హోమ్ / వార్తలు / 27 నుంచి ఏపీ ఎడ్‌సెట్ వెబ్‌కౌన్సెలింగ్
పంచుకోండి

27 నుంచి ఏపీ ఎడ్‌సెట్ వెబ్‌కౌన్సెలింగ్

ఈనెల 27, 28, 29 వతేదీల్లో అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, శ్రీకాకుళం, విశాఖపట్నంలలోని హెల్ప్‌లైన్ కేంద్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు

 

రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశానికి ఈనెల 27 నుంచి ఏపీఎడ్‌సెట్-2016 వెబ్‌కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ టి.కుమారస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 27, 28, 29 వతేదీల్లో అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, శ్రీకాకుళం, విశాఖపట్నంలలోని హెల్ప్‌లైన్ కేంద్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. పీహెచ్‌సీ, స్పోర్స్,సెనికోద్యోగుల పిల్లలకు, ఎన్‌సీసీ క్యాడెట్లకు తిరుపతి, గుంటూరులలోని హెల్ప్‌లైన్ కేంద్రాల్లో కౌన్సెల్సింగ్ నిర్వహిస్తామన్నారు. పూర్తివివరాలను www.apedcet.apsche.ac.in వెబ్‌సైట్‌నుంచి పొందవచ్చన్నారు.
పైకి వెళ్ళుటకు