హోమ్ / వార్తలు / అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం
పంచుకోండి

అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం

అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం

అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి 2016-17 విద్యా సంవత్సరానికి గానూ విదేశాల్లో ఫ్యూర్‌సైన్స్‌, నర్సింగ్‌, హ్యూమనిటీ, ఇంజనీరింగ్‌, మెనేజ్‌ మెంట్‌, అగ్రికల్చర్‌ సైన్సు, సోషల్‌ సైన్స్‌, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించాలనుకునే ఎస్సీ అభ్యర్థులు ఈనెల 28లోపు ఆన్‌లైన్‌ (telanganae pass.cgg.gov.in) లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ ఉపాధ్యక్షుడు హన్మంతునాయక్‌ శనివారం తెలిపారు. ఈ పథకం కింద యూఎస్‌ఏ, యూకే, ఆస్ర్టేలియా, కెనడా, సింగపూర్‌లల్లో చదువుకునే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. దరఖాస్తుదారులు జనవరి 3న ఉదయం 10గంటలకు మాసబ్‌ట్యాంక్‌లోని డీఎస్‌ఎస్‌ భవన్‌లోని 3వ అంతస్తులో జరిగే ఎంపిక ప్రక్రియకు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని హన్మం తునాయక్‌ చెప్పారు. అభ్యర్థుల కుటుంబ ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదన్నారు. మిగతా వివరాల కోసం వెబ్‌సైట్‌లో చూడాలన్నారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు