హోమ్ / వార్తలు / ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రూపు-2 ఉద్యోగాల భర్తీ కోసం ఏపీపీఎస్సీ మంగళవారం రాత్రి నోటిఫికేషన్‌ జారీ చేసింది
పంచుకోండి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రూపు-2 ఉద్యోగాల భర్తీ కోసం ఏపీపీఎస్సీ మంగళవారం రాత్రి నోటిఫికేషన్‌ జారీ చేసింది

ఏపీ గ్రూపు-2 నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపికబురు. రాష్ట్రంలో గ్రూపు-2 ఉద్యోగాల భర్తీ కోసం ఏపీపీఎస్సీ మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 982 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ పి.ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. తొలిసారిగా ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ విధానంలో అభ్యర్థుల హాజరు తీసుకోనున్నట్లు వెల్లడించారు. దరఖాస్తులను పూర్తి ఆన్‌లైన్‌లో విధానంలో స్వీకరిస్తామన్నారు. 25 వేల మంది కంటే ఎక్కువ అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే ప్రాథమిక పరీక్షను ఆఫ్‌లైన్‌ పద్ధతిలో నిర్వహిస్తామని చెప్పారు. మెయిన్స్‌ పరీక్ష మాత్రం ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నామన్నారు.

పూర్తి వివరాలకు: www.psc.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు