హోమ్ / వార్తలు / ఆధార్‌ తోడుగా ఏటీఎం లావాదేవీ:డీసీబీ బ్యాంక్‌
పంచుకోండి

ఆధార్‌ తోడుగా ఏటీఎం లావాదేవీ:డీసీబీ బ్యాంక్‌

ఆధార్‌ తోడుగా ఏటీఎం లావాదేవీ:డీసీబీ బ్యాంక్‌

ఏటీఎం/డెబిట్‌ కార్డుకు కేటాయించే పిన్‌ లేకుండా ఆధార్‌ సంఖ్య తోడుగా ఏటీఎం వద్ద లావాదేవీ నిర్వహించుకునే సదుపాయాన్ని దేశంలోనే తొలిసారిగా ప్రవేశ పెట్టినట్లు డీసీబీ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మురళీ నటరాజన్‌ తెలిపారు. లావాదేవీ కోసం ఏటీఎం వద్ద తన 12 అంకెల ఆధార్‌ నెంబరును నొక్కాలి. లేదా ఏటీఎం/డెబిట్‌ కార్డును స్వైప్‌ చేయొచ్చు. అనంతరం పిన్‌ బదులు, అక్కడ ఉండే స్కానర్‌పై వేలిముద్ర వేయాలి. ఇది ఆధార్‌తో అనుసంధానమై ఉంటుంది కనుక లావాదేవీ పూర్తవుతుంది. పిన్‌ నెంబరు గుర్తించుకునే అవసరం లేకుండా, పూర్తి సురక్షితంగా, లావాదేవీ నిర్వహించడం సాధ్యమవుతుందన్నారు. ఇందుకోసం బ్యాంకు ఖాతా సంఖ్యతో ఆధార్‌ను అనుసంధానించాలని పేర్కొన్నారు.

ఆధారము : ఈనాడు

పైకి వెళ్ళుటకు