హోమ్ / వార్తలు / ఇంకుడు గుంత ఉంటేనే నల్లా . కొత్త భవనాల అనుమతులకూ ఇదే నిబంధన
పంచుకోండి

ఇంకుడు గుంత ఉంటేనే నల్లా . కొత్త భవనాల అనుమతులకూ ఇదే నిబంధన

ఇంకుడు గుంత ఉంటేనే నల్లా . కొత్త భవనాల అనుమతులకూ ఇదే నిబంధన

వాననీటి సంరక్షణ చర్యల్లో వ్యక్తులు, సంస్థలు పూర్తి స్థాయిలో మమేకం కావాలని తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నల్లా కనెక్షన్‌ కావాలన్నా, ఇల్లు/భవనాలకు అనుమతులు కావాలన్నా ఇంకుడు గుంత తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ మహానగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఇళ్లు, భవనాలు నిర్మించే వారు విధిగా ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఈ నిబంధన పాటించకుంటే నిర్మాణాలకు అనుమతులు ఇవ్వబోమని అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని మెట్రోరైలు కార్యాలయంలో పురపాలక శాఖ రూపొందించిన వంద రోజుల ప్రణాళికపై సమీక్ష సమావేశం జరిగింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, పురపాలక శాఖ సంచాలకులు దానకిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ నగరంలో ఉన్న ఐటీపార్కులు, పారిశ్రామికవాడల్లో, ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతల నిర్మాణానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. క్రీడా మైదానాలు, పార్కుల్లో కూడా ఇంకుడు గుంతలు తవ్వాలన్నారు.

ఆధారము : ఈనాడు

పైకి వెళ్ళుటకు