హోమ్ / వార్తలు / ‘షాదీ ముబారక్‌’లో మార్పులు - నేటి నుంచే కొత్త నిబంధనలు
పంచుకోండి

‘షాదీ ముబారక్‌’లో మార్పులు - నేటి నుంచే కొత్త నిబంధనలు

‘షాదీ ముబారక్‌’లో మార్పులు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన షాదీ ముబారక్‌ పథకంలో గోల్‌మాల్‌ జరగడంతో ఇక ఎలాంటి అవకతవకలకు అవకాశం లేనివిధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు నగదు ఇచ్చే విషయంలో మార్గదర్శకాల్లో మార్పు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. షాదీముబారక్‌ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు వచ్చిన దరఖాస్తులను ఇకపై హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో స్పెషల్‌ బ్రాంచ అధికారులు తనిఖీ చేసే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పాస్‌పోర్టు వెరిఫికేషనకు ఎస్‌బీ అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ నిర్వహిస్తున్నారు. ఇకపై షాదీముబారక్‌పథకంలో లబ్ధిదారుల ఎంపికకు కూడా ఎస్‌బీ విచారణ జరపనుంది.

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు