హోమ్ / వార్తలు / 68 శాతం పాలు కల్తీ: కేంద్రం
పంచుకోండి

68 శాతం పాలు కల్తీ: కేంద్రం

రోజూ మనం తాగే పాలలో 68 శాతం కల్తీ!

రోజూ మనం తాగే పాలలో 68 శాతం కల్తీ! అవును పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రం వెల్లడించిన దిగ్ర్భాంతికర వాస్తవం!! లోక్‌సభలో శాస్త్ర సాంకేతిక మంత్రి హర్షవర్థన్‌ బుధవారం ఈ విషయాన్ని తెలిపారు. పాలతో పాటు డిటర్జెంట్‌, కాస్టిక్‌ సోడా, గ్లూకోజ్‌, వైట్‌ పెయింట్‌, రిఫైన్డ్‌ ఆయిల్‌ తదితరాల్లో కల్తీ సాధారణం అయిపోయిందని చెప్పారు. ఇక పాల కల్తీని కనిపెట్టేందుకు కొత్త రకం స్కానర్‌ను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. దీంతొ 40 సెకండ్లలోనే పాలలో కల్తీని పూర్తిగా గుర్తించొచ్చని తెలిపారు. గతంలో రకరకాల కల్తీలను గుర్తించేందుకు వేర్వే రు పరీక్షలు నిర్వహించాల్సి వచ్చేదని, ఇప్పుడు అన్ని రకాల కల్తీలను ఈ స్కానర్‌ ఒక్కదానితోనే అత్యంత వేగంగా గుర్తించవచ్చన్నారు. ప్రస్తుతం 2 లక్షల గ్రామాల నుంచి పాల సేకరణ జరుగుతోంది.

ఆధారము: ఆంధ్రజ్యోతి


పైకి వెళ్ళుటకు