హోమ్ / వార్తలు / అప్‌గ్రేడ్‌ బీసీ గురుకులాలకు పోస్టులు
పంచుకోండి

అప్‌గ్రేడ్‌ బీసీ గురుకులాలకు పోస్టులు

మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాలయాల సంస్థల్లో జూనియర్‌ కాలేజీలకు అప్‌గ్రేడ్‌ అయిన 16 గురుకులాలకు పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది.

మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాలయాల సంస్థల్లో ఇటీవలే పాఠశాల నుంచి జూనియర్‌ కాలేజీలకు అప్‌గ్రేడ్‌ అయిన 16 గురుకులాలకు పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. ఈ ప్రకారం ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్‌ మంగళవారం జీవో జారీ చేశారు. 16 గురుకులాల్లో 16 ప్రిన్సిపాల్‌, 176 జూనియర్‌ లెక్చరర్‌, 16 లైబ్రేరియన, 16 ఫిజికల్‌ డైరెక్టర్‌, 16 సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు కలిపి మొత్తం 240 పోస్టులను శాశ్వత ప్రాతిపదికనగా భర్తీకి, 16 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ డేటాఎంట్రీ ఆపరేటర్‌, 32 ల్యాబ్‌ అసిస్టెంట్‌, 32 ఆఫీస్‌ సబార్డినేట్‌, 16 కుక్‌, 96 మల్టీ పర్పస్‌ వర్కర్‌ కలిపి 192 పోస్టులను ఔట్‌సోర్సింగ్‌ కింద భర్తీ చేయడానికి అనుమతినిచ్చారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు