హోమ్ / వార్తలు / 2016 నవంబర్ 30 నుంచి 2016డిసెంబర్ 2 వరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్లెవెల్ (టైర్-II) ఎగ్జామినేషన్, 2016
పంచుకోండి

2016 నవంబర్ 30 నుంచి 2016డిసెంబర్ 2 వరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్లెవెల్ (టైర్-II) ఎగ్జామినేషన్, 2016

2016 నవంబర్ 30 నుంచి 2016డిసెంబర్ 2 వరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్. కంబైన్డ్ గ్రాడ్యుయేట్లెవెల్ (టైర్-II) ఎగ్జామినేషన్, 2016

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (టైర్-II)ఎగ్జామినేషన్, 2016 ను 30.11.2016 నుంచి 02.12.2016 వరకు కంప్యూటర్ ఆధారితపద్ధతిలో నిర్వహించనున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సదరన్ రీజియన్ తెలిపింది. ఈపరీక్ష తెలంగాణ లోని హైదరాబాద్, వరంగల్ లలోను, ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ,విశాఖపట్నం లలోను, తమిళ నాడు లోని చెన్నై లోను 26 స్థలాల (కళాశాలలు/సంస్థలు)లో ఉంటుంది.పుదుచ్చేరి కి చెందిన అభ్యర్థులను చెన్నై కేంద్రంలో కలుపుతున్నారు.

పరీక్ష యొక్క ఒకటో మరియు రెండో భాగాలను30.11.2016, 01.12.2016 తేదీలలో ఉదయం, మధ్యాహ్న సమయాలలో నిర్వహించనున్నారు. పరీక్షమూడో మరియు నాలుగో భాగాలను క్రమానుగతంగా 02.12.2016 ఉదయం, మరియు అదే రోజుమధ్యాహ్నం నిర్వహిస్తారు. ఉదయం పూట 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం పూట2గంటల 45 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 45 నిమిషాల వరకు పరీక్ష ను నిర్వహిస్తారు.పరీక్ష కోసం ఇ-అడ్మిట్ కార్డులనుఇప్పటికే WWW.SSCSR.GOV.IN వెబ్ సైట్ లో పోస్టుచేసినట్లు, దీనికి డౌన్ లోడ్ సౌకర్యం కూడా ఉన్నట్లు దక్షిణ ప్రాంత కార్యాలయంతెలియజేసింది. ఈ వివరాలను అభ్యర్థుల ఫోన్ నంబర్లకు ఎస్ ఎమ్ ఎస్ ద్వారా కూడాసమాచారం అందిస్తున్నట్లు, అలాగే అభ్యర్థులు ఇచ్చిన మెయిల్ ఐడీ లకు ఇ-మెయిల్ చేసినట్లువివరించారు. ఇ-అడ్మిట్ కార్డులేనిదే ఏ అభ్యర్థినీ పరీక్షకు అనుమతించబోమని స్పష్టంచేశారు. మిగతా వివరాలకుఅభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దక్షిణ ప్రాంత కార్యాలయ హెల్ప్ లైన్ నంబర్లుఅయిన 044-28251139  (ల్యాండ్ లైన్) ను గాని, లేదా9445195946  (మొబైల్) ను గాని సంప్రదించవచ్చు.

ఆధారం: పత్రికా సమాచార కార్యాలయము

పైకి వెళ్ళుటకు