసిన్ పిండం చెవి దెబ్బతింటుంది, చెవుడుకు దారితీస్తుంది
సల్ఫా సలజైన్ ( అజుల్‌ఫిడైన్), ట్రిమెథోప్రిం-సల్ఫామెథాక్సజోల్ వంటి సల్ఫోనమైడ్స్ గర్భవతి నెలలు పైబడిన దశలో ఈ మందు వాడితే,అప్పుడే పుట్టిన శిశువుకు కామెర్లు ( జాండిస్) సోకుతుంది, మెదడు దెబ్బతినే ప్రమాదంకూడా వుంది
టెట్రాసైక్లిన్ (సుమైసిన్)
శిశువుకు ఎముకల పెరుగుదల మందగిస్తుంది, పళ్ళు శాశ్వతంగా పసుపుపచ్చగా మారుతాయి. కొన్నిసందర్భాలలో , గర్భవతికి కాలేయం సరిగా
పనిచేయకపోవచ్చుకూడా.
యాంటీ కోగులంట్స్
(రక్తం గడ్డకట్టకుండా నివారించేవి)
హెపారిన్ ఈ మందును చాలాకాలం వాడితే, గర్భవతికి బోలు ఎముక వ్యాధి (యాస్టియోపొరోసిస్) వస్తుంది; రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే ప్లేటిలెట్స్ సంఖ్య తగ్గిపోతుంది.
వర్ఫారిన్ (కౌమాడిన్)
శిశువుకు పుట్టుకతో లోపాలు ; గర్భవతికి, పిండానికి రక్తస్రావం
మూర్ఛ నివారణ మందులు ( యాంటీ కన్వల్సంట్స్) కార్బమజెపైన్ పుట్టుకతో లోపాలు ఏర్పడే ప్రమాదం అప్పుడే పుట్టిన శిశువులో రక్తస్రావం. గర్భవతి ప్రసవానికి ముందు ఒక నెలరోజులపాటు , రోజూ విటమిన్ కె మందును నోటిద్వారా తీసుకుంటే దీనిని నివారించవచ్చు. లేదా, శిశువు పుట్టిన వెంటనే విటమిన్ -కె ఇంజక్షన్ ఇచ్చినా సరిపోతుంది.
ఫెనోబార్బిటాల్ (ల్యూమినాల్)
కార్బమజెపైన్ మాదిరిగానే
ఫెనైటోయిన్ (డిలాంటిన్)
కార్బమజెపైన్ మాదిరిగానే
ట్రిమెథాడియన్ (ట్రిడియన్) గర్భస్రావం జరిగే ప్రమాదం మరింత ఎక్కువవుతుంది; శిశువుకు పెదవులు గ్రహణం పోవడం, గుండెకు,ముఖానికి, తలపుర్రెకు, చేతులు లేదా పొట్టలోని భాగాలకు సంబంధించి పుట్టుకతో లోపాలు ఏర్పడే ప్రమాదం బాగా ఎక్కువగా ( 70%) వుంటుంది.
వాల్పొరేట్ (డెపాకాన్) అంగుడు చీలిపోవడం , ఇంకా గుండెకు, ముఖానికి, పుఱ్రెకు, వెన్నెముకకు, కాళ్ళుచేతులకు పుట్టుకతో లోపాలు వచ్చే ప్రమాదం కొంతవరకు ( 1%) వుంటుంది.
అధిక రక్తపోటును తగ్గించేవి యాంజియో టెన్షన్ కన్వర్టింగ్ ఎంజైం
(ఏ సి ఇ) ఇన్‌హిబిటర్లు
గర్భం నెలలు మీరిన దశలో ఈ మందు వాడితే, పిండానికి మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం వుంటుంది; పిండం ఎదుగులకు తోడ్పడుతూ, పిండం చుట్టూ వుండే ఉమ్మనీరు ( యామ్నియాటిక్ ఫ్లూయిడ్) పరిమాణం తగ్గవచ్చు; ముఖానికి, కాళ్ళకు, చేతులకు, ఊపిరితిత్తులకు సంబంధించిన లోపాలు ఏర్పడవచ్చు.
బేటా బ్లాకర్లు గర్భవతులు బేటా-బ్లాకర్లను వేసుకుంటే, గుండె కొట్టుకోవడంలోని వేగం తగ్గవచ్చు; పిండానికి రక్తంలో చక్కెర శాతం పడిపోవచ్చు;ఇవి ఎదుగుదలను మందగింప జేయవచ్చు
థియజైడ్ డయోరెటిక్స్ పిండం రక్తంలో ప్రాణవాయువు ( ఆక్సిజన్) , సోడియం, పొటాషియంల స్థాయి, ప్లేట్లేత్స్ సంఖ్య తగ్గుతుంది.
కెమోథెరపి మందులు యాక్టినోమైసిన్ పుట్టుకతో లోపాలు ఏర్పడే అవకాశం (జంతువులలో మాత్రమే గమనించడం జరిగింది )
బుసల్ఫాన్ (మైలెరాన్) కింది దవడ సరిగా పేరగకపోవడం, అంగుడు చీలిపోవడం,పుఱ్రె ఎముకలు అసాధారణంగా పెరగడం, వెన్నెముక లోపాలు, ఏనుగు పాదం వంటి పుట్టుకతో వచ్చే లోపాలు ఎదుగుదల మందగించడం
క్లోరాంబుసిల్ (ల్యూకెరాన్) మెర్‌కాప్టో
బుసల్ఫాన్ లో మాదిరిగానే
సైక్లోఫాస్ఫామైడ్
(లియోఫిలిజెడ్ సైటాక్సాన్)
బుసల్ఫాన్ లో మాదిరిగానే
ప్యురైన్ (ప్యూరినెథాల్)
బుసల్ఫాన్ లో మాదిరిగానే
మెథోట్రెక్సేట్ (ట్రెక్సాల్)
బుసల్ఫాన్ లో మాదిరిగానే
విన్ బ్లాస్టైన్ పుట్టుకతో ఏర్పడే లోపాలు వచ్చే అవకాశం
విన్‌క్రిస్టైన్ పుట్టుకతో ఏర్పడే లోపాలు వచ్చే అవకాశం
మానసిక స్థితిని(మూడ్‌ను) సరిచేసే మందులు లిథియం (లిథోబిడ్) శిశువుకు పుట్టుకతో వచ్చే లోపాలు (ముఖ్యంగా గుండెకు సంబంధించి),మత్తుగా వుండడం, కండరాల సౌష్టవం తగ్గడం, పాలు సరిగా తాగకపోవడం, థైరాయిడ్ గ్రంధి సరిగా పనిచేయకపోవడం,మూత్రపిండకణాలకు సంబంధించిన లోపం
వాపును నివారించే -ఉత్తేజ ప్రేరకాలు కాని మందులు (ఎన్ ఎస్ ఏ ఐ డి లు) యాస్ప్రిన్ , ఇతర శాలిసైలేట్స్
ఇబుప్రొఫెన్ (ఎడ్విల్‌మోట్రిన్)

నప్రాక్సెన్ (అలీవియనా
ప్రాక్స్నాప్రొసిన్)
ఈ మందులను ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే, ప్రసవపు నొప్పులు రావడం ఆలస్యంకావచ్చు; బృహద్దమనికి (గుండె ఎడమ కవాటం నుంచి ఆ వైపు అవయవాలకు రక్తాన్ని సరఫరాచేసే రక్తనాళం), ఊపిరితిత్తులకు రక్తాన్ని చేరవేసే రక్తనాళానికి మధ్య వుండే అనుసంధానం ముందే మూసుకుపోవచ్చు (డక్టస్ ఆర్టీరియోసస్);పిండానికి కామెర్లు సోకవచ్చు , కొన్నిసందర్భాలలో మెదడు దెబ్బతినవచ్చు; తల్లికి, బిడ్డకు ప్రసవ సమయంలోను, ప్రసవం తరువాత రక్తస్రావ సమస్యలు ఏర్పడవచ్చు
గర్భం నెలలు మీరిన దశలో ఈ మందులు తీసుకుంటే, పిండంచుట్టూ వుండే ఉమ్మినీటి పరిమాణం తగ్గవచ్చు
రక్తంలో గ్లూకోజు అధికంగా వుండడాన్ని నివారించడానికి నోటిద్వారా తీసుకునే మందులు క్లోరోప్రొపమైడ్ (డయాబినిస్) అప్పుడే పుట్టిన శిశువు రక్తంలో చక్కెర శాతం బాగా తక్కువగా వుండడం ; గర్భవతికి మధుమేహ (డయబెటిస్) నియంత్రణ లోపించడం; 2వ రకం మధుమేహంవున్న స్త్రీ , గర్భం మొదటిదశలొ ఈ మందు తీసుకుంటే, శిశువుకు పుట్టుకతో లోపాలు ఏర్పడే ప్రమాదం మరింత ఎక్కువవుతుంది.
టోల్బటామైడ్ క్లోరోప్రొపమైడ్ లో మాదిరిగానే
సెక్స్(లైంగికపరమైన) హార్మోన్లు డేనాజోల్ గర్భం ప్రారంభ దశలో ఈ మందును తీసుకుంటే, పిండంలో స్త్రీ జననాంగంలో పురుష జననాంగం ఏర్పడే ప్రమాదం వుంటుంది. శస్త్రచికిత్సద్వారా దీనిని సరిచేయవలసి రావచ్చు.
డైథిల్‌స్టిల్‌బెస్ట్రాల్ (డి ఇ ఎస్) ఆడపిల్ల విషయంలో, బహిస్టు సమస్యలు, జననాంగపు క్యాన్సర్‌ సోకే ముప్పు పెరగడం, గర్భంతో వున్నప్పుడు సమస్యలు ;
మగపిల్లల విషయంలో, జననాంగానికి సంబంధించిన లోపాలు
సింథటిక్ ప్రొజెస్టిన్స్ (అయితే, కొద్దిపరిమాణంలో నోటిద్వారా తీసుకునే గర్భ నిరోధక మాత్రలు కావు) డెనాజోల్ లో మాదిరిగానే
చర్మ చికిత్సలు ఎట్రెటినేట్ గుండెకు సంబంధించిన లోపాలు , చిన్న చెవులు, మెదడులో నీరుచేరడం (హైడ్రోసెఫలస్) వంటి పుట్టుకలో లోపాలు
ఐసోట్రెటినాయిన్ (యాక్యుటేన్) ఎట్రెటినేట్ లో మాదిరిగానే
మానసికంగా ఎదగకపోవడం
గర్భస్రావం అయ్యే ప్రమాదం
థైరాయిడ్ మందులు మెథిమాజోల్ ( టేపాజోల్)
పిండంలో థైరాయిడ్ గ్రంథి పరిమాణం పెరుగుదల, లేదా చురుకుదనం
తగ్గుదల ; అప్పుడే పుట్టిన శిశువులో తలపై చర్మంలో లోపాలు
ప్రొపైల్‌థియోరసిల్ పిండంలో థైరాయిడ్ గ్రంథి పరిమాణం పెరుగుదల, లేదా చురుకుదనం తగ్గుదల
అణుధార్మిక ( రేడియో యాక్టివ్) అయొడిన్ పిండంలోని థైరాయిడ్ గ్రంధి విచ్ఛిత్తి
మూడవనెల చివరలో ఈ మందు వాడితే, పిండంలోని థైరాయిడ్ గ్రంథి పరిమాణం బాగా పెరుగుతుంది, విపరీతమైన చురుకుదనం కలిగి వుంటుంది
ట్రియొడో థైరానిన్ (థైరోలార్) పిండంలోని థైరాయిడ్ గ్రంథి పరిమాణం బాగా పెరుగుతుంది, విపరీతమైన చురుకుదనం కలిగి వుంటుంది
వ్యాక్సీన్లు (సజీవమైన వైరస్) పొంగు కు (రుబెల్లా), మశూచికి (వెరిసెల్లా) వ్యాక్సీన్లు మాయకు, పెరుగుతున్న అండానికి తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ సోకుతుంది
పొంగుకు, గవద బిళ్ళలకు, పోలియో లేదా యెల్లో ఫివర్‌కు వ్యాక్సీన్లు ముప్పు తీవ్రంగానే వుంటుంది, అయితే, ఎలాంటి ముప్పో తెలియదు
* తప్పనిసరిగా అవసరమైతే తప్ప, గర్భంతో వున్న సమయంలో మందులు వాడకూడదు. అయితే, ఒక్కొక్కసారి, గర్భిణిస్ర్రీ మరియు పిండం ఆరోగ్యం దృష్ట్యా , మందులు వాడడం అత్యవసరం కావచ్చు. అటువంటప్పుడు, తాను మందులువాడినందు వల్ల కలిగే మేలు, కీడుల గురించి , గర్భిణిస్ర్రీ తనకు వైద్య పరీక్షలుచేసే వైద్యునితో చర్చించడం అవసరం.
సామాజిక మాదక ద్రవ్యాలు

సిగరెట్ (పొగాకు) కాల్చడం :

పొగత్రాగడం అటు గర్భవతులకు , ఇటు గర్భస్త పిండానికి హానిచేస్తుందని తెలిసినప్పటికి, పొగత్రాగే స్త్రీలలో కేవలం 20 % మంది మాత్రమే గర్భంతో వున్నప్పుడు పొగత్రాగడం మానగలుగు తున్నారు. గర్భంతో వున్నప్పుడు పొగత్రాగడంవల్ల దాదాపు విడవకుండా పిండాన్ని వెంటాడే దుష్ఫలితం శిశువు తక్కువ బరువుతో పుట్టడం. గర్భంతో వున్నప్పుడు తల్లి ఎంత ఎక్కువగా పొగత్రాగితే, శిశువు బరువు అంత తక్కువగా వుంటుంది. పొగత్రాగని స్త్రీలతో పోల్చుకుంటే, గర్భంతో వున్నప్పుడు పొగత్రాగే స్త్రీకి పుట్టే శిశువు బరువు సగటున 170 గ్రాములు తక్కువ. చాలాకాలంగా పొగత్రాగే స్త్రీలకు పుట్టే శిశువుల బరువు బాగా తక్కువగా వుంటుందని భావించవచ్చు.
పొగత్రాగని తల్లులకు పుట్టే బిడ్డలకంటె, పొగత్రాగే తల్లుల శిశువులకు, గుండె, మెదడు, ముఖానికి సంబంధించి, పుట్టుకలో లోపాలు ఏర్పడడం మరింత సాధారణం. శిశువు హఠాత్తుగా మరణించే అస్వస్థత (ఎస్ ఐ డి ఎస్) ప్రమాదం కూడా ఎక్కువే. మాయ పక్కకు జరగడం, మాయ ముందుగానే అండంనుంచి వేరుకావడం, అండాన్ని ఆవరించుకుని వుండే పొరలు ముందుగానే చిరిగిపోవడం, ప్రసవపు నొప్పులు ముందుగానే రావడం, గర్భాశయానికి ఇన్‌ఫెక్షన్లు సోకడం, గర్భస్రావం కావడం, మృతశిశువు పుట్టడం, నెలలు నిండకముందే పుట్టడం వంటివి కూడా చాలా సాధారణం. ఇంతేకాకుండా, పొగత్రాగే స్త్రీల సంతానం శారీరక పెరుగుదలలోను, మేధోవికాసంలోను, ప్రవర్తనలో పరిణతిలోను చిన్నచిన్నవే అయినా, గమనించతగ్గ లోపాలు చోటుచేసుకుంటాయి.
ఈ దుష్ఫలితాలకు, కార్బన్ మోనాక్సైడ్, నికొటిన్ మూలమని భావిస్తున్నారు. గర్భవతులు పరోక్షంగా కూడా పొగకు గురికాకుండా జాగ్రత్తవహించాలి. ఎందుకంటే, తల్లి పొగత్రాగితే గర్భస్త పిండానికి ఎలాంటి హాని కలుగుతుందో, ఈ పరోక్షపు పొగవల్లకూడా అలాంటి హాని కలుగవచ్చు.

మద్యం:

గర్భవతిగా వుండగా మద్యపానంచేయడం, పుట్టుకలో వచ్చే లోపాలకు ప్రధాన కారణంగా వెల్లడైంది. ఎంత పరిమాణం మద్యం పిండంలో దుష్ఫలితాలకు ( ఆల్కహాల్ సిండ్రోమ్)కు దారితీస్తుందో తెలియదు కాబట్టి,ఒక పద్ధతిగానైనా, అధిక పరిమాణంలోనైనా మద్యం తీసుకోవడాన్ని గర్భవతులు మానివేయాలి. మద్యపానాన్ని పూర్తిగా మానివేయడం పిండానికి మరింత క్షేమకరం. గర్భంతో వున్నప్పుడు మద్యపానంవల్ల కలిగే హాని రకరకాలుగా వుంటుంది.
గర్భంతో వున్నప్పుడు ఎంతపరిమాణంలో మద్యం తీసుకున్నా, మరీ ముఖ్యంగా అధిక మోతాదులలో మద్యం సేవిస్తే, వారికి గర్భస్రావం అయ్యే ముప్పు రెట్టింపు అవుతుంది. గర్భంతో వుండికూడా, ఒక అలవాటుగా మద్యపానం సాగించేవారి పిల్లల బరువు సాధారణ శిశువుల బరువుకంటె తక్కువగా వుంటుంది. పుట్టినప్పుడు సాధారణ శిశువు సగటు బరువు 7 పౌండ్లు (3.18 కిలోలు) కాగా, ఎక్కువ మోతాదులో మద్యం సేవించే గర్భవతులకు పుట్టే శిశువుల సగటు బరువు దాదాపు 4 పౌండ్లు (సుమారుగా 1.81 కిలోలు)మాత్రమే!గర్భంతో వున్నప్పుడు మద్యపానంచేసేవారికి పుట్టే శిశువులలో పెరుగుదల సరిగా లేకపోవడంతోపాటు ,పుట్టిన వెంటనే శిశువు ప్రాణంపోయే ముప్పు కూడా ఎక్కువగా వుంటుంది.

గర్భంతో వున్నప్పుడు మద్యం సేవించడం వల్ల కలిగే దుష్ఫలితాలలో , అండానికి సోకే " ఆల్కహాల్ సిండ్రోమ్" మిక్కిలి ప్రమాదకరమైనది. రోజుకు మూడు సార్లు తాగినాకూడా,ఈ సిండ్రోమ్ వస్తుంది. పుట్టిన 1,000 మంది సజీవశిశువులలో దాదాపు ఇద్దరికి ఈ అస్వస్థత ఏర్పడుతుంది. దీని కారణంగా, పుట్టకముందు లేదా పుట్టిన తర్వాత పెరుగుదల సరిగా లేకపోవడం, ముఖంలో లోపాలు,చిన్న తల (మెదడు సరిగా పెరగకపోయినందువల్ల కావచ్చు),మానసిక ఎదుగుదల లేకపోవడం, శిశువులో స్పందనలు మామూలుకంటె భిన్నంగా వుండడం మొదలైన లోపాలు తలెత్తుతాయి.అరుదుగా, కీళ్ళు వుండవలసినచోటికి భిన్నంగా వుండడం , సాధారణ పనితీరుకు భిన్నంగా పనిచేయడం, గుండెకు సంబంధించిన లోపాలు ఏర్పడడం కూడా చోటుచేసుకోవచ్చు.
గర్భంతో వున్న సమయంలో మద్యం సేవించే తల్లుల ఎదిగే పిల్లకు నడవడికి సంబంధించి అనేక తీవ్రమైన సమస్యలు ఏర్పడవచ్చు.వారిలో సంఘ వ్యతిరేక ధోరణి, తమను పట్టించుకోవడం లేదనే మానసిక లోపం ఏర్పడవచ్చు. శారీరకంగా పుట్టుకలో వచ్చే , గమనించగలిగే అవలక్షణాలేవీ లేకున్నాకూడా,ఈ సమస్యలు తలెత్తవచ్చు.

కేఫైన్:

గర్భంతో వున్నప్పుడు కెఫీన్ సేవించడం పిండానికి ఏమైనా హానికరమా అనే విషయం స్పష్టంకావడం లేదు. గర్భంతో వుండగా కొద్ది పరిమాణాలలో (ఉదాహరణకు : రోజుకు ఒక కప్పు కాఫీ) తీసుకోవడంవల్ల పిండానికి ఎలాంటి ముప్పు వుండదని ఆధారాలవల్ల తెలుస్తున్నది. కాఫీ, టీ, సోడాలు, చాకొలేట్,కొన్ని రకాల మందులలో కెఫైన్ వుంటుంది.ఉత్తేజాన్ని కలిగించే ఈ పదార్థాన్ని తీసుకున్న వెంటనే , అది మాయ పొరను దాటి పిండానికి చేరుతుంది.
కెఫైన్ పిండాన్ని ఉత్తేజపరచి, గుండెకొట్టుకునే వేగాన్ని పెంచుతుంది. మాయగుండా రక్త ప్రసరణను తగ్గించవచ్చు; ఇనుము ఖనిజం జీర్ణంకావడాన్ని కూడా తగ్గిస్తుంది( ఇందువల్ల, రక్తహీనత- ఎనీమియా- ముప్పు పెరుగుతుంది).గర్భంతో వున్నప్పుడు రోజుకు ఏడు కప్పులకు మించి కాఫీ తాగితే, మృతశిశువు పుట్టే, లేదా నెలలు నిండకుండానే ప్రసవమయ్యే , లేదా బరువు తక్కువ శిశువు పుట్టే, లేదా గర్భస్రావమయ్యే ముప్పు పెరుగుతుందని తెలియజేసే కొన్ని ఆధారాలు లభిస్తున్నాయి. కాఫీ పరిమాణాన్ని పరిమితంచేయడం;వీలైనంతవరకు కెఫైన్ లేని పానీయాలను సేవింఛడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఎస్పార్టేమ్

ఎస్పార్టేమ్ అనేది కృత్రిమంగా తీపిని కలిగించే ఒక పదార్థం. ఆహార పదార్థాలకు, పానీయాలకు కృత్రిమంగా తీపిని కలిగించడానికి వాడే కొద్దిపాటి మోతాదులలో దీనిని గర్భవతులు తీసుకోవడం క్షేమకరమేనని తెలుస్తున్నది .అయితే, ఫెనైల్‌కెటోన్యూరియా అనే ఒక అరుదైన అస్వస్థతకు లోనైనవారు మాత్రం ఎస్పార్టేమ్ ను బొత్తిగా వాడకూడదు.

పాలిచ్చే తల్లులు మందులు వాడడం..

పాలిచ్చే తల్లులు ఏవైనా మందులు వాడవలసి వస్తే, వారు పిల్లలకు తమ పాలు ఇవ్వడం నిలిపివేయాలా లేదా అనేది ఈ కింది అంశాలపై ఆధారపడి వుంటుంది:

  • తల్లి తీసుకునే మందులో ఎంత పరిమాణం తల్లి పాలలోకి చేరుతుంది
  • ఆ మందును శిశువు జీర్ణంచేసుకుంటుందా
  • ఆ మందు శిశువుపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది
  • శిశువు ఎన్ని పాలు తాగుతుంది (శిశువు వయసుపైన, శిశువు ఇతర ఏయే ఆహార పదార్థాలు, ద్రవాలు తీసుకుంటున్నదనే దానిపైన ఇది ఆధారపడి వుంటుంది)

ఎపినేఫ్రైన్, హెపారిన్, ఇన్సులిన్(హ్యుములిన్‌నొవోలిన్) వంటి కొన్ని మందులు తల్లి పాలలోకి వెళ్ళవు, అందువల్ల ఈ మందులు శిశువుకు సురక్షితమైనవే అవుతాయి. మిగతా చాలా మందులు తల్లి పాలలోకి వెడతాయి, కాని సాధారణంగా, చాలా స్వల్ప పరిమాణంలో మాత్రమే పాలలో కలుస్తాయి. అయితే, కొద్ది మోతాదులోనే అయినా, కొన్ని మందులు శిశువుకు హాని కలిగించవచ్చు, .మరికొన్ని మందులు పాలలో కలిసినా, శిశువు వాటిని చాలా కొద్దిగానే జీర్ణంచేసుకుంటుంది కాబట్టీ,శిశువుకు ఇబ్బందేమీ వుండదు.ఉదాహరణ: జెంటామైసిన్, కెనామైసిన్,స్ట్రెప్టో మైసిన్, టెట్రాసైక్లిన్ వంటి యాంటీబయోటిక్స్.
డాక్టర్ల సలహా తీసుకోకుండా నేరుగా మందుల దుకాణాలలో కొనుక్కునే చాలా మందులు ఈ విషయంలో సురక్షితమైనవే. ఇందుకు మినహాయింపు : జలుబు, దగ్గు మందులలో, ఎలర్జీ మందులలో, విరేచనాల మందులలో, నిద్రపట్టడానికి వాడే మందులలో వుండే ఎలర్జీని నయంచేసే ఔషధ పదార్థాలు ( యాంటీ హిస్టామిన్స్); ఇంకా దీర్ఘకాలంపాటు,ఎక్కువ మోతాదులో తీసుకుంటే హానికర సూక్ష్మక్రిమి నిరోధకాలైన (శాలిసైలేట్స్) యాస్ప్రిన్, మొదలైనవి.

చర్మానికి రాచుకునే ;కళ్ళలో, ముక్కులో వేసుకునే ; లేదా పీల్చుకునే మందులు సాధారణంగా సురక్షితమైనవే. అధిక రక్తపోటును తగ్గించడానికి వాడే ( యాంటీ హైపర్ టెన్సివ్) మందులు చాలావరకు, తల్లిపాలుతాగే శిశువులకు అంతగా హానికరమైనవికావు. అందువల్ల,గుండెజబ్బులకు, అధిక రక్తపోటు నివారణకు వాడే బేటా-బ్లాకర్ మందులను పిల్లలకు పాలిచ్చే తల్లులు వాడవచ్చు. అయితే, ఆ పిల్లలకు గుండె కొట్టుకునే వేగంలో ఏమైనా తగ్గుదల వచ్చిందా, రక్తపుపోటు తగ్గిందా నిర్ధారించుకోవడంకోసం వారికి తరచు వైద్య పరీక్షలు నిర్వహించడం అవసరం.(కౌమదిన్)శిశువు మంచి ఎదుగుదలతో, ఆరోగ్యంతో వుంటే ఈ మందు తీసుకోవచ్చు. అయితే,తల్లి ఆ మందు వాడినప్పుడు ఆమె పాలు తాగే శిశువును గమనిస్తుండడం అవసరం. కెఫైన్ థియోఫెలిన్(థియోలైర్) మందులు పాలుతాగే శిశువులకు హానిచేయవు. అయితే వారికి కొంత చికాకు కలిగించవచ్చు.

శిశువుల గుండె కొట్టుకునే వేగం, శ్వాస తీసుకునే వేగం పెరగవచ్చు.తల్లిపాలు తాగే పిల్లల విషయంలో కొన్ని మందులు నిరపాయకరమైనవని పేరుపొందినప్పటికి, పిల్లలకు పాలిచ్చే తల్లులు, ఆ మందులు వాడేముందు, అవి స్వయంగా మందుల దుకాణంలో కొనుక్కునేవే అయినా, లేదా మూలికా ఔషధాలైనా సరే, వైద్య సలహా పొందడం మంచిది. ఏ మందైనా వాడేముందు, వాటికి సంబంధించిన కాగితాలలో, పాలిచ్చే తల్లులు వాడకూడనివి అంటూ హెచ్చరికలేమైనా వున్నాయేమో పరిశీలించి చూడడం అవసరం. కొన్ని మందులను వైద్య పర్యవేక్షణలోనే వాడవలసి వుంటుంది. పిల్లలకు పాలిస్తూనే, శిశువుకు ఎలాంటి హాని కలుగని రీతిలో ఆ మందులు వాడాలంటే, మందు మోతాదును సవరించడం, మందు వాడవలసిన కాల పరిమితిని సవరించడం, పాలిచ్చే సమయాలకు అనుగుణంగా, మందు వేసుకోవలసిన సమయాన్ని నిర్ణయించడం వంటివి అవసరమవుతాయి. మానసిక ఆందోళనను నివారించే మందులు, నిరాశా నిస్పృహలను పోగొట్టగలిగే మందులు, మానసిక ఉద్రేకాలనుంచి ప్రశాంతతను చేకూర్చే మందులను చాలావరకు వైద్య పర్యవేక్షణలోనే వాడవలసి వుంటుంది. అవి శిశువుకు చెప్పుకోదగిన హాని చేయనివైనా సరే, వైద్య పర్యవేక్షణలోవాడడం అవసరం.అయితే, ఈ మందులు శిశువు శరీరంలో చాలాకాలమే వుంటాయి.శిశువు మొదటి కొన్నినెలల జీవితకాలంలో, ఆ మందులను తన శరీరంనుంచి తొలగించుకోవడం ఎంతో సమస్యగా తయారవుతుంది. ఆ మందులు శిశువు నాడీ వ్యవస్థను దెబ్బతీయవచ్చు కూడా. ఉదాహరణకు, మానసిక ఆందోళనను నివారించే, బెంజో డయా జెపైన్ కుటుంబానికి చెందిన , డయాజెపాం ( డయా స్టాట్ వాలియం) మందు తల్లిపాలు తాగే పిల్లలలో నిస్త్రాణకు, మగతకు, బరువు తగ్గడానికి దారితీస్తాయి. మూర్ఛలను నివారించే , గాఢ నిద్రను కలిగించే ఫెనోబార్బిటాల్ ( ల్యూమినాల్) మందు అవశేషాన్ని తమ శరీరంనుంచి తొలగించుకోవడానికి శిశువులకు చాలా కాలమే పడుతుంది. అందువల్ల ఈ మందు వారికి అపరిమితమైన మగతను కలిగిచవచ్చు. ఈ పరిస్థితులను దృష్టిలో వుంచుకుని, వైద్యులు పిల్లలకు పాలిచ్చే తల్లుల విషయంలో బెంజో డయా జెపైన్ , బార్బిచ్యురేట్ మందులను మోతాదు తగ్గించి ఇచ్చి, వాటి వాడకాన్ని పర్యవేక్షిస్తారు.

ముఖ్యమైన ముందుజాగ్రత్తలు
  • పాలిచ్చే తల్లులు తప్పనిసరి పరిస్థితులలో, బిడ్డకు హానికరమైన మందులను వాడవలసి వస్తే, వారు శిశువుకు తమ పాలు ఇవ్వడం నిలిపివేయాలి. అయితే, ఆ మందు తీసుకోవడాన్ని నిలిపివేసిన తర్వాత వారు తమ శిశువుకు పాలుఇవ్వడం కొనసాగించవచ్చు. మందువాడే సమయంలో తల్లులు , తమ చనుబాలను పిండి పారబోస్తూ, తమకు పాలు కొనసాగేలా చూసుకోవచ్చు.
  • పొగత్రాగే తల్లులు, పొగ త్రాగిన రెండు గంటల వరకు శిశువుకు తమపాలు ఇవ్వకూడదు. పాలిచ్చే తల్లులైనా, పాలివ్వని తల్లులైనా సరే, తమ పిల్లల ఎదుట పొగత్రాగరాదు. పొగత్రాగడం తల్లి పాల పరిమాణాన్ని తగ్గిస్తుంది, శిశువు సాధారణ బరువుకు పెరగడాన్ని దెబ్బతీస్తుంది.
  • తల్లి ఎక్కువగా మద్యం సేవిస్తే, ఆ తల్లి శిశువు ఎప్పుడూ మత్తుగా వుంటాడు, ఎక్కువగా చెమట పడుతుంది .
అక్రమ మాదక ద్రవ్యాలు

గర్భంతో వున్నప్పుడు నల్ల మందు వంటి మాదక ద్రవ్యాలను తీసుకుంటే, ప్రసవంలో ఇబ్బందులు ఎదురవుతాయి; పిండం ఎదుగుదలలోను, అప్పుడే పుట్టిన శిశువు విషయంలోనూ ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. గర్భవతులు మాదక ద్రవ్యాల ఇంజెక్షన్లు తీసుకుంటే, పిండాన్ని దెబ్బతీసే, లేదా పిండానికి ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం మరింత ఎక్కువవుతుంది. కాలేయం వాపు (హెపిటైటిస్) , ఎయిడ్స్ తోసహా , లైంగికంగా సంక్రమించే వ్యాధులు సోకే ముప్పును మరింత పెంచుతాయి. ఇంతే కాక, గర్భవతులు మాదక ద్రవ్యాలను ఉపయోగిస్తే, పిండంలో ఎదుగుదల తగినంతగా వుండదు . నెలలు నిండకముందే పిల్లలు పుట్టడం కూడా చాలా వరకు సర్వ సాధారణం..
తరచుగా కొకైన్ సేవించే తల్లులకుపుట్టే పిల్లల పెరుగుదలలో కొన్ని సమస్యలు వస్తాయి. అయితే, వాటికి కొకైనే కారణమా, కాదా అనేది నిర్ధారణ కాలేదు. ఉదాహరణకు: ఆ సమస్యలు పొగత్రాగడం వల్లనో, లేదా ఇతర మాదకద్రవ్యాలు సేవించడంవల్లనో, లేదా తల్లిదండ్రుల సంరక్షణ సరిగాలేకపోవడం వల్లనో, లేదా పేదరికం కారణంగానో వచ్చివుండవచ్చు.

ఓపియాయిడ్స్:

నల్లమందు కుటుంబానికి చెందిన హిరాయిన్,మెథడోన్, మార్ఫిన్ వంటి మాదక ద్రవ్యాలు నేరుగా మాయ పొరను దాటి వెళ్ళగలుగుతాయి. అందువల్ల, పిండం ఈ మాదకద్రవ్యాలకు అలవాటుపడే అవకాశం వుంది. పుట్టిన 6 గంటలనుంచి, 8 రోజులలోగా ఆ ప్రభావం నుంచి అవి బయటపడవచ్చు. అయితే, గర్భంతో వున్నప్పుడు తల్లి ఈ మాదకద్రవ్యాలు వాడడంవల్ల, పుట్టుకలో లోపాలు అరుదుగా కాని వుండవు. గర్భంతో వున్నప్పుడు తల్లి ఈ మాదకద్రవ్యాలు వాడడం, గర్భానికి హానికరం కావచ్చు. గర్భస్రావం జరగవచ్చు, పిండం మామూలుగా బయటకు రాలేకపోవచ్చు, నెలలు నిండక ముందే పుట్టవచ్చు. హిరాయిన్ సేవించే తల్లులకు పుట్టే పిల్లలు సాధారణంగా చిన్నగా వుంటారు.

యాంఫెటమైన్స్:

చురుకుదనం కలిగించడానికి వాడే యాంఫెటమైన్ మాదక ద్రవ్యాలను గర్భంతో వున్నప్పుడు వాడడంవల్ల, పుట్టుకలో వచ్చే లోపాలకు, ముఖ్యంగా. గుండెకు సంబంధించిన లోపాలకు, దారితీయవచ్చు.

మారిజువానా:

గర్భంతో వున్నప్పుడు మారిజువానా సేవిస్తే, అది పిండానికి చేటుచేస్తుందా అనే విషయంలో స్పష్టత లేదు. మారిజువానా లోని ప్రధాన మాదక పదార్థమైన టెట్రాహైడ్రోకెన్నాబినాల్ , మాయపొరను దాటి వెళ్ళగలుగుతుంది. అందువల్ల, పిండంపై ప్రభావం చూపే అవకాశం వుంది. అయితే, మారిజువానా తో పుట్టుకలో లోపాలు ఏర్పడే ముప్పు పెరుగుతుందనికాని, పిండం పెరుగుదలను మందగింపజేస్తుందనికాని నిర్ధారణ కాలేదు. గర్భంతో వున్నప్పుడు మారిజువానా మరీ ఎక్కువ మోతాదులలో సేవిస్తే తప్ప,పుట్టిన శిశువులో స్వభావసిధ్దమైన ఎలాంటి సమస్యలు తలెత్తవు. .

ప్రసవపు నొప్పుల సమయంలోను , ప్రసవంలోనూ మందుల వాడకం

శరీరాన్ని కావలసినంతమేరకు తాత్కాలికంగా మొద్దుబారేలా చేసే " లోకల్ అనెస్థటిక్స్" , లేదా ఇతర బాధానివారకాలు మాయ పొరనుదాటి వెళ్ళగలుగుతాయి. అందువల్ల, పుట్టిన శిశువుపై వీటి ప్రభావం పడే అవకాశం వుంది. ఉదాహరణకు, ఇవి శిశువులో శ్వాస పీల్చుకోవడాన్ని మందగింపజేయవచ్చు. అందువల్ల, ప్రసవపు సమయంలో ఈ మందులను వాడవలసి వస్తే, వాటిని అవసరమైన ప్రభావాన్ని చూపగలిగే మేరకు చాలా స్వల్పమైన మోతాదులలోనే వాడాలి. సాధారణంగా, శిశువు పొడుగు పెరగకపోవచ్చు, అయితే, బరువు బాగా పెరగవచ్చ

గర్భధారణలో ఎదురయ్యే సమస్యలు

ముత్యాల గర్భం

ముత్యాల గర్భం అనగానేమి?

గర్భిణీ స్త్రీలలో ఉత్పన్నమయ్యే సమస్యలలో ఇది కొంచెం చిక్కు సమస్య. ఫలదీకరణము తరువాత గర్భధారణ జరుగుతుంది. (ఫలదీకరణము - fetitisetis, conception = గర్భధారణ ) ఈ ప్రక్రియలో ఎక్కడ క్రమం తప్పినా ముత్యాల గర్భం వంటి అసాధారణమైన చిక్కులు సంభవించే అవకాశం వుంటుంది. ఈ ముత్యాల గర్భాన్ని హైడేటిడ్ తిత్తులు అని, ద్రాక్ష పళ్ళ గుత్తి వలే మారిన మాంసపు ముద్ద అని సంభోదిస్తారు. వీటినే గర్భధారణలో ఉత్పన్నమయ్యే జరాయికణాలు, కంతులని కూడా సంభోదిస్తారు. ఇవి సాధారణంగా నిరపాయమైనవి. ఇవి గర్భాశయాన్ని దాటి వ్యాపించినా కూడా నిరపాయమైనవి, మరియు చికిత్స చేయగలిగినవి.

సాధారణ గర్భంలో ఫలదీకరణము చెందిన అండంలో తల్లికి సంభంధించిన 23 క్రోమోజోముల (జన్యు పదార్ధపు సూక్ష్మ తునకలు), తండ్రికి సంభంధించిన 23 క్రోమోజోములు ఉంటాయి. సంపూర్ణ ముత్యాల గర్భంలో ఫలదీకరణము చెందిన అండంలో తల్లి నుంచి సంక్రమించవలసిన 23 క్రోమోజోములు ఉండవు. తండ్రి నుంచి సంక్రమించే క్రోమోజోములు ద్విగుణికృతమవుతాయి. కాబట్టి అండంలో మొత్తం 46 క్రోమోజోములు తండ్రి నుంచి సంక్రమించినవే వుంటాయికానీ, తల్లి నుంచి సంక్రమించినవి వుండవు. ఇటువంటి పరిస్ధితిలో పిండం కానీఉమ్మనీరు తిత్తి కానీ, మాయకు సంభంధించిన కణజాలం కానీ, ఏవీ వుండవు. దీనికి బదులుగా మాయ తిత్తుల సముదాయంతో కూడి వుంటుంది. ఇది చూడడానికి ద్రాక్ష పళ్ళ గుత్తులాగా వుంటుంది. ఈ తిత్తులు అల్ట్రా సౌండ్ (tv ఎక్స్ రే) లో స్పష్టంగా కనపడతాయి.

చాలా వరకు పాక్షిక ముత్యాల గర్భంలో ఫలదీకరణము చెందిన అండంలో తల్లి నుంచి సంక్రమించవలసిన 23 క్రోమోజోములతో పాటు తండ్రి నుంచి సంక్రమించిన క్రోమోజోములు ద్విగుణికృతమయి వుంటాయి. సాధారణంగా ఉండవలసిన 46 క్రోమోజోములు ( ఇలా వీర్యకణంలోని క్రోమోజోములు ద్విగుణీకృతమయినప్పుడు, రెండు వీర్యకణాలు ఒకే అండాన్ని ఫలదీకరించినప్పుడు ఇలా 69 క్రోమోజోములు ఏర్పడతాయి) ఇలాంటి సంధర్భంలో ఈ గుత్తులాంటి కణజాలంలో కొంత మాయకు సంభందించిన కణజాలం ఈ అసాధారణమైన కణజాలం లో కనిపించవచ్చును. పిండం పెరుగుదల కనిపించవచ్చును. కాబట్టి శిశువు పెరుగుదల లేదా కొంత శిశువుకు సంబంధించిన కణజాలం కనబడవచ్చును లేదా ఉమ్మనీరు తిత్తి కనబడవచ్చును. కానీ పిండం కనిపించినా, కొంతవరకూ పెరిగినా ఇది అనువంశికంగా (జెనెటికల్ గా) అసాధారణమైనదనీ, మనుగడ సాగించలేదనీ , శిశువుగా సంపూర్ణంగా పెరగలేదనీ గుర్తించాలి. ఈ రకమైన గర్బందాల్చి తరువాత గర్భస్రావం జరగడం గర్భందాల్చిన స్త్రీకు భయం మరియు జగుప్సా కలుగ వచ్చు. మానసికంగా కృంగిపోయినట్టు అనిపించవచ్చు.

కానీ వైద్యుల పర్యవేక్షణలో వుండి (గర్భస్రావం తరువాత) చికిత్స తీసుకుంటూపోతే దీర్ఘకాలిక సమస్యలు నివారించుకోవచ్చును. వైద్యుల పర్యవేక్షణ వుండడం మూలంగా శారిరక సమస్యలు కూడా తలెత్తక పొవచ్చును.

ముత్యాల గర్భం ఎంత తరుచుగా వచ్చే అవకాశాలు వున్నాయి ?

  • ఆసియా ఖండంలో వున్న ఆడవారిలో ముత్యాల గర్భం శాతం అధికంగా కనబడుతుంది.
  • రక్తం గ్రూపు - బి వున్న స్త్రీలలో ముత్యాల గర్భం నిష్పత్తి అధికంగా కనబడుతూ వున్నది.
  • హిందూ మరియూ పాకిస్తానీ స్త్రీలలో మొదటి ముత్యాల గర్భం తరువాత రెండవసారి సంభవించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.

ముత్యాల గర్భం దాల్చినట్టు ఏ విధంగా గుర్తించాలి ?

  • గర్భం దాల్చిన తొలిరోజుల్లో లక్షణాలు ఇతర గర్భిణీ స్త్రీలలో వున్నట్టే వుంటాయి. కానీ రోజులు గడిచే కొద్దీ ఏదో ఒక రోజు మైల కనబడుతుంది. (గర్భిణీ స్త్రీలలో మైల కొద్దిగా కనబడడం అసాధారణం కాకపోయినా స్త్రీ వైద్య నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం.
  • రక్తస్రావం ఎర్రగా లేదా గోధుమ రంగులో వుండవచ్చును. మైల ఆగి, ఆగి కావచ్చును లేదా నిరంతరం అవుతూ వుండనచ్చును. కొద్ది కొద్దిగా కావచ్చును లేదా చాలా ఎక్కువగా కావచ్చును. ఈ రక్తస్రావం కనబడడం అనేది గర్భం దాల్చిన 6 వారాలకే కనబడవచ్చును లేదా 16 వారాల తరువాత కనబడవచ్చును
  • ఇటువంటి గర్భంతో కడుపులో తిప్పుట, వాంతులు అధికంగా ఉండవచ్చును (వేవిళ్ళు) , కడుపు ఉన్న నెలలకు కనపడవలసిన దాని కన్నా ఎక్కువగా కనపడుతుంది. దీనికి కారణం గర్భసంచి సాధారణ గర్భంలో లాగా కాకుండా త్వరగా పెరగడమే గర్భిణీ స్త్రీలలో ఉండే హార్మోనులు మోతాదు చాలా అధికంగా వుంటుంది (హెచ్. సి. జి. హార్మోనులు)
  • సంపూర్ణ ముత్యాల గర్భం స్కానింగ్ ద్వారా (టి.వి ఎక్స్ రే) తేలికగా గుర్తించవచ్చును. రక్త పరీక్షలో గర్భిణికి సంభంధించిన హార్మోనులు కూడా ఎక్కువగా వుంటాయి. (హెచ్. సి. జి. హార్మోనులు) కానీ పాక్షిక ముత్యాల గర్భం నిర్దారించడం కొంచెం కష్టంతో కూడుకున్న పని.
  • ఒక వేళ మీకు ముత్యాల గర్భం నిర్దారించక మునుపే గర్భస్రావం జరిగిపోతే ఆ సముదాయాన్ని ప్రయోగశాలలో పరీక్షించి ముత్యాల గర్భాన్ని నిర్దారించవచ్చును.

ముత్యాల గర్భం యొక్క చికిత్స ఏమిటి ?

  • ముత్యాల గర్భం అని నిర్ధారణ జరిగిన తరువాత గర్భాశయ ముఖాన్ని కొద్దిగా వెడల్పు చేసి లోపలి కణజాలాన్నంతా సాఫు చేస్తారు. ఇది చాలా చిన్న శస్త్ర చికిత్స. గర్భశయ ముఖానికి కొద్దిగా మత్తు సూది చేసి గర్భాశయం శుభ్రం చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు గర్భాశయంలో మందు ఎక్కించడం ద్వారా గర్భస్రావం అదే జరిగిపోతుంది. కానీ కొన్ని సంధర్భాలలో మళ్ళీ గర్భసంచి శుభ్రం చేయవలసి వస్తుంది. దీనిని చట్టరీత్యా ఆమోదం పొందిన గర్భస్రావం అంటారు.
  • గర్భసంచి శుభ్ర పరచిన తరువాత మూత్రం, రక్తం నమూనాలు సేకరించి హెచ్. సి. జి. హార్మోనులను పరీక్షిస్తారు. గర్భస్రావం సంపూర్ణంగా అయిపోయి వుంటే ఈ హార్మోనులు శరీరంలో పూర్తిగా అదృశ్యమయిపోతాయి.

ముత్యాల గర్భం వల్ల ఉత్పన్నమయ్యే దీర్ఘకాలిక సమస్యలు ఏవి ?

  • ముత్యాల గర్భం నిర్ధారించి గర్భస్రావం చేయించిన తరువాత కూడా ఆరునెలల వరకూ వైద్యుల పర్యవేక్షణలో వుంటూ హార్మోనుల పరీక్షలు (హెచ్. సి. జి. హార్మోను) చేయించుకుంటూ వుండాలి. గర్భస్రావం తరువాత కొద్దిపాటి కణజాలం గర్భసంచిలో వుండిపోయినా ఇది తరువాత పెరిగి విస్తరించే అవకాశం వుంటుంది. ఈ విధంగా కొన్ని నెలల తరువాత కూడా జరిగే అవకాశం వుంటుంది. కాబట్టి ఒక వేళ హెచ్. సి. జి. హార్మోనులు పెరుగుతూ పోయినా, చాలా హెచ్చుగా నమోదయినా వైద్యులను సంప్రదించవలసి వుంటుంది.
  • ముత్యాల గర్భం గురించి గర్భస్రావం చేసిన తరువాత కొంత కణజాలం వుండిపోయి తరువాత ఇది చొచ్చుకొని పోయే ముత్యాల గర్భంగా మారుతుంది. ఇది గర్భ సంచిలో వున్న కండరాల పోరలోకి చొచ్చుకొని పోయి వుంటుంది. ఈ స్థితిలో రుతుస్రావం అస్తవ్యస్తంగా కావడం లేదా ఆగకుండా కావడం జరుగుతుంది. ఈ చొచ్చుకొని పోయిన ముత్యాల గర్భం కండరాలలో చొచ్చుకొని పోయి వుండడం మూలాన రక్తస్రావంలో కూడా చేరి దూరంగా వున్న అవయవాలను కూడా చేరడానికి అవకాశం వుంటుంది. ఉదాహరణకు కాలేయము, ఊపిరి తిత్తులు, మరియు మెదడు.
  • చొచ్చుకొని పోయే ముత్యాల గర్భం పాక్షిక ముత్యాల గర్భం తరువాత రావచ్చును. కానీ సాధారణంగా ఇవి సంపూర్ణ ముత్యాల గర్భం తరువాతే కనబడుతూ వుంటుంది.
  • అప్పుడప్పుడు ముత్యాల గర్భం కణజాలం గర్భసంచి శుభ్రపరచిన తరువాత కూడా కొన్ని కణాలు వుండిపోతాయి. ఈ కణాలు గర్భాశయంలో తరుచుగా వుండిపోవడం మూలంగా దీనిని తరచూ లేక నిరంతర గర్భాశయ జరాయువు వ్యాధి అని సంభోదిస్తారు. సంపూర్ణ ముత్యాల గర్భం వున్న స్త్రీలలో ఈ సమస్య 15 శాతం కనబడుతుంది. పాక్షిక ముత్యాల గర్భం వున్న వారిలో ఒక శాతం మాత్రమే కనబడుతుంది. ఈ విధంగా జరిగిన సందర్భంలో మందులు వాడవలసి వుంటుంది. ముత్యాల గర్భం కణజాలం గర్భసంచి దాటిపోకుండా వున్నదీ, లేనిదీ నిర్ధారించు కోవాలి. హెచ్. సి. జి. హార్మోనులు సాధారణ స్ధితికి వచ్చే వరకూ మందులు వాడవలసి వుంటుంది.

ఈ జబ్బును పూర్తిగా నయము చేసే మార్గాలు వున్నాయా ? సంభవమేనా ?

  • సరియైన సమయంలో , సరియైన చికిత్స అందించడం వల్ల ఈ జబ్బు 100 శాతం నయమయ్యే అవకాశాలు వున్నాయి. కానీ ముత్యాల గర్భం కణజాలం గర్భసంచిని దాటి వ్యాపించి వుండకూడదు. కొన్ని సందర్భాలలో అరుదుగా ముత్యాల గర్భానికి చెందిన కణాలు గర్భసంచిని దాటి వేరే అవయవాలకు ప్రాకి వున్నా కూడా పూర్తిగా నయం చేయవచ్చును. హెచ్. సి. జి. హార్మోనుల మోతాదు మాత్రం జీవిత కాలమంతా అప్పుడప్పుడు పరీక్షచేయించుకుంటూ వుండవలసి వుంటుంది.
  • చాలా కొద్ది మంది రోగులలో సంపూర్ణ ముత్యాల గర్భం పరాయువు క్యాన్సర్ కు దారి తీస్తుంది. ఇది చాలా అరుదైన క్యాన్సరు. ఇందులో మాయకు క్యాన్సరు సోకుతుంది. దీనిని కూడా నయం చేయవచ్చును. ఇది 30,000 మంది గర్భిణి స్త్రీలలో ఒకరికి సోకవచ్చును. ఇది ముత్యాల గర్భం నుంచి ఉత్పన్నం కావచ్చును లేదా మామూలు గర్భిణీ స్త్రీలలో రావచ్చును లేదా గర్భస్రావానంతరం ఉత్పన్నం కావచ్చును.

ముత్యాల గర్భం తరువాత, మళ్ళీ ఎప్పుడు గర్భం దాల్చవచ్చును?

  • ఏ మందులూ వాడని పక్షంలో ఆరునెలల వరకూ ఆగి, రక్తంలో హెచ్. సి. జి. హార్మోనులు సున్నా అని నమోదు అయిన తరువాత గర్భం దాల్చడం గురించి ఆలోచించాలి.
  • ఒక వేళ మందులు తీసుకొని ఉండిన యెడల సాధారణంగా గర్భం ధరించడానికి ఒక సంవత్సరం ఆగవలసి వుంటుంది. అంతకంటే ముందే గర్భం ధరిస్తే హెచ్. సి. జి. హార్మోనుల మోతాదు రక్తంలో పెరుగుతూ పోతుంది. కానీ ఇది ప్రస్తుతం గర్భం నుంచి లేక ముందు గర్భస్రావం జరిగిన ముత్యాల గర్భం తాలుకు మిగిలిన కణజాలం నుంచి గుర్తించడం చాలా కష్టం. అందుకని ఒక సంవత్సర కాలం వరకూ గర్భం దాల్చకుండా జాగ్రత్తలు తీసుకొనడం చాలా అవసరం.
  • 1 నుంచి 2 శాతం స్త్రీలలో రెండవ గర్భిణిలో కూడా ముత్యాల గర్భం రావచ్చును మొదటి మూడు నెలలలోనే స్కానింగ్ చేయించుకొనడం ఎంతైనా అవసరం.
  • శుభ సూచకం ఏమిటంటే ఒకసారి ముత్యాల గర్భం ధరించిన వారికి తరువాత సాధారణ గర్భం ధరించడానికి ఎటువంటి అడ్డంకు కాదు. తరువాత గర్భంలో బిడ్డ చనిపోయి పుట్టడం, పుట్టుకతో వచ్చే అంగవైకల్యాలు, నెలలు నిండక ముందే కాన్పు కావడం మరియూ ఇతర ప్రకృతి వైపరీత్యాలు ఏమీ జరుగవు.

ముత్యాల గర్భం ధరించిన వారితో సలహా, సంప్రదింపులు జరిపి వారికి మనోధైర్యం కలిగించడం

  • ముత్యాల గర్భాస్రావం తరువాత ఆరునెలల వరకూ ప్రతినెలా వైద్యులను సంప్రదిస్తూ వారి సలహా పాటిస్తూ వుండాలి. రెండవ గర్భం దాల్చే వరకూ. ఒక వేళ వీరిలో జబ్బు నిరంతరంగా వుంటూ పోతే మందులు మొదలు పెట్టవలసి వుంటుంది. ఈ మందులు స్త్రీలను చాలా బలహీన పరుస్తాయి. రెండవ గర్భం దాల్చడం కొంత ఆలస్యం కావచ్చును. ఈ విషయం వారికి తెలిసేలా చెప్పాలి.
  • రోగి భర్తతో కూడా సంప్రదింపులు జరుపుతూ అర్ధం చేసుకునేలా ఆమె బాధను పంచుకునేలా చేయాలి. ఈ బాధను వారు వారి కుటుంబ వైద్యులతో గానీ, స్నేహితులతో గానీ, అర్హులైన సలహాదారులతో కూడా పంచుకొనవచ్చును
గర్భ సంచిలో అధిక ఉమ్మనీరు స్థితి

ఇది గర్భిణిస్త్రీలలో కనబడే అసాధారణ స్థితి . దీనిలో ఉమ్మనీరుతిత్తిలో అధికంగా ఉమ్మనీరు ఏర్పడుతుంది. దీనిని ఉమ్మనీరు యొక్క అస్వస్థత లేక బహుళంగా ఉన్న ఉమ్మనీరుస్థితి (polyhydromnias) అంటారు .

ఉమ్మనీరు గర్భసంచిలో శిశువు చుట్టూ వుండే స్వఛమైన ద్రవము . ఇది శిశువుకు దిండువలె ఏ తాకిడి తగలకుండా కాపాడుతుంది. ఈ ద్రవము శిశువు యొక్క మూత్రపిండాలచే ఉత్పత్తి చేయబడుతుంది . అంటే ఇది శిశువు యొక్క మూత్రము . ఇది మరలా శిశువు శరీరంలోనికి చూషణ చేయబడుతుంది . 36 వారాల వరకూ ఉమ్మనీరు పెరుగుతూ పోతుంది . ఆ తరువాత ఇది ఏర్పడడం తగ్గుముఖం పడుతుంది . ఒకవేళ శిశువు అధికంగా మూత్రము చేసినాగానీ లేక మింగవలసినంత మింగకపోయినాగానీ ఉమ్మనీరు అధికంగా చేరుతుంది . ఈ కారణంగా అధిక ఉమ్మనీరు స్థితి సంభవిస్తుంది. తీవ్రంగాఉన్న ఉమ్మనీరుస్థితి శిశువు లో వున్న కేంద్రీయ నాడీయవ్యవస్థలో లోపాలు , జీర్ణవ్యవస్థ లో అడ్డంకులు , క్రోమోజోముల సమస్యలను సూచింస్తుంది . అరుదుగా ఈ స్థితి గర్భస్రావానికి , శిశు మరణానికి కూడా దారి తీయవచ్చును . ఈ సమస్య కొద్దిగా వుండడం (Mild hydromnios) సాధారణంగా కనబడుతుంది మరియూ పెద్దగా అసౌకర్యం కలిగించదు . నిజానికి గర్భంరెండవ మూడు మాసికంలో కనబడే అధిక ఉమ్మనీరుస్థితి మూడవ త్రైమాసికంలో ఏ చికిత్స లేకుండానే సాధారణ స్థితికి చేరుకుంటుంది .

అధిక ఉమ్మనీరు స్థితి వున్నట్టు తెలుసుకోవడం ఎలా

ఈ సమస్య కొద్దిగా వున్నప్పుడు ఏలక్షణాలూ కనబడవు . ఆయాసం , కడుపులోనెప్పి , స్పష్ఠంగా కన బడే వాపులు , శరీరం ఉబ్బినట్టుగా అవడం వంటి లక్షణాలు కనబడితే వెంటనే స్త్రీ వైద్యనిపుణులను సంప్రదించాలి . ఈ లక్షణాలు తీంవ్రంగా వుంటే అధిక ఉమ్మనీరు స్థితికి సంకేతాలు కావచ్చును .

క్రమం తప్పకుండా నెలనెలా పరీక్ష చేయించుకుంటున్నప్పుడు వైద్యులు కొలత టేపుతో మీ కడుపు చుట్టు కొలత , గర్భం ఎత్తు ఎప్పటికప్పుడు కొలిచి నమోదు చేస్తూ వుంటారు . దీనిని మీ జఘనాస్థి (పొత్తి కడుపు మధ్య ఎముక భాగం ) నుంచి గర్భసంచి ఎత్తు వరకూ కొలవడం జరుగుతుంది . వైద్యులు శిశువు యొక్క పెరుగుదలను ఎప్పటికప్పుడు చేతి పరీక్షలో స్పర్శతో తెలుసుకుంటూ వుంటారు లేదా స్కానింగు ద్వార కూడా తెలుసుకొనవచ్ఛును . ఈ కొలతలలో అనుమానం వచ్చినప్పుడు స్కానింగు ద్వారా శిశువు చుట్టూ వున్న ఉమ్మనీరు కొలిచి అధిక ఉమ్మనీరు స్థితిని నిర్ధారించవచ్చును

ఈ స్థితికి ఏవిధంగా చికిత్స చేస్తారు?

వైద్యులు అధిక ఉమ్మనీరు స్థితికి చికిత్సచేయగలరుగానీ దీనికి కారణమైన జబ్బుకు చికిత్సచేయడం సాధ్యపడదు . నడచినప్పుడు ,శ్వాసతీసుకోవడానికి కస్టమవుతునప్పుడు ఆసుపత్రిలో చెరనవలసివుంటుంది . ఈ స్థితిలో నెలలు నిండకమునుపే కాన్పు వచ్చే ప్రమాదం వుండడం మూలంగా దీన్ని నివారించే మందులు యిస్తారు . గర్భసంచిలోనుంచి సూదిద్వారాకొంత ఉమ్మనీరు తీసివేయడం ద్వార ఈ లక్షణాలనుంచి ఉపశమనం కలిగిస్తారు . ఏమైనా గర్భిణీస్త్రీలు ప్రసవం వరకూ వైద్యుల పర్యవేక్షణలొ వుడండం ఏవైనా అసాధారణ లక్షణాలు తలెత్తినప్పుడు వారి వైద్యులకు తెలియచేయడం చాలా ముఖ్యం . అప్పుడే తల్లి బిడ్డలకు క్షేమం సుఖప్రసవం సాధ్యం .

గర్భ సంచిలో ఉమ్మనీరు స్వల్పంగా ఉండే స్థితి లేక గర్భసంచిలో ఉమ్మనీరు అతి స్వల్పంగా ఉండడం

గర్భిణి స్త్రీలలో ఈపరిస్థితి ఉత్పన్నమయినప్పుడు శిశువు చుట్టూ వుండే ఉమ్మనీరు సాధారణంగా వుండ వలసిన దానికంటే తక్కువగా వుంటుంది . ఇటువంటి సమస్య మీ పై మరియు మీ శిశువు పై ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుసుకొనడానికి ముందుగా ఆరోగ్యమైన గర్భంలో ఉమ్మనీరు యొక్క పాత్రను అర్ధం చేసుకుంటే సమంజసంగా వుంటుంది

ఉమ్మనీరు అనగానేమి ?

గర్భంలో శిశువు చుట్టూవున్న ఉమ్మనీరు శిశువు యొక్క పెరుగుదల మరియు అభివృధిలో ముఖ్యపాత్ర వహిస్తుంది. ఈ తేటతెల్లంగా వుండే ద్రవము శిశువుకు ద్రవాలు అందజేస్తూ సంరక్షిస్తూ వుంటుంది . శిశువు ఈ ద్రవం గుండా ఊపిరితిత్తులలోనికి శ్వాసతీసుకుంటూ మధ్య మధ్యలో మింగుతూవుంటుంది . ఈ ప్రక్రియ శిశువు యొక్క ఊపిరితిత్తులు , జీర్ణవ్యవస్థ బలంగా పెరగడానికి దోహదపడుతుంది . ఉమ్మనీరు శిశువు గర్భంలో అటుఇటు కదలడానికి సహాయపడుతూ తద్వరా కండరాలు , ఎముకలు బలంగా అభివృధి చెందడానికి సహాయపడుతుంది. శిశువుతోకూడివున్న ఉమ్మనీరు గర్భం ధరించిన 12 రోజుల తరువాత నుంచి ఏర్పడుంది . ఈ సమయం నుంచే ఉమ్మనీరు ఏర్పడడం మొదలవుతుంది . గర్భం యొక్క తొలివారాలలో ఉమ్మనీరులో ముఖ్యంగా తల్లిద్వారా సరఫరా చేయబడిన నీరు మాత్రమేవుంటుంది . 12 వారాలతరువాత శిశువు యొక్క మూత్రము ఎక్కువ మోతాదులో వుంటుంది.

గర్భంలో 28 నుంచీ 32 వారాలవరకూ ఉమ్మనీరు పెరుగుతూ పోతుంది . ఈ సమయంలో గర్భంలో నాలుగిటిలోఒకవంతు ఉమ్మనీరు వుంటుంది. ఈ సమయం నుంచీ అంటే 28-32 వారాల నుంచీ 37-40 వారాలవరకూ ఉమ్మనీరు శాతం దాదాపు ఇదే మోతాదులో నిర్వహించబడుతుంది.ఈ సమయంలో శిశువు నెలలు పూర్తిగా నిండినదిగా పరిగణించబడుతుంది . తదనంతరం ఉమ్మనీరు తగ్గుతూ పోతుంది .

అల్ప ఉమ్మనీరు స్థితి అనగా నేమి ?

అల్ప ఉమ్మనీరు స్థితి ( ఉమ్మ నీరు అతితక్కువగా వుండడం) . 100లో8 గర్భాలలో సంభవిస్తుంది .ఇది సాధారణంగా గర్భంలో ఆఖరి 4 వారాలలో సంభవిస్తూవుంటు0ది . 8 మంది గర్భిణీలలో ఒకరికి పొద్దులు దాటిన 2 వారాలకు ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశాలు ఎక్కువగా వు0టాయి . సహజంగానే ఉమ్మనీరు తగ్గుతూ పోతూవుండడం మూలంగా ఈ పరిస్థితి తలెత్తుతుంది .

అల్పఉమ్మనీరుస్థితి టి. వి . ఎక్స్ రే (scanning) , గర్భిణి స్కానింగ్ లో బయటపడుతుంది . ఈ పరిస్థితి కారణానికి ఇంకా పూర్తి అవగాహన ఏర్పడలేదు . నిజానికి గర్భిణీ స్త్రీలు ఎవరిలో అయితే ఈ పరిస్థితి ఏర్పడుతుందో వారిలో ఏ కారణం కనపడదు.

ఈ పరిస్థితికి కారణాలేవి ?

గర్భం తొలి వారాలలో అల్పంగా ఉమ్మ నీరు వుండడానికి గల కారణాలు

  1. శిశువులోపుట్టుకతో కలిగే కొన్ని అంగవైకల్యాలు ,
  2. ఉమ్మనీరుతిత్తి పొరలు పగలడం లేదా చీలడం .

శువులోవున్న అంగవైకల్యాలలో ముఖ్యమైనవి మూత్రపిండాలు మరియు మూత్రవ్యవస్థలో వున్న లోపాలు . ఎందుకనగా లోపాలతో పుట్టిన శిశువులోతక్కువ మూత్రం ఉత్పత్తి అవుతుంది. అదే కాకుండా ఉమ్మనీరులో అధికంగా శిశువులో వుత్పత్తి చేయబడిన మూత్రమే వుంటుంది . గర్భిణీ స్త్రేలలోవున్న కొన్ని ఆరోగ్యసమస్యలుకూడా ఈపరిస్థితికి కారణమవుతాయి. ఈ సమస్యలలో ముఖ్యమైనవి అధిక రక్తపోటు , చెక్కెర వ్యాధి , మాయలోవున్న సమస్యలు , స్వంత కణజాలము పై ప్రతిఘాతము ( ప్రతిరక్షకాలే తన కణములకు శత్రువులై కణనాశము కలుగజేయుట ) . దీనిలో యెస్ . యెల్. యి.వంటి సమస్యలు చేర్చబడ్డాయి .

ఈ సమస్య గర్భిణీస్త్రీలను ఏవిధంగా ప్రభావితం చేస్తుంది ?

స్వల్పఉమ్మనీరు స్థితి గర్భిణీస్త్రీలను మరియు గర్భస్థశిశువును మరియూ కాన్పుపై కూడా వివిధ రకాలుగా ప్రభావం చూపుతుంది. ఈ ప్రభావాలు ఈ స్థితికి దారితీసిన కారణాలపైన , గర్భిణీలలో ఎన్నవ నెలలో సమస్య ఏర్పదడీనదీ మరియు ఉమ్మనీరు ఎంత తక్కువగా వున్నదీ మొదలగు అంశాలపై ఆధారపడి వుంటుంది .

  1. ఈ పరిస్థితి గర్భం యొక్క మొదటి సగభాగలో సంభవించినట్లయితే శిశువు ఊపిరితిత్తులలో మరియు కాళ్ళు చేతులలో వైకల్యాలు కలుగవచ్చును . ఈ సమయంలో అల్పఉమ్మనీరు స్థితి మూలంగా గర్భస్రావం , నెలలు నిండకమునుపే కాన్పురావడం మరియు శిశువు చనిపోయిపుట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయి .
  2. అల్ప ఉమ్మనీరు స్థితి గర్భం రెండవ భాగంలో సంభవిస్తే శిశువు పెరుగుదలపై ప్రభావం చూపుతుంది .
  3. కాన్పు దగ్గరపడే కొద్దీ ప్రసవసమయ0లో దుష్పలితాలు ఉత్పన్నం కావచ్చు.

ఇటువంటి పరిస్థితిలో మీరు ఏంచేయవలసి వుంటుంది ?

ఇటీవల జరిగిన పరిశోధనలను బట్టి ఇతరత్రా ఏ సమస్యలూలేని గర్భిణీ స్త్రీలలోస్వల్ప ఉమ్మనీరు పరిస్థితి తలెత్తిన యెడల ఏచికిత్స అవసరం లేకపోవచ్చును , వారికి ఆరోగ్యంగా వుండే శిశువు జన్మించే అవకాశాలు వున్నాయి .

  1. చికిత్స అవసరమైనప్పుడు ముఖ్యంగా ప్రసవ సమయంలో ఉమ్మనీరుకు మారుగా కృత్రిమ ద్రవాన్ని గర్భసంచిలోకి ఎక్కించ వలసి వుటుంది .
  2. అన్నిటి కన్నా ఉత్తమమైన పద్దతి స్త్రీ వైద్యనిపుణుల పర్యవేక్షణలో వుండడం . వారు గర్భసంచి యొక్క పరిమాణం , ఉమ్మనీరు యొక్క నిష్పత్తిని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని దుష్పలితాలను నివారించే చర్యలు తీసుకుంటారు .
  3. అధిక రక్తపోటు , చక్కెరవ్యాధి , లూపస్ అనే వ్యాధి , మాయలోని సమస్యలు మొదలగు జబ్బులున్న వారిలో స్వల్ప ఉమ్మనీరు సంభవించే అపాయం ఎక్కువగా వుటుంది .
  4. ముందునుంచే అధిక రక్తపోటు వున్న స్త్రీలు గర్భం దాల్చక ముందే స్త్రీవైద్యనిపుణులను సంప్రదించవలసి వుంటుంది . గర్భిణి స్త్రీలు కూడా వైద్యులపర్యవేక్షణలోనే మందులు వాడాలి . గర్భిణి స్త్రీలు ప్రసవించే వరకూ తమ రక్తపోటు అదుపులో వుంచుకోవాలి .
  5. స్వల్పఉమ్మనీరు స్థితి నిర్ధారించబడిన తరువాత గర్భిణిస్త్రీలు పౌష్ఠికాహారం అధిక మోతాదులోద్రవపదార్ధాలు (నీరు ఉత్తమమైనది ) తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది . నెలలు నిండకమునుపే ఏవైనా ప్రసవలక్షణాలు కనబడితే స్ర్తీవైద్యనిపుణులను సంప్రదించాలి.
అపరిపక్వమైన స్త్రీప్రత్యుత్పత్తికణము(అండము)

అపరిపక్వమైన స్త్రీప్రత్యుత్పత్తికణము లేదా అండము అనగానేమి?

అపరిపక్వస్త్రీప్రత్యుత్పత్తికణము ఫలదీకరణము చెందిన అండము. ఇది గర్భసంచి గోడకు అతుక్కున్న తరువాత దీనినుంచి పిండం అభివృధిచెందదు. దీనినే అపిండగర్భం (పిండం ఏర్పడనిగర్భం (an embryonic pregnancy) అంటారు . అండంలో కణాలు ఉమ్మనీరుతిత్తి ఏర్పడడాని వృధిచెందుతాయికానీ పిండం ఏర్పడదు . ఈస్థితి సాధారణంగా మొదటి మూడు మాసాలలో జరుగుతుంది . అప్పటికి సాధారణంగా స్త్రీకి తాను గర్భిణీ అన్న విషయం కూడాతెలిసి వుండదు . ఇట్టి స్థితిలో స్త్రీ శరీరంలో చాలా అధిక మోతాదులోవున్న జన్యువుల అసాధారణ స్థితి (Chromosomal abnormalities)సహజంగానే గర్భ స్రావానికి దారితీస్తుంది .

అపరిపక్వ స్త్రీ ప్రత్య్త్పతి అండంతో కూడిన గర్భం వున్నట్టు ఏవిధంగా తెలుసుకోవాలి ?

ఈ పరిస్థితి సాధారణంగా గర్భం దాల్చిన తొలిరోజులలోనే ఏర్పడుతుంది . అప్పటికి స్త్రీకి తాను గర్భం దాల్చినట్టు కూడా తెలియదు .

గర్భం లక్షణాలు తెలుస్తూవుండవచ్చును. ఉదాహరణకు వాంతులు , నెలతప్పడం , మూత్రపరీక్షద్వారా గర్భం నిర్ధారించబడడం కూడా జరుగవచ్చును . ఇటువంటిస్థితిలో పొత్తికడుపులొ కడంరాలు గుంజినట్టు నొప్పిరావడం , యోనిద్వారా మైల చుక్కలుగా కనబడడం , అధికరక్తస్రావం కావడం జరుగుతుంది . కొద్దిమందిలొ స్వతహాగా రావలసిన ఋతుక్రమంతో పాటు గర్భసంచిగోడకు వున్నఈ అసాధారణ పిండము బయటకు నెట్టబడుతుంది . ఈ స్థితిలో సాధారణ ఋతుస్రావం కంటే మైల ఎక్కువగావుండే అవకాశం వుటుంది.

హెచ్ . సి. జి . హార్మోనులు మామూలుగానే పెరుగుతూ వుండడం మూలంగా గర్భిణి స్త్రీలు వారికి ఏలోపం లేదని భావిస్తూవుంటారు.

మాయ సాధారణంగా పిడం లేకుండా కొంతకాలం వరకూ పెరుగుతూపోతుంది . గర్భం యొక్క హార్మోనులు కూడాపెరుగుతూ వుండడం మూలంగా యీస్థితి గురించి గర్భిణి స్త్రీలకు ఎటువంటి అనుమానం రాదు . స్త్రీవైద్యనిపుణులు స్కానింగు తీసినప్పుడు బయటపడుతుంది . దీనిలో గర్భసంచి ఖాళీగా ఉమ్మనీరుతిత్తి పిడం లేకుండా కనబడుతుంది .

అపరిపక్వ అడంతో కూడిన గర్భం ఏర్పడడాని కారణాలు ఏవి ?

మొదటి మూడు మాసాలలో జరిగే గర్భస్త్రావాలలో 5ం శాతం వరకూ యీస్థితి కారణం అవుతూ వుటుంది . దీనికి కారణం జన్యువులలో వున్న అసాధారణ సమస్యలు . గర్భిణి స్త్రీశరీరం యీఅసాధారణ స్థితిని గుర్తిస్తుంది , మరియు ఇటువంటి గర్భాన్ని పొడిగించడానికి ఇష్టపడదు . ఎందుకంటే ఇటువంటి పిండం పెరిగి ఆరోగ్యమైన శిశువు జన్మించదన్న విషయం గ్రహిస్తుంది . యీస్థితి అసాధారణమైన కణవిభజన లేక నాణ్యతలేని వీర్యకణాలు అపరిపక్వమైన అండం మూలంగా కూడా ఏర్పడవచ్చును .

నెను గర్భస్రావం చేయించుకోవాలా ? తనంతతాను గర్భస్త్రావం అయేవరకు ఎదురుచూడవచ్చునా?

ఇటువంటి స్థితిలోగర్భస్త్రావం చట్టబధమైనది. గర్బసంచి ముఖద్వారం వెడల్పు చేసి లోపలి కణజాలాన్ని శుభ్రపరుస్తారు. (Dilation curettage-D&C). దీని నిర్ణయం మీఅంతకు మీరే తీసుకోవాలి . చాలామంది స్త్రీవైద్యనిపుణులు గర్భం తొలివారాలలో గర్భస్రావం సిఫారసు చేయరు . ముఖ్యంగా పరికరాలను ఉపయోగించి గర్భసంచి ముఖద్వారం వెడల్పు చేయడంవల్ల తరువాతి గర్భాలలో యిది సమస్యలకు దారితీయవచ్చును . స్త్రీ శరీరం సహజంగానే అసాధారణ కణజాలాన్ని వెలుపలకు నెట్టి వేసే సామర్ధ్యం కలిగి వుంటుందనీ , దీనికి పరికరాలు ఉపయోగించి బలవంతంగా చెయడం మూలంగా తదుపరి గర్భాలలో సమస్యలు తలెత్తవచ్చును . ఒకవేళ మీకు ఈ స్థితికి కారణాలు తెలుసుకోవాలని వున్నప్పుడు యీ కణజాలాన్ని ముక్కపరీక్ష ( Biopsy) కు పంపి కారణం తెలుసుకొని తరువాతి గర్భం లో ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది . కొంతనమంది స్త్రీలు ఈ పద్ధతి ద్వారా గర్భసంచి శుభ్రపరచుకోవడం మూలంగా మానసికంగా శారీకంగ విముక్తి కలిగినట్టు భావిస్తారు .

అపరిపక్వ అండాలను నివారించే ఉపాయాలు ఏవి ?

దురదృష్టవశాత్తూ ఈసమస్యకు కారణాన్ని నివారించలేము . కొంతమంది దంపతులు ఒకటి రెండుసార్లు తొలివారాలలోనే గర్భస్త్రావం అయినతరువాత జన్యుపరీక్షలకొసం వచ్చి సంప్రదిస్తారు . అపరిపక్వ అండం సాధారణంగా ఒకసారే ఏర్పడుతుంది . అరుదుగా ఇది పునరావృతమవుతుంది . మళ్ళీ గర్భం దల్చడానికి మూడు నుంచి ఆరు నెలల వరకూ ఆగమని వైద్యులు సిఫారసు చేస్తారు . స్త్రీ శరీరంలొ హార్మోనుల సాధారణ స్థితి నెలకొనడానికి మూడు నుంచి ఆరు వారాల కాలం పడుతుంది .

గర్భస0చి ముఖపు అసమర్ధత.

గర్బసంచి అసమర్ధత అనగానేమి ?

ఒక్కోసారి గర్బసంచి ముఖద్వారము ప్రసవ సమయoలో కాకుoడా నిర్మాణ బలహేనత వలన అపరిపక్వoగావుoడగానే తెరుచుకుoటుoది.సాధారణoగా నెలలు నిoడిన తరువాత ప్రసవసమయoలో యోనిభాగమయిన గర్బసంచిముఖపు గోడలు పలుచబడి , కుదిoచబడి, గర్భ సoచిముఖము తెరుచుకోవడo మొదలవుతుoది. కొoతమoది గర్భిణిస్త్రీలలో యీపరిస్థితి నెలలు నిoడకమునుపే మొదలవుతుoది . దీనినే గర్బసంచి ముఖపు అసమర్ధత అoటారు . దీనికి కారణాలు చాలా వుoడవచ్చును . చాలావరకూ తొలుత కలిగిన గాయాలు లేక వoశపారoపర్యoగా వచ్చే కoడరాల బలహీనతకావచ్చును . గర్భ సoచి ముఖపుఅసమర్ధత 15 నుoచి 2o శాతo గర్భిణీస్త్రీలలో జరిగే గర్భస్రావాలకు కారణo అవుతుoది .

గర్బసంచి ముఖపు అసమర్ధతకు వివరణ.

గర్బసంచి ముఖానికి గాయాలయినప్పుడు అది గర్భo బరువు మోయలేక పోతుoది . గర్బసంచి ముఖము ఏ నొప్పులూ , సoకోచాలూ లేకుoడానే వెడల్పయి ఒక్కోసారిపూర్తిగా తెరుచుకుoటుoది . ఈ విధoగా తెరుచుకున్నప్పుడు ఉమ్మనీరుతిత్తి పొరలు గర్బసంచి ద్వారo గుoడా ఉబ్బి కనబడుతాయి. తదుపరి పూర్తిగాపగిలి పిoడo బయట పడనూవచ్చు లేదా ఉమ్మనీరుతిత్తి కొద్దిగా చీలి నీరు కారుతూ వుoడవచ్చును . ఈ స్థితిలో పిoడo ఇoకా పరిపక్వదశ చేరి గర్బసంచి బయట బతికే స్థితికి చేరి వుoడదు . ఇది గర్బసంచిని చికాకు పరచి నెలలు నిoడకమునుపే కాన్పు నెప్పులు మొదలయేట్టు చేస్తుoది . చాలామoది గర్భిణి స్త్రీలలొ ఈపరిస్థితి నిర్ధారిoచేసరికే చేయిదాటిపోతుoది .

గర్బసంచి ముఖపు అసమర్ధతకు కారణాలు మరియూ హాని కలిగిoచే అoశాలు .

ముoదు గర్భాలలో ఇటువoటీ సమస్యలతో గర్భస్రావo జరిగివుoడడ0. శస్త్రచిత్స గర్బసంచిముఖానికి గాయాలు . డై _ ఈధైల్ స్టిల్బెస్టిరాల్ అనే మoదులు వాడి వుoడడo.గర్బసంచిముఖపు నిర్మాణoలో అసాధారణస్థితి . గర్బసంచి ముఖద్వారo వెదల్పుచేసి లొపలి కణజాలాన్నిశుభ్రపరిచే శస్త్రచికిత్సమూలoగా గాయo అయి వుoడె అవకాశాలు ఎక్కువ.

గర్బసంచి అసమర్ధతలో కనబడే లక్షణాలు

ఈ పరిస్థితిలోవున్న గర్భిణిస్త్రీలు నిశ్శబ్దoగా గర్బసంచి ముఖము వెడల్పయి ( అతి తక్కువ గర్బసంచి కoడరాల సoకోచాలతొ ) వైద్యులను సoప్రదిoచడానికి వస్తారు . సాధారనoగా 16 నుoచి 2o వారాల గర్భoతో వుoటారు . గర్బసంచి ముఖపు వెడల్పు సుమారు 2సె.మీ . వరకూ వుoడి అతి తక్కువ సoకేతాలతో వస్తారు. ఈ వెడల్పు 4 సె. మీ . లేక కొoచెo ఎక్కువ అయినప్పుడు గర్బసంచి సoకోచాలు ఉత్తేజoగా మొదలవుతాయి . ఉమ్మనీరుతిత్తి పగిలి పోయి పిoడo బయట పడు తుoది.

గర్బసంచి ముఖపు అసమర్ధత యొక్క నిర్ధారణ

పూర్వపు గర్భాలలో ఎటువoటిస్థితి ఉత్పన్నమయిన దాఖలాలు స్త్రీ వైద్యనిపుణులచే గర్బసంచి పరీక్ష . గర్భ నిర్ధారణ పరీక్ష. స్కానిoగు .

గర్బసంచి ముఖపు అసమర్ధత చికిత్స

(గర్బసంచి ముఖద్వారానికి కుట్టువేసే చిన్న శస్త్ర చికిత్స) ఈస్థితి నిర్ధారిoచిన తరువాత గర్బసంచిముఖద్వారాన్ని కుట్లతో మూసివేయవచ్చును . గర్బసంచి ముఖo చుట్టు గుoడ్రoగా ఒకటి కoటే ఎక్కువ కుట్లు వేస్తూ ముఖద్వారాన్ని మూసుకుని వoడేటట్టు చేయవచ్చును . సాధారణoగా ఈ చికిత్చ 12 వారాల తరువాత చేస్తారు ఈ వారాలలో అయితే ఇతర కారణాల మూలoగా గర్భస్త్రావo జరిగే అవకాశాలు తక్కువ . కాని ఉమ్మనీరు తిత్తి పగిలినా , ఏదైనా సoక్రమితo వున్నా యీ చికిత్స పనికిరాదు . కుట్లు వేసిన తరువాత గర్బసంచికి సoక్రమితo లేక సoకోచాలు మొదలయే అవకాశాలు వుoటాయి . అoదుకని వైద్యుల పర్యవేక్షణలొ వుoడాలి . ఆసుపత్రి నుoచి ఇoటికి వెళ్ళిన తరువాత కూడా పూర్తి విశ్రాoతి తీసుకోవాలి . ఈవిధoగా చేస్తే గర్బసంచి ముఖo పై ఎటువoటి ఒత్తిడి పడదు తద్వారా గర్భo కొనసాగిoచబడి శిశువు పరిపక్వదశకు చేరే అవకాశాలు ఎక్కువగావుoటాయి . కొనిఇ సoదర్భాలలో ఈ కుట్టు అదే విధoగా వుoచేసి శిశువును కడకు శస్త్రచికిత్సద్వారా బయాటకు తీస్తారు . స్కానిoగు ద్వారా అధిక ఉమ్మనీరు స్థితివున్నదేమో పరీక్షచేయిoచుకోవాలి.

గర్భస్థ సమయంలో సుళవుగా సక్రమించే వ్యాధలు

వ్యాధి

ఏ విధింగా వ్యాప్తి చెందుతుంది

శిశువు కు అపాయము?

ఏ విధింగా నివారించవచ్చు/చికిచ్చ చేయవచ్చును?

ఎయిడ్స్ (అతి సూక్షక్రిమి) వైరస్

  • కలుషితమైన సూదులు
  • అ సురక్షితమైన సంభొగం
  • ప్రసవసమయంలో, మాయద్వారా ,తల్లి పాల ద్వారా సంక్రమించవచ్చు
  • వ్యాధి తొలి నెలలలో సంక్రమిస్తే శిశువు తల చిన్నదిగా వుండడం , ముఖంలోవైకల్యాలు ఏర్పడడం జరుగుతుంది
  • హెచ.ఐ.వి.సక్రమించిన తల్లుల నుండి శిశువులకు 5ం శాతం వ్యాధి సంక్రమించే అవకాశం వుంటుంది
  • అపాయాన్ని కలిగించే పరిస్థితులకు దూరంగా వుండడం

చిన్న (అమ్మోరు){chickenpox} (అతి సూక్షక్రిమి) వైరస్

  • గర్భస్థతొలి నెలలోఈసూక్ష్మక్రిమి సోకినట్టయితే పుట్టుకతోనే అంగవైకల్యాలు ఏర్పడవచ్చును. కానీ సంక్రమితం వచ్చే శాతం చాలా తక్కువ _ 2.2 శాతం .
  • గర్భస్థ తొలి మూడునెలలో ఈ సోకితే సంపూర్ణంగావృధి చెందని కాళ్ళు, చేతులు ,కళ్ళు ,మెదడు
  • చర్మంపై మచ్చలు
  • తక్కువ బరువుతో బిడ్డ జన్మించడం.
  • పుట్టుకతో సర్పి వ్యాధి చర్మంపై రావటం జరుగుతుంది.
  • వివాహితస్త్రీ మొదటి మూడునెలలో పరీక్షకు వస్తే వారికి చిన్న అమ్మోరు లేక మశూచి
  • వ్యాధి నిరోధకపరీక్షలు జరిపి ఈ వ్యాధికి సంబంధించిన టీకాలు సూదులుగానీ సంభంధించిన వ్యాధినిరోధక టీకాలు(immunoglobulin)
  • సూదులుగానీ చేయవచ్చును . చిన్న అమ్మోరు లేదా మశూచి వ్యాధి నిరోధక టీకాలు గర్భిణీస్త్రీలకు ఇవ్వకూడదు . వేరిసెల్ల సూక్ష్మక్రిమిటీకాలు చేయించుకున్న స్త్రీలు ఒక నెలవరకూ గర్భం దాల్చరాదు .

క్లమీడియా అనే సూక్ష్మజీవి ( ఇదే బ్యాక్టీరియా గొనోరియాఅనే సుఖ వ్యాధికి కూడా వర్తిస్తుంది)

  • సంభోగం ద్వారా వ్యాప్తి చెందుతుంది ఏ లక్షణాలూ లేకుండా యోనిలోవుండవచ్చును
  • ప్రసవసమయంలొతల్లినుంచి
  • శిశువుకు సక్రమించవచ్చును.
  • శిశువు తక్కువ బరువుతో జన్మించడం
  • ఈ వ్యాధి గర్భవతిగా ఉన్న సమయంలో సంక్రమిస్తే బరువు తక్కువ తో పిల్లలు 1. నెలలు నిండకుండానే ముందుగా, ఉమ్మనీరు సంచి బేలడం.వలన శిశువుకు కంటివ్యాధిని మోనియాంనురి సారి వైద్యులు నిర్ధారించే వరకు
  • జీర్ణకోశ వ్యాధులు, మర్మాయవాలకు వ్యాధులు సంక్రమించి సమస్యలు రావచ్చు
  • వ్యాధి నిర్ధారణ తరువాత తల్లికి ,తండ్రికి , నా చెల్లేకి జరిగిన శిశువుకు నాశకమందులతో చికిత్స (antibiotics) చెయ్యాలి. సంభోగంలో కండోమ్ ఉపయోగించాలి .

సైటో మెగలో వైరస్ అతిసూక్ష్మజీవి.

  • వీర్యము , మూత్రము ,రక్తము , గర్భసంచి ముఖపు ద్రవాలు , తల్లి పాల ద్వారా వ్యాపిస్తుంది .
  • నెలలు నిండక మునుపే ప్రసవం , మానసిక మాంద్యం కాలేయం సంభదిత జబ్బులు.
  • శరీర ద్రవాలను తాకినవెంటనేచేతులు శుంభ్రంగా కడుక్కోవడం , మూత్రంతో తడిచిన బట్టలను జాగ్రత్తగా పారవేయడం చేయాలి .

అయిదవ వ్యాధి పార్వోఅతిసూక్ష్మక్రిమి

  • ఒకరినుంచి ఒకరికి ముక్కు గొంతు యొక్క ద్రవాలద్వారా (తుమ్మినప్పుడు , దగ్గినప్పుడు ) త్రాగేద్రవాల గ్లాసులు , పాత్రలు పంచుకోవడం మూలంగా వ్యాపిస్తుంది .
  • గర్భస్థ తొలిసగభాగంలో యీ సంక్రమితం తల్లికి సోకినట్టయితే ఎఱ్ఱరక్తకణాల ఉత్పత్తి 1ం శాతం తగ్గే అవకాశం , తద్వారా రక్తహీనత , గర్భస్త్రావం , శిశు మరణం సంభవించవచ్చును .
  • చాలామంది యుక్తవయస్కులకు యీసంక్రమితం ముందుగానే సోకివుండవచ్చును . జ్వరం వున్నవారికి దూరంగా వుండడం మంచిది. తరచూ చేతులు శుభ్రపరచుకుటూ వుండాలి తుమ్మినప్పుడు , దగ్గినప్పుడూ ,ముఖానికి గుడ్డ అడ్డం పెట్టుకోవాలి .
  • తాగే తినే పాత్రలు ఒకరు మరొకరితో పంచుకొనరాదు .

గ్రూప్ – బి స్ట్రెప్టోకొకల్ సూక్ష్మజీవి

  • 15 నుంచి 30 స్త్రీ యోని మరియు చిన్న ప్రేవులలో కనబడుతాయి .
  • 15 నుండి 30 శాతం స్త్రీలలో
  • ప్రసవానికి కొద్ది సమయం ముందు ఉమ్మనీరు తిత్తిలోనికి చేరవచ్చులేదా తిత్తిలోని చీలికలలోనికి చేరవచ్చును . 5ంశాతం నుంచి 7ం శా శిశువులలో ఉమ్మనీరు మింగడం ద్వారా లేదా ప్రసవసమయంలో పీల్చడం తం శిశువులలో ఉమ్మనీరు మింగడం ద్వారా లేదా ప్రసవసమయంలో పీల్చడం ద్వారా వ్యాధి సంక్రమిస్తుంది . 1 నుంచి 2 శాతం శిశువులలోతీవ్రసంక్రమితం , మెదడు వాపు , రక్తంలోచీము , ఊపిరితిత్తులలో నిమ్ము వంటి పరిణామాలు సంభవించవచ్చును
  • గర్భిణీ స్త్రీలను ఈక్రింది సమస్యల గురించి పరీక్షలు నిర్వహించాలి . *నెలలు నిండకమునుపే కాన్పు (< 37 వారాలు ) **నెలలునిండకమునుపే ఉమ్మనీరు తిత్తి పొరలు చీలిపోవడం (<37 వారాలు ) **ఉమ్మనీరుతిత్తి పగిలి ఉమ్మనీరు కారుతూ వుండడం (> 18 గంటలు ) **ప్రసవ సమయంలో జ్వరం . **ఒకటికంటే ఎక్కువశిశువుల జననం . ** జి . బి . యస్ . అనే సూక్ష్మజీవి మూత్రంలో వుండడం ఈ సూక్ష్మజీవి మూత్రంలో గుంపులు , గుంపులుగా కనబడుతుంది . తల్లివయసు 20 స”రాల కంటే ఎక్కువగా వుండడం. ముందు కాన్పులలో జి.బి.యస్ సంక్రమితం వుండివుండం . ** ప్రసవసమయంలో సూక్ష్మక్రిమి సంహారక మందులు రక్త నాణాల వ్యాధి మందులుయిచ్చివుండం .

కాలేయము యొక్క సంక్రమితం (అతి సూక్ష్మ క్రిమి) వైరస్

  • సంక్రమితంతో కూడిన ద్రవాలు – రక్తము , వీర్యము , యోని ద్రవాలు ,ఉమ్ము మొదలయినవి. అసురక్షిత సంభోగం ,సూదులు , గెడ్డం గీసుకునే బ్లేడు , పళ్ళు తోముకునే కుంచెలు ఒకరితో మరొకరు పంచుకొనడం . ** వ్యాధి పీడితురాలైన తల్లి నుంచి శిశువుకు లేదా ప్రసవం తరువాత తల్లి పాల ద్వారా శిశువుకు సంక్రమించడం జరుగుతుంది.
  • ** గర్భం దాల్చకమునుపే యీసంక్రమితం సోకినట్టయితే దీర్ఘకాలిక కాలేయ వ్యాధి , కాలేయంలో నారవంటి కణజాలం చేరడం , కాలేయ క్యాన్సరు వంటి సమస్యలు రావచ్చును .
  • **గర్భిణీస్త్రీలకు ఖచ్చితంగా పరీక్షలు జరపాలి . ** వ్యాధి నిర్ధారించబడీతే కాన్పయిన 12 గంటలలోపు శిశువుకు కాలేయసంక్రమిత-బి వ్యాధినిరోధకశక్తిని ఉత్తేజపరిచే ప్రొటీనులు (immuno globulins) కాలేయ సంక్రమితానికి చేసే 3 టీకాలలో మొదటి డో సు కాన్పయిన మొదటి 12 గంటల లోపే ఇవ్వాలి. రెడంవడోసు ఒక నెల తరువాత
  • 3డవడోసు ఒక నెల తరువాత 0 - 1- 2 month
  • with 9 to 12 month చేయవలసివుంటుంది. ** తండ్రికి కూడా పరీక్షలు నిర్వహించి , వాధి నిర్ధారించబడితే టీకాలు ఇప్పించాలి

హెర్పిస్ సింప్లెక్సఅతిసూక్ష్మక్రిమి టైపు 1 లేదా 2

  • సంభోగసమయంలో ఒకరిచర్మం ఒకరితో తాకడం మూలంగా వ్యాధి సోకి మరి అక్కడ తాకిన చేతులతో వేరొకచోట తాకడం మూలంగా వ్యాధి వ్యాపిస్తుంది ,
  • జననేంద్రియాల సంక్రమితం మూలంగా 2ం వారాలకు ముందుగానే గర్భస్రావం జరగడం , నెలలు నిండకమునుపే కాన్పురావడం జరుగుతాయి . మాయద్వారా వ్యాప్తి చెందడం అరుదు . ** శిశువుకు కాలేయ సమస్యలు వుండవచ్చు, ఇవికాక మూర్ఛలు , దీర్ఘకాలిక నరాల సమస్యలు , మెదడు వాపు వంటి సమస్యలు కూడారావచ్చును
  • చర్మవ్యాధి చురుకుగావున్న స్థితిలో సంభోగం చేయరాదు . ** ప్రసవ సమయంలో వ్యాధి చురుకుగా వున్నయెడల శిశువును శస్త్రచికిత్సద్వారా బయటకు తీయడం మంచిది . వ్యాధికి చికిత్స చేయించడం

రుబెల్లా( జర్మన్ మీసెల్స్ ) అతిసూక్ష్మక్రిమి

  • మాయద్వారా వ్యాప్తి చెందుతుంది . (తల్లి నుండి పిల్లలకు)
  • గర్భం తొలి త్రైమాసాలలో వ్యాధి సోకినట్టయితే గర్భస్రావం , అంగవైకల్యం , చెవుడు , శుక్లాలు , చిన్న తల , మానసిక లేక బుధి మాంద్యము ,గుండెలో లోపాలు , కాలేయ సమస్యలు ఉత్పన్నం కావచ్చును .
  • వ్యాధి సోకే అవకాశాలు వున్న గర్భిణిస్త్రీలకు టీకాలు వేయాలి .
  • వ్యాధిసోకే అవకాశం వున్న స్త్రీలు గర్భం దాల్చే ఒక నెల ముందు టీకానలు చేయించుకోవాలి .

టోక్సోప్లాస్మోసిసపరాన్నజీవి – టోక్సోప్లాస్మా గొనాడై

  • ** వ్యాధిగ్రస్థమైన పిల్లి మలం ( చెత్తపోగుల డబ్బాలోని) ** పూర్తిగా వుడకని లేక పచ్చి మాంసము ** పచ్చిమాంసము కోసిన తరువాత కత్తులు శుభ్రంగా కడగకపోవడం ** కలుషితమైన మట్టి నుంచి తీసిన పండ్లు , కూరగాయలు , తోటపని , పిల్లులు చేరే ఇసుక డబ్బాలు ** మాయ ద్వారా శిశువుకు వ్యాప్తి చెందడం
  • ** గర్భం తొలి మూడు మాసాలలో వ్యాధి సోకినట్టయితే గర్భస్రావం ,మెదడుకు హాని , మూర్ఛలు , తీంవ్రంగా బలహీనపడినప్పుడు మెదడులో నీరుచేరడం , మరియు ఇతర సమస్యలు . ** గర్భం చివరి త్రైమాసాలలో సంక్రమితం సోకినట్టయితే గర్భస్త్రావం , చనిపోయిన శిశువు జన్మించడం , కాలేయంలో నార చేరడం , మెదడు వాపు , కంటి చూపులో సమస్యలు , (కంటిలోకోరియా, రెటీనా పొరల సంక్రమితం) మెదడు క్షీణస్థితి , 15 నుంచి 2ం సంవత్సరాల వయసు తరువాత నరాల సమస్యలు .
  • పచ్చి మాంసము ముట్టు కున్నతరువాత , పచ్చికూరగాయలు కోసినతరువాత , ప్రతిసారి భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి . పచ్చి మాంసానికి వండిన మాంసానికి వేర్వేరు పాత్రలు ఉపయోగించాలి . ** మాంసాన్ని సంపూర్ణంగా ఉడికించాలి . (మైక్రోవేవ్ లో వండరాదు – ఇందులోఆహారం సగమే ఉడికే అవకాశాలు ఎక్కువ ) ** కేవలం పొగతో ఉడికించిన ఆహారాన్ని గర్భిణిస్త్రీలు నివారించాలి . **కలుశితమైన మట్టినుంచి వచ్చిన కూరగాయలను బాగా ఉడికించాలి . పచ్చిగా వున్నప్పుడుకూడా బాగా కడగాలి . **ఇంట్లో తిరిగే పిల్లులను కలుషితమైనవిగానే చూడాలి . వాటి మూత్రాలను చేతికి తొడుగులు వేసుకొనే శుభ్రపరచాలి . నీటితో కొట్టేయాలి . మల మూత్రాలను ఎత్తిన చాటలను కాల్చేయాలి లేదా పారవేయాలి . పిల్లులను ముద్దు చేయరాదు . ** పిల్లులు విరివిగా తిరిగేచోట తోటపని చేయరాదు . చేసినా చేతులకు తిడుగులు వేసుకోవాలి . ** ఆహార పదార్ధాల మీద ఈగలు బొద్దింకలు వాలకుండా తెరలు వాడాలి .

ఆధారం: Reid, D. "Perinatal AIDS", Perinatal Outreach Program Newsletter

గర్భిణీ స్త్రీల సంరక్షణ

  1. గర్భిణీ స్త్రీలకి సకాలంలో టి.టి. ఇంజక్షను ఇప్పించాలి. (రెండు మోతాదులు ఒక నెల వ్యవధిలో)
  2. గర్భిణీ స్త్రీలకి పోషకాహార లోపం వలన కలిగే నష్టాలు
    1. రక్తహీనత
    2. కడుపులో బిడ్డ సరిగ్గా ఎదగకపోవుట
    3. కాన్పు జరిగినపుడు కష్టం అవడం
    4. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం
  3. గర్భిణీ స్త్రీల యొక్క హీమోగ్లోబిన్ శాతం (హెచ్.బి. శాతం) 10 గ్రాముల కంటే తక్కువ ఉంటే ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ బిళ్ళలు రోజుకి 1 చొప్పున 4 నెలలు ఇవ్వాలి.
  4. గర్భిణీ స్త్రీ 4వ నెల నుండి 100 మి.గ్రా. ఐరన్ మరియు 0.5 మి.గ్రా. ఫోలిక్ యాసిడ్ బిళ్ళలను రోజుకి 1 చొప్పున ఆహారంతోపాటు తీసుకోవలెను.

ఈ క్రింది పరిస్థితులలో గర్భిణీ స్త్రీని ఆసుపత్రికి తరలింపవలెను :

  1. అధిక రక్త స్రావం
  2. గుర్రపు వాతం, శరీరం వాపు, మూర్ఛ, రక్తపోటు అధికం
  3. ప్రసవం సులభంగా కాని సమయంలో
  4. జ్వరం, ఆస్త్మా (ఉబ్బసం)తో బాధపడుతున్నప్పుడు
  5. వాంతులు, విరోచనాలు
  6. కామెర్లు, పొంగు
  7. గర్భంలో బిడ్డ చనిపోయే ప్రమాదం ఉన్నప్పుడు
  8. చక్కెర వ్యాధి, ఆయాసం ఉన్నట్లు తెలిస్తే

ప్రసవ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  1. ముఖ్యమైన 5 శుభ్రతలు :
    • పరిశుభ్రమైన నేల / గది
    • పరిశుభ్రమైన చేతులు
    • పరిశుభ్రమైన దారము
    • పరిశుభ్రమైన బ్లేడు
    • శుభ్రమైన బొడ్డు కొన
  2. శుభ్రత పాటించకపోవడం వలన నష్టాలు :
    • మాతా శిశు మరణాలు
    • తల్లికి, బిడ్డకు ధనుర్వాతం
    • బొడ్డు సరిగా కట్టకపోతే రక్తస్రావము
    • బొడ్డు కొనకు వ్యాధి క్రిములు –సెప్టిక్ అవడం
  3. డెలివరీ కిట్టులో ఉండవలసిన సామాగ్రి :
    • సబ్బు
    • ఆంటిసెప్టిక్ లోషన్
    • బ్లేడు
    • దారము
    • గాజుగుడ్డ
    • దూది
    • క్లిప్స్
  4. వాడేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు :
    1. దారంను వేడి నీటిలో ఉడికించడం
    2. బ్లేడును వేడి నీటిలో ఉడికించడం

తల్లిపాల వారోత్సవాలు

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగష్టు నెల మొదటి వారం రోజులు తల్లిపాల వారోత్సవాలుగా వాబా (వరల్డ్ అలైన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్షన్ ) సంస్థ పర్యవేక్షణలో డబ్ల్యు.హెచ్.ఓ (WHO), యునిసెఫ్ (UNICEF) మరియు బి.పి.ఎన్.ఐ (BPNI) వంటి అంతర్జాతీయ, జాతీయ సంస్థల అనుబంధంగా జరుపబడుచున్నది.

తల్లి పాల సంస్కృతిని ప్రోత్సహించి, సహకరించి, రక్షించుకోవడానికి ప్రతి సంవత్సరం ఒక క్రొత్త సందేశముతో ఈ వారోత్సవాలు జరుగుచున్నవి.

తల్లిపాల వారోత్సవాలు - 1 – 7 ఆగష్టు

శిశువులు, చంటిపిల్లల ఆహారం అందించే పద్ధతులు

శిశువులు ఆరోగ్యంగా పెరిగి, అభివృద్ధి చెందడానికి తల్లిపాలను మించిన ఆహారం మరొకటి లేదు. సంతానోత్పత్తి ప్రక్రియలో ఇదొక భాగం. దీని ప్రభావం తల్లి ఆరోగ్యం పై ఎంతైనా ఉంటుంది. ప్రపంచ ప్రజారోగ్య సిఫారసు ప్రకారం శిశువుల గరిష్ట పెరుగుదలను అభివృద్ధిని, ఆరోగ్యాన్ని సాధించాలంటే వారికి మొదటి ఆరునెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి. ఆ తరువాత శిశువు పెరిగే పోషకాహార అవసరాలను బట్టి తగిన పౌష్టిక విలువలున్న అనుబంధ ఆహారాన్ని ఇస్తూ, అతనికి రెండేళ్ళు వచ్చేంత వరకు, ఆ తరువాత కూడా తల్లిపాలను కొనసాగించాలి

పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లిపాలు త్రాగిద్దాం - శిశుమరణాలు తగ్గిద్దాం

ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10.9 మిలియన్ల 5 సంవత్సరాలలోపు పిల్లలు వివిధ కారణాలతో చనిపోవుచున్నారు ( మన దేశంలో 2.42 మిలియన్లు). ఇందులో 40 శాతం మరణాలు, నెలలోపు (0 – 28 రోజులు) శిశువులలోనే జరుగుచున్నది. అనగా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 4 మిలియన్ల నెలలోపు శిశువులు మరణిస్తున్నారు.

పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లిపాలు త్రాగించినట్లతే 1 మిలియన్ శిశు మరణాలు నివారించవచ్చని శాస్త్రీయంగా నిరూపించబడింది. దీని ప్రకారం మనదేశంలో ప్రతి సంవత్సరం సంభవించే 11 లక్షల నెలలోపు శిశు మరణాలలో సుమారు 2,50,000 మరణాలను నివారించవచ్చు.

  • బిడ్డ పుట్టినప్పటి నుండి మొదటి ఆరు నెలల కాలము తల్లిపాలు ఒక సంపూర్ణ ఆహారం. బిడ్డకు అవసరమైన అన్ని పోషక పదార్థాలు సమపాళ్ళలో ఉండడమే కాక అతి ముఖ్యమైన వ్యాధి నిరోధక శక్తి, వెలకట్టలేని తల్లీబిడ్డల అనుబంధం, పెద్దయ్యాక వచ్చే వివిధరకాల దీర్ఘకాలిక జబ్బుల నుండి రక్షణ, మొదలగునవి తల్లిపాల వలన కలుగుతుంది. ఈ ఆరు నెలల కాలములో బిడ్డకు తల్లిపాలు తప్ప ఏ ఇతర ఆహారము అవసరం లేదు. బిడ్డకు చక్కటి శారీరక, మానసిక, సాంఘీక, ఆరోగ్య అభివృద్ధికి తల్లిపాలు ఒక గట్టి పునాది.
  • పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించాలి. మొదటి ఆరు నెలల కాలము తల్లిపాలు మాత్రమే ఇప్పించాలి. 6 నెలలు నిండిన పిదప తల్లిపాలతో పాటు సురక్షితమైన, సరియైన, ఇంటిలో వండిన అదనపు ఆహారం ఇప్పించాలి. తల్లిపాలు రెండు సంవత్సరాల వరకు, వీలైతే ఇంకా ఎక్కువ కాలం ఇప్పించాలి.
  • తన బిడ్డకు రొమ్ముపాలు ఇవ్వడం వలన తల్లికి రొమ్ము కాన్సరు, అండాశయపు కాన్సరు, రక్తహీనత, ఎముకల బలహీనత మొదలగు జబ్బుల నుండి రక్షణ, మరియు సహజ గర్భనిరోధక శక్తి కలుగుతుంది.
  • ముర్రుపాల ఉపయోగం, శ్రేష్టతల గురించి చాలాకాలంగా చాలా మందికి తెలుసు. పుట్టిన వెంటనే శిశువుకి ముర్రుపాలే ముందు పట్టాలనీ తెలుసు. కానీ కొన్ని పురాతన నమ్మకాలు, సంప్రదాయాలు, మూఢనమ్మకాల వల్ల చాలా సందర్భాలలో ముందుగా ముర్రుపాలు బదులు, తేనె, పంచదార, నీళ్ళు లాంటివి ఇస్తున్నారు.

పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లిపాలు త్రాగిద్దాం

పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లిపాలు త్రాగిద్దాం ! 10,00,000 శిశుమరణాలు తగ్గిద్దాం !

  • 2006 సంవత్సరంలో ఘనా దేశంలో డాక్టర్ ఎడ్మెండ్ చేసిన పరిశోధనలో సుమారు 11 వేల మంది శిశువులకు పుట్టిన గంటలోపలే తల్లిపాలు ఇప్పించి వారిని పరిశీలించారు. ఈ పిల్లలలో సుమారు 22 శాతం నెలలోపు శిశు మరణాలు తగ్గినట్లు ధృవీకరించారు. పుట్టిన గంట పైబడి శిశువులకు తల్లిపాలు త్రాగించినట్లయితే వారిలో మరణాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు కూడా ఆయన పరిశోధనలో చెప్పారు.
  • ఈ పరిశోధనా ఫలితాలు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి. ఎందుకంటే 2000వ సంవత్సరం సెప్టెంబరు నెలలో జరిగిన ఐక్యరాజ్య సమితి మిలీనియం శిఖరాగ్ర సమావేశంలో నిర్ణయించిన మిలీనియం అభివృద్ధి లక్ష్యాలలో 4వ లక్ష్యం ప్రకారం 2015 నాటికి నేడు సంభవిస్తున్న 10.9 మిలియన్ల 5 సంవత్సరపు లోపు మరణాలలో 2/3 వ భాగం తగ్గించాలన్నది ఒక లక్ష్యం. ప్రతి బిడ్డకు పుట్టిన గంటలోపలే తల్లిపాలు త్రాగించినట్లతే 10.9 మిలియన్లలో ఒక మిలియన్ మరణాలను తగ్గించి పై లక్ష్యాన్ని చేరుకొనే అవకాశం ఉంది.
  • సంవత్సరం లోపు పిల్లలలో మరణాలు చాలావరకు విరేచనాలు మరియు శ్వాసకోశములకు సంబంధించిన జబ్బుల వలన జరుగుచున్నవి. ఈ జబ్బులన్నీ పౌష్టిక ఆహారలోపము వలననే కలుగుచున్నవి. పుట్టిన గంటలోపే తల్లిపాలు త్రాగిన పిల్లలు, అటు పిమ్మట చాలాకాలం వరకు తల్లిపాలు త్రాగుతున్నట్లు పరీశీలనలో వెల్లడైనది. దీని వలన బిడ్డ మొదటి 6 నెలల కాలం పూర్తిగా తల్లిపాలే త్రాగి, అటు పిమ్మట అదనపు ఆహారంతో పాటు 2 సంవత్సరాల వయసు వరకు తల్లిపాలు త్రాగగలదు. తద్వారా పిల్లలలో పౌష్టక ఆహారలోపం కూడా నివారించబడుతుంది.
  • ఎన్.ఎఫ్.హెచ్.ఎస్. (NFHS) – 3 (2005-06 ) సర్వే ప్రకారం మన దేశంలో కేవలం 23.4 శాతం పిల్లలు మాత్రమే పుట్టిన గంటలోపే తల్లిపాలు త్రాగుచున్నారు. రాష్ట్రాలవారీగా చూస్తే మిజోరం 65. 4 శాతం గోవాలో 59.7 శాతం , మేఘాలయలో 58.6 శాతం, కేరళలో 55.4 శాతం తమిళనాడులో 55.3 శాతం, అరుణాచలప్రదేశ్ లో 55 శాతం , ఒరిస్సాలో 54.3 శాతం, మహారాష్ట్రలో 51.8 శాతం, నాగాలాండ్ లో 51.5 శాతం, అస్సాంలో 50.6 శాతం, పంజాబ్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు ఢిల్లీలో 40 శాతం కన్నా తక్కువగాను, ఉత్తరప్రదేశ్ (7.2 శాతం), బీహార్ (4 శాతం) లలో అతి తక్కువ శాతం ఉన్నట్లు వెల్లడైనది. మన రాష్ట్రంలో కేవలం 22.4 శాతం శిశువులు మాత్రమే పుట్టిన గంటలోపలే తల్లిపాలు త్రాగుతున్నారు.

పుట్టిన గంటలోపే బిడ్డను తల్లి, తన ఎదపై పడుకోబెట్టుకొని పాలు ఇచ్చి నట్లయితే

ప్రసవించిన వెంటనే బిడ్డను తల్లి ఎదపై పడుకోబెట్టినట్లయితే, తల్లి స్పర్శతో బిడ్డ నెమ్మదిగా తనంతట తాను ప్రాకుతూ వెళ్ళి తల్లి రొమ్మును చేరుకొని, తల్లిపాలు త్రాగడం ప్రారంభిస్తుంది. పుట్టిన ప్రతి బిడ్డ మొదటి గంటలో చాలా హుషారుగా ఉంటుంది. అటు పిమ్మట బిడ్డ నిద్రపోతుంది. తరువాత హుషారు కావడానికి సుమారు 40 గంటల కాలం పడుతుంది.

  1. తల్లి శరీరంలోని వేడి బిడ్డకు ప్రసరించి బిడ్డ వెచ్చగా ఉంటుంది. ఇది ముఖ్యంగా నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు మరియు బరువు తక్కువగా పుట్టిన పిల్లలకు చాలా ఉపయోగకరం.
  2. ప్రసవం వలన కలిగిన శ్రమ నుండి బిడ్డ తొందరగా కోలుకొని, తన యొక్క శ్వాస మరియు
  3. గుండె చక్కగా పని చేయడానికి దోహదపడుతుంది.
  4. తల్లి శరీరంలో ఉన్నటువంటి ప్రమాదరహిత బాక్టీరియా, బిడ్డ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ
  5. బాక్టీరియా వలన ఎలాంటి కీడు బిడ్డకు జరగదు. ఎందుకనగా వీటికి అనువైనట్టి వ్యాధి
  6. నిరోధక శక్తి తల్లిపాలలో ఉంటుంది. దీని వలన ప్రమాదకరమైనటువంటి ఏ ఇతర బాక్టీరియా
  7. బిడ్డ శరీరంలోకి ప్రవేశింప జాలదు.
  8. తన కడుపున పుట్టిన బిడ్డను దగ్గరగా తీసుకోగానే తల్లి అత్యంత ఆనందానికి లోనవుతుంది. ఈ విధంగా తల్లీపిల్లల అనుబంధం మొదలవుతుంది

శ్రేష్టమైన ముర్రుపాలు

  • ముర్రుపాలలో వ్యాధి నిరోధక శక్తి , శిశువు జీర్ణాశయ అభివృద్ధికి దోహదపడే పదార్థాలు , విటమిన్ - ఎ మొదలగునవి అధిక మోతాదులో ఉంటాయి
  • ముర్రుపాల వలన శిశువు మొట్టమొదటిగా విసర్జించే నల్లటి మెకోనియం అనే మలంతో పాటు, పచ్చకామెర్లు కలిగించేటటువంటి బెలూరుబిన్ అనే పదార్థం కూడా త్వరగా విసర్జింపబడి, త్వద్వారా బిడ్డకు మొదటి వారం కలిగే పచ్చకామెర్ల తీవ్రత తగ్గుతుంది
  • మొదటి రోజులలో బిడ్డకు అవసరమైనంత, తక్కువ మోతాదులో పాలు లభ్యమవుతాయి. బిడ్డ తల్లి రొమ్ము స్పృశించి చీకడం వలన ఆక్సిటోసిన్ అనే పదార్థము తల్లి శరీరంలోకి విడుదలవుతుంది
  • దీని వలన తల్లి గర్భాశయము కుంచించుకొని, అధిక రక్త స్రావము ఆపబడుతుంది
  • ఈ ఆక్సిటోసిన్ మూలంగా మరికొన్ని పదార్థములు తల్లి శరీరంలోకి విడుదలై ఆమె మానసిక ప్రశాంతతకు తోడ్పడుతుంది
  • తల్లి రొమ్ము నుంచి బిడ్డకు పాలు సునాయసంగా అందుతాయి

కొలస్ట్రం విలువ

  • బిడ్డ పుట్టిన తరువాత మొదటి కొద్దిరోజుల పాటు స్రవించే పాలను కొలస్ట్రం అంటారు. ఇవి పసుపురంగులో జిగటగా ఉంటాయి. ఇవి అత్యంత పౌష్టికమైనవి.
  • వీటిలో యాంటీ - ఇన్ ఫెక్టివ్ పదార్థాలు ఉంటాయి. ఈ పాలలో విటమిన్ -ఎ పుష్కలంగా ఉంటుంది
  • కొలస్ట్రంలో అధిక ప్రోటీన్లు, కొన్నిసార్లు 10 శాతం వరకు కూడా ఉంటాయి
  • తరువాతి పాలలో కన్నా దీనిలో కొవ్వు, కార్బోహైడ్రేట్ లాక్టోజ్ తక్కువగా ఉంటాయి. బిడ్డకు కొలస్ట్రం తాగించడమంటే బిడ్డ శరీరంలోకి పోషక పదార్థాల (యాంటీ - ఇన్ ఫెక్టివ్ పదార్థాలు / యాంటీబాడీలు) నిల్వలను పెంచడమన్నమాటే
  • ఈ యాంటీ - ఇన్ ఫెక్టివ్ పదార్థాలు శిశువును విరేచనాల నుంచి కాపాడుతాయి. శిశువు మొదటి కొన్ని వారాలపాటు విరేచనాలకు గురికావచ్చు. కనుక ఈ పాలు అతనికి రక్షణ కల్పిస్తాయి
  • కొలస్ట్రంను తల్లి నుంచి బిడ్డకు లభించే రోగ నిరోధక వరప్రసాదంగా పేర్కొనవచ్చు. కొందరు తల్లులు ఇవి ములికిపాలని, పిల్లలకు జీర్ణం కావని అనుకొంటారు. ఈ పాల రంగులో తేడా ఉండడం, చిక్కగా ఉండడం వారిలో ఈ అనుమానాలకు తావిస్తోంది.
  • మన దేశంలో సాధారణంగా తల్లిపాలను ఆలస్యంగా పడుతుంటారు. దాని వలన శిశువుకు కొలస్ట్రంలో ఉండే రోగనిరోధక లక్షణాలు, విటమిన్ - ఎ , ప్రోటీన్లు లభించవు.
  • కొన్ని సమయాలలో మూఢ నమ్మకాలు, అజ్ఞానం కారణంగా ప్రసవమైన 5 వ రోజు నుంచి తల్లిపాలను తాగించడం ప్రారంభిస్తారు. భారతదేశంలోని 15.8 శాతం మంది శిశువులకు గంటలోపల, 37. 1 శాతం మంది శిశువులకు పుట్టినరోజు లోపల తల్లిపాలను ఇవ్వడం ప్రారంభిస్తారు.
  • తల్లిపాలను ఆలస్యంగా తాగించడం వలన శిశువుకు విలువైన కొలస్ట్రం లభించకపోగా, గ్లూకోజు నీళ్ళు, జంతువుల పాలు, పాలపొడి వంటి ప్రమాదం కలిగించే వీలున్న పదార్థాలు, పిల్లలలో విరేచనాలకు దారితీసే ద్రవ పదార్థాలను తల్లిపాల కన్నా ముందు పడుతున్నారు.
  • తల్లిపాలను ఆలస్యంగా ప్రారంభించడం వలన స్తన్యంలో గడ్డలు ఏర్పడే ప్రమాదం ఉంది. దానివలన పాలస్రావం తగ్గిపోయే ప్రమాదం ఉంది.
  • కొలస్ట్రం విలువ గురించి తల్లికి, సముదాయాలకు తెలియజేయడం వలన కొలస్ట్రం వృధా కాకుండా నివారించి, శిశువుకు అది లభించేలా చేయవచ్చు.

ప్రసవించిన మొదటి గంటలోనే బిడ్డకు తల్లిపాలు త్రాగించడం ఎలా

  • తల్లి ప్రసవించే సమయంలో తనకు ఇష్టమైనవారిని, సహకరించే వారిని తోడుగా ఉంచాలి
  • ప్రసవానికి వీలైనంత వరకు మందులు వాడటం తగ్గించాలి
  • తల్లికి అనువైన భంగిమలో ప్రసవం జరగనివ్వాలి
  • ప్రసవించిన వెంటనే బిడ్డను పొడిబట్టతో తుడిచి తల్లి ఎదపై బోర్లా పరుండబెట్టాలి
  • తల్లి స్పర్శతో బిడ్డ నెమ్మదిగా తనంతట తాను ప్రాకుతూ తల్లి రొమ్ము చెంతకు చేరి పాలు త్రాగడం ప్రారంభిస్తుంది. ఇందులకు ఎలాంటి ప్రోద్బలం చేయరాదు.
  • పాలు త్రాగేంత వరకు బిడ్డను అలాగే తల్లి ఎదపైన ఉంచాలి.
  • శస్త్రచికిత్స ద్వారా (సిజేరియన్) పుట్టిన పిల్లలకు కూడా ఈ వసతి కల్పించాలి.
  • బిడ్డ బరువు చూడడం, విటమిన్ -కె ఇంజెక్షన్ చేయడం లాంటివి తరువాత చేయవచ్చును.
  • తల్లి పాలకు ముందు వేరే ఏ ఇతర ఆహార పదార్థములు ఇవ్వరాదు.

పిల్లల సంపూర్ణ ఆరోగ్యాభివృద్ధికి బిడ్డ పుట్టిన గంటలోపే తల్లి పాలు ప్రారంభించి, మొదటి ఆరునెలల కాలం కేవలం తల్లి పాలు మాత్రమే ఇప్పించి, అటుపిమ్మట అదనపు ఆహారం ప్రారంభించి, తల్లి పాలు 2 సంవత్సరాల వరకు ఇప్పించాలి.

తల్లిపాలు - అత్యుత్తమ పౌష్టికాహారం

తల్లిపాలకు ముందు వేరే ఏ ఇతర ఆహార పదార్థములు ఇవ్వరాదు.

  • ఆధునిక శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం శిశువుల కోసం తల్లిపాల కన్నా మెరుగైన ఆహారాన్ని తయారు చేయలేక పోయాయి.
  • బిడ్డ పోషక, మానసిక అవసరాలను తృప్తిపరచడం కోసం తల్లిపాలివ్వడమే అత్యత్తమ మార్గం
  • తల్లిపాలలో ఉన్న అత్యత్తమ పోషక లక్షణాలను ఉన్నయి, ఇవి త్వరగా జీర్ణమై, శరీరంలో గ్రహించబడే లక్షణాలు తల్లిపాలలో ఉంటాయి. తల్లిపాలలోని మాంసకృత్తులు బిడ్డ శరీరంలో త్వరత్వరగా కరిగిపోతాయి. బిడ్డ శరీరం వాటిని సులువుగా గ్రహిస్తుంది.
  • తల్లిపాలలోని కొవ్వు, కాల్షియంలు కూడా ఈ విధంగానే సులువుగా గ్రహించబడతాయి.
  • తల్లిపాలలో ఉండే పాల చక్కెర- లాక్టోజ్ రెడీమేడ్ శక్తిని అందిస్తుంది. అంతేకాక దానిలోని కొంత భాగం ప్రేవులలో లాక్టిక్ ఆసిడ్ గా మారి ప్రమాదకరమైన బాక్టీరియాను నాశనం చేసి, శరీరం కాల్షియం, ఇతర ఖనిజాలను గ్రహించేలా చేస్తుంది.
  • తల్లిపాలలో ఉండే థయమిన్, విటమిన్ – సి ల మోతాదు తల్లి తినే ఆహారం పై ఆధారపడి ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఈ విటమిన్లను తగిన మోతాదులో కలిగి ఉంటాయి.
  • తల్లిపాలలో యాంటీ - ఇన్ ఫెక్టివ్ లక్షణాలు ఉంటాయి. మరే పాలలోనూ ఇవి ఉండవు.
  • వర్దమాన దేశాలలో ఇన్ ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్నందువల్ల శిశువులకు తల్లిపాలు అనే రక్షణ కవచం అవసరం.

సీసాపాలు త్రాగించుట వలన అపాయములు

  • తల్లిపాలు తప్ప ఏ ఇతర పాలు పిల్లలను వ్యాధులు రాకుండా కాపాడలేవు
  • పోతపాల వలన త్వరగా సూక్ష్మజీవులు వ్యాపించి పిల్లలు తరుచుగా రోగాలకు గురవుతారు
  • పాల సీసాలపై, పీకలపై ఈగలు, దుమ్ము చేరడం వలన సరిగా శుభ్రం చేయకపోవుట వలన పిల్లలకు తరచూ విరోచనములు, వాంతులు అగును
  • పాలపీకకు ఉండే రంధ్రము చిన్నది అయినట్లయితే పిల్లలు పాలు త్రాగడానికి ఇబ్బంది అవుతుంది. ఎక్కువగా గాలి పీల్చి పాలు తక్కువగా త్రాగుతారు. రంధ్రము పెద్దదయినట్లయితే వేగంగా పాలు వచ్చి వాంతి అవ్వటానికి అవకాశం కలదు.
  • తల్లిపాలతో సమానంగా ఏ ఇతర పాలలో పోషక విలువలు ఉండవు.
  • ఇతర పాలు లేదా పాలపొడి రేటు అధికంగా ఉండుట వలన ఎక్కువ నీరు కలపడం జరుగుతుంది. దీని వలన పిల్లలకు సరిపడు పోషక పదార్థములు లభించవు.
  • కనుక తల్లిపాల ప్రాముఖ్యతను పిల్లల ఆరోగ్యమును మెరుగు పరచుటకు కార్యకర్తలు కృషి చేయాలి.
  • బిడ్డ పుట్టగానే వీలున్నంత తొందరగా బిడ్డని తల్లికి ఇవ్వాలి. ఆరోగ్య సంరక్షణ వారిద్దరి చేరువకి అనుగుణంగానే ఉండాలి.
  • గర్భవతులకి సహాయకారిగా ఉండే బంధువులకి, సన్నిహితులకి తల్లిపాల మేలు గురించి అవగాహన కలిగించాలి.

తల్లిపాల వల్ల లభించే మరి కొన్ని ప్రయోజనాలు

  • శిశువులకు తల్లిపాలు అత్యుత్తమమైన, ప్రకృతిసిద్ధమైన ఆహారం
  • తల్లిపాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంటాయి
  • తల్లిపాలు బిడ్డను వ్యాధుల నుంచి రక్షిస్తాయి
  • తల్లిపాలు బిడ్డను మరింత మేధావిని చేస్తాయి
  • తల్లిపాలు రోజుకు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. వాటికి ప్రత్యేకమైన తయారీ అవసరం లేదు
  • తల్లిపాలు బిడ్డకు ప్రకృతి ప్రసాదించిన కానుక. దానిని కొనసలసిన అవసరం లేదు
  • తల్లిపాలు తల్లీబిడ్డల మధ్య ప్రత్యేక అనుబంధాన్ని పెంచుతాయి
  • తల్లిపాల వలన తల్లిదండ్రులు బిడ్డల మధ్య వ్యవధి పాటించ గలుగుతారు
  • తల్లి గర్భిణీగా ఉన్నప్పుడు పెరిగిన అదనపు బరువును తల్లిపాలు తగ్గిస్తాయి

తల్లిపాలు త్వరగా తాగించడం

  • పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంతో పాటు బిడ్డకు కొలస్ట్రం ( తల్లి మొదటి పాలు) లభించేలా చేయడం కోసం తల్లిపాలను త్వరగా తాగించడం చాలా ముఖ్యం వీలైనంత త్వరగా అంటే పుట్టిన గంటలోపు బిడ్డకు తల్లిపాలు లభించేలా చేయాలి. అప్పుడే పుట్టిన శిశువు చాలా చురుగ్గా ఉంటుంది.
  • బిడ్డను తల్లి దగ్గర ఉంచి, చనుబాలు పట్టే ప్రయత్నం చేస్తే శిశువు పాలు తాగడం త్వరగా నేర్చుకొంటుంది. బిడ్డ త్వరగా పాలు తాగడం వలన తల్లిలో పాల ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమై చనుబాలు గ్రహించే ప్రక్రియ వేగమవుతుంది.
  • సిజేరియన్ ప్రసవాలలో శిశువుకు 4 – 6 గంటల లోపు తల్లిపాలు తాగించడం ప్రారంభించాలి. పుట్టిన వెంటనే శిశువును తల్లికి దగ్గరగా పడుకోబెట్టడం వలన వారికి వెచ్చదనం లభించడంతో పాటు తరచుగా పాలివ్వడం వీలవుతుంది. దాని వలన పాలు త్వరగా, మెరుగ్గా వస్తాయి.
  • తల్లి మొదటి పాలను కొలస్ట్రం అంటారు, ఇవి తరువాతి పాల కన్నా చిక్కగా, పసుపురంగులో ఉండే ఈ పాలు కొద్దికొద్దిగా మొదటి కొద్దిరోజుల పాటు వస్తాయి. ఇవి శిశువుకు తప్పక తాగించాలి. ఈ సమయంలో బిడ్డకు అందించవలసిన ద్రవాహారం కొలస్ట్రం ఒక్కటే. మరే అనుబంధ ఆహారాలు అవసరం లేదు. నీళ్ళు కూడా తాగించనవసరం లేదు.
  • ముఖ్యంగా మొదటికాన్పు అయినట్లయితే, తల్లిపాలు పట్టే భంగిమ విషయంలో తల్లికి సహాయం అవసరమవుతుంది. బిడ్డ కోరినప్పుడల్లా, తరచుగా తల్లిపాలు తాగించాలి. బిడ్డకు కావలసినప్పుడల్లా పాలివ్వడాన్ని కొనసాగించాలి.
  • ఈ సమయంలో, ఆ తరువాత కూడా కొత్తగా పుట్టిన శిశువుకు తేనె, గుట్టీ, జంతువుల పాలు, పాలపొడి. టీ, నీళ్ళు, గ్లూకోజు నీళ్ళ వంటి మరే ఇతర ద్రవంగానీ, ఆహారంగానీ ఇవ్వకూడదు. ఇవి బిడ్డకు హాని చేసే ప్రమాదముంది.

తల్లిపాలు మాత్రమే

  • తల్లిపాలు మాత్రమే అంటే తల్లిపాలు మినహా మరే పాలను, ఆహారాన్ని, ద్రవాలను, కనీసం నీటిని కూడా శిశువుకు తాగించకపోవడం. మొదటి ఆరునెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగించాలి. మొదటి ఆరునెలల పాటు బిడ్డకు కావలసిన అత్యుత్తమ, సంపూర్ణ పౌష్టికాహారాన్ని తల్లిపాలు అందిస్తాయి. కేవలం తల్లిపాలు మాత్రమే తాగే పిల్లలకు మరే ఆహారం గానీ, ద్రవంగానీ అవసరం లేదు.
  • మూలిక పసరు, గ్లూకోజు నీళ్ళు, పళ్ళరసాలు, నీళ్ళు ఆరునెలల పాటు వారికి అవసరం ఉండదు. దేశంలో ఎంత పొడి, ఉష్ణ పరిస్థితులున్నప్పటికీ, ఉష్ణోగ్రత ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ బిడ్డ శరీరానికి కావలసిన నీటి అవసరాలను తల్లిపాలు సమకూరుస్తాయి.
  • తల్లిపాలు శిశువువులను విరేచనాలు, న్యూమోనియా నుండి రక్షిస్తాయి కనుక శిశువులందరికీ కేవలం తల్లిపాలు లభించేలా చూడడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పిల్లల్లో చెవి ఇన్ ఫెక్షన్ లను, ఆస్థమా, ఎలర్జీ వంటి వాటిని నివారించడానికి తల్లిపాలు దోహదపడతాయి.
  • కేవలం ఒక్కసారి జంతువుల పాలనుగానీ, పాలపొడినిగానీ, ఇతర ఆహార పదార్థాన్ని గానీ, చివరకు నీటిని కూడా త్రాగించినా రెండు నష్టాలు కలుగుతాయి.
    • మొదటిది - తల్లిపాలు తగ్గిపోతాయి. ఎందుకంటే శిశువు తక్కువ పాలు తాగుతాడు. దాని వల్ల స్తన్యం తక్కువ పాలను ఉత్పత్తి చేస్తుంది.
    • మరే ఇతర ఆహారం, నీరు ద్రవాన్ని పాక్షికంగా ప్రవేశ పెట్టినా ఇన్ ఫెక్షన్లు ముఖ్యంగా విరేచనాలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు మొదటి ఆరునెలల పాటు కేవలం తల్లిపాలు తాగించినట్లయితే శిశు మరణాల రేటు నాలుగు రెట్లు తగ్గుతుందని ఇటీవల ప్రపంచ ఆర్యోగ్య సంస్థ అంచనాలు చెబుతున్నాయి.
  • కేవలం తల్లిపాలు మాత్రమే తాగించడం శిశువు జీవితానికి శుభారంభం పలుకుతుంది. అవి వారిని చురుగ్గా చేసి, మేధా ప్రతిభను పెంచుతుంది. వారు గరిష్టంగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. శిశువులో తొలినాళ్ళలో విరేచనాలు, శ్వాస సంబంధమైన తీవ్ర ఇన్ ఫెక్షన్లు తగ్గించి, తద్వారా మరణాల రేటును తగ్గించడానికి కేవలం తల్లిపాలు మాత్రమే తాగించడం చాలా ముఖ్యం. తల్లిపాలు మాత్రమే కానట్లయితే తల్లిపాల వలన కలిగే ప్రయోజనాలు తగ్గిపోతాయని గుర్తుంచుకోవాలి.

ఆధారం: మహిళాభివృద్ధి శిశుసంక్షేమ శాఖ – ఆంధ్రప్రదేశ్

తల్లులకు పౌష్టికాహారం

అనుబంధ పోషకాహారం అంటే తల్లిపాలలో పాటుగా 6 నెలలు నిండినప్పటి నుండి పిల్లలకు ఇచ్చే అదనపుఆహారం. తల్లి పాలతో పాటు ఎదుగుతున్న పిల్లలకు అనుబంధ పోషకాహారం ఎంత అవసరమో, అలాగే తల్లలకూ పోష్టికాహారం అత్యంత ఆవశ్యకం.

పోషణ మానవుల మౌలిక అవసరాలలో ఒకటి. ఆరోగ్యకరమైన జీవితానికి తప్పనిసరి కూడా. పెరుగుదల, వికాసం, చురుకైన జీవితానికి సరైన ఆహారం జీవితం యొక్క తొలిదశ నుండే అవసరం.

స్త్రీ గర్భం ధరించిన నాటి నుండి తొలిదశగానే పరిగణించాలి. తల్లి తీసుకొనే జాగ్రత్తలు బిడ్డకి ఎంతగానో మేలు చేస్తాయి.

  • శరీర ధర్మపరంగా, పోషణపరంగా కూడా, గర్భంతో ఉన్న సమయం చాలా కీలకమైనది.
  • గర్భంతో ఉన్నప్పుడు తన శరీరంలో క్రొవ్వు నిలువలను పెంచడం ద్వారా స్త్రీ పోషణ అవసరాలను తీర్చుకొనేందుకు తయారవుతుంది.
  • తగినంత పాలను ఉత్పత్తి చేసేందుకు,తన ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు, పాలిచ్చే తల్లికి అదనపు ఆహారం అవసరమవుతుంది
గర్భంతో ఉన్నప్పుడు, బిడ్డకు పాలిస్తున్నప్పుడు ఆహారం అదనంగా ఎందుకు కావాలి ?

శరీరధార్మిక పరంగా, గర్భంతో ఉన్న సమయం పలురకాల అవసరాలను ఎదుర్కొనవలసిన పరిస్థితిని కలిగిస్తుంది. భారతదేశంలోని పేదవర్గానికి చెందిన స్త్రీలు తీసుకొనే ఆహారాన్ని పరిశీలిస్తే గర్భానికి ముందుగానీ, గర్భంతో ఉన్నప్పుడుగానీ, ఆ తరువాత పాలిచ్చే సమయంలోగాని, వాళ్ళ ఆహారం దాదాపు ఒకే విధంగా ఉంటున్నట్లు గుర్తించారు. ఆ కారణంగా విస్తృతమైన లోప పోషణ ఏర్పడి, శిశువులు తక్కువ బరువుతో పుట్టడానికి, ఎక్కువ సంఖ్యలో మాతృ మరణాలు సంభవించడానికి దారితీస్తోంది. శిశువు తగిన బరువుతో పుట్టడావికి, తల్లి శరీరంలో తగిన క్రొవ్వు నిలువలు చేరడానికి, గర్భిణీ స్త్రీకి అదనపు ఆహారం అవసరమవుతుంది అలాగే, పాలిచ్చే తల్లులకు కూడా తాము మంచి పోషక విలువలుండే పాలను తగినంత తయారు చేయడానికి తమ ఆరోగ్యం కాపాడుకొనేందుకు అదనంగా పోషకాలు కావాలి.

ఏ పోషకాలను ఎక్కువగా ఆహారంలో తీసుకోవాలి ?

గర్భిణీగా ఉన్న సమయంసగం గడిచేసరికి స్త్రీ యొక్క ఆహారంలో అదనంగా 300 కేలరీలు, 15 గ్రా!!ల మాసంకృత్తులు, 10గ్రా. క్రొవ్వు రోజూ చేర్చాలి. పాలిచ్చే సమయంలో రోజుకు 500 కేలరీలు, 25గ్రా. మాంసకృత్తులు , 25గ్రా. క్రొవ్వు ఎక్కువగా కావాలి. ఈ ప్రత్యేక పరిస్థితులలో, కొన్ని సూక్ష్మపోషక పదార్థాలు కూడా ఎక్కువగా అవసరమవుతాయి. గర్భస్థ సమయమంతట, ఫోలిక్ యాసిడ్ తీసుకొనడం ద్వారా శిశువు అవలక్షణాలతో పుట్టే ప్రమాదం తగ్గడం, ఎక్కువ బరువుతో పుట్టడం లాంటి లాభాలుంటాయి. ఎర్ర రక్తకణాల తయారీకి కావలసిన అవసరాలను తీర్చేందుకు తల్లికి, ఆమెలో పెరుగుతున్న బిడ్డకు కూడా ఇనుము ధాతువు అవసరముంటుంది. బిడ్డ పళ్ళు, ఎముకలు బాగా తయారుకావడానికి, తల్లిపాలలో కాల్షియం స్థాయి పెరిగి తద్వారా ఆమెకు ఆస్టియోపొరొసిస్ రాకుండా ఉండడానికి కాల్షియం స్థాయి అవసరం. అలాగే తగినంత అయొడిన్ తీసుకోవడం వల్ల పెరుగుతున్న పిండానికి తరువాత బిడ్డకు సరయైన మానసిక ఆరోగ్యం ఏర్పడుతుంది. బిడ్డ సవ్యంగా పెరిగి ఆరోగ్యంగా ఉండడానికి పాలిచ్చే సమయంలో తల్లికి విటమిన్-ఎ కావాలి. ఇవే కాకుండా, విటమిన్ –బి, సి-విటమిన్లను పాలిచ్చే తల్లి తీసుకోవాలి.

అదనపు పోషక అవసరాలను గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు ఎలా తీర్చుకోవాలి ?

గర్భిణీ స్త్రీ తన మరియు తనలో పెరుగుతున్న పిండానికి అవసరమైన పోషకాలు అందేలా పలు విధాలైన ఆహార పదార్థాలనుతినాలి. అలాగే పాలిచ్చే తల్లుల ఆహారం కూడా శిశువు పెరుగుదలకు మరియు తమ ఆరోగ్యానికి కావసిన పోషక పదార్థాలను అన్నింటిని అందించేలా ఉండాలి. వాళ్ళ ఆహార పద్ధతులు అన్నింటిని అందించేలా ఉండాలి. వాళ్ళ ఆహార పద్ధతులు ప్రత్యేకించి మార్చుకోవలసిన అవసరం లేదు. తీసుకొనే ఆహార పదార్థాల మోతాదును ఎక్కువ చేయడం, ఎక్కువసార్లు తినడం అవసరం. ఆమె చాలా ఎక్కువ శాతం శక్తిని (సుమారు 60%) బియ్యం, గోధుమలు, చిరుధాన్యాల నుండి సంపాదించుకోవచ్చు. వంటనూనెలు శక్తిని, పోలీ అన్ శాచ్యురేటేడ్ ఫ్యాటీ యాసిడ్లల చాలా ఎక్కువగా కలిగి ఉంటాయి. మంచి నాణ్యమైన మాంసకృత్తులు పాలు, చేపలు, మాంసం, కోడి మాంసం, గ్రుడ్ల నుండి లభిస్తాయి. కాని గింజధాన్యాలు, పప్పులు, కాయలను సరియైన నిష్పత్తులలో వాడినప్పుడు కూడా మంచి మాంస కృత్తులను పొందవచ్చు. ఆయా కాలాల్లో దొరికే కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలు, పాలు, తాజా పళ్ళ ద్వారా ఖనిజాలు, విటమిన్లు అవసరాలకు తగినంత పొందవచ్చు. శరీరానికి ఇనుము యొక్క అందుబాటు పులియబెట్టిన పదార్థాలు, మొలకెత్తిన పప్పులు, విటమిన్-సి అధికంగా ఉండే ఆహారపదార్థాలు, పుల్లటి పళ్ళ ద్వారా ఎక్కువచేసుకోవచ్చు. శరీరానికి కాల్షియం బాగా అందటానికి పాలు మంచి ఆహారంగా పనిచేస్తాయి సమతుల ఆహారం ద్వారా పోషకాలలో చాలావాటిని సంపాదించుకోగలినప్పటీకీ, గర్భిణీ, స్త్రీలు, పాలిచ్చేతల్లులు అదనపు పోషకాలను-ఇనుము, పోలిక్ యాసిడ్, విటమిన్-బి12, కాల్షియం విడిగా తీసుకోవలసిన అవసరం ఉంటుంది.

అదనంగా మరే జాగ్రత్తలు తీసుకోవాలి

స్త్రీ గర్భిణీగా ఉన్నప్పుడు పోషకాహారాన్ని అదనంగా తీసుకొంటూ ఉంటే ఆమె 10-12 కిలోల మేరకు బరువు పెంచుకోగలుగుతుంది. పీచుపదార్థం ఎక్కువగా ఉండే నిండు గింజ ధ్యాన్యాలు, పప్పులు, కూరగాయలను తీసుకొంటూ మలబద్ధకం రాకుండా చూసుకోవాలి. రోజుకు 8-12 గ్లాసుల నీటితో సహా ఎక్కువగా ద్రవాలను త్రాగాలి. గర్భకాలంలో అధిక రక్తపుపోటు, ప్రీ ఎక్లాంప్సియా వంటి రుగ్మతలను రాకుండా చూసుకోవలసి వచ్చినప్పటికి, ఉప్పును మాత్రం తగ్గించరాదు. కాఫీ టీ లాంటి కెఫిన్ కలిగిన పానీయాలను ఎక్కువగా తీసుకొంటే పిండం పెరుగుదల దెబ్బ తింటుంది. అందుకే వాటిని ఎక్కువగా తీసుకోరాదు.

ఆ విధంగా ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవడానికి తోడు శరీర బరువు పెరుగుదల, రక్తపుపోటు, రక్తహీనత పరిస్థితి మొదలైనవి పరిశీలనలో ఉంచుకోవడానికి గర్భిణీ స్త్రీ తరచు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఆ పైన టెటనెస్ టాక్సాయిడ్ ఇంజక్షను తీసుకోవాలి. తగిన శరీర వ్యాయామం, రోజులో 2-3 గంటల విశ్రాంతి ఆమెకు అవసరం. వైద్యుని సలహా లేకుండా గర్భిణీ స్త్రీ ఎలాంటి మందులు తీసుకోరాదు. ఎందుకంటే కొన్ని గర్భస్థ పిండానికి, శిశువుకు హాని కలిగిస్తాయి. పొగ త్రాగడం, పొగాకు నమలడం, మద్యం సేవించడం పనికిరాదు. ఆహారాన్ని గురించిన నిషిద్ధాలు పాటించకుండా చేయాలి.

  • గర్భవతిగా ఉన్నప్పుడు, పాలిచ్చే కాలంలో ఆహారాన్ని ఎక్కువగా తినాలి.
  • గింజధాన్యాలు (నిండువి), మొలకెత్తిన పప్పులు, పులియబెట్టిన ఆహారపదార్థాలను ఎక్కువగా తినాలి.
  • పాలు, మాంసం, గ్రుడ్లను తినాలి..
  • కూరగాయలు, పళ్ళను ఎక్కువగా తినాలి.
  • అపనమ్మకాలను, ఆహారం విషయంలో నిషిద్ధాలను మానాలి.
  • మద్యం, పొగాకును వాడవద్దు. డాక్టరు వాడమని సిఫార్సు చేసినప్పుడే మందులను వాడాలి.
  • గర్భిణీగా ఉన్నప్పుడు 14-16 వారాల నుండి క్రమం తప్ప కుండా ఇనుము, ఫోలేట్, కాల్షియం తీసుకొంటూ బిడ్డకు పాలిచ్చే సమయంలో కూడా వాటిని అలాగే తీసుకోండి.

ఫోలేట్ పుష్కలంగా ఉన్న ఆహారపదార్థాలను తినండి

  • హిమోగ్లోబిన్ తయారయ్యేందుకు ఫోలిక్ యాసిడ్ తప్పకుండా కావాలి.
  • ఫోలిక్ యాసిడ్ లోపం మాక్రోసైటిక్ రకం అనీమియా (రక్తహీనత)కు దారి తీస్తుంది.
  • గర్భిణీ స్త్రీలకు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా కావాలి.
  • గర్భిణీ సమయంలో 100 ఐరన్ ఫోలిక్ మాత్రలు తప్పకుండా తీసుకోవాలి.
  • అదనంగా ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల బిడ్డ ఎక్కువ బరువుతో పుట్టి, పుట్టుకతో వచ్చే అవలక్షణాలు తగ్గుతాయి.
  • ఆకుకూరలు, పప్పులు, పప్పుదినుసులు, కాయలు, కాలేయం, ఫోలిక్ యాసిడ్ ను ఎక్కువగా అందిస్తాయి

ఇనుము ధాతువు సమృద్ధిగా ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోవాలి

  • హిమోగ్లోబిన్ ఏర్పడడానికి, మానసిక క్రియలకు, శారీరక రక్షణ వ్యవస్థకు, ఇనుము ధాతుకు అవసరమవుతుంది.
  • ఇనుము లోపం అనీమియా (రక్తహీనత) కు దారి తీస్తుంది.
  • ఇనుము లోపం ప్రత్యేకించి పునరుత్పత్తి దశలో ఉన్న స్త్రీల లోను, పిల్లల్లోనూ సాధారణంగా కనిపిస్తుంది.
  • గర్భస్థ దశలో ఇనుములోపం ఉంటే, అది తల్లుల మరణాలను శిశువులు తక్కువ బరువుతో పుట్టే సంఘటనలను ఎక్కువ చేస్తుంది.
  • ఆ లోపం వల్ల పిల్లలు ఇన్ పెక్షన్ లకు (సంక్రమణ వ్యాధులకు) గురికావడం, మానసిక గ్రాహకశక్తి మందగించడం ఎక్కువవుతుంది.
  • పప్పులు, లెగ్యుమ్ జాతికి చెందిన పదార్థాలు, ఎండబెట్టిన పళ్ళు, పచ్చని ఆకుకూరల్లో ఇనుము ఉంటుంది.
  • మాంసం, చేపలు, కోళ్ళ ఉత్పత్తుల నుండి కూడా ఇనుమును పొందవచ్చు.
  • విటమిన్ – సి బాగా కలిగి ఉన్న ఉసిరిక, జామ, నారింజ, ఇతర పుల్లరకం పళ్ళు శరీరం ఇనమును గ్రహించడాన్ని మెరుగు పరుస్తాయి.
  • శాకాహార పదార్థాల నుండి ఇనుమును శరీరానికి తక్కువగా అందుతుంది. అదే జంతు సంబంధ ఆహార పదార్థాల నుండి ఎక్కువగా అందుతుంది.
  • టీ లాంటి పానీయాలు ఆహారంలోని ఇనముతో కనిసిపోయి, శరీరానికి ఇనుము అందకుండా చేస్తాయి. అందుకే అలాంటి పానీయాలను భోజనానికి ముందు, భోజనం చేస్తున్నప్పుడు లేదా భోజనమైన వెంటనేగాని పుచ్చుకోరాదు.

శిశువులకు 6 నెలలు వయస్సు నిండగానే అదనపు ఆహార పదార్థాలను ఇవ్వాలి

  • శిశువులకు 6 నెలలు వయస్సు దాటిన తరువాత తల్లి పాలోక్కటే చాలవు.
  • 6 నెలలు నిండగానే తల్లిపాలతో పాటు ఇతర ఆహార పదార్థాలను ఇవ్వడం మొదలుపెట్టాలి.
  • అదనపు ఆహారం తగినంతగా ఇవ్వడంవల్ల చిన్నపిల్లల్లో లోపపోషణను నిరోధించవచ్చు.
  • బిడ్డకు పై ఆహారాన్ని తయారుచేయడంలోనూ, తినిపించడంలోనూ, పరిశుభ్రతను పాటించాలి. లేకుంటే అది విరోచనాలకు దారి తీస్తుంది.

శిశువుకు తల్లిపాలు ఉత్తమమైన ఆహారం అని అందరూ ఒప్పు కొంటారు. అదృష్టవశాత్తు మనదేశంలో గ్రామాల్లో చాలామంది తల్లులు ఎక్కువకాలం పాటు తమ పాలను పిల్లలకు త్రాగిస్తారు. నిజానికి ఇది మనదేశపు పిల్లలకి ఒక వరమనే చెప్పాలి. ఎందుకంటే అలాకాని పక్షంలో వారిలో లోపపోషణ ఎంతో ఎక్కువగా ఉండి ఉండేది. కాని బిడ్డలు తమంతట తాముగా ఆహారాన్ని తీసుకొని తినే వయస్సు వచ్చేదాకా వాళ్ళకు తల్లిపాలొక్కటే చాలునన్న ఉద్దేశ్యంతో పిల్లలకు ఒక ఏడాది వయస్సు వచ్చినా వాళ్ళకు తల్లిపాలు మాత్రమే కొందరు తల్లులు ఇస్తుంటారు. దానివల్ల చిన్నపిల్లల్లో లోపపోషణ ఏర్పడుతుంది.ఇక పనికి వెళ్ళే తల్లులు బయట పనికి వెళ్ళాలి గనుక వాళ్ళ పిల్లలకు ఎక్కువకాలం పాలు ఇవ్వలేకపోతున్నారు.

అదనపు ఆహారమంటే ఏమిటి ?

పాలవంటి ద్రవ ఆహారపదార్థాలు కావచ్చు లేదా జారుడు ద్రవంగా వుండే పాయసం కావచ్చు, లేదా ఒక ఏడాది బిడ్డల విషయంలోనైతే, అన్నంలాంటి ఇతర ఘనాహారాలు కావచ్చు.

అదనపు ఆహారాన్ని ఎందుకు వాడాలి ?

పుట్టిననప్పుడు శిశువుకు తల్లిపాలు ఒక్కటే చాలు. శిశువు పెరిగే కొద్దీ, క్రమంగా అన్ని పోషకపదార్థాల అవసరాలు ఎక్కువవుతాయి. అదే సంమయంలో క్రమేపి, తల్లిపాల పరిమాణం తగ్గుతూ ఉంటుంది. పెరుగుతున్న పోషక అవసరాలు, తగ్గుతున్న తల్లిపాలు ఈ రెండు కారణాల వల్ల బిడ్డకు లభించే పోషక పదార్థాలు తగ్గుతాయి. మామూలుగా ఈ పరిస్థితి బిడ్డకు 6 నెలలు వయస్సు వున్నప్పుడు ఏర్పడుతుంది. అందుకే అలాంటప్పుడు శిశువుల పెరుగుదల తగిన విధంగా ఉండాలంటే 6 నెలలు వయసు నిండినప్పటి నుండి తల్లిపాలతో పాటు అదనంగా ఇతర ఆహార పదార్థాలు ఇవ్వాలి.

ఇంట్లో తయారైన వంటకాలు అదనపు పోషకాహారంగా పనికివస్తాయా ?

మామూలుగా వాడే ఆహారపదార్థాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో అదనపు ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు . వాటి తయారీలో బియ్యం, గోధుమ, రాగులు, జొన్న, సజ్జల వంటి తృణధాన్యాలు, పప్పు దినుసులు, వేరుసెనగ (పల్లీ) కాయలు, నువ్వులు వంటి నూనె గింజలు, వేరుసెనగ నూనె, నువ్వులనూనె వంటి వంటనూనెలు, చక్కెర బెల్లం లాంటివాటిని ఉపయోగించవచ్చు. అలాంటి ఆహారపదార్థాలు లోపపోషణతో బాధపడే పిల్లలతో సహా అందరు శిశువులు సులభంగా జీర్ణించుకొంటారు. మార్కెట్లో వాణిజ్యపరంగా దొరికే ఆహార పదార్థాలు మాత్రమే పుష్టినిస్తాయన్న అభిప్రాయం సరియైనది కాదు.

శిశువులకు అదనపు ఆహారాన్ని తయారుచేయడంలో ముఖ్యసూత్రాలు ఏవి ?

గింజధాన్యాలు, పప్పు-నూనె గింజలతోపాటు చక్కెర, బెల్లం చేర్చిన మిశ్రమాలు శిశువులకు చక్కని అదనపు ఆహారంగా ఉపయోగపడి, మంచి నాణ్యమైన మాంసకృత్తులను, తగినంత కేలరీలను ఇతర రక్షక పోషకాలను అందిస్తాయి. శిశువులు ఎక్కువ పరిమాణంలో ఆహారాన్ని తీసుకొనలేరు కనుక తక్కువ బరువుతో శక్తిసాంద్రత అధికంగా ఉండే క్రొవ్వు, చక్కెరను వారి ఆహారంలో వాడాలి. తక్కువ ఖర్చుతో విటమిన్లు, ఖనిజాలను అందించే ఆకుకూరలను కూడా అదనపు ఆహారం తయారీలో వాడవచ్చు. కాని ఈ విషయంలో ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఆకుకూరలను వండే ముందు శుభ్రంగా కడగాలి. లేకుంటే శిశువులకు విరోచనాలు రాగలవు. అసలు ఆకుకూరలలోని ఫైబర్ (పీచు పదార్థం) కారణంగానే పిల్లల్లో నీళ్ళ విరోచనాలు రావచ్చు. ఆకుకూరల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కనుక, మొదటి నెలల్లో ఉడికించిన ఆకుకూరల రసం మాత్రమే ఆహారంలో వాడడం మంచిది. క్రమంగా శిశువుల ఆహారంలో వేరువేరు కూరలు, పళ్ళను ప్రవేశపట్టాలి. వాడే పదార్థాలను బాగా ఉడికించి, గుజ్జుగా చేసి తినిపించాలని మరచిపోకూడదు. కుటుంబం ఇవ్వగలిగితే మాంసం సూప్ ఇవ్వవచ్చు. దాదాపు ఒక సంవత్సరం వచ్చేసరికి బిడ్డకు కుటుంబ సభ్యులు తినే భోజన పదార్థాలను ఇవ్వవచ్చు.

అమైలేజ్ ఎక్కువగా ఉండే ఆహారం అంటే ఏమిటి ?

మొలకెత్తిన గింజధాన్యాల పిండిలో ఆల్ఫా ఆమలైజ్ ఎంజైమ్ లు ఎక్కువగా ఉంటాయి. వాటిని అమలైజ్ రిచ్ పుడ్ (ఎ.ఆర్.ఎఫ్) అంటారు. ఈ రకమైన ఆహారపదార్థాలు, గింజ ధాన్యాలను ఆధారంగా చేసుకొని తయారుచేయబడ్డ ఆహారం, ఆహారం యొక్క బరువును తగ్గించి పల్చగా చేస్తాయి. అందుకే ఎ.ఆర్.ఎఫ్. పిల్లలకు మొదట వాడే గంజి పాయసం లాంటి పదార్థాల శక్తి సాంద్రతను ఎక్కువచేసి, వాటి బరువును తగ్గిస్తుంది. తక్కువ ఖర్చుతో తయారైన అదనపు ఆహారానికి తల్లులు ఎ.ఆర్.ఎఫ్. ను చేర్చి వాటిని శిశువులకు సులభంగా జీర్ణమయ్యేలాగా చేయవచ్చు. ఎ.ఆర్.ఎఫ్. ను తల్లులు ఇంట్లో సులభంగా తయారుచేసుకోవచ్చు.

అనుబంధ ఆహారపదార్థాలు సురక్షితంగా ఉండేలా చూడడం

అనుబంధ ఆహారము కలుషితం కాకుండా ఉండడం కోసం వాటిని జాగ్రత్తగా తయారుచేసి నిల్వ చేయడం చాలా ముఖ్యం. చిన్నపిల్లలకు ఆహారం తినిపించడంలో వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్య పాత్ర పోషిస్తుంది. పరిశుభ్రతను పాటించనట్లయితే, పిల్లలకు,ఇన్ ఫెక్షన్లు సోకి అనుభంధ ఆహారం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతుంది. అందువలన శిశువులకు ఆహారం తయారుచేసే సమయంలో దానిలో ఎంటువంటి క్రిమి కీటకాలు లేకుండా చూసుకోవాలి. శిశువులకు ఆహారం తయారుచేసేటప్పుడు ఈ క్రింది విషయాలు గుర్తుంచు కోవాలి.

  • కంటికి కనిపించని క్రిములు, మురికి చేతుల నుంచి ఆహారం లోకి ప్రవేశిస్తాం. కనుక ఆహారం వండేటప్పుడు, తినిపించేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
  • గిన్నెలను బాగా రుద్ది తోమి కడగాలి. తడి లేకుండా తుడిచి మూతపెట్టి ఉంచాలి.
  • వండడం వలన చాలా క్రిములు నశిస్తాయి. శిశువుల కోసం తయారుచేసే ఆహారపదార్థాలను బాగా ఉడికించడం వలన అందులో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటె నశిస్తుంది.
  • వండిన తరువాత దానిని వీలైనంత కొద్ది మొత్తంలో బయట ఉంచాలి. మిగిలిన ఆహారాన్ని మూతపెట్టిన పాత్రలో ఉంచి దుమ్ము, ఈగలు దరి చేరకుండా చూడాలి.
  • వండిన ఆహారాన్ని ఉష్ణ వాతావరణంలో ఒకటి రెండు గంటల కన్నా ఎక్కువసేపు ఉంచకూడదు. వాటిని రిఫ్రిజిరేటర్ లో పెట్టేయాలి.

తల్లి తనను తాను సంరక్షించుకుంటూ, బిడ్డను సంరక్షించాలి. దానికి కుటుంబ వ్యక్తులు, సంబంధింత కార్యకర్తలు, అధికారులు, ప్రజాసంస్థల వారు తోడ్పడాలి. సరైన ఆహారం, బిడ్డలకు సకాల అనుబంధ పోషకాహారం జాతి ఆరోగ్యానికి, ప్రగతికి కీలకం అని అంగన్ వాడి కార్యకర్తలు ప్రతి తల్లికి తెలియజెయాల్సిన బాధ్యతగా గుర్తించినప్పుడు పిల్లల్లో పోషకలోపాన్ని అరికట్టగలం.

గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వాడకూడని మందులు

ఈ ఆధునిక వైద్యయుగంలో మాత్రలు, సూదులు, టానిక్ లు ఒక విధంగా చూస్తే వరం లాగా, మరోరకంగా చూస్తే శాపం లాగా కనిపిస్తుంటాయి. టైఫాయుడ్, మలేరియా, క్షయ, గుండెపోటు లాంటి విషమ వ్యాధుల నుంచి మనలని కాపాడగలిగేవి ఈ మందులే. అలాగే విచక్షణ లేకుండా ఇష్టమొచ్చినట్లు వాడినప్పుడు మనల్ని భయంకరమైన సమస్యలకు గురిచేసేవీ ఈ మందులే. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు. పాలిచ్చే తల్లులు మందులు వేసుకోవటం వలన జరగబోయే హాని గురించి తలుసుకొందాం.

మందుల వల్ల వచ్చే దుష్ప్రభావాలు

  • అధిక మోతాదులో విటమిన్లు- విటమిన్ – ఎ, డిల వల్ల మూత్ర నాళ వ్యవస్థ, మెదడు సరిగా ఎదకపోవటం ఉంటుంది.
  • విటమిన్ డి వల్ల అప్పుడే పుట్టిన బిడ్డ రక్తంలో కాల్షియం ప్రమాణం మారుతంది. దీనికి క్రొవ్వులో కరిగే శక్తి ఉంటుంది. కానీ నీళ్ళతో ఉండదు. దానితో ఇది మూత్రం ద్వారా బయటికి విసర్జించబడదు.

యాంటిబయాటిక్స్

  • పెన్సిలిన్:పాలిచ్చే సమయంలో తీసుకోవడం వల్ల పెన్సిలిన్ పాలద్వారా పాపకి చేరి పడకపోయే అవకాశం ఉంది. తల్లికి దీనివల్ల ఏ ఇబ్బందీ లేకపోతే గర్భిణీ సమయంలోనే తీసుకోవచ్చు.
  • టెట్రాసైక్లిన్:పుట్టబోయే బిడ్డ దంతాలక హాని చేస్తుంది. గర్భిణీ సమయంలో గానీ పాలిచ్చేటప్పుడుగానీ అస్సలు తీసుకోకూడదు.
  • క్లోరిమ్ ఫెనికాల్ :అస్సలు వాడకూడదు. కడుపులో బిడ్డకు చాలా ప్రమాదకరం.
  • సల్ఫానమైడ్:అప్పుడే పుట్టిన బిడ్డకు కామెర్లు రావచ్చు. సెఫ్ట్రాన్ / బాక్ట్రిన్ కూడా ఈ కోవలోకే వస్తాయి.
  • సెప్ట్రామైసిన్, కనామైసిన్ :కడుపులోని శిశువు వినికిడి శక్తిని దెబ్బతీస్తాయి.
  • మెట్రోనిడజోల్:గర్బిణీ సమయంలో వాడకూడదు. మరీ ముఖ్యంగా మొదటి నాలుగు నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.

నొప్పి తగ్గించే మందులు

  • ఆస్ట్రిన్ (పాలిసైలేట్స్):చాలా ఎక్కువ సమస్యలొచ్చే అవకాశం ఉంది కాబట్టి వాడకుండా ఉండటానికి ప్రయత్నించాలి.
  • ఇబూప్రొఫెన్, ఆక్సిఫెన్ బుటాజోన్ (బ్రూఫిన్, కామ్ బి ఫ్లామ్):గుండెకు సమస్యలొచ్చే అవకాశం ఉంది.
  • పెథెడిన్,సుగాన్ రిల్:వీటికి తర్వాత అలవాటుపడే ప్రమాదం ఉంది.
  • మార్ఫిన్:దీనిని ప్రసవ నొప్పులు మొదలైన తర్వాత ఇస్తారు. దానితో పుట్టబోయే బిడ్డ మగతగా ఉండొచ్చు. అలాగే తల్లికి కూడా మత్తుగా, వికారంగా ఉండి వాంతులవుతాయి. ఒక్కోసారి మార్ఫిన్ వల్ల నొప్పులు ఆగిపోయి గర్భాశయం కదలికలు, ప్రసవం ఆలస్యం అవుతుంది.

మత్తు కలిగించే మందులు

  • బార్ బిచ్యురేట్స్ (గారినాల్, లూమినాల్):మూర్ఛవ్యాధి కోసం వాడతారు. దీనివలన కడుపులో బిడ్డకు తొర్రి (చీలిక పెదవులు) ఏర్పడవచ్చు. ప్రసవ నొప్పుల సమయం లో వాడితే గనుక బిడ్డ మీద ఆ ప్రభావం ఉంటుంది.
  • డయాజెపామ్ (కాంపోజ్):గర్భిణీ సమయంలో ప్రత్యేక పరిస్థితులోనే దీనిని ఇస్తారు. అయితే ఇది ఎంత మాత్రమూ సురక్షితం కాదు కనుక సాథ్యమైనంత వరకు వాడకుండా ఉండాలి. బిడ్డ శరీరంలో అవలక్షణం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే నొప్పుల సమయంలో ఇస్తే బిడ్డ మగతగా ఉండే అవకాశం ఉంటుంది.
  • హార్మోన్లు (ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్):గర్భంలో ఉన్న శిశువుకు జనాంగంలో మగ లక్షణాలు వస్తాయి. డైధిల్-సిల్ బెస్ట్రాల్ (ఈస్ట్రోజెన్ హార్మోన్లు) ఆడ శిశువులు పుట్టిన ఇరవైయేళ్ళ తర్వాత వారిలో యోని కాన్సర్ కు కారణమౌతుంది.
  • కార్టికో స్టెరాయిడ్స్:దీర్ఘకాలం ఉండే ఇన్ ఫెక్షన్లకి, ఉబ్బసానికి వాడతారు. దీనివల్ల కూడా తొర్రి పెదవులు వస్తాయి.
  • థైరాయిడ్, మధుమేహం, రక్తపోటు కాన్సర్ మందులు, పరీక్షా పద్ధతుల్లో రేడియేషన్ కారకాలను ఉపయోగించటం – ఇవన్నీ కూడా తీవ్రస్థాయిలో ప్రమాదాన్ని కొనితెచ్చేవే.

అందుకే వీటిని నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి. లేదా పూర్తిగా వాడటాన్ని మానేయాలి.

బాలింత సంరక్షణ

ప్రసవానంతరం ఆరు వారాలను (42 రోజులు) “ బాలింత కాలం ‘’ అంటారు. ప్రతి స్త్రీ జీవితంలో బాలింతకాలం ఎంతో క్లిష్టమైనది. స్త్రీ బాలింత కాలంలో శారీరకంగా నీరసించి ఉంటుంది. ప్రసవపు పుండు ఆరని దశలో అంటు క్రిములు అవలీలగా ఆమె శరీరాన్ని ఆవరించే అవకాశం ఉంది. నీరసించిన శరీరం రక్తస్రావానికి, బాలింత అంటుకు తట్టుకోలేదు. ఈ సమయంలో ఆరోగ్య కార్యకర్త సహాయం, కుటుంబ సభ్యుల శ్రద్ధ, ఆప్యాయత స్త్రీ అవసరం

బాలింతకాలంలో తీవ్ర పరిస్ధితులు :

అధిక రక్తస్రావం, బాలింత జ్వరం మరియు వాసనతో కూడిన యోని స్రావం వంటి తీవ్రపరిస్ధితులు చాలా మందిలో వస్తాయి. ఇవి బాలింత అంటు వలన వస్తాయి. దాదాపు 10 శాతం మాతృమరణాలు దీనివలనే జరుగుతున్నాయి. బాలింతకు జ్వరం సాధారణమని తీసి వేయకూడదు. వెంటనే చికిత్స చేయించాలి. జ్వరంతోపాటు యోని స్రావాలు వాసన వస్తుంటే మరీ ప్రమాదం. ఆలస్యం అసలు చేయకూడదు.

  • బాలింతను మొదటి వారం రోజులు ప్రతిరోజు పర్యవేక్షించాలి.
  • ముర్రుపాలు ఇచ్చారా ? లేదా ? అడిగి తెలుసుకొని, తల్లిపాలు తప్పక ఇవ్వమని చెప్పాలి.
  • ఈ వారంలో తప్పకుండా ఏ. ఎన్.ఎమ్. ఒక్కసారైనా వచ్చి తల్లిబిడ్డలను చూడాలి.
  • బాలింతకు ఆరువారాల వరకైనా అంటు సోకకుండా, జ్వరం రాకుండా ప్రతిరోజు పరీక్షించి సూచనలివ్వాలి.
  • బాలింతకు జ్వరం ఉందని గుర్తించిన వెంటనే ఆసుపత్రికి పంపించాలి.
  • అధిక రక్తస్రావం అవుతున్న, రక్తస్రావం వాసన వస్తున్నా, గుర్తించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి.
  • బాలింత సమయంలో ఆహారం మరియు త్రాగునీటి ప్రాముఖ్యత గురించి తల్లికి, కుటుంబ సభ్యులకు అవగాహన పెంచాలి.
  • తల్లీ బిడ్డలకు అంటు సోకకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించమని చెప్పాలి.

ఆధారం: మహిళాభివృద్ధి శిశుసంక్షేమ శాఖ – ఆంధ్రప్రదేశ్

కాన్పుచేసే సమయంలో పాటించవలసిన ఐదు శుభ్రతలు

కాన్పుచేసే సమయంలో పాటించవలసిన ఐదు శుభ్రతలు

పోషకాహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే గర్భిణీ విషయంలో సురక్షితమైన కాన్పు కోసం కుటుంబ సభ్యులు క్రింద పేర్కొన్న సన్నాహాలు చేసుకోవాలి. ప్రసూతి ఇంట్లో జరగాలా లేక ఆరోగ్య కేంద్రం / ఆసుపత్రిలో చేయించాలా అనే విషయం గురించి ఆలోచించాలి.

గర్భిణీ స్త్రీ వీలయినంతవరకు కాన్పు ఆసుపత్రిలోనే చేయించుకోవాలి. దీని వలన తల్లీబిడ్డలు సురక్షితంగా ఉంటారు. అలాగే కాన్పు తరువాత ఏమైనా అత్యవసర పరిస్ధితులను గుర్తించినట్లయితే వెంటనే చికిత్స చేస్తారు. కాని కొన్ని పరిస్ధితులు లేదా అనుకోకుండా ఇంటి దగ్గరే కాన్పు చేయించవలసి వస్తుంది. ఇలాంటి సందర్భాలలో ......

  • శిక్షణ పొందిన దాయిని గుర్తించి ఆమె సహాయంతో పురుడు పోసుకోవాలి.
  • ఇంటి దగ్గర కాన్పు చేసేటపుడు దాయి 5 శుభ్రతలు పాటించాలి.
  • కాన్పు సమయంలో తగిన శుభ్రతలు పాటించకపోవటం వలన, పుట్టిన బిడ్డ అంటువ్యాధులు కలిగించే సూక్ష్మజీవుల బారిన పడవచ్చు.
  1. ఇల్లు ప్రసవం చేసే స్ధలం గాలి వెలుతురూ ధారాళంగా ఉండి శుభ్రంగా, వెచ్చగా వుండేలా చూసుకోవాలి.గాలి, వెలుతురు లేని స్ధలంలో సూక్ష్మక్రిములు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రసవ సమయంలో గాలి, వెలుతురూ ధారాళంగా ఉన్న గదిలో కాన్పు చేయడం మంచిది.
    • తొమ్మిది నెలలు తల్లి గర్భంలోని వెచ్చదనానికి అలవాటు పడ్డ బిడ్డ బయటి వాతావరణంలోని మార్పులను తట్టుకోలేదు. కాబట్టి బిడ్డ యొక్క శరీర ఉష్ణోగ్రతను కాపాడాలి. పుట్టిన వెంటనే బిడ్డను శుభ్రమైన బట్టతో తుడవాలి. తరువాత వేరొక శుభ్రమైన పొడిబట్టలో కప్పి వెచ్చగా ఉన్న గదిలో తల్లిప్రక్కనే పడుకోబెట్టాలి.
  2. బిడ్డను పుట్టినప్పటి నుండి వెచ్చగా ఉంచకపోవడం వలన బిడ్డ శరీర ఉష్ణోగ్రత కోల్పోయి ప్రాణాపాయం కలగవచ్చు.
  3. ప్రసూతికి ముందు మంత్రసాని చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
  4. డెలివరీ కిట్ ను లేదా రెండు బ్లేడులను సిద్ధం చేసుకోవాలి. వాటితోనే బొడ్డు పేగు కోయాలి. కొత్త బ్లేడును కడగడం గాని, శుభ్రం చేయడం కాని చేయనవసరం లేదు.
  5. కత్తిరించిన బొడ్డును కట్టడానికి కొత్త దారం ఉపయోగించాలి. దీని వలన చాలా వరకు బిడ్డకు అంటుసోకే ప్రమాదాన్ని నివారించవచ్చు.
  6. కత్తిరించిన బొడ్డును శుభ్రంగా ఉంచాలి. బొడ్డు మీద పసుపు, లేదా ఇతర పౌడర్లేవీ రాయకూడదు. రోజూ బొడ్డు త్రాడు చుట్టూ తడిలేకుండా పొడిగా ఉంచాలి. చీము అంటు సోకిందేమో గమనించాలి. అంటుసోకినట్లు తెలిసిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

గర్భిణీగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహారము

సురక్షిత మాతృత్వం అంటే ఒక స్త్రీ ఎలాంటి అవాంతరాలు లేకుండా గర్భసమయంలో, ప్రసవ సమయంలోను, ప్రసవానంతరం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా తన కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉండటానికి గర్భిణీ సమయంలో సరైన పోషణ చాలా అవసరం.

గర్భిణీ స్త్రీలు అన్ని రకాల ఆహార పదార్ధాలు అంటే ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పాలతో చేసిన పదార్ధాలు, మాంసం మొదలైనవి తగిన మోతాదులో తీసుకోవాలి.

గర్భిణీ స్త్రీ తీసుకోవాల్సిన పోషకాలు - లభించే ఆహారపదార్ధాలు :

పోషకాలు

లభించే ఆహారపదార్ధాలు

శక్తి

బియ్యం, గోదుమలు, జొన్నలు, దుంపలు, క్రొవ్వు పదార్దాలు, పిండి పదార్దాలు

మాంసకృత్తులు

పప్పు దినుసులు, పాలు, పాలతో చేసిన పదార్దాలు మాంసం, గుడ్లు

క్రొవ్వు

నూనె, నెయ్యి, నూనె గింజలు (వేరు శెనగలు, నువ్వులు

ఐరన్

ఆకుకూరలు, బెల్లం, రాగులు, నువ్వులు, ఉలవలు, చెఱకురసం, మాంసం (కాలేయం), ఖర్జూరం, ఎండిన పండ్లు

కాల్షియం

పాలు, పాలతో చేసిన పదార్ధాలు, ఆకుకూరలు, రాగులు, చేపలు

  • తల్లికి ఎక్కువగా శక్తి లభించే ఆహార పదార్ధాలు ఇవ్వడం వలన తక్కువ బరువుతో ఉన్న పిల్లలు పుట్టకుండా ఉంటారు. అలాగే కాన్పు సమయంలో, ప్రసవానంతర అత్యవసర పరిస్ధితులకు గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
  • గర్భిణీ సమయంలో తల్లి ఆరోగ్యానికి, బిడ్డ పెరుగుదలకు సరిపోయేంత ఆహారం కొంచెంకొంచెంగా ఎక్కువ సార్లు తినాలి. రోజూ తినే ఆహారం కంటే ఎక్కువ తినాలి.
  • కాల్షియం, ఇనుము అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటితో పాటు పుల్లటి పండ్లు తీసుకోవాలి.
  • పాలు, మాంసం, గుడ్లు,చేపలు, క్రొవ్వు పదార్దాలు ఎక్కువగా తీసుకోవటం మంచిది.
  • మలబద్దకం లేకుండా ఎక్కువ ద్రవపదార్ధాలు, పీచుపదార్ధాలు తీసుకోవాలి.
  • అంగన్ వాడి కేంద్రంలో ప్రతి 15 రోజులకు ఇచ్చే బలవర్ధకమైన పిండిని తప్పక తీసుకోవాలి.

సరైన పోషకాహారంతో పాటు సరైన విశ్రాంతి తీసుకోవాలి. (పగలు కనీసం 2 గంటలు, రాత్రి 8 గంటలు)

  • గర్భిణీ స్త్రీలలో ముఖ్యంగా రక్తహీనత సమస్య ఉంటుంది. దీని వలన బరువు తక్కువ ఉన్న బిడ్డలు పుట్టడం, తల్లికి అధిక రక్తస్రావం కావడం జరుగుతుంది. కాబట్టి ఇనుము ఎక్కువగా ఉన్న ఆహారం అంటే ఆకుకూరలు, బెల్లం, రాగులు, ఎండిన పండ్లు (కర్జూరం, ద్రాక్ష ) , నువ్వులు, చెఱకురసం, ఉలవలు, మాంసం (కాలేయం) తీసుకోవాలి. రోజుకు ఒకటి చొప్పున వంద ఐరన్ మాత్రలు తీసుకోవాలి.

పోషకాహారం తీసుకుని ఆరోగ్యం గా ఉన్న స్త్రీకి సుఖప్రసవం జరుగుతుంది.

ప్రసవానంతర కాలం

స్ర్రీలకు ప్రసవం జరిగి, బిడ్డకు జన్మనిచ్చిన తరువాత కాలంలో శరీరంలోని కణజాలం, ముఖ్యంగా జననేంద్రియ సంబంధిత మరియు కటి ప్రదేశంలోని అవయవాలు ప్రసవానికి ముందున్న పరిస్ధితిలోకి తిరిగి చేరుకోవడాన్ని వివరించడానికి వైద్యంలో ఉపయోగించే ఒక పదం, ఒక మాట వంటిది ఈ ‘ప్యూర్ పెరియమ్’ అనేది. ప్రసవం జరిగిన నాటినుండి ఇంచుమించు 6 వారాలు (42 రోజులు లో చోటుచేసుకుంటూ, కొనసాగుతూ వుంటుంది ఈ ప్రసవానంతర మార్పు.. ఈ కాల వ్యవధి ముగిసే సరికి మీరు చాలావరకు మామూలు స్ధితికి చేరుకున్నట్లుగా భావిస్తారు, కాస్తంత పెరిగిన బరువు తప్పిస్తే. సాంప్రదాయబధ్దంగా ఈ 40 రోజుల వ్యవధి అనే ఆలోచనస (లేక 40 ‘ సవా మహినా ‘ ) ఈ ప్రసవానంతర ప్రసూతి అనే దానిని చాలావరకు భారతీయ కుటుంబాలలో ఆచరిస్తూ వుండడానికి బహుశా ఇది ఒక కారణం కావచ్చు. ఇది స్త్రీలకు తిరిగి కోలుకుని, మామూలు స్ధితికి చేరుకోవడానికి టైమునిస్తుంది.

ప్రసనానంతరం వెంటనే వచ్చే కాలం

ప్రసవం అయిన వెంటేనే వచ్చే 24 గంటల కాలం చాలా క్లిష్టతరమైన దశ. ఈ టైములోనే గర్భాశయం తిరిగి పుష్టిగా దాని యధాస్ధాన్ని చేరుకోవాలి, దానిలో ఉన్న మాయ నుండి ప్రవహిస్తూ వుండే రక్తస్రావాన్ని నిలిపి వేయడానికి. ఇదే మీకు చనుబాలనివ్వడానికి, మీ బిడ్డ జీవితంతో మీరు పెనవేసుకు పోవడానికి శుభారంభం. తరచుగా జీవితాన్ని క్లిష్టతరం చేసే అనేక ప్రసవ సంబంధిత చిక్కు సమస్యలు తలెత్తే టైము కూడా ఇదే. ఇవి ప్రసవానంతరం జరిగే అధిక రక్తస్రావం, ప్రసరణలో అంతరాయం, గుండె సంబంధిత వైఫల్యాలు మొదలగు వాటిత సహా ఉంటాయి. అయితే, ఇవి సాధారణమైనవి కావు, కాని మామూలు ప్రసవాల ద్వారా జన్మనిచ్చిన సందర్భాలే అయినప్పటికి, ప్రతి 10,000 మంది స్త్రీలలో ఇంచుమించు 1 స్త్రీ మృత్యు వాత పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఉన్న వైద్య పరిస్ధితులు – అంటే రక్తహీనత, రక్తపు పోటు (హైపర్ టెన్షన్) లేక గుండె జబ్బులతో ఉన్న స్త్రీలలో ఇది ఇంకా ఆదికంగా ఉండవచ్చు. అనేక సార్లు ప్రసవం జరిగిన స్త్రీలలో కూడా ఇది ఎక్కువగానే వుంటుంది. అందుచేత, బిడ్డ పుట్టిన తరువాత కనీసం 24 గంటల వరకూ మీరు అసుపత్రిలో ఉండడమే మంచిదని సలహానివ్వ బడతారు.

ప్రసవానంతర మొదటి వారం

ఇది ప్రసవం జరిగిన 2వ రోజు నుండి 7వ రోజు వ్యవధికి సంబంధించినది – మీ జననాంగాల సంబంధిత మార్గాలలో మార్పులు చోటుచేసుకుంటూ వుండే కాలం. చాలావరకు మీరు తిరిగి మామూలు దశకు చేరుకుని, మీ జీవనసరళిని సర్దుబాటు చేసుకుంటూ, ‘మాతృత్వ’ దశలో ఉండే స్ఠితి ఇది. ఇదే కాల వ్యవధిలో మీరు మీ బిడ్డతో సహా ఇంటికి చేరుకుంటారు. మీలో శారీరక మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి, ఇవి చిన్న చిన్న మార్పులే అయినప్పటికీ, చెప్పుకోతగ్గవిగా ఉంటాయి అన్నది.

ప్రసవానంతర స్రావం (లోకియా) /జననాంగాన్నుండి డిస్చార్జ్ అవుతూ వుండడం.

ప్రధానంగా గర్భాశయంలోని లోపలి పొరల నుండి విసర్జింపబడి, జననాంగం నుండి బయటకు స్రవిస్తూ వుండే డిస్చార్జ్ ఇది ఋతుక్రమంలో ఉన్నప్పుడు స్రవిస్తూ వుండే ఆధిక స్రావం మాదిరిగా, మొదటి 4 రోజులలో, కొత్తగా స్రావం అవుతూవుండడం జరుగుతుంది. ఒకే సారి మీరు 2 ప్యాడ్ లను రోజుకు 3 – 4 సార్లు ఉపయోగించవలసిన అవసరం రావచ్చు. ఏమైనప్పటికీ స్రావం మరీ ఎక్కువగా ఉందనిపిస్తే, లేక పెద్ద, పెద్ద ఉండలుగా స్రవిస్తూ వుంటే ఈ విషయాన్ని మీ వైద్యునికి మీరు వెంటనే తెలియజాయాలి. సాధారణంగా 5వ రోజునాటికి స్రావం అవ్వడం చాలావరకు తగ్గిపోతుంది. ఇప్పటికైతే, రక్తంతో కూడి వుండే పసుపు-గోధుమ రంగులో వుండే డిస్చార్జ్ మాత్రమే అవుతుంది. అయినప్పటికి కూడా రోజుకు 2 -3 చొప్పున ఈ శానిటరీ ప్యాడ్ ల రక్షణ కావలసి వుంటుంది మీకు. ఈ డిస్చార్జి మామూలుగా 2వ వారాంతానికి ఆగిపోతుంది. దీని తరువాత ఇది మామూలుగా ఒక తెల్లటి డిస్చార్జిలాగ ఉంటుంది. మంచి పరిశుభ్రమైన మరియు ప్రసవసమయంలో శస్త్ర చికిత్స చేసినప్పుడు వేసిన కుట్ల విషయంలో మొదలగు జాగ్రత్తలు అంటువ్యాధులను నివారించఢంలొ తోడ్పడుతాయి . డిస్చార్జిలో ఏవిధమైన దుర్వాసన వస్తున్నా మీ వైద్యుడికి తెలియజేయండి.

మూత్ర విసర్జన

మొదటిరోజున తప్పనిసరిగా మీరు 2 – 3 గంటలకొకసారి మూత్ర విసర్జన చేయాలి, కుట్లలో నెప్పి అనిపిస్తున్నప్పటికి కూడా. ఇది ఎందుకంటే మీకు తెలియకుండానే మూత్రాశయం పూర్తిగా నిండిపోయి వుండవచ్చు - మీకు సమస్యలను సృష్టిస్తూ, ముఖ్యంగా తరువాత వచ్చే అంటువ్యాధులతో. మొదటివారంలో మీరు మరీ అతిగా మూత్రనిసర్జన చేస్తున్నారని మీరు గ్రహిస్తారు. ఇలా ఎందుకు జరుగుతోందంటే మీరు గర్భవతిగా ఉన్న సమయంలో మీలో మిగిలివుండి పోయిన అధిక నీటిని, ఉప్పును మీ శరీరం ఇప్పుడు తొలగించి వేస్తోంది కాబట్టి.

మలము

అనేక కారణాల వల్ల ప్రసవం అయిన మొదటి 2 రోజుల వరకూ మీకు సుఖప్రదమైన మలవిసర్జన అవుతూ ఉండకపోవచ్చు. ఒకటి నొప్పులు వస్తున్న కాలంలో మీరు అంతగా ఆహారాన్ని తీసుకుని ఉండకపోవచ్చు, మీరు అలసిపోయి వుండవచ్చు లేదా నిద్రలోకి జారిపోతూ వుండవచ్చు. రెండవది ప్రసవసమయంలో మీకు పడిన కుట్లలో వస్తూ వుండే బాధ, నెప్పి వల్ల కావచ్చు. గట్టిగా అవుతూ వుండే మలవిసర్జనను నివారించడానికి మీరు ముఖ్యంగా ఎక్కువగా పీచు పదార్ధాలతో వుండే ఆహారాన్ని, సమృధ్దిగా ద్రవపదార్ధాలను తీసుకోవలసి వుంటుంది. కొన్ని రోజులపాటు మీరేదైనా ఒక మాదిరి ల్యాక్జాటివ్ (విరేచనకారి) ను తీసుకోవలసిన అవసరం కూడా ఉండవచ్చు.

వక్షోజాలు

మొదటిరోజున వక్షోజాలనుండి పల్చటి నీరులాగ వచ్చే పసుపు రంగు డిస్చార్జ్ వుంటుంది. వక్షోజాలనుండి వుండే ‘వాస్తవ‘ మైన పాలవంటి ద్రవం కూడా స్రవిస్తూ వుంటుంది. దీనిని కోలోస్ట్రమ్ అంటారు. ఇది మీ బిడ్డకు అవసరమయ్యే అనేక పోషక విలువలను సమృధ్దిగా కలగి వుంటుంది. ఈ టైములోనే మీరు మీ బిడ్డకు ఈ పాలివ్వాలి. 3వ రోజునాటికి మీ శరీరంలో సంభవిస్తూ వుండే హోర్మోన్ల మార్పుల వల్ల ఈ పాలు రావడం ఉధృతంగా వుంటుంది. ఒక క్రమబధ్తమైన రీతిలో పాలివ్వడం చాలా ముఖ్యం, బిడ్డకు అతిగా, అతృతగా ఒక్కసారిగా తాగెయ్యాలనే తాపత్రయం వుండరాదు.

ప్రసవ సమయంలో వేసిన కుట్లపై శ్రధ్ద, జాగ్రత్తను తీసుకోవడం

ప్రసవ సమయంలో మీకేమైనా కుట్లు పడి వుంటే మీరు చేయవలసిన కొన్ని పనులున్నాయి,, ముఖ్యంగా మొదటివారంలో మీరు సుఖంగా, అరోగ్యంగా ఉండడానికి.

  • కుట్లు పడిన ప్రదేశాన్ని కనీసం రోజుకి 2 సార్లు శుభ్రం చేయడం. యాంటిసెప్టిక్ సొల్యూషన్ అంటే శావ్లాన్ లేక డెట్టాల్ వంటి వాటిని ఉపయోగిస్తూ. మలవిసర్జన అయిన తరువాత ఇది తప్పని సరి. అలాగే, మూత్ర విసర్జన అయిన తరువాత కూడా నీటితో ఈ ప్రాంతాన్నంతా శుభ్రం చేయడం కూడా ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి. ముందు నుండి వెనుకకు కడగండి, అంతే కాని దీనికి వ్యతిరేకంగా కాదు. – అంటు వ్యాధులను నిరోధించడానికి.
  • యాంటి సెప్టిక్ క్రీములు, అంటే సోఫ్రామిసిన్, మెట్రోజిల్ జెల్, బిడాడైన్ ఇ-కామ్ వంటి వాటిని ఈ ప్రాంతంలో వాడడం అంటువ్యాధి నివారణకు ఉపయోగిస్తుంది. మామూలుగా ఇది రోజుకు 2 సార్లు చెయ్యాలి – స్నానం చేసిన తరువాత మరియు రాత్రి నిద్రకుపక్రమించే ముందు.
  • బాధను నివారించే పధ్దతులు, అంటే ఈ ప్రాంతాన్ని వేడినిటితో కడగడం లేక వేడి నీటి సంచి అన్నవి ఉపయోగ కరం కావచ్చు.
  • బాధను పోగొట్టడానికి మరో మార్గమేమిటంటే ఈ ప్రదేశంలో ఆయింట్ మెంట్ రాయడం, అంటే 2 శాతం జైలోకేన్ – ఇది ఆ ప్రదేశంలో వస్తూ వుండే నెప్పిని, బాధను నివారించేదిగా పనిచేస్తుంది.
  • కుట్లు పడ్డ చోట పగటి పూట వుండే వెచ్చదనం మాదిరిగా ఉపయోగించుకునేందుకు ఇన్ ఫ్రా రెడ్ ల్యాంప్. ఇది మీకు ఆసుపత్రిలొనే పెట్టగలరు.
  • నోటి ద్వారా తీసుకునే మందులు – అంటే యాంటిబయోటిక్స్ – అంటువ్యాధులను నివారించడానికి, లేక పెయిన్ కిల్లర్ బిళ్లల (పారాసిటమోల్, ఇబుప్రొఫేన్ మొదలగునవి) ను వైద్యుని సలహామేరకు మాత్రమే తీసుకోవాలి.
  • చాలామంది వైద్యులు వాటంతటవే హరించుకుపోయటటువంటి కుట్లను వేస్తారు లేక కొద్ది రోజుల తరువాత ఊడిపోయి, రాలిపోయే కుట్లను వేస్తారు. మీ వైద్యుణ్ని అడగండి మీరు మీ కుట్లను చూపించుకోవడానికి మరోసారి ఆయన వద్దకు రావాల్సి వుంటుందా అని.
సాధారణ కార్యకలాపాలను తిరిగి కొనసాగించుట

ఇంతకుముంది చర్చించివ విధంగా ప్రసవం వల్ల మీలో వచ్చిన మార్పులనుండి పూర్తిగా కోలుకోవడానికి మీ శరీరానికి 6 వారాల వరకు పడుతుంది. అందుచేత ఓర్పుతో ఉండండి. వారిలో కలిగే వివిధ మార్పులతో వ్యవహరించడంలో వివిధ రకాల స్త్రీలు వివిధ రకాలైన శక్తిని కలిగి వుంటారు. ఏమైనప్పటికి చాలా సందర్భాలలో మామూలుగా గర్భాశయం ద్వారా జరిగిన ప్రసవానంతరం మీ దైనందిన, ఆరోగ్యరమైన వ్యక్తిగత జాగ్రత్త, శ్రధ్దకు సంబంధించిన కార్యకలాపాలను ఒక్కరోజులోనే మీరు ప్రారంభించుకోగలరు. అలాగే ఇంటిపనిని కూడా వారం రోజుల లోపల మొదలుపెట్టుకోగలరు. అతిగా శ్రమ పడకండి. మీకోసం, మీ బిడ్డకోసం ఎక్కువ సమయాన్నికేటాయించవలసి వుంటుంది. మీ జీవితాన్ని సులభతరం చేసుకోవడానికి ఇతరుల సహాయం తీసుకోండి. క్లిష్టతరమైన శిశుజననం తరువాత లేక సీజెరియన్ ప్రసవం అయిన తరువాత మీరు తిరిగి కోలుకోవడానికి మీకు రెండింతల సమయము పట్టవచ్చు.

ప్రసనానంతర అభ్యాసాలు

లైంగిక కార్యకలాపాలను మానివేయడం చాలా శ్రేయస్కరమైనది, ప్రసవం జరిగిన తరువాత కాలవ్యవధిలో మీకు పడ్డ కుట్లు ఇంకా బిరుసుగావుండి, బాధాకరంగా ఉండవచ్చు, ముఖ్యంగా మొదటి వారంలో గర్భాశయం చుట్టూ వుంటే వలయం వంటి పొరలు ఇంకా యధాస్ధానానికి చేరుకోలేదు, మాయ ఉండే చోటుతో సహా. అందుకే, సాంప్రదాయబధ్దంగా కూడా కొంతమంది ప్రసవం అయిన 6 వారాలదాకా ఇటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండమని సలహా ఇస్తారు. అయితే, మీరు పూర్తిగా ఒక సాధారణమైన, ఏ సమస్యలు రానటువంటి, క్లిష్టతరం కానటువంటి ప్రసనాన్ని కలిగివుంటే మీ లైంగిక జీవితాన్ని తొందరలోనే మొదలుపెట్టవచ్చు. మీరు, మీ భాగస్వామి ఒకరినుండి మరొకరు విడిచి దూరమైపోయామనే అభిప్రాయం ఉండవచ్చు, ముఖ్యంగా గర్భం వచ్చిన ప్రసవసమయానికి ఒక నెల ముందు నుండి. అందుచేత మీరు మీ లైంగిక జీవితాన్ని తిరిగి అనుభవించాలను కోవడం అసామాన్యమైన విషయమేమీ కాదు. మీరు మైధునంలో పాల్గొని, నిలకడగా ఉండే అంగస్ధంభనతో సౌకర్య వంతంగా పాల్గొనగలనని నమ్మకం ఉన్నంత వరకూ, ఇతర ఆప్యాయతా, అనురాగం, ఒకరిపై మరొకరికి శ్రధ్ద అన్నవి సరిపోతాయి. కౌగలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం, లాలించడం లేక తాకడం అన్నవి నిషిధ్ధమైనటువంటివి కావు, గర్భవతిగా ఉన్న ఏ సమయంలోనైనా సరే లేక ప్రసవానంతర మైనా సరే.

ఋతుక్రమం సరిగా లేకపోవడం

మీరు ప్రత్యేక శ్రధ్దతో చనుపాలు ఇస్తూ వుండే,కాలంలో మీ శరీరంలో సంభవిస్తూ వుండే హార్మోన్ల మార్పులు గర్భాశయ మార్గాలలో ఉండే అండం పెరగడాన్ని లేక ఋతు క్రమాన్ని అణిచివేసేవిగా పనిచేస్తాయి.
కొన్ని నెలల వరకూ మీకు బహిష్టు అవడం అంటూ ఉండదు. కొంతమంతి స్త్రీలలో అయితే ఇది ఒక సంవత్సరం వరకూ కూడా మొదలవదు, వారి చనుపాలిచ్చే విధానం మరియు ఎంత తరచుగా ఇస్తున్నారు అన్న అంశాలపై ఆధారపడి.

కాలవ్యవధి చనుబాలివ్వకుండా ఉండడం చనుబాలివ్వడం స్ధిరపడితే
బహిష్టు అవడానికి 6 – 12 వారాలు 36 వారాలు (సగటున)
అండాశయం నుండి అండాన్ని ముందుగా వేరుచేయడం 4 వారాలు 12 వారాలు
అండాశయాన్ని వేరుచేయడానికి పట్టే సగటు టైము 8 – 10 వారాలు 12 వారాలు (మారుతూ ఉండవచ్చు)

దీని అర్ధం మీరు గర్భవతి కాలేరు అనా? దీనికి సమాధానం ‘కాదు.’ అనే. ప్రసవానంతరం ఇంచుమించుగా 5 శాతం స్త్రీలకు ఋతుక్రమం మొదలవుతుంది. ఈ ఋతుక్రమం జరగకపోవడం అన్నది మీకు గర్భం రాకుండా రిక్షిస్తుంది కొంత వరకు. ఏమైనప్పుటికీ మీరు ఈ విషయంలో బహిష్టులవకుండా వుండడం పై ఆధారపడవచ్చు, గర్భం రాకుండా నిరోధించుకోవడానికి. అయితే, ఇది కేవలం క్రింద వివరించిన 3 నిబంధనలను సంతృప్తికరంగా పాటించినప్పుడు మాత్రమే.

  • మీరు ప్రత్యేకంగా చనుబాలను మీ బిడ్డకిస్తున్నారు
  • ప్రసవం అయిన తరువాత 6 నెలలకు మించకుండా కాలం గడిచిపోయింది.
  • ప్రసవం అయిన తరువాత ఇంతవరకు మీరు బహిష్టు అవడం జరగలేదు.
గర్భం రాకుండా నిరోధించే తొడుగులను వాడుట.

ఒకవేళ మీరు బహిష్టు అవకుండా ఉండడంపై ఆధారపడి ఉన్నట్లయితే, మీరు రక్షింపబడి ఉండవచ్చు. లేకపోతే మరోసారి గర్భం దాల్చడానికి మీరు సిధ్దమేనా? మీ శరీరం పూర్తిగా కోలుకోవలసిన అవసరం ఉంది, మీ బిడ్డకు పెరగడానికి టైము కావాలి అలాగే మీకు సంబంధించినంత వరకు మీరు మరోసారి తల్లి అవడానికి తగిన సమయము కావాలి. అయితే, ఇది ఒక వ్యక్తిగత విషయం, ఇష్టం. కాని, ఒకదాని తరువాత మరొకసారి వచ్చే గర్భానికి కనీసం 2 సంవత్సరాలు ఎడం ఉండాలని సిఫార్స్ చేయబడుతోంది.
ప్రసవం అయిన తరువాత కాలంలో మళ్లీ మరోసారి గర్భం దాల్చకుండా ఉండడానికి మీరేమి చేయాలి? దీనికి చాలా పధ్దతులు అందుబాటులో ఉన్నాయి.

ఏమైనప్పటికి, ప్రసవానంతర కాలంలో, కొన్ని అంశాలను మీరు దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది.
  • చనుబాలనే ఇస్తున్నారా లేదా?
  • ఎంత తరచుగా మీరు మైధునంలో పాల్గొంటున్నారు
  • ఎంత కాలం పాటు గర్భం రాకుండా ఉండాలనకుంటున్నారు
  • ఈ చివరి అంశం మీ వ్యక్తిగత అనసరాలను మరియు అనుభనాన్ని బట్టి కూడా ప్రభావితమవుతుంది.

ఇతరములు

కండోమ్ లు.
కండోమ్లు శ్రేయస్కరమైనవి మరియు విశ్వసించతగ్గవి, సరైన విధంగా, ఒక క్రమపధ్దతిలో వాడినప్పుడు. వీటి వాడకం వల్ల దుష్ప్రభావాలేమీ (సైడ్ ఎఫెక్ట్స్) ఉండవు, మరియు మైధునంలో తక్కువగా పాల్గొనే దంపతులకు ఉపయోగకరమైనవి.

ఐ.యు.సి.డి. లు లేక ‘లూప్స్ ‘
ఇవి చాలా నమ్మకమైనవి, విస్వశింపతగ్గవి, దీనిని అమర్చుకునేందుకు వైద్యుణ్ని కేవలం ఒకసారి కలిస్తే సరిపోతుంది. మత్తుమందు కూడా వాడనక్కరలేకుండా ఇది సులభంగా చేయబడుతుం.ది. సగటున 3 – 5 ఏళ్ల వరకూ ఇవి పనిచేస్తాయి (మీరు వాడే సాధనంపై ఇది ఆధారపడి వుంటుంది). అలాగే కండోమ్స్ మాదరి కాకుండా లైంగిక కార్యంతో నిమిత్తం లేకుండా ఉంటాయి. ఒకరు, లేక ఇద్దరు పిల్లలున్న స్త్రీలకు ఇది ఆదర్శవంతమైనది మరియు చాలా ప్రజాదరణ కలిగింది కూడా. శాశ్వతంగా చేసుకునే ఏర్పాటుకు ఇది ఒక ప్రత్యామ్నాయం వంటిది. ప్రసవం తరువాత మొదటిసారి వైద్యుని వద్దకు వెళ్లినప్పుడే ఈ ఐ.యు.సి.డి. ను అమర్చుకోవడానకి వీలవుతుంది. (బిడ్డ పుట్టిన 6 వారాలలో లేక పోతే అటుతర్వాత, చివరికి మీరు బహిష్టు అవుతూ ఉండకపోయినా సరే., అయితే, ఇది మీ అంతర్గత పరిస్దితి మామూలుగా ఉన్నప్పుడే..

నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక బిళ్లలు
మీరు చనుబాలిచ్చే కాలంలో జంటగా పనిచేసే నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక బిళ్లలు (ఎస్ట్రోజెన్ ప్లస్ ప్రోజెస్టిరోన్ తో కలిసి) చనుబాలు ధారగా రావడాన్ని తగ్గించివేయ వచ్చు. అందుచేత ఇవి అంత ప్రజారంజకంగా సిఫార్సు చేయబడడం లేదు. పాలివ్వడం ఆపినేసిన తరువాత కాలంలో వీటిని సురక్షితంగా వాడవచ్చు.

స్టెరిలైజేషన్ (సంతాన నిరోధక శస్చ్ర చికిత్స)
ఇది ఒక శాశ్వతమైన పధ్దతి, మీ కుటుంబ పరిమితితో మీరు సంతృప్తి చెందిన తరువాత దీనిపై మీరు మొగ్గు చూపవచ్చు. ప్రసవానంతరం చేసే సుళువైన పధ్దితి ఇది. మీరు మీ వైద్యునితోను, మీ భాగస్వామితోను దీని పూర్వాపరాలను గురించి చర్చించుకోవలసి ఉంటుంది. కొంతమందైతే చంటిపిల్ల పెరిగి పెద్దవాళ్లయెంతవరకూ - 1 సంవత్సరం ధాటివుంటే మరీ మంచిది – ఈ శాశ్వత ఏర్పాటు చేసుకునే ముందు చేయించుకుంటే మంచిదని భావిస్తారు. ఒక విశ్రాంత సమయంగా, ప్రసవం జరిగిన తరువాత 6 వారాలు లేక అంతకు మించి సాధారణంగా ఈ ల్యాప్రోస్కోపీ అనే ఆపరేషన్ చేయబడుతుంది.

ప్రసనానంతరము వైద్యుని మొదటి రాక:
శిశువు జన్మనిచ్చిన తరువాత మీరు ఇంటికి చేరుకుని మెల్లగా కోలుకుంటుంటారు. మీ వైద్యుడు కనీసం ఒక సారి, మిమ్మల్ని చూసి, మీరు కోలుకునే విధానం సంతృప్తికరంగానే పూర్తయిందని ధృవీకరించుకోవడానికి వస్తాడు. మొదటి చెక్ అప్ సాధారణంగా ప్రసవం అయిన నాటి నుండి 6 వారాలలో అవుతుంది. ఒక వేళ మీరు ప్రత్యేక శ్రధ్ద కావాలని కోరుకుంటున్నప్పుడు లేక ప్రసవ సందర్భంలో ఏమైన సమస్యలనెదుర్కున్నప్పుడు, వైద్యుని రాక ఇంకా ముందుగా అంటే ఇంచుమించు 3 వారాలలో జరగవచ్చు.

మొదటి పర్యాయం వచ్చినప్పుడు, మీ వైద్యుడు వీటిని చెక్ చేసి చూస్తాడు.

  • మీ బరువు
  • రక్తపు పోటు
  • రక్తలేమి లక్షణాలు
  • మీ వక్షోజాలు
  • ప్రసవసమయంలో మీకు వేసిన కుట్ల వల్ల వచ్చిన మచ్చలు (ఈ పాటికి మాసిపోయి ఉండాలి)
  • మీ గర్భాశయం (తిరిగి అది యధాస్ధితికి, సైజుకి చేరుకుందా అని చూడడానకి)

మీరు కొన్ని పరిక్షలు చేయించుకోవలసి వుంటుంది. ఈ క్రింది అంశా లను గురించి మీరు మీ వైద్యుడితో చర్చించ వలసి వుంటుంది.

  • మీ ఆరోగ్యాన్ని పూర్తిగా యధాస్ధితికి చేరుకునేటట్లు చేయడం
  • ప్రసవానంతరం ఎక్సర్ సైజులు
  • ఆహారం మరియు పోషకాలు
  • మీ బిడ్డ ఆరోగ్యం
  • టీకాలు వేయించే ఒక ప్రణాళిక
  • చనుబాలనివ్వడం కొనసాగించడం
  • గర్భనిరోధక చర్యలు

దీనిపై మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి. ఇ-మెయిల్

ప్రసవానంతర అంటువ్యాధులు

ప్రసవానంతర అంటువ్యాధులు ప్రసవానికి ప్రత్యక్ష సంబంధం కలిగివుంటాయి (గర్భాశయంలో గాని లేక దాని చుట్టూ వుండే ప్రాంతంలో గాని వ్యాపిస్తూ) లేక పరోక్ష కారణాలు మూత్రపిండాలలోను, మూత్రాశయం, వక్షోజాలలో లేక ఊపిరితిత్తులలోను వుండే అంటువ్యాధుల ద్వారా, ప్రసవానంతరం వచ్చే జ్వరం.

ప్రసవానంతరం వచ్చే జ్వరం

ప్రసవం అయిన వెంటనే స్త్రీ యొక్క ఉష్ణోగ్రత తరచుగా పెరిగిపోతుంది. ప్రసవం అయిన మొదటి 12 గంటలలో ఉష్ణోగ్రత 101 డిగ్రీ ఫా. (38.3 డిగ్రీలు సెం.) లేక అంతకంటే ఎక్కువగా ఉంటే అది అంటువ్యాధికి సంకేతం వంటిది. ప్రసవం అయిన 24 గంటలు గడచిన తరువాత ప్రసవానంతర అంటువ్యాధి నిర్ధారణ పరిక్ష చేయబడుతుంది, అటువంటి స్త్రీ 100.4 డిగ్రీల ఫా. (38 డిగ్రీల సెం.) లేక అంతకంటే ఎక్కువగా కనీసం 6 గంటల వ్యవధిలో రెండు పర్యాయాలు ఉన్నప్పుడు కూడా. ఈ ప్రసవానంతర అంటువ్యాధి చాలా అరుదుగా సంభవిస్తుంది, ఎందుకంటే వైద్యులు దీనిని నివారించడానికి ప్రయత్నిస్తారు లేక ఇది రావడానికి దారితీసే అనువైన పరిస్ధితుల నివారణకు సరైన చికిత్సను చేస్తారు కాబట్టి. ఏమైనప్పటికి, ఈ అంటువ్యాధి కనుక వచ్చిందంటే అది తీవ్రమైనదిగా పరిణమించవచ్చు.

గర్భాశయంలో వచ్చే అంటువ్యాధులు
  • గర్బాశయాన్ని మరియు చుట్టు వున్న ప్రాంతానికి ప్రసవం అయిన వెంటనే బ్యాక్టీరియా ఈ అంటువ్యాధిని సంక్రమింప చేయగలదు,
  • అటువంటి అంటువ్యాధి సాధారణంగా పొత్తి కడుపులో నెప్పిని కలిగించడం, జ్వరం రావడం మరియు దుర్వాసనతో వుండే డిస్చార్జ్ రావడానికి దారితీయవచ్చు.
  • శారీరక పరిక్ష చేసి, ఈ వ్యాధిని సామాన్యంగా దాని లక్షణాలను బట్టి నిర్ధారించడం జరుగుతుది.
  • యాంటి బయోటిక్స్ సాధారణంగా ఈ వ్యాధిని నిరోధించగలవు.

ప్రసవానంతర అంటువ్యాధులు సాధారణంగా గర్భాశయం నుండే మొదలవుతాయి. ఇటువంటి అంటువ్యాధులు పిండాన్ని (లేక గర్భంలోని శిశువు) (ఎమినియోటిక్ శాక్) లోనికి వ్యాపించి నొప్పులు పడే సమయంలో జ్వరాన్ని కలిగించవచ్చు. ఇటువంటివి గర్భాశయపు లైనింగు (ఎండోమెట్రైయం) తో సహా, గర్భాశయ కండరాలు (మయోమైట్రైటిస్) లేక గర్భాశయం చుట్టు పక్కల ప్రదేశాలతో కూడి ఉంటాయి.

కారణాలు

సామాన్యంగా ఆరోగ్యకరమైన యోనిలో ఉండే బ్యాక్టిరీయా ప్రసవం అయిన వెంటనే ఈ అంటువ్యాధిని వ్యాపింపచేయగలదు. స్ర్రీ ఈ అంటువ్యాధిన బారినపడే అవకాశం కలిగించే పరిస్ధితులు.

  • రక్తహీనత
  • బ్యాక్టరియాతో సంక్రమించే వెజినోసిస్ (యోని సంబంధిత వ్యాధి)
  • మళ్లీ మళ్లీ చేసే యోని పరిక్షలు
  • పిండం యొక్క పరిస్ధితిని అంతర్గతంగా మానిటర్ చేయడం (దీనివల్ల గర్భాశయం చుట్టూ వుండే పొరలు చినిగిపోవచ్చు)
  • దీర్ఘమైన కాలయాపన (డిలే) (తరచుగా 18 గంటలకు మించి) ఈ విధంగా పొరలు చినిగిపోవడం మరియు ప్రసవానికి మధ్య
  • అతి దీర్ఘకాలంపాటు నొప్పులు రావడం
  • సీజేరియన్ ప్రసవం జరగడం
  • ప్రసవం అయిన తరువాత మాయ యొక్క ముక్కలు వంటివి గర్భాశయంలోనే ఉండిపోవడం
  • ప్రసవం అయిన తరువాత అధిక రక్తస్రావం (ప్రసవానంతర హేమరేజ్)
  • యుక్త వయసు
  • అల్పమైన సాంఘిక-ఆర్ధిక స్ధాయి

గర్భాశయంలో అంటువ్యాధి రావడానికి గల అవకాశాలు ఏ రకమైన ప్రసవం జరిగింది అన్నదానిపై ఆధారపడివుంటాయి.
  • సాధారణ ప్రసవాలు 1 నుండి 3 శాతం
  • నొప్పులు ప్రారంభం అవడానికి ముందు నిర్ణయించబడి, చేయబడిన సీజెరియన్ ప్రసవాలు 5 నుండి 15 శాతం
  • నొప్పులు ప్రారంభం అవడానికి ముందు నిర్ణయించబడకుండా, చేయబడిన సీజెరియన్ ప్రసవాలు 15 నుండి 20 శాతం

లక్షణాలు

లక్షణాలు సాధారణంగా పొత్తికడుపు లేక పెల్విస్ (పొత్తి కడుపు చుట్టూ గల కటి భాగం) నెప్పి, జ్వరం (మామూలుగా ప్రసవం అయిన 1 నుండి 3 రోజులలో), పాలిపోయినట్లు ఉండడం, అతి శీతలం, మామూలుగా జ్వరం లేక ఏదో ఒక అసౌకర్యంగా ఉన్నట్లు అనిపించడం మరియు తరచుగా తలనెప్పి, ఆకలి లేకపోవడం. గుండే కొట్టుకునే రేటు వేగవంతంగానే వుంటుంది. గర్భాశయం వాపు, సున్నితంగా, మెత్తగా ఉంటుంది. ప్రత్యేకంగా యోని నుండి చెడు వాసనతో వుండే డిస్చార్జ్ అవుతుంది, ప్రమాణంలో తేడా కనిపిస్తూ. ఏమైనప్పటికి, ఒకో సారి తక్కువ స్ధాయిలో ఉన్న జ్వరం మాత్రమే దీని లక్షణంగా ఉంటుంది.
గర్భాశయం దాని చుట్టూ వున్న ప్రాంతం వున్న భాగాలలో అంటువ్యాధి వున్నచో వాపు మరియు అధిక జ్వరం మరియు తీవ్రమైన నొప్పి వుంటుంది.

కొన్ని తీవ్రమైన చిక్కులు, ఇబ్బందులు రావచ్చు, అయితే తరచుగా మాత్రం కాదు. అవి ఈ క్రింది వాటితో సహా ఉంటాయి
  • పొత్తి కడుపులో చుట్టూ ఉండే పొరలలో మంటగా వుండడం,
  • కటిప్రదేశంలో ఉండే నరాలలో రక్తం గడ్డకట్టుకు పోవడం (పెల్విక్ థ్రోంబోప్లెబిటైస్),
  • ఊపిరితిత్తులకు వెళుతూ వుండే గడ్డకట్టిన రక్తం అక్కడకు వెళ్లి అక్కడ దమనిని అడ్డుకుంటుంది (పల్మోనరీ ఎంబోలిజమ్)
  • అధిక స్ధాయిలో వుండే విషపదార్ధాలు (టాక్సిన్స్) రక్తంలో ఉండే అంటువ్యాధిని వ్యాపింపచేస్తూ వుండే బ్యాక్టిరీయాచే తయారుచేయబడి, పూతిక (సెప్సిస్) లేక విషపూరితమైన షాక్ కు దారితీస్తూ ఉంటాయి.

పూతిక మరియు విషపూరితమైన షాక్ లో ఉన్నప్పుడు రక్తపు పోటు నాటకీయంగా పడిపోతుంది, గుండె కొట్టుకునే రేటు కూడా ఎక్కువ వేగవంతంగానే ఉంటుంది, ఫలితంగా మూత్రాశయానికి తీవ్రమైన హాని సంభవిస్తుంది, చివరకు మరణానికి దారితీస్తూ. అయితే ఇది చాలా అరుదుగా జరుగుతుంది, వెంటనే చేపట్టిన వ్యాధి పరిక్షతోను అలాగే ప్రసవానంతర జ్వరానికి శీఘ్రంగా చికిత్స చేయడం వల్ల కూడా.

వ్యాధి నిర్ధారణ మరియు చికిత్స

శారీరక పరిక్షలను ప్రధానంగా ఆధారం చేసుకుని ఒక అంటువ్యాధిని పరిక్షించి నిర్ధారించవచ్చు. ఒకోసారి స్త్రీలు కేవలం జ్వరంతోనే ఉన్నప్పుడు మరి ఏ ఇతర కారణాన్ని గుర్తించలేనప్పుడు కూడా ఒక అంటువ్యాధిని నిర్ధారించవచ్చు. మామూలుగా వైద్యులు ఒక మూత్రపు శాంపుల్ తీసుకుని దానిలో బ్యాక్టిరియా ఉందా అని పరిక్షించడానికి పంపిస్తారు. తరచుగా ఒక రక్తపు శాంపుల్ ను పరీక్షకు పంపడం జరుగుతుంది. ఒకవేళ గర్భాశయంలోకి అంటువ్యాధి వ్యాపించిందంటే స్త్రీలకు సాధారణంగా రక్తనాళాలలోనికి యాంటీ బయోటిక్స్ (సూక్ష్మ జీవులను నాశనం చేయడానికి) ఎక్కిస్తారు - వారికి 48 గంటలలో ఏ జ్వరం లేకుండా ఉండి ఉన్నప్పుడు. అటు తర్వాత చాలా మంది స్త్రీలకు నోటి ద్వారా యాంటిబయోటెక్స్ ను తీసుకోవలసిన అవసరం ఉండదు.

మూత్రాశయము మరియు మూత్రపిండాలలో అంటువ్యాధి

ఒకోసారి మూత్రాశయములోని అంటువ్యాధి (సిస్టిటిస్) ప్రసవానంతరం సంభవించవచ్చు. అప్పుడు ఈ ప్రమాదం ఇంకా ఎక్కువయ్యే ఆవకాశం వుంది. నొప్పులు వస్తున్నప్పుడు, అటు తరువాత మూత్రాశయంలో నిండుకున్న మూత్రాన్ని తొలగించడానికి ఒక క్యాధటర్ అనే పరికరాన్ని వుపయోగిస్తారు. ప్రసవం అయిన తరువాత మూత్రాశయం నుండి మూత్రపిండానకి కూడా బ్యాక్టీరియా వ్యాపించడం వల్ల మూత్రపిండానికి కూడా అంటువ్యాధి (పైలోనెఫ్రిటిస్) రావచ్చు. ఒకోసారి మూత్రాశయానికి గాని, మూత్రపిండానికి గాని అంటువ్యాధి రావచ్చు. ఎందుకంటే ప్రసవ సమయంలో మూత్రపిండంలో ఉన్న బ్యాక్టీరియా ప్రసవం అయిపోయేంతవరకూ ఈ వ్యాధి లక్షణాలను చూపించదు కాబట్టి మూత్రాశయం మరియు తరుచుగా వచ్చే మూత్రపిండంలో అంటువ్యాధి బాధాకరమైన లేక పదే పదే మూత్రవిసర్జనకు కూడా కారణమౌతుంది. మూత్రపిండం మరియు కొన్ని మూత్రాశయంలోని అంటువ్యాధులు జ్వరానికి దారితీస్తాయి. మూత్రపిండంలో వచ్చే అంటువ్యాధులు క్రింద మరియు వెనుక పక్క భాగంలోనూ లేక పక్కలయందు నొప్పికి కారణమౌతాయి. – ఒక సాధారణమైన అనారోగ్యం లేక ఇబ్బంది, అసౌకర్యం మరియు మలబధ్దకం వచ్చినట్లు భావన కలిగిస్తూ.

వ్యాధి నిర్ధారణ మరియు చికిత్స

మూత్రం శాంపుల్ ను పరిక్షించి, విశ్లేషణ చేసిన దానిపై ఆధారపడి ఈ వ్యాధి నిర్ధారణ చేయబడుతుంది. మూత్రపిండంలో అంటువ్యాధి,తోను, మరికొంత మూత్రాశయంలో వచ్చిన అంటువ్యాధితోను, బ్యాక్టీరియాను కనిపెట్టడానికి మూత్రం చేయటం వుంటుంది.. సాధారణంగా స్త్రీలలో మూత్ర పిండంలో వచ్చే అంటువ్యాధికి రక్తనాళాలద్వారా యాంటిబయోటిక్స్ ను ఇవ్వడం జరుగుతుంది, అలాగే మూత్రాశయంలో ఈ వ్యాధి వస్తే నోటి ద్వారా దీనిని ఇస్తారు. ఒక వేళ మూత్రాశయంలోని ఈ అంటువ్యాధి మూత్రపిండాలకు కూడా వ్యాపించిందని ఋజువు కాకపోతే, కేవలం కొద్ది రోజులపాటే యాంటీబయోటిక్స్ ను ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మూత్రపిండంలో అంటువ్యాధి వుందని అనుమానం వున్నప్పుడు యాంటిబయోటిక్స్ ను వాడాలి. గత 48 గంటలలో ఆమెకు ఏ జ్వరం రాకుండా వుంటే ఇస్తారు. తరుచుగా యాంటిబయోటిక్స్ ను నోటి ద్వారా దీర్ఘకాలం పాటు కూడా ఇవ్వవచ్చు. కల్చర్ ఫలితాలు తెలిసిన తరువాత, యాంటిబయోటిక్స్ ను మార్చవచ్చు ద్రవ పదార్ధాలను సమృధ్దిగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలు బాగా పనిచేయడానికి వీలుకలుగుతుంది., మూత్రంపోయే మార్గం గుండా బ్యాక్టిరియాను బయటకు విసర్జింప చేస్తూ.
ప్రసవం అయిన 6 నుండి 8 వారాలలో ఈ అంటువ్యాధి తగ్గిపోయిందేమో చూడడానికి మరొక మూత్రపు శాంపుల్ ను కల్చర్ చేయడం జరుగుతుంది.

వక్షోజాలలో అంటువ్యాధి

వక్షోజాలలో అంటువ్యాధి (మ్యాస్టిటిస్) ప్రసవం తరువాత సంభవించవచ్చు, సాధారణంగా మొదటి 6 వారాలలోను, చనుపాలిచ్చే స్త్రీలలో ఇంచుమించు ఎల్లప్పుడూ కూడా. చనుమొనల చుట్టూ వుండే చర్మం పగిలినట్లు ఉన్నట్లయితే, ఈ భాగం నుండి పాలు వచ్చే మార్గాల (డక్ట్స్) గుండా ప్రవహించి, అంటువ్యాధిని కలిగించే అవకాశం ఉంది. బిడ్డను పాలిచ్చేటప్పుడు సరైన విధంగా ఎత్తుకుని వుండకపోతే, ఈ పగుళ్లు మరియు నెప్పి, బాధ కూడా ఇంకా తీవ్రమౌతాయి.
అంటువ్యాధికి గురయిన వక్షోజం సాధారణంగా వాపు ఎరుపెక్కి వుంటుంది, అయితే వక్షోజంలో ఏదైనా ఒక భాగం మాత్రమే ఎర్రగావుండి, బాధగా అనిపించ వచ్చు. ఇటువంటి స్త్రీలలొ జ్వరాం కూడా వుంటుంది. ప్రసవం అయిన 10 రోజుల తరువాత వచ్చిన జ్వరం తరచుగా వక్షోజాలకు వచ్చిన అంటువ్యాధి వల్లే వస్తుంది.
అరుదుగా వక్షోజంలో వచ్చే అంటువ్యాధి చీముకు దారితీస్తుంది గడ్డ లేక పుండులాగ వుండే దానిచుట్టూ వుండే ప్రాంతమంతా వాచివుంటుంది. ప్రసవం అయిన తరువాత వక్షోజాలలో ఈ అంటువ్యాధి వచ్చినప్పుటికీ, మామూలుగా స్త్రీలు చనుబాలనివ్వడం కొనసాగించవచ్చు.

చికిత్స

వక్షోజాల వచ్చే అంటువ్యాధులు యాంటీబయోటిక్స్ తో చికిత్స చేయబడతాయి. స్త్రీలు ద్రవాలను సమృధ్దిగా తీసుకోవలసిందిగా ప్రోత్సహింప బడతారు. చనుబాలిస్తూ వుండే వక్షోజాలలో అంటువ్యాధి ఉన్న స్త్రీలు, చనుబాలనివ్వడం అలాగే కొనసాగించవచ్చు వక్షోజాన్ని సరైన రీతిలో పాలు పిండివేయటం అన్నది చికిత్సలో ఒక భాగం. ఇది వక్షోజం చుట్టూ పుండు, గడ్డ కట్టడం వంటి ప్రమాదకరమైన ఇబ్బందులను తగ్గిస్తుంది.
వక్షోజంపై వచ్చే గడ్డలకు యాంటిబయోటిక్స్ తో చికిత్స చేస్తారు. ఈ గడ్డలను శస్త్ర చికిత్స ద్వారా కరిగిపోయటట్లు చేస్తారు. ఈ గడ్డ కట్టిన ప్రాంతంలో మత్తుమందునిచ్చి దీనిని చేయవచ్చు, కాని రక్తనాళాలలో కూడా ఉపశమనకారి (సెడేషన్) ను గాని లేక మామూలు మత్తుమందును కాని ఇవ్వ వలసి వుంటుంది.

ప్రసవానంతర మనోవేదన, ఒత్తిడి

ప్రసవానంతర మనోవేదన, ఒత్తిడి

ప్రసవం అయిన మొదటి కొన్ని వారాలపాటు లేక నెలల కాలంలో కలిగే అత్యంత నిరుత్సాహం, చికాకు, మరియు దానితో పాటుగా అంటిపెట్టుకుని వస్తూ వుండే మానసిక సంఘర్షణ ప్రసవానంతరం కలుగుతూవుండే ఒక మనోవేదన వంటివి. ప్రసవం జరిగిన 3 రోజులలో బాధను అనుభవిస్తూ వుండడం లేక ధుఃఖపూరితమైన రోజులను గడుపుతూ వుండడం అన్నవి ప్రసవం అయిన తరువాత సాధారణమైన విషయాలే. ఇటువంటి మనోభావాలతో స్త్రీలు అతిగా బాధపడనవసరం లేదు, ఎందుకంటే అవి మామూలుగా రెండు, మూడు వారాలలో కనుమరుగవుతాయి కాబట్టి. ఈ ప్రసవానంతర చికాకు, నిరుత్సాహం అన్నవి ప్రధానంగా మానసిక వ్యవస్ధ (మూడ్)ను మార్చేవే. ఈ పరిస్ధితి కొన్ని వారాలు, కొన్ని నెలలపాటు ఉంటూ దైనందిన కార్యక్రామాలకు అడ్డురావచ్చు. రమారమి 10 నుండి 15 శాతం వరకు స్త్రీలు ఇటువంటి స్ధితిననుభవించినవారే. చాలా తక్కువ సందర్భాలలో, ఇంతకంటే తీవ్రంగా అస్ధవ్యస్దమైన పరిస్ధితి – ప్రసవానంతర మానసిక ప్రవృత్తి పెరిగిపోవచ్చు.

  • నిరుత్సాహం, మనోవేదన అనుభవించి ఉన్న స్త్రీలు, ఈ ప్రసవానంతర నిరుత్సాహాన్ని, మానసిక బాధను ఇంకా తివ్రంగా పెంచుకునే అవకాశం కలిగివుంటారు
  • స్ర్రీలు అతిగా భాధకు గురవుతారు, గట్టిగా అరుస్తూ ఎడుస్తారు, చిరాకు ఎక్కువైపోతుంది,, అలాగే వారి మానసిక వ్యవస్ధ కూడా. వీరు దైనందిన కార్యకలాపాలలో ఉత్సాహాన్ని పూర్తిగా కోల్పోయి, చివరికి పుట్టిన బిడ్డ విషయంలో కూడా ఇలాగే ప్రవర్తిస్తారు.
  • ఇటువంటి వారికి చొరవ తీసుకుని మంచిగా నచ్చచెప్పడం, సలహానివ్వడం మరియు నిరుత్సాహాన్ని పొగొట్టి, ఉత్సాహాన్ని కలిగించే వాటితో చేరదీస్తే,, చాలా మేలు జరిగినట్టే.
కారణాలు

ఈ విధమైన బాధ, మనోవేదన, చిరాకులు లేక ప్రసవానంతర నిరుత్సాహానికి, ఒత్తిడికి గల కారణాలను ఊహంచడం కష్టం, అస్పష్టమైవని కూడా. అయితే, ఈ క్రింద వివరించినవి కొంతవరకూ దీని గురించి అవగాహన చేసుకోవడానికి సహకరించ వచ్చు.

  • ప్రసవానికి ముందు గానీ లేక తరువాత గాని ఉన్న చిరాకు, బాధ లేక మరో మానసిక అస్ధవ్యస్ధ పరిస్ధితి వుండి గానీ లేక ప్రసవ కాలంలో ఇవి ఇంకా ఎక్కువై వుండడం గాని.
  • ఇటువంటి బాధననుభవించిన సమీప బంధువులు (కుటుంబ చరిత్ర గల వారు).
  • హర్మోన్ల స్ధాయిలలో ఒక్క సారిగా సంభవించిన తరుగుదల (ఎస్ట్రోజెన్, ప్రజెస్టిరోన్), పిల్లలను కని, వారిని జాగ్రత్తగా పెంచడంలో ఉండే భారం (పురిటినెప్పులు వచ్చే సమయంలో పడే యాతన, ప్రసవ వేదన, నిద్రతేమి, తీవ్ర ఒత్తిడి, స్వేచ్ఛ లేకపోవడం మరియు ఒంటరిగా విసిరివేసి ఉంచినట్లుగా భావించడం, అలాగే, ఏమీ చేయలేని స్ధితిలో వుండడం వంటివి).
  • సాంఘికంగా బలపరిచే వారు లేకపోవడం
  • వైవాహిక విబేధాలు
  • జీవితంలో ఒత్తిడిని, అసహనాన్ని కలిగించే ఇతర విశిష్టమైన, చెప్పుకోదగిన అంశాలు, అంటే ఆర్ధిక ఇబ్బందులు లేక ఇటీవలే సంభవించిన కదలికలు వంటివి.

    గర్భవతి కాక ముందే స్త్రీలలో ఈ విధమైన మానసిక వేదన, ఒక రకమైన అసంతృప్తి, నిరుత్సాహం వంటివి ఉన్నప్పుడు వారు వైద్యునికి గానీ, మిడ్ వైఫ్ (మంత్రసాని) కి గానీ దీనిని గురించి ముందుగానే తెలియజేయాలి. ఈ మాదిరి మానసిక ఒత్తిడి తరచుగా ప్రసవానంతర ఒత్తిడికి, అసహనానికి దారితీయవచ్చు. గర్భవతులు ఈ రకమైన మానసిక ఒత్తిడి, వేదనలో ఉండడం సహజమే. ప్రసవానంతర బాధాకరమైన ఇటువంటి పరిస్ధితికి ఇది ఒక ప్రధానమైన, విపత్తు వంటిది.

లక్షణాలు

తరచుగా రోదిస్తూ వుండడం, మానసిక వ్యవస్ధ (మూడ్)లలో హెచ్చు , తగ్గులు, చిరాకు మరియు తీవ్రమైన బాధతో కూడిన మనోవేదనతో కూడి వుంటాయి ఈ లక్షణాలు. అంత సాధారణమైనవి కాని లక్షణాలు విపరీతమైన అలసట, దేనిమీదైనా దృష్టిని పెట్టడంలో ఇబ్బంది, నిద్ర సమస్యలు, లైంగిక మరియు ఇతర కార్యకలాపాలపై ఆసక్తి లేకపోవడం, ఆతృత, ఆందోళన, ఆకలి వేయడంలో వచ్చే మార్పులు మరియు ఏదో లోపించిందని , కొరతగా వుందనే భావం, అలాగే పూర్తిగా నిరాశక్తులై వుండడం వంటివి. ఇటువంటి స్త్రీలలో ఏ పని చేయాలన్నా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. చివరికి పుట్టిన బిడ్డపై కూడా వారికి ఆసక్తి ఉండదు.
ప్రసవానంతర మానసిక పరిస్ధితి ఇటువంటి మనోవేదన ఆత్మహత్యా సదృశమై, హింసాత్మక ఆలోచనలు, విభ్రాంతిని కలిగించే ఊహలు లేక అస్తవ్యస్ధమైన ప్రవర్తనతో జతకూడి వుంటుంది. ఒకోసారి, ఈ ప్రసవానంతర మానసిక పరిస్ధితి అస్తవ్యస్ధమై బిడ్డకు హానిని తలపెట్టేదిగా కూడా ఉంటుంది. దీనితో తండ్రులు కూడా తీవ్ర మానసిక వేదనకు గురవడంతో వైవాహిక సంబంధిత ఒత్తిడి కూడా పెరిగిపోతుంది. ఇటువంటి ప్రసవానంతర ఒత్తిడికి, మానసిక వేదనకు చికిత్స చేయకపోతే అదే పరిస్ధితి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా కొనసాగవచ్చు. అలాగే, స్త్రీలు కూడా వారి శిశువుతో మమేకమై వుండలేరు. దీని ఫలితంగా పుట్టిన బిడ్డ భావావేశపూరితమైన, సాంఘిక మరియు దేనిని గ్రహించుకునే శక్తి లేనివాడుగా పడివుండేటటువంటి సమస్యలను కూడా ఎదుర్కొన వలసి వస్తుంది. ప్రతి 3 లేక 4 మంది స్త్రీలలో ఒక స్త్రీ ఈ ప్రసవానంతర మనోవేదన, చిరాకుపడడం వంటి అవస్ధకు తిరిగి మరోసారి గురవుతారు.

రోగనిర్ధారణ

స్త్రీలకు, వారి బిడ్డకు శీఘ్రమైన వ్యాధి నిర్ధారణ మరియు చికిత్స అవసరం. ప్రసవం అయిన 2 వారాల తరువాత కూడా ఒకవేళ నిరుత్సాహంతో ఉంటూ, మామాలుగా వారు చేసుకునే పనుల్లో ఇబ్బందితో వారింకా బాధపడుతూ ఉన్నప్పుడు లేక వారి మనసులో వారికే గానీ లేక బిడ్డకు గానీ హానిని తలపెట్టే ఆలోచనలు వస్తున్నప్పుడు వారు పైద్యుణ్ని చూడాల్సి వుంటుంది. ఒకవేళ కుటుంబ సభ్యులు గాని, స్నేహితులు గానీ ఇటువంటి పరిస్ధితిని, లక్షణాలను గమనించినట్లయితే వారు ఆ స్త్రీతో మాట్లాడి, ఆమెను వైద్యని వద్దకు వెళ్లెందుకు ప్రోత్సహించాలి.
ఈ ఒత్తిడికి, మానసికవేదనను గుర్తించమని వైద్యలనడగవచ్చు. ఆరోగ్య పరిస్ధితి ఏమైనా అస్తవ్యస్ధంగా ఉందేమో నని, అంటే థైరాయిడ్ లోపం వంటిది వుండి, ఈ లక్షణాలకు కారణమా అని పరిశోధిస్తూ. వారు రక్తపు పరిక్షలు కూడా విర్వహించవచ్చు, .

ప్రసవమైన తరువాత ఈ విధమైన మానసిక ఒత్తిడిని, చిరాకును, ఆవేదనను నివారించడం.

బిడ్డ కలిగిన తరువాత, స్త్రీలు ఈ విధమైన మనోవేదనను, చిరాకును, బాధను నివారణకు ఈ క్రింది చర్యలను చేపట్టవచ్చు

  • వీలైనంత వరకూ విశ్రాంతిని తీసుకోవడం – ఉదాహరణకుః బిడ్డ పడుకున్నప్పుడే మీరు కూడా నిద్రపొండి.
  • ప్రతీదీ తనే చేసెయ్యాలనుకోవడం – ఉదాహరణకుః ఎక్కడా ఒక మచ్చకూడా లేకుండా ఇల్లంతా శుభ్రంగా ఉంచాలని ప్రయత్నించకబోవడం, రోజంతా వంటింట్లో వంట చేస్తూ వుండకుండా చూసుకోవడం..
  • కుటుంబ సభ్లులనుండి మరియు స్నేహితులనుండి సహకారాన్ని కోరుతూ వుండడం.
  • ఎవరితో ఒకరితో మాట్లాడుతు వుండడం (భాగస్వామి గాని, భర్త గాని, కుటుంబ సభ్యులు గాని లేక స్నేహితులు గాని) వారి ఆభిప్రాయాలను గురించి
  • స్నానం చేస్తూ, రోజంతా డ్రస్ చేసుకుంటూ
  • అతి తరచుగా ఇంటినుండి బయటకు వెళుతూ వుండడం – ఉదాహరణ పనిమీద ప్రయాణాలు, స్నేహితులను కలుస్తూ వుండడం లేక ఒకసారి నడిచి వెళుతూ వుండడం.
  • ఒంటిరిగా భర్తతో గానీ లేక భాగస్వామితో గాని కాలక్షేపం చేస్తూ వుండడం.
  • ఇతర తల్లులతో సాధారణ అనుభవాలు మరియు వారి అభిప్రాయాలను గురించి తెలుసుకుంటూ వుండడం.
  • మానిసిక ఒత్తిడికి గురయ్యే స్ర్రీలను బలోపేతం చేయడానికి వారికి అండగా వుండే బృందంలో చేరడం
చికిత్స

ఒకవేళ స్ర్రీలు మానసికవ్యధకు గురవుతున్నారంటే సాధారణంగా వాళ్లకి కావలసిందల్లా కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల ఆదరణ మాత్రమే. అయితే, ఈ మానసికవ్యధకు గురయి భాధననుభవిస్తున్నారని వైద్య నిర్ధారణ జరిగితే, వృత్తి పరమైన సహకాహం కూడా అవసరమౌతుంది. చొరవతీసుకుని వారికి నచ్చ చెప్పడం, సలహానివ్వడం అలాగే ఒత్తిడిని తగ్గించే మార్గాలను చూపెట్టడం అన్నది ఒక మంచి కలయికతో కూడిన పహకారం వంటిది ఇటువంటి సమస్యకు. అస్తవ్యస్ధమైన మానసిక వేదనతో వుండే స్త్రీలను ఆసుపత్రిలో చేర్చవలసి వుంటుంది, ముఖ్యంగా బిడ్డను మరొకరి జాగ్రత్తలో, పర్యవేక్షణలో ఉంచడానికి వీలుగా వుండే అసుపత్రిలో. ఇటువంటి వారికి మానసిక వ్యధను తొలగించి, వారిని ఆ స్ధితినుండి తప్పించగలిగే మందులు మరియు ఒత్తిడిని నివారించే వాటిని ఇవ్వ వలసి వుంటుంది.

గర్భిణీలు సహజంగా వచ్చే ఆరోగ్యసమస్యలు నివారణ

మహిళలకు గర్భం ధరించడం సృష్టిలో ఒక అద్భుతమై ఘట్టం. అందులోనే గర్భం ధరించనప్పటి నుండి గర్భధారణ కాలం సురక్షితంగా పూర్తి అయితే ఎటువంటి సమస్యలుండవు. మహిళలు గర్బం ధరించిన తర్వాత శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అవి తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని మీరు చదవాల్సిందే. బరువు పెరగడం, బ్లడ్ ప్రెజర్, తిమ్మిరులు, వైజినల్ డిస్చార్జ్, లీకింగ్ నిప్పల్స్ మరియు ఒళ్ళు నొప్పులు మొదలగునవి మరికొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు కూడా గర్భణి స్త్రీలో వచ్చేటటువంటి సాధారణ ఆరోగ్యసమస్యలు.

గర్భిణీ స్త్రీ పొట్టలో పిండం పెరిగే కొద్ద పొట్ట మరియు బ్రెస్ట్ పెరగడంతో పాటు, శరంల కూడా అనేక మార్పలకు లోనవుతుంది. ఉదాహరణకు: గర్భం ధరించగానే, గర్భిణీలో చర్మం స్ట్రెచ్ (సాగడం మొదలవుతుంది మరియు ఇది తరచూ స్ట్రెచ్ మార్క్స్ (చర్మంలో ఛారలు) ఏర్పడటానికి కారణం అవుతుంది.

గర్భం ధరించిన మహిళ చూడటానికి మరింత అందంగా కనిపించడం కానీ లేదా మరింత నీరసంగా, డల్ గా కనిపించడం కానీ జరుగుతుంది. ముఖ్యంగా జుట్టు రాలడం, మనస్సులో గందరగోళం, తరచూ మనస్సు మార్చుకోవడం, మరియు వికారం వంటి సాధారణ సమస్యలు అసౌకర్యానికి గురిచేస్తాయి. అదేవిధంగా, వికారం, మార్నింగ్ సిక్ నెస్, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు మొదలగు, ఇతర ఆరోగ్యసమస్యలతో బాధపడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఈ మార్పుల వల్ల అసౌకర్యంగాను మరియు చిరాకుగాను అనిపిస్తుంది. అయితే, కొన్ని సందర్భాలలో వారు చాలా ఆందోళకరమైనవారుగా అనిపించవచ్చు. గర్బిణీ స్త్రీలు ఎదుర్కొనే కొన్ని సాధారణ ఆరోగ్య సమస్యలు మీరు తెలుసుకోవడం కోసం కొన్ని ఇక్కడ అంధిస్తున్నాం.

ఆధారము: తెలుగు.బోల్డ్ స్కై.కం

గర్భిణీలకు ఎనర్జీనిచ్చే 7 హెల్తీ డ్రింక్స్

సహజంగా మహిళలు గర్భం పొందిన తర్వాత మీరు తీసుకొనే ఆహారం చాలా ప్రధాన పాత్రపోషిస్తుంది. ఎందుకంటే ఇది, కడుపులో పెరిగే శిశువుమీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి, గర్భధారణ సమయంలో గర్భిణీ తీసుకొనే సమతుల్యమైన హారంలో అవసరం అయ్యే పూర్తి పోషకాలుండాలి.

తల్లి తీసుకొనే పౌష్టికాహారంతోనే కడుపులో పెరిగే బిడ్డ యొక్క మెంటల్ మరియు ఫిజికల్ డెవలప్ మెంట్ ఆధారపడుతుంది. పౌష్టికాహారం మాత్రమే కాదు, బెవరేజస్ (ద్రవాలు) కూడా హైల్తీ డైట్ లిస్ట్ లో చేర్చుకోవచ్చు. ప్రెగ్నెన్సీ వల్ల డీహైడ్రేషన్ ముఖ్యంగా మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, గర్భధారణ సమయంలో ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే, హెల్తీ డ్రింక్స్ ను ఎంపిక చేసుకోవడం వల్ల మరింత ఎక్కువ ప్రభావం ఉంటుంది.

కార్బొనేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్, లేదా కమర్షియల్ ఫ్రూట్ జ్యూస్ లను నివారించాలి. ఇలాంటివి కేవలం పొట్టను నింపుతాయి, శరీరానికి ఎటువంటి క్యాలరీలను అందివ్వడు. వీటిలో ప్రత్యేమైన ఎనర్జీ కంటెంట్ లేదా మీ ఆరోగ్యానికి ఉపయోగపడేవేవి కలిగి ఉండవు. అందుకే బెవరేజస్ లో ప్యూర్ వాటర్ ఒక బెస్ట్ అండ్ గుడ్ ఆప్షన్. అయితే, ప్లేయిన్ వాటర్ త్రాగలేము అనుకునే వారు, హెల్తీ బెవరేజస్ ను ఎంపిక చేసుకోవచ్చు. ద్రవాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా అది మీ శరీరంను డిటాక్సిఫై చేస్తుంది, మలబద్దకంను నివారిస్తుంది. ఎడిమా తగ్గిస్తుంది మరియు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. ఇన్ని ప్రయోజనాలందించే కొన్ని ప్రత్యేకమైన బెవరేజస్ గర్భిణీ స్త్రీలకు ఎక్కువ ఉపయోగకరమైన బెవరేజస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

గ్రీన్ టీ  గర్భధారణ సమయంలో గ్రీన్ టీ తీసుకోవడం ఒక విధంగా మంచిదే. గర్భిణీలు కూడా గ్రీన్ టీ త్రాగడం ఆరోగ్యానికి మంచిదే. ఇది ఒత్తిడి తగ్గించడానికి సహాయపడుతుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

పాలు గర్భిణీ స్త్రీలకు పాలు ఒక ఉత్తమ బెవరేజ్. ఎందుకంటే మహిళలకు అవసరం అయ్యే క్యాల్షియం అందివ్వడంలో పాలు గ్రేట్ గా సహాయపడుతాయి. ఇది సెరోటెనిన్ ను అందిస్తుంది, దాంతో మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. కానీ, పాలలో ఏ ఇతర ఆర్టిఫిషయల్ ఫ్లేవర్ పౌడర్స్ ను జోడించకండి. రోజుకు రెండు సార్లు పాలను త్రాగడం వల్ల గర్భిణీలకు చాలా అవసరం

అవొకాడో స్మూతీస్ అవొకాడో లేదా బటర్ ఫ్రూట్ గర్భిణీలకు ఒక ఉత్తమ ఫ్రూట్. ఇది గర్భిణీలో బ్లడ్ ప్రెజర్ ను క్రమబద్దంగా ఉంచుతుంది మరియు స్ట్రెస్ హార్మోన్లను రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి, పెరుగు, పాలు, తేనెతో అవొకాడో జోడించి తయారుచేసిన జ్యూస్ లేదా స్మూతీస్ ను తీసుకోవడం మంచిది.

ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భిణీలో పూర్తి వ్యాధినిరోధకతను పెంచడానికి సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఇంకా, శరీరంలో వ్యర్థాలను బయటకు నెట్టుటకు కూడా ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి, గర్భధారణ సమయంలో ఆరెంజ్ జ్యూస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.

చమోమెలి టీ గర్భిణీ స్త్రీలు తీసుకోగలిగి బెవరేజెస్ లిస్ట్ లో చాలావరకూ హెర్బల్ టీలు ఆరోగ్యం మరియు తల్లి బిడ్డకు సురక్షితం. ఈ హెర్బల్ టీలు రుచికరంగా మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా బోలెడు ప్రయోజనాలను అందిస్తుంది. ప్రెగ్నెన్సీ టిప్స్ ఒక ఉత్తమ చిట్కా గర్భధారణ సమయంలో చమోమెలీ టీని తీసుకోవాలి.

చెర్రీ జ్యూస్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కు చెర్రీ జ్యూస్ ఒక బెస్ట్ బెవరేజ్. గర్భిణీ స్త్రీలు నిద్రలేమితో బాధపడుతున్నట్లైతే చెర్రీ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది. చెర్రీ జ్యూస్ త్రాగడం వల్ల ఒత్తిడి తగ్గిస్తుంది మరియు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. దాంతో మంచి నిద్ర వస్తుంది.

జింజర్ టీ మీ రెగ్యులర్ డ్రింక్స్ లో జింజర్ టీ జోడించడం ఒక ఎఫెక్టివ్ ప్రెగ్నెన్సీ టిప్. చాలా వరకూ ఎక్కువగా గర్భిణీ స్త్రీలకు జింజర్ టీ త్రాగమని సలహాలిస్తుంటారు ఇది మార్నింగ్ సిక్ నెస్ ను నివారిస్తుంది మరియు దీన్ని ఒక ట్రెడిషినల్ మెడిసిన్ గా ఉపయోగిస్తుంటారు. ఇది మంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఆధారము: తెలుగు.బోల్డ్ స్కై.కం

ఆధారము: వైద్యరత్నాకరం బ్లాగ్

2.99224806202
పి.వి.రామారావు Dec 02, 2015 09:49 PM

వీలైనంత సమాచారం ఇచ్చారు .హైరిస్క్ ప్రేగనేన్చి గురించి వివరంగా వ్రాయాలి ,రక్త పరీక్షలు ,రెసస్ ఫ్యాక్టర్ గురించి కూడా ఇస్తే బాగుంటుంది

kanakadurga Mar 31, 2015 02:36 PM

నిరుపేదలు గర్భినిస్త్రీలు, వృద్ధులు వీరికి తగిన సౌకర్యాలు కల్పించాలి. ప్రభుత్వపతకాలు అందరికి చేరేలా చూడాలి. సరైన వైద్యం సకాలంలో అందించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపడగలం. గ్రామాల్లో వైద్య సదుపాయాలు విస్తృత పరచాలి, రవాణ సౌకర్యం లేనిచోట వైద్యం అందుభాటులో వుండటం తప్పనిసరి.

srinivas Dec 11, 2013 04:55 PM

ప్లీజ్ షేర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు