హోమ్ / వార్తలు / 50% మార్కులొచ్చినా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ‘నెట్‌’
పంచుకోండి

50% మార్కులొచ్చినా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ‘నెట్‌’

50% మార్కులొచ్చినా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ‘నెట్‌’

గుర్తింపు పొందిన విద్యా సంస్థలో మాస్టర్స్‌ డిగ్రీ చదివిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 50శాతం మార్కులు వచ్చినా వారు ‘జాతీయ అర్హత పరీక్ష’ (నెట్‌)కు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు యూజీసీకి ఆదేశాలు జారీ చేసినట్లు సోమవారం లోక్‌సభకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే వెల్లడించారు. నెట్‌ పరీక్షకు పీజీలో కనీసం 55శాతం మార్కులు పొందాల్సి ఉంది. యూజీసి నియమావళిలో ఇటీవలి నాలుగో సవరణకు అనుగుణంగా ఆ వర్గాలకు 5శాతం మినహాయింపు లభించింది.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు