హోమ్ / వార్తలు / ఆపరేషన్ క్లీన్ మనీ ని ప్రారంభించిన ఆదాయపు పన్ను విభాగం
పంచుకోండి

ఆపరేషన్ క్లీన్ మనీ ని ప్రారంభించిన ఆదాయపు పన్ను విభాగం

ఆపరేషన్ క్లీన్ మనీ ని ప్రారంభించిన ఆదాయపు పన్ను విభాగం

ఆదాయపు పన్ను విభాగం (ఐటిడి) ఈ రోజు ఆపరేషన్ క్లీన్ మనీ నిప్రారంభించింది. 2016 నవంబర్ 9వ తేదీ నుండి 2016 డిసెంబర్ 30వ తేదీ మధ్యకాలంలో బ్యాంకుల వద్దకు వచ్చిన భారీ నగదు డిపాజిట్లను ఇ-వెరిఫికేషన్ పద్ధతిలో సరిచూస్తారు. నోట్ల చట్టబద్ధత రద్దుకు సంబంధించిన సమాచారాన్ని ఐటిడి డేటా బేస్ లలోనిసమాచారంతో పోల్చి చూడటానికి డేటా ఎనలిటిక్స్ ను ఉపయోగించారు. ఒకటవ విడతలో  పన్ను చెల్లింపుదారుకు సంబంధించిన వివరాలతోసరిపోయే విధంగా లేనటువంటి నగదు లావాదేవీలు జరిపిన సుమారు 18 లక్షల మందినిగుర్తించారు.
ఆన్ లైన్ ద్వారా వెరిఫికేషన్ జరిగిన కేసులకు సంబంధించినసమాచారాన్ని https://incometaxindiaefiling.gov.inపోర్టల్ లోకిలాగ్ ఆన్ అయిన అనంతరం పిఎఎన్ హోల్డర్ యొక్క ఇ-ఫైలింగ్ విండోలో లభ్యం అయ్యే విధంగాచర్యలు చేపడుతున్నారు. పాన్ హోల్డరు పోర్టల్ లోని “Compliance” విభాగంలోని “Cash Transactions 2016” అనే లింకునుఉపయోగించి సమాచారాన్ని తెలుసుకొనేందుకు అవకాశం ఉంది. పన్ను చెల్లింపుదారు ఆదాయపుపన్ను కార్యాలయానికి వెళ్ళకుండానే తన వివరణను ఆన్ లైన్ లో సమర్పించవచ్చు.
ఇ-ఫైలింగ్ పోర్టల్ లో సమాధానాన్ని పొందుపరచడం కోసం పన్నుచెల్లింపుదారులను ఇ-మెయిల్,ఇంకా ఎస్ ఎమ్ ఎస్ద్వారా కూడా సంప్రదించడం జరుగుతుంది.  https://incometaxindiaefiling.gov.in అనే ఇ-ఫైలింగ్పోర్టల్ లో ఇప్పటికీ నమోదు చేసుకోని పన్ను చెల్లింపుదారులు ‘Register Yourself’ ను క్లిక్ చేయడంద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. నమోదైన పన్ను చెల్లింపుదారులు వారి యొక్క ఇ-మెయిల్చిరునామాను మరియు మొబైల్ నంబరును సరిచూసుకొని అప్ డేట్ చేసి ఎలక్ట్రానిక్కమ్యూనికేషన్ ను అందుకోవచ్చు.
ఆన్ లైన్ లో సమాధానాన్ని సమర్పించేందుకు పన్నుచెల్లింపుదారుకు పోర్టల్ లో సమగ్రమైన వినియోగదారు గైడ్, క్విక్ రిఫరెన్స్గైడ్ లు అందుబాటులో లభ్యమవుతున్నాయి. ఆన్ లైన్ లో సమాధానం పొందుపరచడంలో ఏదైనాఇబ్బంది ఎదురైతే 18004250 0025 నెంబరులో హెల్ప్ డెస్క్ ను సంప్రదించవచ్చు.
వెరిఫికేషన్ నిమిత్తం ఏదైనా కేసును ఎంపిక చేసిన పక్షంలోఅదనపు సమాచారం కోసం అభ్యర్థనను ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే కోరుతారు. దీనికిప్రతిస్పందనను కూడా ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త సమాచారం, ప్రతిస్పందనఅందిన తరువాత ఆన్ లైన్ పోర్టల్ లో వివరాలు నవీకరిస్తారు.
పన్ను చెల్లింపుదారు ఇచ్చిన సమాధానాన్ని అందుబాటులో ఉన్నసమాచారాంతో పోల్చి చూస్తారు. నగదు మూలం గురించి వివరణ న్యాయబద్ధమైందిగాతోచినట్లయితే వెరిఫికేషన్ ప్రక్రియను ఆపివేస్తారు. నగదు డిపాజిట్ "ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన" లో భాగంగా ప్రకటించినా కూడా వెరిఫికేషన్ ను ఆపివేస్తారు.
ఈ దశలో భాగమైన పన్ను చెల్లింపుదారులు వారి ప్రతిస్పందనను 10 రోజులలోగాపోర్టల్ లో పొందుపరచవలసి ఉంటుంది. అలా చేయడం ద్వారా ఐటిడి నుండి ఎటువంటినోటీసునైనా ఆదాయపు పన్ను చట్టం కింద గాని, ఇతర చట్టాల కింద గాని ఎన్ ఫోర్స్ మెంట్ యాక్షన్లనైనా తప్పించుకోగలుగుతారు.
***

ఆధారం: పత్రికా సమాచార కార్యాలయము

పైకి వెళ్ళుటకు