హోమ్ / వార్తలు / ఆధార్‌ కార్డే అవసరం లేదు డౌన్‌లోడు చేసుకున్న పత్రం చాలు
పంచుకోండి

ఆధార్‌ కార్డే అవసరం లేదు డౌన్‌లోడు చేసుకున్న పత్రం చాలు

ఆధార్‌ కార్డే అవసరం లేదు డౌన్‌లోడు చేసుకున్న పత్రం చాలు

ప్లాస్టిక్‌ ఆధార్‌ కార్డు అవసరం లేదని, కంప్యూటర్‌ నుంచి డౌన్‌లోడు చేసుకున్న పత్రం కూడా సరిపోతుందని యుఐడిఏఐ స్పష్టం చేసింది. స్మార్ట్‌/ప్లాస్టిక్‌ ఆధార్‌ కార్డు ఇస్తామంటూ కొందరు రూ.50 నుంచి రూ.200 వసూలు చేస్తుండడాన్ని తప్పుపట్టింది. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది. సాధారణ కాగితంపై డౌన్‌లోడు చేసుకున్న ఆధార్‌ పత్రంగానీ, దాని కింద చింపడానికి అనుకూలంగా ఉండే చిన్న చీటిలాంటిది గానీ సరిపోతాయని స్పష్టం చేసింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న పత్రం కూడా చెల్లుబాటు అవుతుందని తెలిపింది.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు