హోమ్ / వార్తలు / 2020, 2024, 2028 ఒలింపిక్స్ గేమ్స్ కార్యాచ‌ర‌ణ రూప‌క‌ల్ప‌న‌కు టాస్క్ ఫోర్స్ : ప‌్ర‌ధాని ప్ర‌క‌ట‌న‌
పంచుకోండి

2020, 2024, 2028 ఒలింపిక్స్ గేమ్స్ కార్యాచ‌ర‌ణ రూప‌క‌ల్ప‌న‌కు టాస్క్ ఫోర్స్ : ప‌్ర‌ధాని ప్ర‌క‌ట‌న‌

2020, 2024, 2028 ఒలింపిక్స్ గేమ్స్ కార్యాచ‌ర‌ణ రూప‌క‌ల్ప‌న‌కు టాస్క్ ఫోర్స్ : ప‌్ర‌ధాని ప్ర‌క‌ట‌న‌

ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోదీ రానున్న మూడు ఒలింపిక్స్ కు స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ రూపొందించేందుకు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. శ‌నివారం నాడు మంత్రిమండ‌లి స‌మావేశంలో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటును ఆయ‌న ప్ర‌క‌టించారు. 2020, 2024, 2028 సంవ‌త్స‌రాల్లో జ‌రుగ‌నున్న ఒలింపిక్స్ క్రీడ‌ల‌కు భార‌త క్రీడాకారులు మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా పాల్గొనేందుకు అవ‌స‌ర‌మైన స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించ‌డం ఈ టాస్క్ ఫోర్స్ ల‌క్ష్యంగా నిర్దేశించారు.

  • - క్రీడాకారుల కోసం ఏర్పాటు చేయాల్సిన స‌దుపాయాలు, శిక్ష‌ణ‌, ఎంపిక విధానం, ఇత‌ర అంశాల‌న్నింటి పైన సంపూర్ణ వ్యూహాన్ని ఈ టాస్క్ ఫోర్స్ ర‌చించి ప్ర‌భుత్వానికి అందిస్తుంది.
  • - అంత‌ర్గ‌త నిపుణుల‌తో పాటు వెలుప‌లి నిపుణుల‌ను కూడా టాస్క్ ఫోర్స్ లోకి తీసుకుంటారు.
  • - రానున్న కొద్ది రోజుల్లో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ప్ర‌ధాని ప్ర‌క‌టించారు.


ఆధారం: PIB

 

 

పైకి వెళ్ళుటకు