హోమ్ / వార్తలు / 24న జిల్లాస్థాయి చదరంగం పోటీలు
పంచుకోండి

24న జిల్లాస్థాయి చదరంగం పోటీలు

24న జిల్లాస్థాయి చదరంగం పోటీలు

జిల్లా చెస్‌ సంఘం ఆధ్వర్యంలో స్థానిక చంద్రమౌళినగర్‌లోని జీనియస్‌ చెస్‌ అకాడమిలో ఈ నెల 24న ఉదయం 10 గంటలకు జిల్లాస్థాయి అండర్‌ -7 బాల, బాలికల చదరంగం పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా చె స్‌ సంఘం కార్యదర్శి చల్లా రవీంద్రరాజు తెలిపారు. ఈ పోటీల్లో మొదటి రెండు స్థానాలు సాధించిన క్రీడాకారులను మే 6 నుంచి 8 వరకు తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలకు పంపుతామన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు హాజరు కావాలని, వివరాలకు 9948198809లో సంప్రదించాలని కోరారు. --ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు