హోమ్ / వార్తలు / ‘సీజీఎల్‌-2’ రేసులో లక్షన్నర మంది
పంచుకోండి

‘సీజీఎల్‌-2’ రేసులో లక్షన్నర మంది

‘సీజీఎల్‌-2’ రేసులో లక్షన్నర మంది

సివిల్‌ సర్వీసెస్‌ తర్వాత ప్రతిష్ఠాత్మకంగా భావించే వివిధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం... స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) నిర్వహించనున్న కంబెన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌-2 (సీజీఎల్‌-2) పరీక్షలకు కొద్ది రోజుల్లో పోటీ ప్రారంభం కానుంది. ఈనెల 30 నుంచి డిసెంబరు 2 వరకు జరిగే ఈ రెండో దశ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు లక్షన్నర మంది పోటీ పడనున్నారు. ఈ పరీక్షా ఆన్‌లైన్‌లోనే జరుగనుంది. సీబీఐ, ఇంటెలిజెన్స్‌ బ్యూరో, ఆదాయపన్నుశాఖ తదితర కేంద్ర సర్వీసుల్లో ‘బి’ గ్రేడ్‌ ఉద్యోగాలకు ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరుల్లో జరిగిన సీజీఎల్‌-1కు 14.82 లక్షల మంది హాజరయ్యారు. ఇది కేవలం అర్హత పరీక్షే. అభ్యర్థులకు కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కులను నిర్ణయించి, అసలు పరీక్షయిన సీజీఎల్‌-2కు మొత్తం 1,49,319 మందిని ఎస్‌ఎస్‌సీ ఎంపిక చేసింది. దాదాపు ఐదువేల పోస్టులకు వీరంతా పోటీ పడనున్నారు. ఈసారి సీజీఎల్‌-1లో కటాఫ్‌ మార్కులు బాగా (అన్‌ రిజర్వుడ్‌కు 137 మార్కులు) పెరిగాయి. అయితే, తుది ఎంపికకు ముఖాముఖీలు ఉండవు. ఏటేటా పోస్టుల సంఖ్య తగ్గుతుండగా, అభ్యర్థుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. సీజీఎల్‌-2కు నిరుడు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒక్క హైదరాబాద్‌లోనే పరీక్ష కేంద్రం ఇచ్చారు. ఆయా నగరాల నుంచి ఎంపికయ్యే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే పరీక్ష నిర్వహించే నగరాలను పెంచుతారని నిపుణులు చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లో దానిపై స్పష్టత రానుంది.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు