30లోగా ఉపకార వేతనాలకు ఆనలైన రిజిస్ట్రేషను చేసుకోవాలి
30లోగా ఉపకార వేతనాలకు ఆనలైన రిజిస్ట్రేషను చేసుకోవాలి
2014-15, 2015-16 విద్యా సం వత్సరాలకు సంబంధించి ఈనెల 30లోగా ఆనలైనలో రిజిసే్ట్రషన్లు చేయించుకోవాలని బీసీ సంక్షేమశాఖ ఉప సంచాలకులు టి.సూ ర్యనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రెష్, రెన్యూవల్ విద్యార్థులు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని సూచించారు. విద్యార్థినీ, విద్యార్థులు తమ దరఖాస్తులు ఈపాస్ వెబ్సైట్ ద్వారా పంపాలని సూచించారు. జిల్లాలోని యూనివర్శిటీలు, ఇం జనీరింగ్ కళాశాలలు, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలల యాజమాన్యం వెంటనే విద్యార్థులకు ఈ విషయం తెలియజేసి ఉ పకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తులు వెంటనే బీసీ సంక్షేమశాఖ కార్యాలయంలో సమ ర్పించాలన్నారు.
ఆధారము: ఆంధ్రజ్యోతి