హోమ్ / వార్తలు / 330 గోదాములపై సోలార్‌ ప్యానళ్లు
పంచుకోండి

330 గోదాములపై సోలార్‌ ప్యానళ్లు

330 గోదాములపై సోలార్‌ ప్యానళ్లు

రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 330 గోదాములపై సోలార్‌ ప్యానళ్లు ఏర్పాటు చేసి 50 నుంచి 55 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సాధించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు మార్కెటింగ్‌ శాఖ ఎండీ శరత్ చెప్పారు. ఆదివారం మెదక్‌ జిల్లా సిద్దిపేట పత్తి మార్కెట్‌ యార్డులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 90 గోదాముల నిర్మాణం పూర్తికావచ్చిందన్నారు. కొత్తగా నిర్మిస్తున్న గోదాములు శాసీ్త్రయ పద్ధతిలో సౌకర్యాలన్నీ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మండలాల స్థాయిలో నిర్మించే వీటిలో మూడు కంపార్ట్‌మెంట్లు ఉంటాయన్నారు. ఒకదానిలో ఎరువులు, మరో దాంట్లో రైతుబంధు పథకం కింద ధాన్యం నిల్వ చేసుకునే అవకాశం, మూడో దాంట్లో పౌరసరఫరాల బియ్యం నిల్వచేసే సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు.

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు