హోమ్ / వార్తలు / ‘ఎస్సై’ తుది షెడ్యూల్‌ విడుదల
పంచుకోండి

‘ఎస్సై’ తుది షెడ్యూల్‌ విడుదల

‘ఎస్సై’ తుది షెడ్యూల్‌ విడుదల ♦ 19, 20, 27 తేదీల్లో రాత పరీక్షలు ♦ 13 నుంచి ఆన్లైన్ లో హాల్‌టిక్కెట్లు

రాష్ట్ర పోలీసు శాఖలో సబ్‌ ఇన్ స్పెక్టర్‌ (సివిల్‌/ఏఆర్‌/ఎస్‌ఏఆర్‌/ టీఎస్‌ఎస్పీ), స్పెషల్‌ ప్రొటెక్షన్ ఫోర్స్‌ (ఎస్పీఎఫ్‌)లో ఎస్సై (మెన్స్), అగ్నిమాపక శాఖలో స్టేషన్ ఫైర్‌ ఆఫీసర్‌ (ఎస్‌ఎఫ్‌ఓ) పోస్టులతోపాటు ఎస్సై (కమ్యూనికేషన్/ పీటీఓ) పోస్టుల భర్తీకి సంబంధించిన తుది రాత పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు శనివారం ప్రకటించింది. ఈ నెల 19, 20, 27వ తేదీల్లో రాత పరీక్షలు జరగనున్నాయి. దేహదారుఢ్య పరీక్షల్లో నెగ్గి తుది రాత పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తమ వెబ్‌సైట్‌ (www.tslprb. in) నుంచి హాల్‌టిక్కెట్లను డన్ లోడ్‌ చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్ పూర్ణచందర్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు.

రిజిస్ట్రేషన్ నంబర్, ఎస్‌ఎస్‌సీ హాల్‌టిక్కెట్‌ నంబర్‌లను వెబ్‌సైట్‌లో నమోదు చేసి హాల్‌టిక్కెట్లను డౌన్ లోడ్‌ చేసుకోవాలన్నారు. హాల్‌టిక్కెట్లను డౌన్ లోడ్‌ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే  support @tslprb.inకు ఈ–మెయిల్‌ చేయాలని లేదా <div id="MiddleColumn_internal">ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలన్నారు.

ఆధారం : సాక్షి

పైకి వెళ్ళుటకు