హోమ్ / వార్తలు / 47వ భారతదేశ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం
పంచుకోండి

47వ భారతదేశ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం

47వ భారతదేశ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం

మరికొన్ని గంటలలో 47వ ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ ఎఫ్ఐ..ఇఫి’) కి తెరలేవబోతోంది. సినిమాలకు సంబంధించి అతి పెద్దదైన వేడుకకు ఆతిథేయిగా ఉండటానికి గోవాసర్వసన్నద్ధమైంది. 2016 నవంబర్ 20వ తేదీ నుంచినవంబర్ 28వ తేదీ వరకు ఈచలనచిత్రోత్సవం జరుగనుంది.  చలనచిత్ర కళలోశ్రేష్ఠతకు పట్టం కడుతూ ప్రపంచంలో రూపొందుతున్న సినిమాల ప్రదర్శనకు ఒక ఉమ్మడివేదికను అందించడమే ఇఫి ధ్యేయం; అలాగే, వేరు వేరు దేశాల చలనచిత్ర సంస్కృతులను ఆకళింపుచేసుకోవడానికి, ఆయా దేశాల సాంఘిక, సాంస్కృతిక సంప్రదాయాల నేపథ్యం అవగతం చేసుకొనిఆనందించడానికి, వివిధ దేశాల ప్రజల మధ్య మైత్రిని, సహకారాన్ని పెంపొందింపచేయడానికి తోడ్పాటునుఅందజేయాలన్నది కూడా ఈ చిత్రోత్సవ ధ్యేయమే. అన్ని రకాల శైలుల చిత్ర నిర్మాణానికిమద్దతునివ్వడం, వాటి ప్రత్యేకతను గుర్తించడం, ప్రాచుర్యం కల్పించడం.. ఈ విధానంలో ఆయాకళారూపాల భిన్నత్వాన్ని, సారాంశాన్ని, రసదృష్టిని ఒక చోట ఆవిష్కరించడం ఇఫి స్థాపనకుహేతువైన అంశాలలో కొన్ని. ప్రపంచంలో లబ్ధప్రతిష్ఠులైన చలనచిత్ర సంబంధిత కళాకారులతోఅప్పుడే వికసించడం మొదలుపెట్టిన వర్ధమాన కళాకారులు భుజం భుజం కలిపి సమ పథంలోఅడుగులు వేసే వేదిక ఇఫి. అంతే కాకుండా, చలనచిత్ర రంగ నిపుణులు ప్రపంచం అంతటా వ్యాపించిఉన్న కళాప్రియులకు ఎదురుపడే రంగస్థలం కూడా ఇఫి. ఈ విశాలమైన భారతదేశంలోని చలనచిత్రరంగ ప్రతిభావంతులకు, ప్రతిభావంతురాళ్లకు చక్కని పోషణను కల్పించి, వెన్ను తట్టి, ఒక ప్రేరణగా మారిబయటి ప్రపంచానికి వారిని వారు పరిచయం చేసుకోగలిగే అవకాశాన్ని ఇవ్వడం ఇఫిలక్ష్యాలలో ఒకటి. సాంకేతిక విజ్ఞానపరంగా పెను మార్పులు శరవేగంగా చోటు చేసుకొంటున్నఈ కాలంలో ఈ చిత్రోత్సవానికి ఉన్న ప్రాముఖ్యం నానాటికీ కొత్త చివుళ్లు వేసేదేననిచెప్పుకోవచ్చు. ఎలాగంటే మొగ్గ తొడుగుతున్న సరికొత్త ప్రసార మాధ్యమాలకు సాటిగాబహుముఖ కళారూపాలు ఇఫిలో విశ్వరూప ప్రదర్శన చేస్తాయి మరి. కొత్త కొత్త ముఖాముఖీసంభాషణలు అదే పనిగా ఇక్కడ సాగుతాయి కదా; ఆ చర్చ ఉపచర్చల మథనంలో నుంచి నూతన వ్యూహాలుఆవిర్భవించగలవు. దీంతో ఏళ్లు గడుస్తున్న కొద్దీ ప్రతి ఇఫి రాటుదేలుతుంటుంది.చలనచిత్ర నిర్దేశకుల, ప్రేక్షకుల మనోఫలకం విస్తృత‌ం,సుసంపన్నం అవుతూఉంటుంది. అహింస, శాంతియుత సహజీవనం.. ఈ భారతీయ భావాలు ‘వసుధైవ కుటుంబకం’ అనే పదబంధంలోప్రతిబింబిస్తూ ఉన్నట్లే ఇఫికి కూడా ఇదే పదబంధం ఇతివృత్తంగా స్థిరపడింది.

ఆధారం:పత్రికా సమాచార కార్యాలయము

పైకి వెళ్ళుటకు