హోమ్ / వార్తలు / 15 నుంచి వేసవి శిక్షణ శిబిరం
పంచుకోండి

15 నుంచి వేసవి శిక్షణ శిబిరం

15 నుంచి వేసవి శిక్షణ శిబిరం

రంగారెడ్డి జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వార్షిక వేసవి క్రీడా శిక్షణ శిబిరం ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నది. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం వేదికగా మే 31 వరకు జరిగే ఈ శిబిరంలో 6 నుంచి 16 ఏళ్లలోపు బాలబాలికలు పాల్గొనవచ్చు. 15 క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చే ఈ శిబిరంలో పాల్గొనేందుకు ఆసక్తి గల బాలలు సంబంధిత కోచ్‌ను సంప్రదించాలి. ఈ నెల 12వ తేదీలోగా రూ.10 రుసుం చెల్లించి కోచ్‌ వద్ద దరఖాస్తు పొందాలి. స్టేడియంలో ఆయా కోచ్‌లను ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 7 గంటల వరకు సంప్రదించాలి. సంప్రదించవలసిన కోచ్‌ల వివరాలిలా ఉన్నాయి. బాక్సింగ్‌లో శ్రీనివాస్‌ (93463 42274), జిమ్నాస్టిక్స్‌లో స్వర్ణలత (81424 50218), రవీందర్‌ 94412 01523), ఖో-ఖోలో నర్సింహారెడ్డి (83740 02778), బ్యాడ్మింటన్‌లో ఎంవీ ఫణికిశోర్‌ (98660 95912), వాలీబాల్‌లో రమాదేవి (92461 88641), స్విమ్మింగ్‌లో సంజయ్‌సింగ్‌ (97008 82801), క్రికెట్‌లో రాజశేఖర్‌ రెడ్డి (99121 14789), అథ్లెటిక్స్‌లో సాయిబాబా (97038 38987), స్కేటింగ్‌లో యాదయ్య (93466 62588), వెయిట్‌ లిఫ్టింగ్‌లో రాజరాజేశ్వరి (93947 82649), హ్యాండ్‌బాల్‌లో అలెగ్జాండర్‌ (83746 56787)ను సంప్రదించాలి. టెన్ని్‌సలో 96665 46567, కరాటేలో 040-2403 2833 నెంబర్‌లో సంప్రదించవచ్చు.

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు