హోమ్ / వార్తలు / 14న క్యాబ్‌ ఆధ్వర్యంలో ఎంసెట్‌ ఉచిత మోడల్‌ పరీక్ష
పంచుకోండి

14న క్యాబ్‌ ఆధ్వర్యంలో ఎంసెట్‌ ఉచిత మోడల్‌ పరీక్ష

14న క్యాబ్‌ ఆధ్వర్యంలో ఎంసెట్‌ ఉచిత మోడల్‌ పరీక్ష

తెలంగాణ, ఏపీ రాష్ర్టాలలో క్యాబ్‌ ఎడ్యుకేషనల్‌ కన్సల్‌టెంట్స్‌ ఆధ్వర్యంలో ఉచిత మోడల్‌ ఎంసెట్‌ పరీక్ష జరగనుంది. ఈ నెల 14న తెలంగాణలో 40, ఏపీలో 15 కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మోడల్‌ ఎంసెట్‌ సలహాదారు, జెఎన్‌టీయూ మాజీ వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ డీఎన్‌.రెడ్డి, సంస్థ డైరెక్టర్‌ కె.వెంకటేశ్‌లు తెలిపారు. మంగళవారం వారు సోమాజిగూడలోని హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. టీసీఎస్‌ అయాన్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలో విద్యార్థులకు 16 పేజీల నివేదికను కూడా ఇస్తామని, విద్యార్థులు ఎక్కడ తప్పులు చేశారు తదితర అంశాలను కూడా అందులో పొందుపరుస్తామని, 18న ఫలితాలను ప్రకటిస్తామన్నారు. క్యాబ్‌ సంస్థ కార్యాలయల్లో ఈ నెల 10లోపు తమ పేర్లను ఉచితంగా నమోదు చేసుకోవచ్చునని, ఆన్‌లైన్‌ ద్వారా అయితే రూ.100 చెల్లించాల్సి ఉంటుందన్నారు. 14న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంజనీరింగ్‌, మెడికల్‌ విభాగాలలో పరీక్ష ఉంటుందన్నారు. మొదటి ర్యాంకు సాధించినవారికి ల్యాప్‌టాప్‌ను, 10 ర్యాంకులు సాధించిన వారికి నగదు పురస్కారాలు అందజేయనున్నట్లు వారు తెలిపారు. వివరాలకు 040-2762 6194, 98499 66200లలో సంప్రదించాలని వారు కోరారు

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు