హోమ్ / వార్తలు / అసంఘటిత మహిళలకు ప్రసూతి పథకం
పంచుకోండి

అసంఘటిత మహిళలకు ప్రసూతి పథకం

అసంఘటిత మహిళలకు ప్రసూతి పథకం

అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలకు చందాతో కూడిన ప్రసూతి లబ్ధి పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు కార్మికశాఖ కార్యదర్శి శంకర్‌ అగర్వాల్‌ పథకం వివరాలను రేఖామాత్రంగా తెలిపారు. ఈ పథకం కింద మహిళలు నిర్దేశిత మొత్తాన్ని తమ చందాగా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమచేయడంతోపాటు ఖాతాలోని నిల్వకు వడ్డీ కూడా ఇస్తుంది. చందాదారులు తమ వాటాను నిర్దేశిత మొత్తంకన్నా ఎక్కువగానూ జమ చేసుకోవచ్చు. ప్రసూతి సమయంలో తప్ప ఇతర అవసరాలకు ఈ పథకంలోని సొమ్మును వాడుకునే వీలుండదు. నిర్దేశిత వయసులోగా మాతృత్వం పొందలేని పక్షంలో నిల్వ మొత్తాన్ని వెనక్కు తీసుకోవచ్చు.

ఆధారం : ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు