హోమ్ / వార్తలు / ఆంధ్ర ప్రదేశ్రె వెన్యూలో 670 పోస్టులు
పంచుకోండి

ఆంధ్ర ప్రదేశ్రె వెన్యూలో 670 పోస్టులు

ఆంధ్ర ప్రదేశ్రె వెన్యూలో 670 పోస్టులు

రెవెన్యూశాఖను పటిష్ట పరిచి... సమర్థవంతంగా సేవలు అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం ఈ శాఖలో 670 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. సాధారణంగా... ఖాళీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయటంలేదనే విమర్శలనే వింటూ ఉంటాం. కానీ తాజాగా ఆర్థిక శాఖ వెలువరించిన జీవో అందుకు భిన్నమైనది... అరుదైనది! రెవెన్యూశాఖలో కొత్తగా ‘జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌’ కేటగిరీని సృష్టించి... అందులో 670 మందిని భర్తీ చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కొత్త కేటగిరీ పోస్టులను తహసిల్దారు కార్యాలయానికి ఒకటి చొప్పున మంజూరు చేసింది. రెగ్యులర్‌ ప్రాతిపదికన డెరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) పరీక్ష ద్వారా నియామకాలు జరగాలని నిర్దేశించింది. ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి హేమా మునివెంకటప్ప గురువారం ఈ మేరకు జీవో(ఎంఎస్‌ నెంబర్‌ 8) జారీ చేశారు. తహసిల్దార్లకు సహకరించడం కోసం ఈ పోస్టులను మంజూరు చేసినట్లు జీవోలో పేర్కొన్నారు. కొత్త కేటగిరీలో నియమితులయ్యేవారి వేతన శ్రేణి రూ.16,400- రూ.49,870 మధ్య ఉంటుంది.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు